Google Play ఇన్‌స్టంట్‌తో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి

గమనిక: Android Instant Apps is currently only available on some devices.

తక్షణ యాప్‌లతో ఎదురయ్యే సమస్యలకు దిగువ సూచనలతో మీరు పరిష్కారాలను కనుగొనవచ్చు. మీ పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌తో మీకు సమస్య ఉంటే, సహాయం కోసం సెర్చ్ చేయడానికి, పేజీ పై భాగానికి సమీపంలో ఉండే "Google Play సహాయ కేంద్రంలో సెర్చ్ చేయండి" అనే బాక్స్‌లో మీ సమస్యను వివరించండి.

మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకోండి

నేను ఇన్‌స్టంట్ యాప్ సెట్టింగ్‌లను మార్చాలనుకుంటున్నాను

Google Play ఇన్‌స్టంట్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత జనరల్ ఆ తర్వాత Google Play ఇన్‌స్టంట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. Google Play ఇన్‌స్టంట్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

నిర్దిష్ట ఇన్‌స్టంట్ యాప్‌నకు సంబంధించిన డేటాను క్లియర్ చేయండి

మీరు ఉపయోగించిన ఇన్‌స్టంట్ యాప్‌నకు సంబంధించిన డేటాను మీరు ఈ విధంగా క్లియర్ చేయవచ్చు:

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్ సెట్టింగ్‌లును తెరవండి.
  2. ఎగువన ఇటీవల తెరిచిన యాప్‌లను చూపించే యాప్‌లు, నోటిఫికేషన్‌లను ట్యాప్ చేయండి.
  3. మీరు సెట్టింగ్‌ను మార్చాలనుకుంటున్న ఇన్‌స్టంట్ యాప్ పైన ట్యాప్ చేయండి.
  4. యాప్‌ను క్లియర్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 

చిట్కా: మీరు మీ Google ఖాతాకు కనెక్ట్ చేసిన యాప్‌లను మేనేజ్ చేయడానికి మీ ఖాతా పేజీకి వెళ్లాలి. మీరు డెవలపర్‌తో షేర్ చేసిన సమాచారం డెవలపర్‌కు చెందిన గోప్యతా పాలసీకి లోబడి ఉంటుందని గమనించండి, కాబట్టి మీరు ఈ సమాచారాన్ని మేనేజ్ చేయాలనుకుంటే డెవలపర్‌ను సంప్రదించండి.

ఒక ఇన్‌స్టంట్ యాప్ స్తంభించిపోతోంది, క్రాష్ అవుతోంది లేదా లోడ్ అవ్వడం లేదు

మీ వెబ్ కనెక్షన్‌ను చెక్ చేయండి

మీకు యాక్టివ్‌గా ఉండి, పని చేసే Wi-Fi లేదా మొబైల్ డేటా కనెక్షన్ ఉందో లేదో చెక్ చేయండి. వెబ్‌ను సెర్చ్ చేయడం ద్వారా దీన్ని సులభంగా చెక్ చేయవచ్చు. పిల్లుల గురించి Googleలో సెర్చ్ చేయడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి. పిల్లులకు సంబంధించిన సమాచారం మీకు కనిపిస్తే, బహుశా మీ ఇంటర్నెట్ కనెక్షన్‌తో సమస్య ఉండకపోవచ్చు. 

ఒకవేళ సెర్చ్ పని చేయకపోతే, కనెక్టివిటీతో సమస్య ఉండవచ్చు. మీ కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేయండి.

యాప్‌ను రీలోడ్ చేయడానికి ట్రై చేయండి

మీ ఇంటర్నెట్ కనెక్షన్ పని చేస్తుందని మీరు నిర్ధారించిన తర్వాత, మళ్లీ లింక్‌పై క్లిక్ చేసి, ఇన్‌స్టంట్ యాప్ సరిగ్గా లోడ్ అవుతుందో లేదో చూడండి. 

యాప్‌నకు బదులుగా వెబ్‌ను ఉపయోగించండి

మీరు మీ కనెక్షన్‌ను చెక్ చేసి, యాప్‌ను రీలోడ్ చేయడానికి ట్రై చేసినప్పటికీ అది పని చేయకపోతే, మీరు వెబ్ బ్రౌజర్‌ను (Chrome లేదా Firefox వంటివి) ఉపయోగించి మీ కంటెంట్‌ను చేరుకోవచ్చు

ఇన్‌స్టంట్ యాప్‌లో దేని కోసమైనా పేమెంట్ చేసేటప్పుడు నాకు సమస్య ఎదురవుతోంది

మీ పేమెంట్ సఫలం అవ్వడం లేదు

ఇన్‌స్టంట్ యాప్‌లో దేని కోసమైనా పేమెంట్ చేసేటప్పుడు మీకు సమస్య ఎదురవుతుంటే, సాధారణ పేమెంట్ సమస్యలకు సంబంధించిన ఈ పరిష్కారాలను ట్రై చేయండి

నేను వేరే పేమెంట్ ఆప్షన్ / పద్ధతిని ఉపయోగించాలనుకుంటున్నాను

ఇన్‌స్టంట్ యాప్‌లలో అన్ని రకాల పేమెంట్ ఆప్షన్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు చెక్ అవుట్ చేసే సమయంలో లిస్ట్ చేయని పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించాలనుకుంటే, మీ పరికరంలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి లేదా అందుకు బదులుగా వెబ్‌ను ఉపయోగించండి. 

నేను ఇటీవల ఉపయోగించిన ఇన్‌స్టంట్ యాప్‌లను చూడాలనుకుంటున్నాను

మీరు ఇటీవల ఉపయోగించిన ఇన్‌స్టంట్ యాప్‌లను మీరు చూడవచ్చు:
  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్ సెట్టింగ్‌లును తెరవండి.
  2. ఇటీవల తెరిచిన యాప్‌లను ఎగువున చూపించే "యాప్‌లు & నోటిఫికేషన్‌లు" ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఏ యాప్ గురించి అయినా మరిన్ని వివరాలను చూడటానికి, ఆ యాప్‌ను ట్యాప్ చేయండి. మీ ఫోన్ ఓవర్‌వ్యూ మెనూలోని ఇటీవలి యాప్‌ల లిస్ట్‌లో మీరు ఉపయోగించిన ఇన్‌స్టంట్ యాప్‌లు కూడా కనిపిస్తాయి.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9019648564676914786
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false