కొనుగోలు, రద్దు, రీఫండ్ పాలసీలు

ఆటోమేటిక్ రీ-యాక్టివేషన్‌లు

మీ స్టోరేజ్ కొనుగోలు విషయంలో ఆటోమేటిక్ ఎంపిక ఇలా ఉంటుంది. మీ సబ్‌స్క్రిప్షన్ ముగింపు సమయంలో ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ అయ్యేలా సెట్ చేయబడుతుంది. మీ సబ్‌స్క్రిప్షన్ సమయంలో ఎప్పుడైనా మరింత పెద్ద స్టోరేజ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. మీరు తక్షణమే మీ కొత్త స్టోరేజ్ స్థాయికి అప్‌గ్రేడ్ అవుతారు, మీ క్రెడిట్ అయిపోయినప్పుడు మీ క్రెడిట్ కార్డ్‌కు ఛార్జీ విధించబడుతుంది.

మీరు పాత ప్లాన్ ధరతో స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసి ఉంటే, మీరు అప్‌గ్రేడ్ చేయాలని ఎంచుకునే వరకు లేదా మీ పేమెంట్ సమాచారం గడువు ముగిసే వరకు మీ సబ్‌స్క్రిప్షన్‌ను మీరు రీ-యాక్టివేట్ చేయవచ్చు.

ఆటోమేటిక్ రీ-యాక్టివేషన్ విఫలమైతే, ఏడు రోజుల అదనపు గడువు మీ సబ్‌స్క్రిప్షన్‌కు జోడించబడుతుంది, దీని వలన మీరు మీ పేమెంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయగలరు. ఈ అదనపు గడువు సమయంలో, మీ Google ఖాతాలో ఉన్న వాటికి గానీ లేదా మీ ప్రస్తుత స్టోరేజ్ ప్లాన్‌కు గానీ మీరు యాక్సెస్‌ను కోల్పోరు.

మీరు Gmailను ఉపయోగిస్తూ ఉంటే, ఇంకా ఆటోమేటిక్ రీ-యాక్టివేషన్ విఫలమైతే, మీ స్టోరేజ్ ప్లాన్ ఏడు రోజుల పాటు పొడిగించబడుతుంది, కనుక మీ పేమెంట్ సమాచారాన్ని మీరు అప్‌డేట్ చేయగలరు. మీ ఖాతాలోని స్పేస్‌ను క్లియర్ చేయడానికి లేదా కొత్త స్టోరేజ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి మీరు ఆ అదనపు ఏడు రోజుల సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.

మీ స్టోరేజ్ ప్లాన్ రద్దయితే లేదా దాని గడువు ముగిసినట్లయితే

మీరు మీ స్టోరేజ్ ప్లాన్‌ను రద్దు చేసినట్లయితే, మీ ఖాతా కోసం కేటాయించిన అదనపు స్టోరేజ్ మొత్తాన్ని కోల్పోతారు. మీ బిల్లింగ్ కాల వ్యవధి ముగింపులో, మీ స్టోరేజ్ కోటాను మించి ఉండవచ్చు.

మీరు 2 సంవత్సరాల పాటు మీ స్టోరేజ్ కోటాను మించి ఉంటే, మీ స్టోరేజ్ కోటాలో లెక్కించబడే మొత్తం కంటెంట్ తొలగించబడవచ్చు.

ఒక్కసారి మీరు ఛార్జీ విధించబడని స్టోరేజ్ కోటాను చేరుకున్నట్లయితే లేదా దాని పరిమితిని మించి ఉంటే:

  • Gmail: మీరు మెసేజ్‌లను పంపలేరు లేదా అందుకోలేరు. మీకు పంపిన మెసేజ్‌లు, పంపిన వారికి తిరిగి పంపబడతాయి.
  • Google Drive:
    • మీరు కొత్త ఫైల్‌లను సింక్ చేయలేరు లేదా అప్‌లోడ్ చేయలేరు.
    • మీ కంప్యూటర్ తాలూకు Google Drive ఫోల్డర్, నా డ్రైవ్‌ల మధ్య సింక్ అవ్వడం ఆగిపోతుంది.
    • మీరు వీటిలో కొత్త ఫైల్స్‌ను క్రియేట్ చేయలేరు:
      • Google Docs
      • Sheets
      • Slides
      • Drawings
      • Forms
      • Jamboard
    • మీరు ఉపయోగించే స్టోరేజ్ మొత్తాన్ని తగ్గించే వరకు, మీ ఫైళ్లను వేరే ఎవరూ ఎడిట్ చేయలేరు లేదా కాపీ చేయలేరు.
  • Google Photos:మీరు ఫోటోలను, వీడియోలను వేటినీ బ్యాకప్ చేయలేరు. మీరు మరిన్ని ఫోటోలను, వీడియోలను జోడించాలనుకుంటే, మీరు Google స్టోరేజ్ స్పేస్‌ను క్లీనప్ చేయడం లేదా మరింత Google స్టోరేజ్‌ను కొనుగోలు చేయడం లాంటివి చేయవచ్చు.

స్టోరేజ్ స్పేస్‌ను క్లీనప్ చేయండి

మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి

మీ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్‌ను మీరు ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.

Drive స్టోరేజ్ ప్లాన్‌ను రద్దు చేయండి

  1. www.google.com/settings/storage లింక్‌కు వెళ్లండి.
  2. మీరు స్టోరేజ్‌ను కొనుగోలు చేసిన Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ ప్లాన్ దిగువున, 'రద్దు చేయి' క్లిక్ చేయండి.
  4. రద్దు చేసిన తర్వాత స్టోరేజ్‌కు చేయబడే మార్పులను రివ్యూ చేయండి. ప్లాన్‌ను రద్దు చేయి క్లిక్ చేయడం ద్వారా నిర్ధారించండి.
  5. మీ సబ్‌స్క్రిప్షన్ రద్దయిన తర్వాత మీరు నిర్ధారణ ఇమెయిల్‌ను అందుకుంటారు. మీ ప్లాన్ తర్వాతి నెల ప్రారంభమయ్యే మొదట్లో, మీరు Google Drive, Google Photos, Gmail సంబంధిత ఉచిత స్టోరేజ్ స్థాయిలకు డౌన్‌గ్రేడ్ అవుతారు.

మీ Google One మెంబర్‌షిప్‌లో స్టోరేజ్‌ను రద్దు చేయండి

రీఫండ్ పాలసీ

Google స్టోరేజ్ ప్లాన్ కొనుగోళ్లు రీఫండ్ చేయబడవు. మీరు కొనుగోలు చేసిన స్టోరేజ్ మొత్తం, సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసే వరకు మీదే అవుతుంది, మీరు రద్దు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆ స్టోరేజ్ మీకే ఉంటుంది. కొన్ని దేశాలు/ప్రాంతాలలో, మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను వెంటనే ముగించవచ్చు, అలాగే పాక్షిక రీఫండ్‌ను పొందవచ్చు.

Play Store కొనుగోళ్ల కోసం, YouTube Premium, Music Premium రీఫండ్‌లకు వెళ్లండి.

Apple యాప్ స్టోర్ కొనుగోళ్ల కోసం, Apple సపోర్ట్ నుండి రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3965984393811114862
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false