Chrome నుండి మీ టీవీలో ప్రసారం చేయండి

మీరు మీ PC, ఇంకా Chromecast పరికరంతో మీ TVలో Chrome ట్యాబ్ లేదా మీ స్క్రీన్‌ను చూపవచ్చు.

మీరు అత్యధిక వెబ్ కంటెంట్‌ను ప్రసారం చేయవచ్చు. Silverlight, QuickTime, VLC వంటి కొన్ని ప్లగ్ఇన్‌లు పని చేయవు.

Chromeను మీ TVలో చూపడానికి, మీకు ఇవి అవసరమవుతాయి:

Chrome నుండి ఒక ట్యాబ్‌ను ప్రసారం చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. పైన కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సేవ్ చేసి, షేర్ చేయండి ఆ తర్వాత ప్రసారం చేయండి… ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న ప్రసార రిసీవర్‌ను ఎంచుకోండి.
    • పరికరం ఇప్పటికే వినియోగంలో ఉంటే, ప్రస్తుత కంటెంట్ రీప్లేస్ అవుతుంది.
  4. ప్రసారాన్ని ఆపివేయడానికి, అడ్రస్ బార్‌కు కుడి వైపున ఉన్న, ప్రసారం చేయండి ఆ తర్వాత ప్రసారాన్ని ఆపివేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: Google Castను సపోర్ట్ చేసే సైట్‌లలో, మీడియా ప్లేయర్ నుండి నేరుగా ప్రసారం చేయండి.

మీరు Chromeలో వీటిని కనుగొనవచ్చు

  • మీరు ట్యాబ్‌ను TVలో ప్రసారం చేసినప్పుడు, ట్యాబ్‌లో ఒక డిస్‌ప్లే చిహ్నం Display కనిపిస్తుంది.
  • యాక్టివ్‌గా ఒక ప్రసార సెషన్ జరుగుతున్నప్పుడు, అడ్రస్ బార్‌కు కుడివైపున, ”ఎక్స్‌టెన్షన్”ల పక్కన, మీరు ప్రసారం కనెక్ట్ చేయబడిన చిహ్నాం ను కనుగొనవచ్చు.

Chromeలో షార్ట్‌కట్‌ను ఉపయోగించడానికి, Cast బటన్‌ను జోడించండి.

చిట్కా: మీరు ప్రసారం చేసే వీడియోలు లేదా ఇమేజ్‌లు మీ కంప్యూటర్‌లో, టీవీలో కనిపిస్తాయి, కానీ సౌండ్ మీ టీవీలో మాత్రమే ప్లే అవుతుంది. ఇతర ట్యాబ్‌లు, యాప్‌లలోని సౌండ్‌లు ఇప్పటికీ మీ కంప్యూటర్‌లోనే ప్లే అవుతాయి.

మీ కంప్యూటర్ స్క్రీన్‌ను ప్రసారం చేయండి

Chromeతో మీ కంప్యూటర్ స్క్రీన్ మొత్తాన్ని Mac, Windows, లేదా Chromebookలో డిస్‌ప్లే చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీ స్క్రీన్‌ను ప్రసారం చేసినప్పుడు, ఆడియో మీ కంప్యూటర్‌లో ప్లే కావచ్చు. బదులుగా మీ టీవీలో ఆడియోను ప్లే చేయడానికి, ట్యాబ్‌ను ప్రసారం చేయండి.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. పైన కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సేవ్ చేసి, షేర్ చేయండి ఆ తర్వాత ప్రసారం చేయండి… ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. సోర్స్‌లు ఆ తర్వాత స్క్రీన్‌ను ప్రసారం చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు మీ స్క్రీన్‌ను ప్రసారం చేయాలనుకుంటున్న పరికరాన్ని ఎంచుకోండి.

మీ కంప్యూటర్ నుండి మ్యూజిక్, వీడియోలను ప్రసారం చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. మీరు Chrome ట్యాబ్‌లో ప్రసారం చేయాలనుకుంటున్న ఫైల్‌ను తెరవండి.
  3. ఫైల్‌ను Chrome ట్యాబ్‌లోకి లాగి, వదలండి లేదా కీబోర్డ్ షార్ట్‌కట్‌ను ఉపయోగించండి:
    • Windows: Ctrl + O
    • Mac: కమాండ్ + O
  4. పైన కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాతసేవ్ చేసి, షేర్ చేయండి ఆ తర్వాత ప్రసారం చేయండి… ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మీరు ప్రసారం చేయాలనుకుంటున్న పరికరాన్ని ఎంచుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2642864494677070947
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false