Google Playలో కొనుగోలు ఆమోదాలు

మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో తల్లి/తండ్రి అయితే, మీ ఫ్యామిలీ మెంబర్‌లు Google Playలో కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి మీ అనుమతిని పొందవలసి ఉంటుంది. కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు, కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లను మార్చండి

ఒకవేళ మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో ఫ్యామిలీ మేనేజర్ అయితే, మీరు మీ ఫ్యామిలీలోని ఏ మెంబర్ కోసం అయినా కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో తల్లి/తండ్రి అయితే, Family Linkతో మేనేజ్ చేయబడే ఖాతాలు కలిగిన ఫ్యామిలీ మెంబర్‌ల కోసం, మీరు కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు.

  1. మీ iPhone లేదా iPadలో, Playstore వెబ్ వెర్షన్‌ను play.google.com సైట్‌లో, యాక్సెస్ చేయండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీ గ్రూప్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. "ఫ్యామిలీ గ్రూప్" విభాగంలో, ఫ్యామిలీ మెంబర్ పేరును ట్యాప్ చేయండి.
  5. మీరు ఇవ్వాలనుకుంటున్న కొనుగోలు ఆమోదం రకాన్ని ఎంచుకోండి:
    • మొత్తం కంటెంట్
    • కేవలం చెల్లింపు కంటెంట్
    • యాప్‌లో కొనుగోళ్లు మాత్రమే
    • ఆమోదం అవసరం లేదు
Family Link యాప్
  1. మీ iPhone లేదా iPadలో, Family Link యాప్ Family Linkను తెరవండి.
  2. మీ చిన్నారి పేరును ట్యాప్ చేయండి ఆ తర్వాత కంటెంట్ పరిమితులు ఆ తర్వాత Google Play అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "కొనుగోళ్లు & డౌన్‌లోడ్ ఆమోదాలు" విభాగంలో, దీని కోసం ఆమోదం కావాలి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు ఇవ్వాలనుకుంటున్న కొనుగోలు ఆమోద రకాన్ని ఎంచుకోండి:
    • మొత్తం కంటెంట్
    • కేవలం చెల్లింపు కంటెంట్
    • యాప్‌లో కొనుగోళ్లు మాత్రమే
    • ఆమోదం అవసరం లేదు

రిక్వెస్ట్‌లను ఆమోదించండి లేదా తిరస్కరించండి

ముఖ్య గమనిక: మీరు iPhoneను ఉపయోగిస్తుంటే, మీ చిన్నారి పరికరం నుండి Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసిన పెయిడ్ కంటెంట్ కోసం పెండింగ్‌లో ఉన్న రిక్వెస్ట్‌లను మాత్రమే ఆమోదించగలరు.

ఒకవేళ మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో తల్లి/తండ్రి అయితే, Google Play నుండి పొందే కంటెంట్ కోసం చేసే రిక్వెస్ట్‌లను మీరు ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోలు పూర్తయినప్పుడు, ఫ్యామిలీ మేనేజర్ ఈ మెయిల్ రసీదును పొందుతారు.

మీరు Google Kids Spaceలో డౌన్‌లోడ్ చేసే సిఫార్సు చేసిన యాప్‌ల కోసం ఆమోదాలను, ప్రత్యేకంగా Google Kids Space సెట్టింగ్‌లులో మేనేజ్ చేయవచ్చు.

పెయిడ్ కంటెంట్
  1. ఫ్యామిలీ మెంబర్ Google Play బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసినప్పుడు, వారికి మీ పాస్‌వర్డ్‌ను అడిగే స్క్రీన్ కనిపిస్తుంది.
  2. రిక్వెస్ట్‌ను రివ్యూ చేయండి.
  3. ఆమోదించడానికి, వారి పరికరంలో మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  4. ఆమోదించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ఎటువంటి ఛార్జీ లేకుండా అందుబాటులో ఉన్న కంటెంట్

