మీ ఖాతాను మరింత సురక్షితం చేసుకోండి

Googleలో, మేము ఆన్‌లైన్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యతను ఇస్తాము. మీ Google ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి, కింద ఉన్న దశలను క్రమం తప్పకుండా ఫాలో అవ్వమని మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము.

ముఖ్య గమనిక: మీ Google ఖాతా కోసం తక్షణ చర్యను సిఫార్సు చేయడానికి Google ఎరుపు, పసుపు లేదా నీలం ఆశ్చర్యార్థక చిహ్నాన్ని ఉపయోగించవచ్చు. మరింత తెలుసుకోవడానికి, సిఫార్సు చేయబడిన చర్యలకు వెళ్లండి.

సిఫార్సు చేయబడిన చర్యలు

"సిఫార్సు చేయబడిన చర్యలు" పక్కన ఉన్న ఆశ్చర్యార్థక గుర్తు మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి మీరు యాక్టివ్‌గా చర్యలు తీసుకోవాలని Google సిఫార్సు చేస్తుంది. తీవ్రత స్థాయి వాటి రంగుపై ఆధారపడి ఉంటుంది: సెక్యూరిటీ చిట్కాల కోసం నీలం రంగు, ముఖ్యమైన దశలకు పసుపు రంగు, అలాగే అత్యవసరమైన వాటికి ఎరుపు రంగు ఉంటాయి. ఎంపిక గుర్తుతో ఆకుపచ్చ రంగు షీల్డ్ అనేది మీ ఖాతా సురక్షితంగా ఉంది, తక్షణ చర్య అవసరం లేదని అర్థం.

నోటిఫికేషన్‌లను చెక్ చేయడానికి:

  1. మీ Google ఖాతాలోకి సైన్ ఇన్ చేయండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను ఎంచుకోండి.
  3. సిఫార్సు చేయబడిన చర్యలు ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • ఇది మిమ్మల్ని సెక్యూరిటీ చెకప్‌నకు తీసుకెళ్తుంది, ఇక్కడ మీరు మీ ఖాతా సెక్యూరిటీను మెరుగుపరచడానికి వ్యక్తిగత సిఫార్సులను పొందుతారు.

సిఫార్సు చేయబడిన చర్యలు కనిపించకపోతే, మీ కోసం Google వద్ద ఎటువంటి సెక్యూరిటీ సిఫార్సులు లేవని అర్థం. అయితే, మీరు మీ Google ఖాతాలో మీ సెక్యూరిటీ స్థాయిని రివ్యూ చేయవచ్చు:

  1. మీ Google ఖాతాలోకి సైన్ ఇన్ చేయండి.
  2. మీ ఖాతాను మేనేజ్ చేయండి and then సెక్యూరిటీ ఆప్షన్‌లకు వెళ్లండి.
    • పైన, అన్ని సిఫార్సులు పరిష్కరించబడితే, ఈ పేజీ ఆకుపచ్చ షీల్డ్‌ను చూపుతుంది.
    • ఈ పేజీ ఆకుపచ్చ షీల్డ్‌ను చూపితే, మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది, అయితే మీ ఖాతాను మరింత సురక్షితంగా ఉంచడానికి సూచనలను షేర్ చేసే సెక్యూరిటీ చిట్కాలను కూడా మీరు కలిగి ఉండవచ్చు.

చిట్కా: మీరు విలేఖరి, యాక్టివిస్ట్, లేదా టార్గెట్ చేసిన ఆన్‌లైన్ అటాక్‌లకు గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తి అయితే, అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోండి.

1వ దశ: సెక్యూరిటీ చెకప్‌ను చేయండి

కింద ఉన్న వాటితో సహా, మీ Google ఖాతా కోసం వ్యక్తిగతీకరించిన సెక్యూరిటీ సిఫార్సులను పొందడానికి, సెక్యూరిటీ చెకప్‌కు వెళ్లండి:

ఖాతా రికవరీ ఆప్షన్‌లను జోడించండి లేదా అప్‌డేట్ చేయండి

మీ రికవరీ ఫోన్ నంబర్ , ఇమెయిల్ అడ్రస్‌లు శక్తివంతమైన సెక్యూరిటీ టూల్స్. ఈ కాంటాక్ట్ సమాచారాన్ని కింది వాటి విషయంలో మీకు సహాయపడటానికి ఉపయోగించవచ్చు:

  • మీ అనుమతి లేకుండా మీ ఖాతాను ఉపయోగించకుండా ఎవరినైనా బ్లాక్ చేయడంలో సహాయపడటానికి
  • మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ జరిగితే, మిమ్మల్ని అలర్ట్ చేయడంలో సహాయపడటానికి
  • మీ ఖాతా ఎప్పుడైనా లాక్ అయితే, దాన్ని రికవర్ చేయడంలో సహాయపడటానికి

మీ రికవరీ ఫోన్ నంబర్‌ను లేదా ఇమెయిల్ అడ్రస్‌ను జోడించడం లేదా మార్చడం ఎలాగో తెలుసుకోండి.

