2-దశల వెరిఫికేషన్ కోసం సెక్యూరిటీ కీని ఉపయోగించండి

మీ Google ఖాతాను హ్యాకర్‌ల నుండి సురక్షితంగా ఉంచడంలో మీకు సహాయపడటానికి, సెక్యూరిటీ కీలను 2-దశల వెరిఫికేషన్‌తో ఉపయోగించవచ్చు.
ముఖ్య గమనిక: మీరు విలేఖరి, యాక్టివిస్ట్, లేదా టార్గెట్ చేసిన ఆన్‌లైన్ దాడులకు గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తి అయితే, అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోండి.

1వ దశ: మీ 'కీ'లను పొందండి

2వ దశ: మీ ఖాతాకు 'కీ'ని జోడించండి

మీరు మీ బ్రౌజర్ లేదా OSకు చెందిన తాజా వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. కొత్త రిజిస్టర్డ్ కీలు ఇకపై Android పరికరాల 8.0, అంతకంటే తక్కువ వాటిపై పని చేయవు.

  1. Chrome లాంటి ఒక అనుకూల బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీ సెక్యూరిటీ కీని ఎన్‌రోల్ చేయండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
చిట్కా: మీ కీ పోయినప్పుడు సైన్ ఇన్ చేయడంలో మీకు సహాయపడటానికి, అది మీరేనని నిరూపించుకోవడానికి మరిన్ని మార్గాలను జోడించండి

3వ దశ: మీ 'కీ'తో సైన్ ఇన్ చేయండి

రెండవ దశలుగా సెక్యూరిటీ కీలు మరింత రక్షణను అందిస్తాయి. మీరు ఇతర రెండవ దశలను సెటప్ చేసి ఉంటే, సైన్ ఇన్ చేయడానికి సాధ్యమైనప్పుడల్లా మీ సెక్యూరిటీ కీని ఉపయోగించండి. మీ పరికరంలో లేదా బ్రౌజర్‌లో సెక్యూరిటీ కీ పని చేయకపోతే, దానికి బదులుగా కోడ్ లేదా ప్రాంప్ట్‌తో సైన్ ఇన్ చేయడానికి మీకు ఒక ఆప్షన్ కనిపించవచ్చు.

మీకు ఎర్రర్ వచ్చినట్లయితే, మీరు "ఈ సెక్యూరిటీ కీని ముందుగా మీ Google ఖాతాలో నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే దీనిని ఉపయోగించి సైన్ ఇన్ చేయగలరు":

  1. వేరే ఖాతాతో సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నించండి.
  2. మీ Google Play సర్వీస్‌ను అప్‌డేట్ చేయండి.
  3. సదరు ఖాతాను జోడించడానికి, మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి .
చిట్కా: ఒక కొత్త కంప్యూటర్ లేదా పరికరం నుండి మీరు ఎప్పుడు సైన్ ఇన్ చేసినా, మీ సెక్యూరిటీ కీని ఉపయోగించమని లేదా మరొక రెండవ దశను ఉపయోగించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
బ్లూటూత్ (BLE)తో
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్‌ను గానీ లేదా Chrome, Firefox, Edge, లేదా Opera లాంటి ఒక అనుకూల బ్రౌజర్‌ను గానీ తెరవండి.
  2. మీరు ఇప్పటికే మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండకపోతే, ఆ పని చేయండి.
  3. మీ ఖాతాకు ఒక సెక్యూరిటీ కీ ఉందని మీ పరికరం గుర్తిస్తుంది. మీ పరికరాన్ని, 'కీ'ని పెయిర్ చేయడానికి, దశలను ఫాలో అవ్వండి.

పెయిరింగ్ అయ్యాక, మీరు ఇంతకు ముందు మీ Google ఖాతాకు ఎలా సైన్ ఇన్ చేసేవారో, ఇప్పుడు కూడా అలాగే చేయవచ్చు. మీరు సైన్ ఇన్ చేసేటప్పుడు మీ గుర్తింపును నిర్ధారించవలసిన అవసరం మాకు వస్తే, మీ కీ మీద ఉన్న బటన్‌ను నొక్కమని మిమ్మల్ని అడుగుతాము.

బ్లూటూత్‌తో ఉన్న సమస్యలను పరిష్కరించండి

ఫోన్‌తో లేదా టాబ్లెట్‌తో, కీ పెయిర్ అవ్వడం లేదు

వీటిని మర్చిపోకుండా చేయండి:

కీ పెయిరింగ్ మోడ్‌లోకి వెళ్లడం లేదు

వీటిని చెక్ చేయండి:

  • మీ కంప్యూటర్ లేదా ఛార్జర్ నుండి మీ కీ అన్‌ప్లగ్ చేసి ఉందని
  • మీ కీ ఛార్జ్ చేయబడి ఉందని

