మీ Google డేటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలి

ముఖ్యమైనది: మీరు మీ Google డేటాను డౌన్‌లోడ్ చేసినట్లయితే, అది Google సర్వర్‌ల నుండి తీసివేయబడదు. ఖాతాను ఎలా తొలగించాలి లేదా యాక్టివిటీని ఎలా తొలగించాలి అనేదాని గురించి తెలుసుకోండి. 

మీరు ఉపయోగించే Google ప్రోడక్ట్‌ల కోసం మీరు మీ డేటాను ఎగుమతి చేయవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఉదాహరణకు:

  • ఈమెయిల్
  • డాక్యుమెంట్‌లు
  • Calendar
  • Photos
  • YouTube వీడియోలు (చిట్కా: మీరు మీ YouTube వీడియోలో కొన్నింటిని కనుగొనలేకపోతే, మీకు బ్రాండ్ ఖాతా ఉందా అని చెక్ చేయండి. మీకు బ్రాండ్ ఖాతా ఉంటే, మీరు ఖాతాలను మార్చాల్సిన అవసరం ఉండకపోవచ్చు.)
  • రిజిస్ట్రేషన్, ఖాతా యాక్టివిటీ

మీ రికార్డులలో ఉంచుకోవడానికి లేదా మీ డేటాను మరొక సర్వీసులో ఉపయోగించడానికి, మీరు ఆర్కైవ్‌ను క్రియేట్ చేయవచ్చు.

ముఖ్యమైనది: చర్యలు ప్రమాదకరంగా అనిపించినప్పుడు, మీ ఖాతా రక్షణ కోసం, సదరు చర్యలు ఆలస్యం కావచ్చు లేదా అవి అందుబాటులో ఉండకపోవచ్చు.

దశ 1: మీ డౌన్‌లోడ్ ఆర్కైవ్‌లో చేర్చడానికి డేటాను ఎంచుకోండి

  1. మీ Google ఖాతాకు లాగిన్ చేయండి.
  2. Google Takeout పేజీకి వెళ్లండి. మీరు ఉపయోగించే, మీ డేటాను కలిగి ఉండే Google ప్రోడక్ట్‌లు ఆటోమేటిక్‌గా ఎంపిక చేయబడతాయి.
    • మీరు ప్రోడక్ట్ నుండి డేటాను డౌన్‌లోడ్ చేయకూడదనుకుంటే దాని పక్కనున్న బాక్స్‌పై ఎంపికను తీసివేయండి.
    • మీరు ప్రోడక్ట్ నుండి మీకు సంబంధించిన కొంత డేటాను మాత్రమే డౌన్‌లోడ్ చేయాలనుకొంటే, ముందుగా మీరు మొత్తం డేటా చేర్చబడింది List వంటి బటన్‌ను ఎంచుకోవడం ద్వారా డేటా మొత్తాన్ని చేర్చవచ్చు. ఆ తర్వాత, మీరు చేర్చకూడదని అనుకున్న డేటా పక్కనున్న బాక్స్‌పై ఎంపికను తీసివేయవచ్చు.
  3. తర్వాతి దశ ఎంచుకోండి.
ముఖ్యమైనది: మీరు డౌన్‌లోడ్ కోసం రిక్వెస్ట్ చేయడం మరియు మీ ఆర్కైవ్ క్రియేట్ అవ్వడం మధ్య ఉన్న సమయంలో మీ డేటాకు జరిగిన మార్పులు మీ ఫైల్‌లో ఉండకపోవచ్చు. ఏవేవి చేర్చబడకపోవచ్చు అనేదాని గురించి మరింత తెలుసుకోండి.

దశ 2: మీ ఆర్కైవ్ ఫార్మాట్‌ను అనుకూలంగా మార్చండి

డెలివరీ పద్ధతి**

డౌన్‌లోడ్ లింక్‌ను ఇమెయిల్ ద్వారా పంపు

మీ Google డేటా ఆర్కైవ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మేము ఒక లింక్‌ను ఇమెయిల్ చేస్తాము.

  1. "డెలివరీ పద్ధతి" కోసం, 'ఇమెయిల్ ద్వారా డౌన్‌లోడ్ లింక్‌ను పంపించండి' ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. ఎగుమతిని క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. వచ్చిన ఇమెయిల్‌లో 'ఆర్కైవ్‌ను డౌన్‌లోడ్ చేయండి' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీ Google డేటాను డౌన్‌లోడ్ చేయడానికి, స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.
డిస్క్‌కు జోడించు

మేము మీ ఆర్కైవ్‌ను Google Driveకు జోడించి దాని లొకేషన్‌కు సంబంధించిన లింక్‌ను మీకు ఇమెయిల్ చేస్తాము. మీ డేటా, మీ స్టోరేజ్ కిందకు లెక్కలోకి వస్తుంది .

