2-దశల వెరిఫికేషన్‌కు సంబంధించి సాధారణ సమస్యలను పరిష్కరించండి

ఫోన్ పోయినప్పుడు లేదా దొంగలించబడినప్పుడు

మీరు వీటిని చేయాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము: మీ పరిస్థితులను బట్టి మీరు మీ ఖాతాలోకి తిరిగి రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. బ్యాకప్ ఆప్షన్‌లను ఉపయోగించండి
మీరు మీ ప్రాథమిక ఫోన్‌కు యాక్సెస్‌ను కోల్పోతే, అది మీరేనని నిర్ధారించడానికి, దీనితో వెరిఫై చేయవచ్చు:
  • మీ Google ఖాతాలోకి సైన్ ఇన్ చేయబడి ఉన్న వేరొక ఫోన్.
  • మీ Google ఖాతా 2-దశల వెరిఫికేషన్ విభాగంలో మీరు జోడించిన వేరొక ఫోన్ నంబర్.
  • మీరు మునుపు సేవ్ చేసిన బ్యాకప్ కోడ్.
  • మీ Google ఖాతా 2-దశల వెరిఫికేషన్ విభాగంలో మీరు జోడించిన సెక్యూరిటీ కీ.
విశ్వసనీయ పరికరం నుండి సైన్ ఇన్ చేయండి
మీరు మునుపు పరికరం నుండి సైన్ ఇన్ చేసి, "ఈ కంప్యూటర్‌లో మళ్లీ అడగవద్దు"కు పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకుంటే, రెండవ వెరిఫికేషన్ దశ లేకుండా ఆ పరికరం నుండి మీరు సైన్ ఇన్ చేయవచ్చు. మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసిన తర్వాత, మీరు మీ వెరిఫికేషన్ పద్ధతులను మేనేజ్ చేయవచ్చు.
మీ క్యారియర్ నుండి కొత్త ఫోన్‌ను పొందండి
మీరు మీ ఫోన్‌ను కోల్పోతే, మీ ఫోన్ నంబర్‌ను కొత్త ఫోన్ లేదా SIM కార్డ్‌కు బదిలీ చేయమని మీ క్యారియర్‌ను అడగవచ్చు.
మీ ఖాతాను రికవర్ చేసుకోండి
మీరు సైన్ ఇన్ చేయలేకపోతే, మీ ఖాతాను రికవర్ చేయడానికి సూచనలను ఫాలో అవ్వండి. మీరు సమస్య ఎదుర్కొంటున్నట్లయితే, ఖాతా రికవరీ దశలను పూర్తి చేయడానికి చిట్కాలను ట్రై చేయండి.

నా సెక్యూరిటీ కీ పోయింది లేదా దొంగిలించబడింది

మీరు ఇటువంటి వాటిని మరొక రెండవ దశగా సెటప్ చేస్తే దాని ఆధారంగా, మీ ఖాతాలోకి తిరిగి ప్రవేశించడానికి సరైన దశలను ఎంచుకోండి:
  • వెరిఫికేషన్ కోడ్‌లు
  • Google ప్రాంప్ట్‌లు
  • బ్యాకప్ కోడ్‌లు
  • మీరు మీ ఖాతాకు జోడించిన బ్యాకప్ సెక్యూరిటీ కీ
  • వెరిఫికేషన్ కోడ్‌ను అడగకూడదని ఎంచుకున్న రిజిస్టర్ చేయబడిన కంప్యూటర్
ముఖ్యమైనది: మీరు మీ ఖాతాకు అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్‌ను జోడించినట్లయితే, మీరు బ్యాకప్ సెక్యూరిటీ కీని మాత్రమే ఉపయోగించగలరు. మీ వద్ద బ్యాకప్ సెక్యూరిటీ కీ లేకపోతే, మీ ఖాతాను రికవర్ చేయడం కోసం సూచలను ఫాలో అవ్వండి.

మీకు మరొక రెండవ దశ ఉన్నట్లయితే

  1. మీ పాస్‌వర్డ్, అలాగే మీ ఇతర రెండవ దశను ఉపయోగించి మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. పోగొట్టుకున్న 'కీ'ని మీ ఖాతా నుండి తీసివేయడం కోసం సూచనలను ఫాలో అవ్వండి.
  3. కొత్త సెక్యూరిటీ కీని పొందండి. మీరు ఒక అదనపు 'కీ'ని తీసుకుని, దానిని సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవచ్చు.
  4. మీ ఖాతాకు కొత్త 'కీ'ని జోడించండి.

