మీ కంటెంట్‌ను మీరు ఎక్కడ చూడగలరు

మీరు Android TV పరికరం, Google TV పరికరం, Android పరికరంలోని Google TV యాప్, లేదా YouTube ద్వారా సినిమాను కొనుగోలు చేసినప్పుడు లేదా అద్దెకు తీసుకున్నప్పుడు, అది మీ లైబ్రరీకి జోడించబడుతుంది. మీరు అనేక పరికరాలలో మీ లైబ్రరీలోని కంటెంట్‌ను చూడవచ్చు.

ఎక్కడ చూడాలి

ముఖ్యమైనది: ప్రతి ప్లాట్‌ఫామ్‌పై, మీరు కొనుగోలు చేయడానికి ఉపయోగించిన అదే ఖాతాతో సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి. మీరు మీ మొత్తం కంటెంట్‌ను మీ లైబ్రరీలో కనుగొనవచ్చు.

ఫోన్ లేదా టాబ్లెట్‌లో చూడండి

Google TV మొబైల్ యాప్

మీరు Android, iOS పరికరాలలో Google TV యాప్‌లో సినిమాలు, ఇంకా షోలను చూడవచ్చు.
  1. మీ ఫోన్‌లో, Google TV యాప్‌ను తెరవండి.
  2. మీ విషయాలు ఆ తర్వాత లైబ్రరీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

YouTube యాప్

  1. మీ ఫోన్‌లో YouTube YouTubeను తెరవండి.
  2. దిగువున ఉన్న, లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ సినిమాలు & షోలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు కొనుగోలు చేసిన కంటెంట్‌ను చూసినప్పుడు యాడ్‌లు ప్లే కావు.

వెబ్ బ్రౌజర్‌లో చూడండి

YouTube.com

  1. బ్రౌజర్‌లో, https://youtube.com సైట్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువున, ఎడమ వైపున ఉన్న మెనూ మెనూ ఆ తర్వాత మీ సినిమాలు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. కొనుగోలు చేయబడ్డాయి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
చిట్కా: మీరు కొనుగోలు చేసిన కంటెంట్‌ను చూసినప్పుడు యాడ్‌లు ప్లే కావు.

స్ట్రీమింగ్ పరికరం లేదా స్మార్ట్ టీవీలో చూడండి

Google TV పరికరాలు

  1. మీ Google TV పరికరంలో, మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.
  2. లైబ్రరీ ట్యాబ్‌కు వెళ్లండి.
  3. మీరు చూడాలనుకుంటున్న సినిమా లేదా టీవీ షోను ఎంచుకోండి.

Android TV పరికరాలు

  1. మీ Android TV పరికరంలో, మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.
  2. షాప్ ట్యాబ్‌కు వెళ్లండి.
  3. “మీ లైబ్రరీ” టైటిల్‌తో ఉన్న మొదటి అడ్డు వరుసలో, మీరు కొనుగోలు చేసిన కంటెంట్ కనిపిస్తుంది.
    • మీ లైబ్రరీ 10 కంటే టైటిల్స్ ఎక్కువ ఉంటే, “మీ లైబ్రరీ” విభాగంలో, అన్నీ చూడండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
చిట్కా: షాప్ ట్యాబ్ కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది. మీ పరికరంలో షాప్ ట్యాబ్ లేకపోతే, YouTube యాప్ ద్వారా లేదా కింది పద్ధతుల్లో ఒక దాని ద్వారా మీరు కొనుగోలు చేసిన కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు.

ఇతర స్మార్ట్ టీవీలలో YouTube యాప్

  1. మీ స్మార్ట్ టీవీలో YouTube YouTubeను తెరవండి.
  2. మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.
  3. లైబ్రరీ ట్యాబ్‌కు వెళ్లండి.
  4. మీ సినిమాలు, షోలు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
చిట్కా: మీరు కొనుగోలు చేసిన కంటెంట్‌ను చూసినప్పుడు యాడ్‌లు ప్లే కావు.

స్మార్ట్ టీవీలలో, Movies Anywhere యాప్

ముఖ్య గమనిక: Movies Anywhere అనే యాప్ USలో అర్హత ఉన్న టైటిల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే, మీరు మీ Movies Anywhere ఖాతాకు మీ Google ఖాతాను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం, Movies Anywhere సపోర్ట్‌కు వెళ్లండి.
  1. మీ స్మార్ట్ టీవీలో, Movies Anywhereను తెరవండి.
  2. మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.
  3. నా సినిమాలు అనే విభాగానికి వెళ్ళండి.
  4. మీరు చూడాలనుకుంటున్న సినిమాను లేదా టీవీ షోను ఎంచుకోండి.

Chromecast పరికరాలు

మీ Chromecastలో Google TV ఉన్నప్పుడు, మీరు నేరుగా మీ టీవీలో Google నుండి సినిమాలు, షోలను పొందవచ్చు. Google TVలో కంటెంట్‌ను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడం ఎలాగో తెలుసుకోండి.

ఇతర Chromecast పరికరాలతో, మీరు మీ టీవీకి వీడియోను స్ట్రీమ్ చేయవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14525217465968700375
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false