  1. "డెలివరీ పధ్ధతి" కోసం, Driveకు జోడించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. ఎగుమతిని క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీకు వచ్చిన ఇమెయిల్‌లో, Driveలో చూడండి ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు ఫోల్డర్‌ను ప్రోడక్ట్ వారీగా ఆర్గనైజ్ చేయబడిన మీ డేటాతో చూస్తారు.
  4. మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి, స్క్రీన్ పైభాగంలో, డౌన్‌లోడ్ Download ఆప్షన్‌ను ఎంచుకోండి.
డ్రాప్‌బాక్స్‌కు జోడించండి

మేము మీ ఆర్కైవ్‌ను Dropboxకు అప్‌లోడ్ చేసి దాని లొకేషన్‌కు సంబంధించిన లింక్‌ను మీకు ఇమెయిల్ చేస్తాము.

  1. "డెలివరీ పద్ధతి" కోసం, Dropboxకు జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. ఖాతాలను లింక్ చేసి, ఎగుమతిని క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీరు Dropboxకు మళ్ళించబడతారు. ప్రాంప్ట్ చేయబడితే, మీ Dropbox ఖాతాకు సైన్ ఇన్ అవ్వండి.
  4. 'Google ద్వారా మీ డేటా డౌన్‌లోడ్' సర్వీస్ మీ Dropboxలో ఉండే దాని స్వంత "యాప్‌లు" ఫోల్డర్‌ను యాక్సెస్ చేయవచ్చా అని అడిగే Dropbox విండోలో, అనుమతించు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచడానికి, మీరు ఈ Dropbox ఫోల్డర్‌ను ఎవరితోనూ షేర్ చేయలేదని నిర్ధారించుకోండి.
  6. మీకు వచ్చిన ఇమెయిల్‌లో, Dropboxలో చూడండి ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు మీ ఆర్కైవ్‌తో Dropbox ఫోల్డర్‌కు మళ్ళించబడతారు.
  7. మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి, ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసే Dropbox ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి.

గమనికలు

  • మీరు ఈ దశలను ఫాలో అయిన తర్వాత, 'Google ద్వారా మీ డేటా డౌన్‌లోడ్' సర్వీస్ మీ Dropbox సెక్యూరిటీ సెట్టింగ్‌లలో ఒక లింక్ చేసిన యాప్‌లాగా చూపించబడుతుంది. లింక్ చేసిన యాప్‌లాగా ఉన్న Googleను మీరు ఎప్పుడైనా తీసివేయవచ్చు. (భవిష్యత్తులో మీరు డేటాను Dropboxకు ఎగుమతి చేసినప్పుడు, మీరు మళ్ళీ Googleకు యాక్సెస్‌ను ఇవ్వాలి.)
  • మీ ఆర్కైవ్ Dropboxకు చేరిన తర్వాత, Google ఇకపై బాధ్యత వహించదు. మీ ఆర్కైవ్ Dropbox సర్వీస్ నియమాల పరిధిలో ఉంటుంది.
Microsoft OneDriveకు జోడించండి

మేము మీ ఆర్కైవ్‌ను Microsoft OneDriveకు అప్‌లోడ్ చేశాక, దాని లొకేషన్‌కు సంబంధించిన లింక్‌ను మీకు ఇమెయిల్ చేస్తాము.

  1. "డెలివరీ పధ్ధతి" కోసం, OneDriveకు జోడించండి అనే ఆప్షన్ ఎంచుకోండి.
  2. ఖాతాలను లింక్ చేసి, ఎగుమతిని క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీరు Microsoftకు మళ్ళించబడతారు. ప్రాంప్ట్ చేయబడితే, మీ Microsoft ఖాతాకు సైన్ ఇన్ అవ్వండి.
  4. 'Google ద్వారా మీ డేటా డౌన్‌లోడ్' సర్వీస్ మీ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చా అని అడిగే Microsoft విండోలో అవును అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచడానికి, మీరు ఈ OneDrive ఫోల్డర్‌ను ఎవరితోనూ షేర్ చేయలేదని నిర్ధారించుకోండి.
  6. మీకు వచ్చిన ఇమెయిల్‌లో, OneDriveలో చూడండి అనే ఆప్షన్ ఎంచుకోండి. మీరు మీ ఆర్కైవ్‌తో OneDrive ఫోల్డర్‌కు మళ్ళించబడతారు.
  7. మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి, ఫైళ్లను డౌన్‌లోడ్ చేసే OneDrive ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి.

గమనికలు

  • మీరు కింద పేర్కొన్న దశలను ఫాలో అయిన తర్వాత, మీ Microsoft OneDrive సెక్యూరిటీ మరియు గోప్యతా సెట్టింగ్‌లలో, 'Google ద్వారా మీ డేటా డౌన్‌లోడ్' సర్వీస్ కనిపిస్తుంది, మీ సమాచారంలోని కొంత మొత్తాన్ని యాక్సెస్ చేయగలిగే ఒక యాప్‌లాగా అది చూపించబడుతుంది. మీరు Google యాక్సెస్‌ను ఎప్పుడైనా తీసివేయవచ్చు. (భవిష్యత్తులో మీరు డేటాను OneDriveకు ఎగుమతి చేస్తే, మీరు మళ్ళీ Googleకు యాక్సెస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.)
  • మీ ఆర్కైవ్, Microsoft OneDriveను చేరుకున్నప్పుడు, Google ఇకపై దానికి బాధ్యత వహించదు. మీ ఆర్కైవ్, Microsoft సర్వీస్‌ల ఒప్పందం పరిధిలో ఉంటుంది.
Boxకు జోడించండి

మేము మీ ఆర్కైవ్‌ను Boxకు అప్‌లోడ్ చేసి దాని లొకేషన్‌ను మీకు ఇమెయిల్ చేస్తాము.