Google Play సర్వీస్‌ల ఎర్రర్

  1. మీ Android పరికరంలో, సెక్యూరిటీ కీని ఉపయోగించని ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  2. Google Play సర్వీస్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
    • మీ పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడి ఉందని నిర్ధారించుకోండి.
  3. సెక్యూరిటీ కీని ఉపయోగించే ఖాతాతో తిరిగి మీ Android పరికరంలోకి సైన్ ఇన్ చేయండి.
  4. బ్లూటూత్ (BLE)తో మీ 'కీ'ని ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.
'సమీప క్షేత్ర కమ్యూనికేషన్ (NFC)'తో
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్‌ను గానీ లేదా Chrome లాంటి ఒక అనుకూల బ్రౌజర్‌ను గానీ తెరవండి.
  2. మీరు ఇప్పటికే మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండకపోతే, ఆ పని చేయండి.
  3. మీ ఖాతాకు ఒక సెక్యూరిటీ కీ ఉందని మీ పరికరం గుర్తిస్తుంది. మీ 'కీ'ని ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.

NFCతో ఉన్న సమస్యలను పరిష్కరించండి

వీటిని మర్చిపోకుండా చేయండి:

  • మీ పరికరంలో NFCని ఆన్ చేయండి
  • 'కీ'ని మీ ఖాతాకు జోడించండి
  • NFC సిగ్నల్‌ను బ్లాక్ చేయగల కేసు లేదా స్టిక్కర్ వంటి వస్తువు ఏదైనా ఉంటే, దాన్ని తీసివేయండి
  • మీ పరికరాన్ని Google Play సర్వీస్‌ల తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి
  • మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేయండి
  • NFCని ఆఫ్ చేసి, మళ్లీ ఆన్ చేయడానికి ట్రై చేయండి

Google Play సర్వీస్‌ల ఎర్రర్

  1. మీ Android పరికరంలో, సెక్యూరిటీ కీని ఉపయోగించని ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  2. Google Play సర్వీస్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
    • మీ పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడి ఉందని నిర్ధారించుకోండి.
  3. సెక్యూరిటీ కీని ఉపయోగించే ఖాతాతో తిరిగి మీ Android పరికరంలోకి సైన్ ఇన్ చేయండి.
  4. 'సమీప క్షేత్ర కమ్యూనికేషన్' (NFC)తో మీ 'కీ'ని ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.
USBతో
  1. Chrome లాంటి ఒక అనుకూల బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి. మీ ఖాతాకు ఒక సెక్యూరిటీ కీ ఉందని మీ పరికరం గుర్తిస్తుంది.
  3. మీ 'కీ'ని మీ పరికరంలోని USB పోర్ట్‌కు కనెక్ట్ చేయండి. మీకు USB అడాప్టర్ అవసరం కావచ్చు
  4. మీకు "Google Play సర్వీస్‌ల" నుండి వచ్చిన మెసేజ్ ఏదైనా కనబడితే, సరేను ట్యాప్ చేయండి. మెసేజ్ ఏదీ రాకపోతే, 5వ దశకు కొనసాగండి.
  5. మీ 'కీ'ని ఆన్ చేయండి:
    • మీ 'కీ'కి గోల్డ్ డిస్క్ ఉంటే, దాన్ని ట్యాప్ చేయండి.
    • మీ 'కీ'కి గోల్డ్ టిప్ ఉంటే, దాన్ని ట్యాప్ చేసి, నొక్కండి.
    • మీ 'కీ'కి బటన్ ఉంటే, దాన్ని నొక్కండి.
    • మీ 'కీ'కి ఈ ఫీచర్‌లు ఏవీ లేకపోతే, దాన్ని మీరు తీసివేసి, తిరిగి ఇన్‌సర్ట్ చేయాల్సి రావచ్చు. ఇలాంటి 'కీ', దానిని ఉపయోగించడం అయిపోయిన ప్రతిసారీ ఆఫ్ అయిపోతుంది.

మీ సెక్యూరిటీ కీలను ఆర్గనైజ్ చేయండి

మీరు మీ 2-దశల వెరిఫికేషన్ సెట్టింగ్‌లలో మీ సెక్యూరిటీ కీలను మేనేజ్ చేయవచ్చు. అక్కడ, మీరు జోడించిన కీల లిస్ట్‌ను మీరు ఇటీవలి నుండి పాత వాటి వరకు కనుగొంటారు. మీరు కీ పేరు, జోడించిన తేదీ, చివరిగా ఉపయోగించిన తేదీ వంటి మరింత సమాచారాన్ని కూడా కనుగొంటారు. మీరు అనుకూల పేరును ఎంచుకున్నప్పుడు తప్ప, "సెక్యూరిటీ కీ"కి ఆటోమేటిక్ సెట్టింగ్ కీ పేరు అవుతుంది.

మీరు ప్రతి సెక్యూరిటీ కీ పేరును ఎడిట్ చేయడానికి లేదా తొలగించడానికి కూడా ఆప్షన్‌ను కలిగి ఉంటారు.

మీ సెక్యూరిటీ కీల పేరు మార్చండి

ప్రతి సెక్యూరిటీ కీ పక్కన, దాని పేరును ఎడిట్ చేయడానికి పెన్సిల్ చిహ్నం ఎడిట్ చేయండిపై క్లిక్ చేయండి. మీకు పలు సెక్యూరిటీ కీలు ఉంటే, మీరు వాటిని అనుకూల పేరుతో బాగా గుర్తించగలరని దీని అర్థం.