ఒకవేళ Family Linkతో మేనేజ్ చేయబడే Google ఖాతాను కలిగిన చిన్నారికి Play కంటెంట్ కోసం తల్లిదండ్రుల ఆమోదం అవసరమైతే, వారు ఆ కంటెంట్‌ను డౌన్‌లోడ్ లేదా యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు వారికి రెండు ఆప్షన్‌లు కలిగిన స్క్రీన్ కనిపిస్తుంది:

మెసేజ్‌లో అడగండి

యాప్‌లో నేరుగా ఈ సెట్టింగ్‌కి వెళ్లడానికి, కింద ఉన్న బటన్‌ను ట్యాప్ చేయండి:

అప్రూవల్ రిక్వెస్ట్‌లను మేనేజ్ చేయండి

  1. మీ ఫోన్‌లో మీరు నోటిఫికేషన్‌ను పొందుతారు.
  2. రిక్వెస్ట్‌ను రివ్యూ చేయడం. మరిన్ని వివరాలను చూడటానికి, రిక్వెస్ట్‌ను లేదా యాప్ పేరును ట్యాప్ చేయండి.
  3. ఆమోదించు లేదా తిరస్కరించు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఇప్పుడు అడగండి

  1. మీరు రిక్వెస్ట్‌ను మీ చిన్నారి పరికరంలో రివ్యూ చేస్తారు.
  2. దానిని ఆమోదించడానికి, వారి పరికరంలో మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  3. ఆమోదించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ఎలాంటి ఛార్జీ లేకుండా కంటెంట్‌కు సంబంధించి పెండింగ్ రిక్వెస్ట్‌లను కనుగొనండి

Family Link యాప్

  1. మీ iPhone లేదా iPadలో, Family Link Family Linkను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

కొనుగోలు ఆమోదాల సెట్టింగ్‌ల గురించి తెలుసుకోండి

మొత్తం కంటెంట్

Family Linkతో మేనేజ్ చేయబడే ఖాతాలను కలిగిన 18 ఏళ్లలోపు ఫ్యామిలీ మెంబర్‌లు, ఏదైనా కంటెంట్ ఉచితంగా అందుబాటులో ఉన్నా కూడా, దానిని వారు డౌన్‌లోడ్ చేయడానికి మీ ఆమోదాన్ని పొందడం అవసరం. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్‌కు 18 ఏళ్లు నిండి, పర్యవేక్షించబడే Google ఖాతాను కలిగి ఉన్నట్లయితే, వారు మీ ఆమోదం లేకుండానే, సినిమాలు, టీవీ షోలను కొనడానికి ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు.

చిట్కా: ఒకవేళ పర్యవేక్షించబడే మెంబర్‌లను మీ ఫ్యామిలీకి జోడించడానికి ముందే కంటెంట్‌ను పొందినప్పటికీ, మునుపటి డౌన్‌లోడ్‌లు, అప్‌డేట్‌లు, ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా షేర్ చేసిన కంటెంట్‌కు మీ ఆమోదం అవసరం లేదు.
ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ ద్వారా చేసిన అన్ని కొనుగోళ్లు

పెయిడ్ యాప్‌లు లేదా యాప్‌ల లోపల విక్రయించిన ఐటెమ్‌లతో సహా, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి చేసిన అన్ని కొనుగోళ్ల కోసం ఫ్యామిలీ మెంబర్‌లు మీ ఆమోదాన్ని పొందడం అవసరం. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్‌కు 18 ఏళ్లు నిండి, పర్యవేక్షించబడే Google ఖాతాను కలిగి ఉన్నట్లయితే, వారు ఇప్పటికీ సినిమాలు, టీవీ షోలను కొనడానికి మీ ఆమోదం లేకుండానే ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు.

Family Linkతో మేనేజ్ చేయబడని ఖాతాలను కలిగిన, 18 ఏళ్లు లేదా ఆపై వయసున్న ఫ్యామిలీ మెంబర్‌ల కోసం ఈ సెట్టింగ్ అందుబాటులో లేదు.