  1. "డెలివరీ పద్దతి" కోసం, Boxకు జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. ఖాతాలను లింక్ చేసి, ఎగుమతిని క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీరు Boxకు మళ్ళించబడతారు. ప్రాంప్ట్ చేయబడితే, మీ Box ఖాతాకు సైన్ ఇన్ అవ్వండి.
  4. 'Google ద్వారా మీ డేటా డౌన్‌లోడ్' సర్వీస్ మీ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చా అని అడిగే Box విండోలో, Boxకు యాక్సెస్ ఇవ్వండిని ఎంచుకోండి.
  5. మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచడానికి, మీరు ఈ Box ఫోల్డర్‌ను ఎవరితోనూ షేర్ చేయలేదని నిర్ధారించుకోండి. మీరు ఎంటర్‌ప్రైజ్ ఖాతాకు ఎగుమతి చేస్తుంటే, షేరింగ్ లింక్ ఏదీ క్రియేట్ కాకపోయినప్పటికీ, అడ్మిన్ మీ డేటాను చూడగలరు.
  6. వచ్చిన ఇమెయిల్‌లో, Boxలో చూడండి ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు మీ ఆర్కైవ్‌తో Box ఫోల్డర్‌కు మళ్ళించబడతారు.
  7. మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి, ఫైళ్లను డౌన్‌లోడ్ చేసే Box ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి.

గమనికలు

  • మీరు కింద పేర్కొన్న దశలను ఫాలో అయిన తర్వాత, 'Google ద్వారా మీ డేటా డౌన్‌లోడ్' సర్వీస్ కనిపిస్తుంది, మీ కనెక్ట్ చేసిన యాప్‌లలో మీ సమాచారంలో కొంత మొత్తాన్ని యాక్సెస్ చేయగల ఒక యాప్‌లాగా అది చూపించబడుతుంది. మీరు Google యాక్సెస్‌ను ఎప్పుడైనా తీసివేయవచ్చు. (భవిష్యత్తులో మీరు డేటాను Boxకు ఎగుమతి చేసినప్పుడు, మీరు మళ్ళీ Google యాక్సెస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.)
  • మీ Box ఖాతా యొక్క గరిష్ఠ ఫైల్ అప్‌లోడ్ సైజ్ తక్కువగా ఉంటే, మీరు ఎంచుకున్న గరిష్ఠ ఆర్కైవ్ సైజ్ తగ్గిపోతుంది. మీ Box ఖాతా యొక్క గరిష్ఠ ఫైల్ అప్‌లోడ్ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే మీ ఆర్కైవ్‌లోని ఫైల్‌లు Boxకు ఎగుమతి చేయబడవు.
  • మీ ఆర్కైవ్, Boxను చేరిన తర్వాత, Google ఇకపై దానికి బాధ్యత వహించదు. మీ ఆర్కైవ్ Box గోప్యతా పాలసీ పరిధిలో ఉంటుంది.

ఎగుమతి రకం

ఒకసారి ఉపయోగించగల ఆర్కైవ్

ఎంచుకోబడిన మీ డేటాకు ఒక ఆర్కైవ్‌ను క్రియేట్ చేయండి.

గమనిక: మీరు అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో, ఎన్‌రోల్ అయితే భవిష్యత్తులో మీ ఆర్కైవ్ రెండు రోజులకు షెడ్యూల్ చేయబడుతుంది.

షెడ్యూల్ చేయబడిన ఎగుమతులు

ఒక సంవత్సరం దాకా ప్రతి 2 నెలలకొకసారి నుండి మీరు ఎంచుకున్న డేటాకు ఆటోమేటిక్‌గా ఆర్కైవ్ క్రియేట్ అవుతుంది. మొదటి ఆర్కైవ్ వెంటనే క్రియేట్ చేయబడుతుంది.

గమనిక: మీరు అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ అయి ఉంటే, షెడ్యూల్ చేయబడిన ఎగుమతులు అందుబాటులో ఉండవు.

ఫైల్ రకం

జిప్ ఫైల్‌లు

ఈ ఫైల్‌లను దాదాపు ఏ కంప్యూటర్‌లో అయినా తెరవవచ్చు.

Tgz ఫైల్‌లు

ఈ ఫైల్‌లను Windowsలో తెరవడానికి, మీకు అదనపు సాఫ్ట్‌వేర్ కావాలి.

ఆర్కైవ్ సైజ్

మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న గరిష్ఠ సైజ్ ఆర్కైవ్‌ను ఎంచుకోండి. మీరు డౌన్‌లోడ్ చేస్తున్న డేటా దీనికన్నా ఎక్కువ సైజ్‌లో ఉంటే, ఒకటి కంటే ఎక్కువ ఆర్కైవ్‌లు క్రియేట్ చేయబడతాయి.

