మీ Google Play బ్యాలెన్స్‌ను జోడించడం, అలాగే ఆ బ్యాలెన్స్‌ను చెక్ చేయడం ఎలా

Google Play బ్యాలెన్స్ అనేది Google Playలో యాప్‌లు, గేమ్‌లు, డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి ఉపయోగపడే క్రెడిట్. మీ బ్యాలెన్స్‌ను ఎలా రీఛార్జ్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి:

రెండు ఖాతాలకు మీరే ఓనర్ అయినప్పటికీ కూడా, Google Playలో ఖాతాల మధ్య కంటెంట్‌ను షేర్ చేయడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. మీ పరికరంలో మీకు పలు ఖాతాలు ఉన్నట్లయితే, మీరు మీ కొనుగోలును పూర్తి చేయడానికి ముందు మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.

చట్ట ప్రకారం అవసరం అయితే తప్ప (ఉదాహరణకు, తక్కువ వయస్సు గల యూజర్ ఖాతాలు), ఈ Google Play ప్రోడక్ట్‌ల విషయంలో రీఫండ్ చేయడం లేదా బదిలీ చేయడం వీలు కాదు:

  • Play గిఫ్ట్ కార్ద్‌లు
  • ప్రీపెయిడ్ Play బ్యాలెన్స్
    • క్యాష్ టాప్ అప్‌లు
  • ప్రమోషనల్ Play బ్యాలెన్స్

Google Play గిఫ్ట్ కార్డ్‌లను ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌గా లేదా తక్కువ వయస్సు గల యూజర్ ఖాతాల కోసం ఉపయోగించడం సాధ్యపడదు.

తప్పు ఖాతా ద్వారా మీరు యాప్‌ను కొనుగోలు చేసినట్లయితే, యాప్ డెవలపర్‌ను కాంటాక్ట్ చేయండి. వారు మీ కొనుగోలుకు సంబంధించి రీఫండ్ చేయవచ్చు, తద్వారా మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతా ద్వారా మళ్లీ దాన్ని కొనుగోలు చేయవచ్చు.

చిట్కా: Google Play ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా మీరు మీ ఫ్యామిలీతో యాప్‌లను, డిజిటల్ కంటెంట్‌ను షేర్ చేయవచ్చు.

Google Playలో మీరు ఏం కొనగలరో చూడండి

 

మీ Google Play బ్యాలెన్స్‌కు, డబ్బు లేదా క్రెడిట్‌ను ఎలా జోడించాలి

గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేయండి

మీరు గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసినప్పుడు, ఆ గిఫ్ట్ కార్డ్ అమౌంట్ మొత్తం మీ Google Play బ్యాలెన్స్‌కు జోడించబడుతుంది.

కిరాణా షాప్ నుండి నగదును జోడించడం

మీరు కిరాణా షాప్‌కు వెళ్లి, మీ Google Play బ్యాలెన్స్‌కు నగదును జోడించవచ్చు. ఈ సదుపాయం మీ దేశంలో లభ్యమవుతోందో లేదో చెక్ చేయండి.

గమనిక: మీ Google Play బ్యాలెన్స్‌కు, క్యాష్‌ను జోడించడానికి, కిరాణా షాప్ అదనపు ఫీజును ఛార్జీ చేయవచ్చు.

Play క్రెడిట్‌ల కోసం, Play పాయింట్‌లను రిడీమ్ చేయండి

Play క్రెడిట్‌ల కోసం, మీ Play పాయింట్‌లను ఎలా రిడీమ్ చేయాలి అనేదాని గురించి మరింత తెలుసుకోండి.

మీ Google Play బ్యాలెన్స్‌ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌లు ఆ తర్వాత Google Play బ్యాలెన్స్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీరు కొనగలిగేవి ఏంటో చూడండి

సంబంధిత కథనం

మీ పేమెంట్ ఆప్షన్‌ను మార్చడం ఎలాగో తెలుసుకోండి.
Android కంప్యూటర్
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12020647971540978504
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false