చిట్కా: ఒకవేళ "మొత్తం పెయిడ్ కంటెంట్"ను ఆన్ చేసే ఆప్షన్, 18 ఏళ్లలోపు ఫ్యామిలీ మెంబర్ కోసం లేత బూడిదరంగులో చూపబడినట్లయితే, మీ ఫ్యామిలీ మెంబర్, వారి పుట్టిన తేదీతో సహా, ఖాతా సమాచారం సరైనదేనని చెక్ చేసుకునేలా చూడండి.

ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించే యాప్‌లో కొనుగోళ్లకు మాత్రమే
Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా గేమ్‌లలోని కాయిన్‌ల వంటి యాప్‌లో కొనుగోళ్లను చేయడానికి ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించడానికి మాత్రమే ఫ్యామిలీ మెంబర్‌లకు మీ ఆమోదం అవసరం అవుతుంది.
ఆమోదం అవసరం లేదు
ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి కొనుగోళ్లు చేయడానికి ఫ్యామిలీ మెంబర్‌లకు ఎలాంటి అనుమతి అవసరం లేదు.
కొనుగోలు రిక్వెస్ట్‌లను ఉపసంహరించుకోండి
Android పరికరంలో ఫ్యామిలీ మెంబర్‌లు, Google Play ఆర్డర్ హిస్టరీ ట్యాబ్ నుండి, పెండింగ్‌లో ఉన్న వారి పెయిడ్ కొనుగోలు రిక్వెస్ట్‌లను ఉపసంహరించుకోవచ్చు.
ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ లేకుండా చేసిన కొనుగోలు రిక్వెస్ట్‌లు

మీరు ఫ్యామిలీ మేనేజర్ అయి ఉండి, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను జోడించకుంటే, మీ ఫ్యామిలీ మెంబర్‌లు కొనుగోలు చేయడానికి మీ ఆమోదం కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ గురించి మరింత తెలుసుకోండి.

మీరు, Google Play గిఫ్ట్ కార్డ్‌లతో సహా, మీ Google Play ఖాతాకు జోడించే ఏదైనా పేమెంట్ ఆప్షన్‌తో కొనుగోలును పూర్తి చేయవచ్చు. మీరు కొనుగోలును పూర్తి చేసినప్పుడు, ఆ విషయాన్ని నిర్ధారిస్తూ మీ Google ఖాతాకు ఒక ఈమెయిల్ వస్తుంది. కొనుగోలు మీ Google Play ఆర్డర్ హిస్టరీలో చూపబడుతుంది.

మీ ఫ్యామిలీ మెంబర్‌లు కొనుగోలు రిక్వెస్ట్ చేస్తే, వారు కూడా కొనుగోలు నిర్ధారణ ఈమెయిల్‌ను అందుకుంటారు. మీ కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు, కొనుగోలు నిర్ధారణ ఈమెయిల్స్‌తో సహా, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు వర్తిస్తాయి.

చిట్కాలు:

  • పెయిడ్ యాప్‌లు లేదా యాప్‌లో కొనుగోళ్లను చేయడానికి ఫ్యామిలీ మెంబర్‌లు ఆమోదం కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. ఇందులో, Play Books, Google TV లేదా సబ్‌స్క్రిప్షన్ కొనుగోళ్లు ఉండవు.
  • మీరు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను జోడిస్తే, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ లేకుండా చేసిన కొనుగోలు రిక్వెస్ట్‌లు మీ ఫ్యామిలీ గ్రూప్‌నకు అందుబాటులో ఉండవు.
  • ఫ్యామిలీ మేనేజర్ అనుమతి లేకుండా ఫ్యామిలీ మెంబర్‌లు, ఫ్యామిలీ మేనేజర్‌కు చెందిన పేమెంట్ ఆప్షన్‌ను కనుగొనలేరు లేదా ఉపయోగించలేరు.
  • కొనుగోలు రిక్వెస్ట్‌లను పూర్తి చేయడానికి ఫ్యామిలీ మేనేజర్‌లు గతంలో రిడీమ్ చేసిన ప్రమోషనల్ ఆఫర్‌లను ఉపయోగించలేరు లేదా కొత్త ప్రమోషనల్ ఆఫర్‌లను రిడీమ్ చేయలేరు. Google Playలో రీఫండ్‌ల గురించి మరింత తెలుసుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7812454521415428517
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false