2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి

హ్యాకర్‌లు మీ పాస్‌వర్డ్‌ను దొంగిలించినప్పటికీ, వారు మీ ఖాతాలోకి చొరబడకుండా నిరోధించడంలో 2-దశల వెరిఫికేషన్ సహాయపడుతుంది. టెక్స్ట్ మెసేజ్ కోడ్‌లతో అనుబంధించబడిన సాధారణ ఫిషింగ్ పద్ధతులను నివారించడానికి, మరింత శక్తివంతమైన రెండవ వెరిఫికేషన్ దశను ఎంచుకోండి:

మెరుగైన సెక్యూరిటీ: అధునాతన రక్షణ

మీరు విలేఖరి, యాక్టివిస్ట్, లేదా లక్షిత ఆన్‌లైన్ దాడులకు గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తి అయితే, అధిక సెక్యూరిటీ కోసం అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ అవ్వడం గురించి ఆలోచించండి. అధునాతన రక్షణ, ఫిషింగ్ నుండి రక్షించడానికి సెక్యూరిటీ కీలను ఉపయోగిస్తుంది, ఇందులో సురక్షితం కాని యాప్‌లను బ్లాక్ చేయడం లాంటి ఇతర సురక్షితమైన ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

మీ డేటాకు ప్రమాదకర యాక్సెస్‌ను తీసివేయండి

సున్నితమైన సమాచారాన్ని మరింత మెరుగ్గా రక్షించడానికి, ఏ యాప్‌లు మీ ఖాతా సమాచారాన్ని ఉపయోగించవచ్చో రివ్యూ చేయండి అలాగే మీకు అవసరం లేని వాటిని తీసివేయండి.

స్క్రీన్ లాక్‌లను ఆన్ చేయండి

మీ అనుమతి లేకుండా మీ పరికరాలను ఉపయోగించకుండా స్క్రీన్ లాక్‌లు రక్షిస్తాయి. Android పరికరంలో స్క్రీన్ లాక్‌లను ఎలా సెట్ చేయాలో తెలుసుకోండి.

చిట్కా: ఇతర పరికరాలు ఇంకా కంప్యూటర్‌లలో స్క్రీన్ లాక్‌ను జోడించడం గురించిన సమాచారం కోసం, తయారీదారు సపోర్ట్ సైట్‌ను సందర్శించండి.

2వ దశ: మీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి

మీ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్, లేదా యాప్‌ల గడువు ముగిస్తే, హ్యాకర్‌ల దాడి నుండి సాఫ్ట్‌వేర్ సురక్షితంగా ఉండకపోవచ్చు. మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, మీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసి ఉంచుకోండి.

మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయండి

మీ బ్రౌజర్‌కు చెందిన తాజా వెర్షన్‌ను ఉపయోగించేలా చూసుకోండి.

Google Chromeను అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

చిట్కా: ఇతర బ్రౌజర్‌లను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోవడానికి, డెవలపర్‌కు చెందిన సపోర్ట్ సైట్‌కు వెళ్లండి.

మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయండి

మీ కంప్యూటర్ లేదా పరికరంలో, మీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన తాజా వెర్షన్‌ను ఉపయోగించేలా చూసుకోండి.

చిట్కా: ఇతర పరికరాలు ఇంకా కంప్యూటర్‌లను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోవడానికి, తయారీదారు సపోర్ట్ సైట్‌కు వెళ్లండి.

మీ యాప్‌లను అప్‌డేట్ చేయండి

మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో, యాప్‌లకు చెందిన తాజా వెర్షన్‌ను ఉపయోగించేలా చూసుకోండి.

  • Android యాప్‌లను అప్‌డేట్ చేయండి: Android పరికరాలలో అలాగే అనుకూల Chromebookలలో మీ Android యాప్‌లను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.
  • Google Play Protectను ఆన్ చేయండి: హానికరమైన యాప్‌ల నుండి Android పరికరాలను సురక్షితంగా ఉంచడంలో Google Play Protect సహాయపడుతుంది.

చిట్కా: ఇతర పరికరాలు ఇంకా కంప్యూటర్‌లలో యాప్‌లను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోవడానికి, తయారీదారు సపోర్ట్ సైట్‌కు వెళ్లండి.

3వ దశ: ప్రత్యేకమైన, శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి

ఒకటి కంటే ఎక్కువ సైట్‌లలో ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ప్రమాదకరం. ఒక సైట్‌కు సంబంధించిన మీ పాస్‌వర్డ్ హ్యాక్ అయితే, దానిని పలు సైట్‌లకు సంబంధించిన మీ ఖాతాలను తెరవడానికి ఉపయోగించవచ్చు.

ప్రతి ఖాతాకు శక్తివంతమైన, విభిన్నమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసేలా చూసుకోండి.

మీ పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేయండి

శక్తివంతమైన, విభిన్నమైన పాస్‌వర్డ్‌లను జెనరేట్ చేయడంలో పాస్‌వర్డ్ మేనేజర్ మీకు సహాయపడుతుంది. Chrome లేదా మరో నమ్మకమైన పాస్‌వర్డ్ మేనేజర్ ప్రొవైడర్ అందించే పాస్‌వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించడం గురించి ఆలోచించండి.

