మీరు గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసుకొనేటప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి

Google Play గిఫ్ట్ కార్డ్‌లను, Google Play బ్యాలెన్స్ రూపంలో క్రెడిట్ కోసం రిడీమ్ చేసుకోవచ్చు. Google Playలోని కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి మీ బ్యాలెన్స్‌ను మీరు ఉపయోగించవచ్చు.

మీరు ప్రమోషన్‌ను రిడీమ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే:

  • మీరు రిడీమ్ చేయడానికి ప్రయత్నిస్తోంది Google Play గిఫ్ట్ కార్డ్‌నే అని నిర్ధారించుకోండి. మేము ఇతర గిఫ్ట్ కార్డ్ రకాలను ఆమోదించము.
  • మీరు కోడ్‌ను సరిగ్గానే టైప్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. ఖాళీలు లేదా డాష్‌లను ఉపయోగించవద్దు.

గిఫ్ట్ కార్డ్‌లతో ఎదురయ్యే సాధారణ సమస్యలు

గిఫ్ట్ కార్డ్‌పై ఉన్న కోడ్‌ను రీడ్ చేయడం సాధ్యపడలేదు

ముందుగా, మీ గిఫ్ట్ కార్డ్‌ను స్కాన్ చేయడానికి ట్రై చేయండి:

  1. మీ Android ఫోన్‌లో, Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. గిఫ్ట్ కార్డ్‌ను స్కాన్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ కోడ్‌ను మీరు రీడ్ చేయలేకపోతే, సహాయం కోసం మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి. మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు, ఇవి మీ వద్ద ఉండాలి:

  • కార్డ్ వెనుక భాగానికి సంబంధించిన ఫోటో: కార్డ్ సీరియల్ నంబర్ తప్పనిసరిగా కనిపించాలి.
  • మీ రసీదు: మీ కొనుగోలు రుజువు డాక్యుమెంట్ మాకు కావాలి.
కోడ్ చెల్లదు లేదా తప్పు కోడ్ ఎంటర్ చేయబడింది

ముందుగా, మీ గిఫ్ట్ కార్డ్‌ను స్కాన్ చేయడానికి ట్రై చేయండి:

  1. మీ Android ఫోన్‌లో, Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. గిఫ్ట్ కార్డ్‌ను స్కాన్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ గిఫ్ట్ కార్డ్‌ను మీరు స్కాన్ చేయలేకపోతే, మీరు కోడ్‌ను మాన్యువల్‌గా ఎంటర్ చేయవచ్చు. మీరు కోడ్‌ను సరిగ్గానే ఎంటర్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. మీరు కోడ్‌ను ఎంటర్ చేసేటప్పుడు ఖాళీలు లేదా డాష్‌లను ఉపయోగించవద్దు, సరైన అక్షరాలనే ఇన్‌పుట్ చేస్తున్నారని చెక్ చేసుకోండి.

అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే, మీ గిఫ్ట్ కార్డ్ యాక్టివేట్ అయి ఉండకపోవచ్చు అని అర్థం. దుకాణాలలో కొనుగోలు చేసిన గిఫ్ట్ కార్డ్‌లను, తప్పనిసరిగా కొనుగోలు చేసిన సమయంలోనే విక్రేత యాక్టివేట్ చేయాలి. స్టోర్ తరఫున గిఫ్ట్ కార్డ్‌లను Google యాక్టివేట్ చేయలేదు.

  • గిఫ్ట్ కార్డ్ యాక్టివేట్ అయిందో లేదో చెక్ చేయడానికి, మీరు కార్డ్‌ను ఏ రిటైలర్ వద్ద అయితే కొనుగోలు చేశారో, ఆ రిటైలర్‌ను లేదా కోడ్‌ను జారీ చేసిన కంపెనీని సంప్రదించండి.
  • కార్డ్ యాక్టివేట్ చేయబడిందని దుకాణం నిర్ధారించిన తర్వాత కూడా మీకు ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లయితే, సహాయం కోసం మమ్మల్ని సంప్రదించండి.
ఈ కోడ్ ఇప్పటికే రిడీమ్ చేయబడింది

ఇప్పటికే మీ కోడ్ రిడీమ్ చేయబడింది అనే ఎర్రర్ కనుక మీకు వస్తే, దాన్ని మళ్లీ రిడీమ్ చేయడం సాధ్యం కాదు. దానికి సంబంధించిన క్రెడిట్ మీ Google Play బ్యాలెన్స్‌లో కనిపించాలి. మీ Google Play బ్యాలెన్స్‌ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.