దశ 3: మీ Google డేటా ఆర్కైవ్‌ను పొందండి

ఈ కింద పేర్కొన్న ఆప్షన్‌లలో ఒకదాన్ని ఉపయోగించడం ద్వారా మీ ఆర్కైవ్ క్రియేట్ చేయబడితే, మేము మీకు దాని లొకేషన్‌కు సంబంధించిన లింక్‌ను ఇమెయిల్ చేస్తాము. మీ ఖాతాలో ఉన్న సమాచారం మేరకు, ఈ ప్రాసెస్‌కు కొన్ని నిమిషాల నుండి, కొన్ని రోజుల దాకా పడుతుంది. చాలా మంది, వారు రిక్వెస్ట్ చేసిన అదే రోజున, వారి ఆర్కైవ్‌కు సంబంధించిన లింక్‌ను పొందుతారు.

గమనిక: మీరు అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేయబడి ఉంటే, భవిష్యత్తులో మీ ఆర్కైవ్ రెండు రోజులకు షెడ్యూల్ చేయబడుతుంది.

మీరు తొలగించిన డేటా

మీరు డేటాను తొలగించినప్పుడు, దానిని మీ ఖాతా నుండి సురక్షితంగా, పూర్తిగా తీసివేయడానికి, మేము Google గోప్యతా పాలసీలో వివరించిన ప్రాసెస్‌ను అనుసరిస్తాము. ముందుగా, తొలగించిన యాక్టివిటీ తక్షణమే వీక్షణ నుండి తీసివేయబడుతుంది, ఇకపై అది మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఉపయోగించబడదు. ఆ తర్వాత, మా స్టోరేజ్ సిస్టమ్‌ల నుండి డేటాను సురక్షితంగా, పూర్తిగా తొలగించడానికి రూపొందించిన ఒక విధానాన్ని ప్రారంభిస్తాము.

తొలగింపు ప్రక్రియలో ఉన్నటువంటి నా యాక్టివిటీ నుండి ఐటెమ్‌లు, ఫోటోలు, లేదా డాక్యుమెంట్‌లు లాంటి డేటా మీ ఆర్కైవ్‌లో చేర్చబడదు.

ముఖ్య గమనిక: మీరు వెతుకుతున్న సమాచారం ఈ టూల్స్‌తో అందుబాటులో లేకుంటే, మా గోప్యత సహాయ కేంద్రానికి వెళ్లండి, మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము, ఎందుకు సేకరిస్తాము, మీ సమాచారాన్ని మీరు ఎలా అప్‌డేట్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు, ఎగుమతి చేయవచ్చు, తొలగించవచ్చు అనే విషయాలను గురించి మీరు తెలుసుకోవచ్చు. మా స్టోరేజ్ సిస్టమ్‌ల నుండి సమాచారం తొలగించబడితే, దాన్ని తిరిగి పొందే అవకాశం లేదు.

సాధారణ ప్రశ్నలు

మా గోప్యత సహాయ కేంద్రాన్ని చూడండి, మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము, ఎందుకు సేకరిస్తాము, మీ సమాచారాన్ని మీరు ఎలా అప్‌డేట్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు, ఎగుమతి చేయవచ్చు, తొలగించవచ్చు అనే విషయాలను గురించి మీరు తెలుసుకోవచ్చు.

If the info you are looking for is not available via the tools mentioned above, submit a data access request and specify:

  • The categories of personal info you're seeking;
  • The products or services to which the data relates;
  • Any approximate dates when you think the data may have been collected by Google.

You’ll need to sign in to your Google Account to complete the form.

Important: You can also call our toll-free number, 855-548-2777. Our representatives can answer many of your questions and help you fill out the form to ensure we are providing information to the account owner.

ఎగుమతి చేసిన టేక్అవుట్ డేటాను నేను ఎలా గుర్తించగలను?

మీ డేటా ఎగుమతి రిక్వెస్ట్ పూర్తయిన తర్వాత, మీరు మీ డేటా ఉన్న ఫోల్డర్‌కు లింక్‌ను కలిగి ఉన్న ఈమెయిల్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు.

మీరు “ఈమెయిల్ ద్వారా డౌన్‌లోడ్ లింక్‌ను పంపండి” ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి మీరు Google Takeoutలో మీ డేటాను కలిగి ఉన్న ఫోల్డర్‌కు మళ్లించబడతారు.

లేకపోతే, మీరు ఎంచుకున్న క్లౌడ్ గమ్యస్థానం (Drive, Dropbox, Box, OneDrive)లో మీ డేటాను కలిగి ఉన్న ఫోల్డర్ లొకేషన్‌కు ఇది మిమ్మల్ని లింక్ చేస్తుంది.