మీ సెక్యూరిటీ కీలను తీసివేయండి
సెక్యూరిటీ కీ పక్కన, దాన్ని తీసివేయడానికి ట్రాష్ బిన్ చిహ్నం తొలగించు పై క్లిక్ చేయండి, తద్వారా ఇది మీ Google ఖాతాకు కనెక్ట్ చేయబడదు. మీరు మీ సెక్యూరిటీ కీని తీసివేసినప్పుడు, నిర్ధారణ కోసం మిమ్మల్ని అడుగుతాము. మీరు ఇప్పుడు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి మీ ఫోన్‌ను ఉపయోగిస్తారు.
సెక్యూరిటీ కీని ఉపయోగించలేని సందర్భం

మీరు మీ సెక్యూరిటీ కీని ఉపయోగించలేకపోతే, 2-దశల వెరిఫికేషన్ కోసం సెక్యూరిటీ కోడ్‌ను జెనరేట్ చేయవచ్చు:

  1. మీ ఖాతాకు సైన్ ఇన్ చేసిన పరికరంలో, g.co/sc లింక్‌కు వెళ్లండి.
  2. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
లాక్ అయిన మీ సెక్యూరిటీ కీని రీసెట్ చేయండి

కొన్ని సెక్యూరిటీ కీలకు PIN లాంటి అదనపు వెరిఫికేషన్ అవసరం అవుతుంది.

పలు సార్లు సరికాని PINను ఎంటర్ చేసిన కారణంగా మీ సెక్యూరిటీ కీ లాక్ అయిపోయి ఉండి, తప్పనిసరిగా రీసెట్ చేయాల్సిన సందర్భంలో:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను Chrome తెరవండి.
  2. పైన కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత గోప్యత, సెక్యూరిటీ ఆ తర్వాత సెక్యూరిటీ ఆ తర్వాత సెక్యూరిటీ కీలను మేనేజ్ చేయండి ఆ తర్వాత మీ సెక్యూరిటీ కీని రీసెట్ చేయండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

చిట్కా: మీ లాక్ చేయబడిన సెక్యూరిటీ కీను రీసెట్ చేయడానికి మీరు Chromeను ఉపయోగించవచ్చు. chrome://settings/securityKeysకు వెళ్లండి.

సెక్యూరిటీ కీ పోయిన సందర్భం

మీ సెక్యూరిటీ కీ పోయినట్లయితే, మీ ఖాతాకు యాక్సెస్‌ను తిరిగి పొందడానికి, అలాగే దాన్ని రక్షించడానికి, మీరు ఉపయోగించే 2-దశల వెరిఫికేషన్ రకానికి సంబంధించిన దశలను ఫాలో అవ్వండి:

మీకు మరొక రెండవ దశ ఉన్నట్లయితే

  1. మీ పాస్‌వర్డ్‌ను, అలాగే మీ ఇతర రెండవ దశను ఉపయోగించి మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. పోగొట్టుకున్న 'కీ'ని మీ ఖాతా నుండి తీసివేయడం కోసం దశలను ఫాలో అవ్వండి.
  3. కొత్త సెక్యూరిటీ కీని పొందండి. మీరు ఒక అదనపు 'కీ'ని తీసుకుని, దానిని సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవచ్చు.
  4. మీ ఖాతాకు కొత్త 'కీ'ని జోడించండి.

మీకు మరొక రెండవ దశ లేకుంటే లేదా మీరు పాస్‌వర్డ్‌ను మర్చిపోయి ఉంటే

గమనిక: ఖాతా మీదేనని నిరూపించడానికి, 2-దశల వెరిఫికేషన్‌లో మీరు ఇంకొక అదనపు దశను పూర్తి చేయాల్సి ఉంటుంది. అదనంగా జోడించబడిన ఈ సెక్యూరిటీ కారణంగా, సైన్ ఇన్ చేయడానికి ట్రై చేస్తున్నది మీరేనని నిర్ధారించడానికి Googleకు 3-5 పని దినాల వరకు సమయం పట్టవచ్చు.

  1. మీ ఖాతాను రికవర్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి. ఇది మీ ఖాతాయే అని నిర్ధారించడానికి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
  2. మిమ్మల్ని ఇవి అడగవచ్చు:
    • మిమ్మల్ని సంప్రదించగల ఇమెయిల్ అడ్రస్‌ను లేదా ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయమని అడగవచ్చు.
    • మీ ఇమెయిల్ అడ్రస్‌కు లేదా ఫోన్ నంబర్‌కు పంపిన కోడ్‌ను ఎంటర్ చేయమని అడగవచ్చు. మీకు ఆ ఈమెయిల్ అడ్రస్‌కు లేదా ఫోన్ నంబర్‌కు యాక్సెస్ ఉందని నిర్ధారించడంలో ఈ కోడ్ సహాయపడుతుంది.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10656117561075712451
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false