ఒకవేళ మీకు క్రెడిట్ కనిపించకపోతే:

  • మీరు కోడ్‌ను రిడీమ్ చేసుకున్నప్పుడు ఏ ఖాతాకు అయితే సైన్ అయి ఉన్నారో, ఇప్పుడు కూడా అదే ఖాతాకు సైన్ అయి ఉన్నారని నిర్ధారించుకోండి. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు మారడం ఎలాగో తెలుసుకోండి.
  • కోడ్‌కు యాక్సెస్ ఉండే అవకాశం ఉన్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌లు, దాన్ని రిడీమ్ చేయలేదని నిర్ధారించుకోండి.

గోప్యత, అలాగే సెక్యూరిటీ కారణాల దృష్ట్యా, గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేయడానికి ఉపయోగించబడిన Google ఖాతాకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా మేము షేర్ చేయలేము.

మీ Google Play బ్యాలెన్స్ పరిమితిని చేరుకుంది

మీ Google Play బ్యాలెన్స్ మొత్తం విలువకు పరిమితులు ఉన్నాయి. ప్రమోషన్ విలువ మీ బ్యాలెన్స్‌ను మీ దేశంలోని పరిమితి కంటే ఎక్కువగా ఉంచినట్లయితే మీరు దానిని రిడీమ్ చేయలేరు.

ప్రమోషన్‌ను రిడీమ్ చేయడానికి:

  1. మీ బ్యాలెన్స్‌లో కొంత ఖర్చు చేయండి.
  2. 24 గంటలు వేచి ఉండండి.
  3. కోడ్‌ను రిడీమ్ చేయడానికి ట్రై చేయండి.
గిఫ్ట్ కార్డ్‌కు సంబంధించి ఇతర ఎర్రర్‌లు
ఎర్రర్ మెసేజ్ పరిష్కారం
"ఈ కోడ్‌ను రిడీమ్ చేయడం సాధ్యపడలేదు. ఈ కోడ్‌ను [country/region]‌లో మాత్రమే ఉపయోగించవచ్చు. గిఫ్ట్ కార్డ్ సర్వీస్ నియమాలను చూడండి."

ప్రమోషన్ ఏ దేశంలో అయితే అందించబడుతోందో మీరు తప్పనిసరిగా ఆ దేశ నివాసి అయి ఉండాలి. పేమెంట్ ఆప్షన్, మీ స్వదేశంతో మ్యాచ్ అవుతోందని నిర్ధారించుకోండి.

కొన్ని సందర్భాల్లో, మీరు తప్పనిసరిగా ఆ దేశం లేదా ప్రాంతంలో ఫిజికల్‌గా ఉండాల్సి ఉంటుంది. ఇటీవలే మీరు మరొక దేశానికి మారినట్లయితే, మీరు మీ Google Play దేశాన్ని మార్చాల్సి రావచ్చు.

మరింత సమాచారం కోసం, Google Play గిఫ్ట్ కార్డ్, అలాగే ప్రీపెయిడ్ బ్యాలెన్స్ సర్వీస్ నియమాలను చెక్ చేయండి.
"మీ గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేయడానికి మాకు మరింత సమాచారం అవసరం అవుతుంది. వివరాలను మాకు పంపండి." సమస్యను పరిశోధించడంలో మా టీమ్‌కు సహాయపడటానికి, ఈ ఫారమ్‌ను సమర్పించండి.
"ఆ కోడ్‌తో ఏదో సమస్య ఉంది. వేరే కోడ్‌ను ట్రై చేయండి లేదా మరింత తెలుసుకోండి." సమస్యను పరిశోధించడంలో మా టీమ్‌కు సహాయపడటానికి, ఈ ఫారమ్‌ను సమర్పించండి.
"మీ ఖాతాతో ఏదో సమస్య ఉన్నందున, మీ గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేయడం సాధ్యపడదు." మీ సమాచారాన్ని మీరు వెరిఫై చేసి, అప్‌డేట్ చేయాల్సి రావచ్చు. పేమెంట్‌ల విషయంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.
"మీ Google Play ఖాతాకు బ్యాలెన్స్‌ను జోడించే సదుపాయాన్ని మేము మీకు కల్పించే ముందు, మీ గుర్తింపును వెరిఫై చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము."

మీ గుర్తింపును, అలాగే పన్ను సమాచారాన్ని అప్‌డేట్ చేయడం, అలాగే వెరిఫై చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీ గుర్తింపు నిర్ధారించబడకపోతే, మీ Google Play బ్యాలెన్స్‌కు మీరు యాక్సెస్‌ను కోల్పోయే అవకాశం ఉంది.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4896904860367019361
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false