నా డేటా కోసం నేను ఏ ఫార్మాట్‌ను ఎంచుకోవాలి?
మీరు ఏ ఫార్మాట్‌ను ఎంచుకోవాలి అన్నది, సర్వీస్, డేటా రకం, ఇంకా మీరు దానిని ఉపయోగించాలనుకున్న ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. మేము, చాలా ఉపయోగకరం ఇంకా పోర్టబుల్ అని నమ్ముతున్న రకాలను ఎంచుకున్నాము. ఉదాహరణకు, మేము కాంటాక్ట్‌లను vCard ఫార్మాట్‌లో ఎగుమతి చేస్తాము, ఇది ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్‌లకు చాలా సాధారణమైన ఫార్మాట్. మేము తరచుగా, మీ ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా అదనపు ఆప్షన్‌లను కూడా అందజేస్తాము.
నేను నా డేటాను డౌన్‌లోడ్ చేయలేకపోతే ఏం చేయాలి?
మీరు మీ డేటాను డౌన్‌లోడ్ చేయలేకపోతే, ప్రోడక్ట్‌లోని డ్రాప్‌డౌన్ ఆప్షన్‌ల నుండి ఎగుమతి చేయడానికి మరియు/లేదా చిన్న ఆర్కైవ్ డేటా పరిమాణాన్ని రిక్వెస్ట్ చేయడానికి తక్కువ ప్రోడక్ట్ ఫైళ్లను ఎంచుకుని ట్రై చేయండి. అదనంగా, Box లేదా స్టోరేజ్ వంటి థర్డ్-పార్టీ స్టోరేజ్ సైట్‌కు ఎగుమతి చేయడానికి ట్రై చేయండి.
నేను నిర్దిష్ట ఫైల్ ఫార్మాట్‌లను తెరవలేకపోతే ఏం చేయాలి?
HTML ఫైళ్లను ఏదైనా స్టాండర్డ్ బ్రౌజర్‌లో తెరవవచ్చు; CSV, JSON ఫైళ్లను TextEdit సాఫ్ట్‌వేర్, ఇండస్ట్రీ స్టాండర్డ్ ఇన్‌బాక్స్ లేదా ICS-స్పెషలైజ్డ్ సర్వీస్‌లో తెరవవచ్చు.
నేను డేటాను ఎగుమతి చేస్తున్నప్పుడు వర్సెస్ మొత్తం డేటాను ఎగుమతి చేసే సమయ వ్యవధిని ఎంచుకోవచ్చా?
ఈ సమయంలో, మేము నిర్దిష్ట టైమ్ ఫ్రేమ్‌ల కోసం డేటాను ఎగుమతి చేయడానికి ప్రస్తుతం సపోర్ట్ ఇవ్వము.
నేను నా డేటాను ఎక్కడ స్టోర్ చేయాలి?

సురక్షితంగా, స్టోర్ చేయడానికి తగినంత స్పేస్ ఉండే ఏ ప్రదేశంలోనైనా మీరు మీ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. చాలా సందర్భాలలో, దాన్ని మీ కంప్యూటర్‌కు నేరుగా డౌన్‌లోడ్ చేయడం చాలా తేలిక.

మీరు పబ్లిక్ కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు మీ డేటాను Google Driveలో గానీ లేదా మీరు మాత్రమే యూజర్‌గా ఉన్నచోట గానీ నిల్వ చేయవచ్చు.

గమనిక: మీరు Google Driveను ఉపయోగిస్తూ, మీ Google ఖాతాను తొలగించడానికి ప్రణాళిక చేస్తుంటే, మీ ఖాతాను తొలగించడానికి ముందు, మీ ఆర్కైవ్‌ను వేరొక స్టోరేజ్ స్పేస్‌కు తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది.

నేను ఎగుమతి చేసిన టేక్అవుట్ డేటాను థర్డ్ పార్టీ యాప్ లేదా వెబ్‌సైట్‌తో ఎలా షేర్ చేయాలి?

మీరు మీ డేటాను మీ పరికరానికి డౌన్‌లోడ్ చేసినట్లయితే, ఆ థర్డ్-పార్టీ యాక్సెస్ పాయింట్‌ను ఉపయోగించి మీరు దాన్ని నేరుగా థర్డ్ పార్టీ యాప్ లేదా వెబ్‌సైట్‌కు షేర్ చేయవచ్చు.  ఈ యాక్సెస్ పాయింట్ ఈమెయిల్ అడ్రస్ లేదా థర్డ్ పార్టీ యాప్ లేదా వెబ్‌సైట్‌కు సంబంధించిన కస్టమ్ బిల్ట్ అప్‌లోడ్ ఫంక్షనాలిటీతో సహా వివిధ రకాలుగా ఉండవచ్చు, ఇక్కడ మీరు డేటాను నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు.

మీరు Drive, Box, OneDrive లేదా Dropbox వంటి క్లౌడ్ స్టోరేజ్ గమ్యస్థానానికి మీ డేటాను జోడించినట్లయితే, మీరు క్లౌడ్ ప్రొవైడర్ నుండి మీ డేటాను నేరుగా థర్డ్-పార్టీ యాప్ లేదా వెబ్‌సైట్‌తో షేర్ చేయవచ్చు.  పలు సందర్భాలలో, క్లౌడ్ ప్రొవైడర్ సపోర్ట్ చేసే ఈమెయిల్ ద్వారా క్లౌడ్ ప్రొవైడర్ నుండి థర్డ్-పార్టీకి నేరుగా మీ డేటాను షేర్ చేయడం అనేది దీనిలో భాగంగా ఉంటుంది.

కొన్ని సందర్భాలలో, థర్డ్ పార్టీ యాప్ లేదా వెబ్‌సైట్ నేరుగా క్లౌడ్ స్టోరేజ్ గమ్యస్థానంతో ఇంటిగ్రేట్ కావచ్చు, అలాగే క్లౌడ్ గమ్యస్థానం నుండి నేరుగా మీ డేటాను చదవడానికి థర్డ్ పార్టీ యాక్సెస్‌ను మంజూరు చేసే సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది.