చిట్కా: మీ Google ఖాతాలో సేవ్ చేసిన ఏ పాస్‌వర్డ్‌లు అయినా బహిర్గతం అయ్యే అవకాశం ఉందా, బలహీనంగా ఉన్నాయా లేదా పలు ఖాతాలలో మళ్లీ ఉపయోగించబడ్డాయా అని కనుగొనడానికి, మీరు పాస్‌వర్డ్ చెకప్ని ఉపయోగించవచ్చు.

హ్యాకర్‌ల బారిన పడకుండా మీ పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడండి

మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను మీరు Google యేతర సైట్‌లో ఎంటర్ చేసినప్పుడు నోటిఫికేషన్ పొందడానికి, Chrome కోసం పాస్‌వర్డ్ హెచ్చరికను ఆన్ చేయండి. అలా చేయడం ద్వారా, ఏదైనా సైట్ Googleలా నటిస్తుంటే, మీకు తెలుస్తుంది, అలాగే మీ పాస్‌వర్డ్ దొంగలించబడితే, మీరు దానిని మార్చుకోవచ్చు.

చిట్కా: ఖాతా సెక్యూరిటీకి సంబంధించిన అదనపు లేయర్ కోసం 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి.

4వ దశ: మీకు అవసరం లేని యాప్‌లను & బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లను తీసివేయండి

పరికరంలో ఎన్ని ఎక్కువ యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తే, అది దాడికి గురయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. సున్నితమైన సమాచారానికి యాక్సెస్ కలిగి ఉన్న పరికరాలలో, మీకు అవసరమైన యాప్‌లను ఇంకా బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని మరింత మెరుగ్గా రక్షించుకోవడానికి, తెలియని యాప్‌లను లేదా తెలియని మూలాల నుండి వచ్చే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి.

మీ పరికరంలో యాప్‌లను ఇంకా ఎక్స్‌టెన్షన్‌లను ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకోండి:

చిట్కా: ఇతర పరికరాలు అలాగే బ్రౌజర్‌ల నుండి యాప్‌లను ఇంకా ఎక్స్‌టెన్షన్‌లను ఎలా తీసివేయాలనేది తెలుసుకోవడానికి, పరికరం లేదా బ్రౌజర్‌కు చెందిన సపోర్ట్ సైట్‌కు వెళ్లండి.

5వ దశ: అనుమానాస్పద మెసేజ్‌లు & కంటెంట్ నుండి సురక్షితంగా ఉండండి

సంస్థలు, ఫ్యామిలీ మెంబర్‌లు, లేదా సహోద్యోగులుగా నటించడానికి, హ్యాకర్‌లు ఇమెయిల్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వెబ్ పేజీలను ఉపయోగించవచ్చు.

అనుమానాస్పద రిక్వెస్ట్‌ల జోలికి వెళ్లకండి
  • మీ పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ ఎవరికీ చెప్పకండి. ఈమెయిల్, మెసేజ్, లేదా ఫోన్ కాల్ ద్వారా Google మీ పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ అడగదు.
  • మీ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అడిగే అనుమానాస్పద ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లు, వెబ్‌పేజీలు, లేదా ఫోన్ కాల్స్‌కు రిప్లయి ఇవ్వకండి.
  • అవిశ్వసనీయ వెబ్‌సైట్‌లు లేదా పంపే వారి నుండి వచ్చిన ఇమెయిల్‌లు, మెసేజ్‌లు, వెబ్‌పేజీలు లేదా పాప్-అప్‌లలోని లింక్‌లను క్లిక్ చేయకండి.
అనుమానాస్పద ఈమెయిల్స్ జోలికి వెళ్లకండి

మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, Gmail అనుమానాస్పద ఈమెయిల్స్‌ను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఈ బిల్ట్-ఇన్ రక్షణను బలోపేతం చేయడానికి, స్వయంగా మీరే కింద పేర్కొన్న విధంగా అనుమానాస్పద ఈమెయిల్స్ ఇంకా సెట్టింగ్‌లను కూడా గుర్తించవచ్చు:

చిట్కా: మీరు Gmailను మీ కంప్యూటర్‌లో ఉపయోగిస్తున్నట్లయితే, లింక్‌ను క్లిక్ చేయకుండా, దాన్ని పాయింట్ చేయండి. దిగువ ఎడమ వైపున, వెబ్ అడ్రస్‌ను చూసి, అది మీరు ఆశించినదేనని నిర్ధారించుకోండి.

అనుమానాస్పద వెబ్ పేజీల జోలికి వెళ్లకండి

అనుమానాస్పదమైన కంటెంట్ గురించి, అలాగే అవాంఛిత సాఫ్ట్‌వేర్ గురించి మిమ్మల్ని హెచ్చరించేలా Google Chrome, అలాగే Search రూపొందించబడ్డాయి.

Chromeలో, అలాగే Searchలో ఈ హెచ్చరికలను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పదమైన యాక్టివిటీని మీరు గమనించినట్లయితే

మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి దశలను ఫాలో అవ్వండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17240800417033118052
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false