నా ఆర్కైవ్ పలు ఫైళ్లుగా ఎందుకు విభజించబడింది?

మీరు ఎంచుకున్న సైజ్ పరిమితి కన్నా పెద్దగా ఉండే ఆర్కైవ్‌లు పలు ఫైల్స్‌గా విభజించబడతాయి.

మీ ఆర్కైవ్ విభజించబడే అవకాశాన్ని తగ్గించడానికి, మీరు 50GB సైజ్ పరిమితిని ఎంచుకోవచ్చు.

గమనిక: tgz ఆర్కైవ్‌ను అన్‌ప్యాక్ చేయడానికి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అవసరం కావచ్చు. ఈ రకమైన ఫైల్‌లు, వాటి ఫైల్ పేర్లలో Unicode అక్షరాలను కలిగి ఉండవని గుర్తుంచుకోండి.
నా ఆర్కైవ్‌ల గడువు ఎందుకు ముగుస్తుంది?

మీ ఆర్కైవ్ గడువు ఇక 7 రోజులలో ముగుస్తుంది. దాని తర్వాత, మీరు మీ అప్‌డేట్ అయిన సమాచారంతో కొత్త ఆర్కైవ్‌ను క్రియేట్ చేయవచ్చు.

గడువు ముగిసిన ఆర్కైవ్ అంటే డేటా గడువు ముగిసినట్లు కాదు, ఇంకా దాని ఫలితంగా మీకు మీ Google సర్వీస్‌లలో ఎటువంటి మార్పు కనిపించదు.

గమనిక: మేము ప్రతి ఆర్కైవ్‌ను 5 సార్లు మాత్రమే డౌన్‌లోడ్ అవ్వడానికి అనుమతిస్తాము; దాని తర్వాత దయచేసి మరొక ఆర్కైవ్‌ను రిక్వెస్ట్ చేయండి.

నేను నా ఆర్కైవ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, పాస్‌వర్డ్‌ను మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి?

మీ డేటా సెక్యూరిటీ చాలా ముఖ్యం, కనుక మీరు ఆర్కైవ్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు, మీ డేటాను డౌన్‌లోడ్ చేసే వ్యక్తి మీరు మాత్రమేనని మేము నిర్ధారించాలి.

అలా చేయడానికి, ఈ మధ్యన మీరు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి ఉండకపోతే, మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను మళ్ళీ ఎంటర్ చేయమని మేము అడుగుతాము. ఇది మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చని మేము అర్థం చేసుకున్నాము, కానీ మీ డేటాను సురక్షితంగా ఉంచాలంటే ఇలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

గమనిక: మీ ఖాతాకు 2-దశల వెరిఫికేషన్ ఆన్ చేయబడి ఉంటే, అదనపు వెరిఫికేషన్ దశను పూర్తి చేయమని కూడా మిమ్మల్ని అడగవచ్చు.

నా ఆర్కైవ్ ఎందుకు పని చేయలేదు?

మీ ఆర్కైవ్‌కు సంబంధించి ఏదైనా తప్పు జరిగినట్లయితే, లేదా మీరు దానిని చేయలేకపోతే, మరొక దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధానం తరచుగా సమస్యను పరిష్కరిస్తుంది.

ప్రత్యామ్నాయంగా, ఒకేసారి ఒక ప్రోడక్ట్ లేదా సర్వీసును ఎంచుకోవడం ద్వారా డేటాను చిన్న ఇంక్రిమెంట్‌లలో డౌన్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు పెద్ద మొత్తంలో డేటాను డౌన్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇది ప్రభావవంతంగా ఉండవచ్చు.

Takeout నుండి డౌన్‌లోడ్ చేసిన ఫైళ్లను ఎలా తెరవాలి
టేక్అవుట్ ఎగుమతులను మొబైల్ పరికరం నుండి కాకుండా డెస్క్‌టాప్ కంప్యూటర్ నుండి డౌన్‌లోడ్ చేసి చూడాలని మేము సిఫార్సు చేస్తున్నాము. మీ ఆర్కైవ్‌లో archive_browser.html అనే ఫైల్ ఉంటుంది, దానిలో ఫైల్ ఫార్మాట్‌లను, ఫైల్‌ను ఎలా తెరవాలి, డేటాను చూడటం గురించి అదనపు సమాచారం ఉంటుంది.
ఇటీవల జరిగిన మార్పులు నా ఆర్కైవ్‌లో ఎందుకు చేర్చబడలేదు?

మీరు డౌన్‌లోడ్‌ను రిక్వెస్ట్ చేసినప్పుడు మరియు ఆర్కైవ్ క్రియేట్ చేసినప్పుడు, దానికి మధ్యలో మీ డేటాకు జరిగిన మార్పులను ఫైల్ కలిగి ఉండదు. దీనిలో కొన్ని ఉదాహరణలు కింద పేర్కొనబడ్డాయి:

  • షేరింగ్ రకం లేదా Drive ఫైల్ కోసం అనుమతులలో జరిగిన మార్పులు
  • Drive ఫైల్ గురించి పరిష్కరించబడిన కామెంట్‌లు
  • జోడించిన లేదా తీసివేయబడిన ఫోటోలు లేదా ఆల్బమ్‌లు
నేను నా మెయిల్‌ను ఎగుమతి చేస్తున్నప్పుడు, నా Gmail లేబుల్‌లను ఎలా రక్షించుకోవాలి?

మీరు మీ Gmail నుండి మెయిల్‌ను ఎగుమతి చేసినప్పుడు, ప్రతి మెసేజ్ లేబుల్‌లు మీ డౌన్‌లోడ్ ఫైల్‌లో ఒక ప్రత్యేక X-Gmail-లేబుల్‌ల శీర్షికలో ఉంచబడతాయి. ఈ శీర్షికను మెయిల్ క్లయింట్ ఏదీ గుర్తించదు, అయితే ఈ లేబుల్‌లను ఉపయోగించి రాసే ఎక్స్‌టెన్షన్‌లను చాలా మెయిల్ క్లయింట్‌లు అనుమతిస్తాయి.

నేను నా YouTube వీడియోలలో కొన్నింటిని ఎందుకు కనుగొనలేకపోతున్నాను?

మీరు మీ YouTube వీడియోలలో కొన్నింటిని డౌన్‌లోడ్ చేయలేకపోతే, మీ YouTube ఛానెల్ 'బ్రాండ్ ఖాతా'తో లింక్ అయ్యిందేమో కనుక్కోవడానికి చెక్ చేయండి. ఆ విధంగా అయితే, మీరు కింద పేర్కొన్న విధంగా చేయాలి:

  • మీరు బ్రాండ్ ఖాతాతో అనుబంధించబడిన Google ఖాతాకు సైన్ ఇన్ అయ్యారేమో నిర్ధారించుకోండి.
  • YouTubeకు వీడియోలను అప్‌లోడ్ చేయడానికి ఉపయోగించిన బ్రాండ్ ఖాతాకు స్విచ్ అవ్వండి.

చిట్కా: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్రాండ్ ఖాతాలు ఉంటే, మీ ఇతర బ్రాండ్ ఖాతాల నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి ఈ దశలను మళ్లీ చేయవచ్చు.

నా స్కూల్ లేదా వర్క్ ఖాతా నుండి డేటాను నేను ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోలేను?

యూజర్‌లు వివిధ ప్రోడక్ట్‌ల నుండి డేటాను డౌన్‌లోడ్ చేయగలిగితే Google Workspace అడ్మినిస్ట్రేటర్‌లు మేనేజ్ చేయగలరు. మీ అడ్మినిస్ట్రేటర్ ఎవరో తెలుసుకోండి.

నా యాప్ టేక్అవుట్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అనుకూలంగా మార్చగలదా?

టేక్అవుట్ యూజర్ ఇంటర్‌ఫేస్ పారామీటర్‌లకు సపోర్ట్ చేస్తుంది, కాబట్టి యాప్‌లు యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అనుకూలంగా మార్చగలదు. ఉదాహరణకు, యాప్‌లు నిర్దిష్ట ప్రోడక్ట్‌లను, క్లౌడ్ ఎగుమతుల కోసం గమ్యస్థానాన్ని, అలాగే షెడ్యూల్ చేసిన టేక్అవుట్‌ల కోసం ఫ్రీక్వెన్సీని ఎంచుకోవచ్చు.

మూడు పారామీటర్‌లను ఉపయోగించే urlకు సంబంధించిన ఫార్మాట్ ఉదాహరణ ఇక్కడ ఉంది:

https://takeout.google.com/settings/takeout/custom/google_account,my_activity,fit,youtube?dest=drive&frequency=2_months

చిట్కా: ఈ ఉదాహరణలో వివరించినది ఇంకా ప్రోగ్రెస్ లోనే ఉంది, ఇది ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడవచ్చు. "డేటా-ID" పేరుతో ఉన్న css అట్రిబ్యూట్(ల)లో రెండర్ చేయబడిన htmlకు చెందిన సోర్స్‌లో చేర్చడానికి అప్లికేషన్‌లు లేదా ఇతర ప్రోడక్ట్‌ల కోసం సాధ్యమయ్యే విలువలను కనుగొనవచ్చు.  ఉదాహరణకు, "dest" పారామీటర్‌లో సాధ్యమయ్యే విలువలలో "box", "dropbox", "drive", "onedrive" ఉన్నాయి.  “ఫ్రీక్వెన్సీ” పారామీటర్‌లకు సాధ్యమయ్యే విలువలలో “2_months” అనేది ఉంటుంది

మీ ఖాతా కోసం ఎగుమతి చేయగల సామర్థ్యం ఉన్న డేటాతో ప్రోడక్ట్‌ల కోసం డేటా-ఐడి ప్రాపర్టీ విలువను గుర్తించడానికి: 


ముఖ్య గమనిక: ఈ సూచనలు Chromeతో ఉపయోగించడానికి ఉద్దేశించబడ్డాయి. మీరు వేరొక బ్రౌజర్‌ను ఉపయోగిస్తే, ప్రాసెస్ మారవచ్చు.

  1. కంప్యూటర్‌లో, takeout.google.com లింక్‌కు వెళ్లండి.
  2. టేక్అవుట్ వెబ్ పేజీపై కుడి-క్లిక్ చేసి, "సోర్స్ పేజీ" వీక్షణను ఎంచుకోండి. ఇది పేజీని రూపొందించే HTML కోడ్‌ను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 
  3. “డేటా-ఐడి” ప్రాపర్టీని గుర్తించడానికి సెర్చ్ కమాండ్ (Windowsలో Control + F లేదా Macలో Command + F) ఉపయోగించండి. 
  4. సెర్చ్ ఫలితాలను చెక్ చేయండి.  సంబంధిత విలువలు “data-id=” తర్వాత కనిపిస్తాయి. ఉదాహరణకు: data-id="blogger"

థర్డ్-పార్టీ అప్లికేషన్‌ల ద్వారా డేటాను ఉపయోగించడానికి డెవలపర్‌ల కోసం Google, కొత్త అధునాతన ఫీచర్‌ల (Data Portability API)ను కూడా రిలీజ్ చేసింది. మీరు అందుబాటులో ఉన్న మొత్తం డాక్యుమెంటేషన్‌ను ఇక్కడ కనుగొనవచ్చుhttps://developers.google.com/data-portability.

సాధారణ Google ప్రోడక్ట్ డౌన్‌లోడ్ ప్రశ్నలు

నేను నా YouTube వీడియోలను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు, ఏ ఫార్మాట్‌ను ఉపయోగించాలి?

వీడియోలు వాటి ఒరిజినల్ ఫార్మాట్‌లో గానీ లేదా H264 వీడియో ఇంకా AAC ఆడియోతో కూడిన MP4 ఫైల్‌లుగా డౌన్‌లోడ్ చేయబడతాయి.

నేను Google గ్రూప్ మెంబర్‌ను. నేను గ్రూప్ నుండి మెసేజ్‌లను, మెంబర్‌షిప్ సమాచారాన్ని ఎలా డౌన్‌లోడ్ చేయగలను?

ఓనర్‌లు మాత్రమే గ్రూప్ మెసేజ్‌లను, మెంబర్‌షిప్‌ను డౌన్‌లోడ్ చేయగలరు.

మీరు మెంబర్ గానీ లేదా మేనేజర్ గానీ అయితే, మీరు కావాలనుకున్న సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసి మీతో షేర్ చేయమని ఓనర్‌ను అడగండి. లేదా, మీ ఇమెయిల్‌లో మీకు ఒకవేళ మెసేజ్‌లు అందితే, మీ ఇమెయిల్ ఆర్కైవ్ నుండి మెసేజ్‌ల హిస్టరీని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పూర్తి ఇన్‌బాక్స్‌ను ఎగుమతి చేయడానికి టైమ్‌ఫ్రేమ్ ద్వారా నేను Gmail నుండి నా మెయిల్‌ను డౌన్‌లోడ్ చేయవచ్చా?
దురదృష్టవశాత్తు ఈ సమయంలో, మేము టైమ్‌ఫ్రేమ్ ఎగుమతులకు సపోర్ట్ ఇవ్వము.
నేను Google Workspace అడ్మినిస్ట్రేటర్. నేను నా సంస్థ డేటాను ఎలా ఎగుమతి చేయగలను?

మీరు ఈమెయిల్స్, క్యాలెండర్‌లు, డాక్యుమెంట్‌లు ఇంకా సైట్‌లతో కూడిన మీ సంస్థకు సంబంధించిన డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా తరలించవచ్చు. మీ సంస్థకు చెందిన Google Workspace డేటాను ఎగుమతి చేయడం ఎలాగో తెలుసుకోండి.

**ఈ లిస్ట్‌లో Google యేతర సర్వీస్ ప్రొవైడర్‌లు ఉన్నారు. మీరు Google యేతర సర్వీస్ ప్రొవైడర్ ఆప్షన్‌ను ఎంచుకున్నప్పుడు:

1. మీ తరఫున ఫైళ్లను ఈ సర్వీస్ ప్రొవైడర్‌కు బదిలీ చేయడానికి మీరు Googleను అనుమతిస్తారు.

2. ఈ సర్వీస్ ప్రొవైడర్‌కు ఫైళ్లను అప్‌లోడ్ చేసిన తర్వాత, ఫైళ్లకు సంబంధించి Google ఇకపై బాధ్యత వహించదు. ఎగుమతిలోని కంటెంట్ అనేది సర్వీస్ ప్రొవైడర్ నియమాలకు లోబడి ఉంటుంది.

చిట్కా: ఏమి షేర్ చేయబడుతుందో అర్థం చేసుకోవడానికి, డేటాను మీరే రివ్యూ చేయండి.

మాకు ఫీడ్‌బ్యాక్‌ను పంపండి

మీ Google డేటాను డౌన్‌లోడ్ చేయడంలో మీ అనుభవం మాకు తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్‌ను షేర్ చేయడం ద్వారా, మీతో పాటు ఇతర వ్యక్తులకు ఈ ప్రోడక్ట్‌ను మెరుగుపరచడంలో Googleకు సహాయపడతారు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1622367402380559752
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false