మీకు మరొక రెండవ దశ లేకుంటే లేదా మీరు పాస్‌వర్డ్‌ను మర్చిపోయి ఉంటే

ముఖ్యమైనది: ఖాతా మీదేనని నిరూపించడానికి, 2-దశల వెరిఫికేషన్‌లో మీరు ఇంకొక అదనపు దశను పూర్తి చేయాలి. ఈ అదనపు సెక్యూరిటీ కారణంగా, ఇది మీరేనని నిర్ధారించుకోవడానికి Googleకు 3-5 పని దినాల వరకు సమయం పట్టవచ్చు.

మీ ఖాతాను రికవర్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి. ఖాతా మీకు చెందినదే అని నిర్ధారించడానికి మిమ్మల్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది.

మీకు సాధ్యమైనంత వరకు ఉత్తమ సమాధానాలను అందించడానికి ఈ చిట్కాలను ఉపయోగించండి.

మిమ్మల్ని ఇవి అడగవచ్చు:

  1. మిమ్మల్ని సంప్రదించగల ఇమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయమని అడగవచ్చు.
  2. మీ ఇమెయిల్ అడ్రస్‌కు లేదా ఫోన్ నంబర్‌కు పంపిన కోడ్‌ను ఎంటర్ చేయమని అడగవచ్చు. మీరు ఆ ఇమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌కు యాక్సెస్‌ను కలిగి ఉన్నారని నిర్ధారించడంలో ఈ కోడ్ సహాయపడుతుంది.

మీ రెండవ దశగా సెక్యూరిటీ కీ అవసరం

మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేసి, అర్హత గల ఫోన్‌లో సైన్ ఇన్ చేస్తే, మీరు Google ప్రాంప్ట్‌లను పొందవచ్చు. సెక్యూరిటీ కీని రూపొందించడానికి మీరు అనుసరించాల్సిన రెండవ దశ, అధునాతన రక్షణలో ఎన్‌రోల్ అవ్వండి.

పోగొట్టుకున్న బ్యాకప్ కోడ్‌లను ఉపసంహరించుకోండి

మీరు మీ బ్యాకప్ కోడ్‌లను కోల్పోతే, మీరు వాటిని ఉపసంహరించుకోవచ్చు, కొత్త వాటిని పొందవచ్చు.
  1. మీ Google ఖాతాకు సంబంధించిన 2-దశల వెరిఫికేషన్ విభాగానికి వెళ్లండి.
  2. కోడ్‌లను చూపించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. కొత్త కోడ్‌లను పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీకు వెరిఫికేషన్ కోడ్ అందలేదు

  • అందుకు బదులుగా మీకు Google ప్రాంప్ట్ పంపబడి ఉండవచ్చు. టెక్స్ట్ మెసేజ్ (SMS) వెరిఫికేషన్ కోడ్‌లకు బదులుగా Google ప్రాంప్ట్‌లను ఎందుకు సిఫార్సు చేస్తున్నామో తెలుసుకోండి.
  • మీరు సైన్ ఇన్ చేసే విధానంలో ఏదైనా తేడా ఉంటే, అంటే లొకేషన్ వంటివి మేము గమనిస్తే, మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ను పొందలేకపోవచ్చు.
  • వెరిఫికేషన్ కోడ్‌తో టెక్స్ట్ మెసేజ్ మీ ఫోన్‌కు పంపబడితే, మీ సర్వీస్ ప్లాన్, అలాగే మొబైల్ పరికరం టెక్స్ట్ మెసేజ్ డెలివరీని సపోర్ట్ చేస్తాయని నిర్ధారించుకోండి.
    • లొకేషన్‌ను, అలాగే సర్వీస్ ప్రొవైడర్‌ను బట్టి డెలివరీ వేగం, లభ్యత మారవచ్చు.
  • మీరు మీ కోడ్‌లను పొందడానికి ట్రై చేసినప్పుడు మీకు తగినంత ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని నిర్ధారించుకోండి.
  • మీ ఫోన్‌కు వెరిఫికేషన్ కోడ్‌తో కూడిన వాయిస్ కాల్ వచ్చినట్లయితే, ఈ కింద పేర్కొన్న సందర్భాలలో మీకు వాయిస్ మెయిల్ అందుతుంది:
    • మీరు కాల్‌కు సమాధానం ఇవ్వలేకపోయినప్పుడు.
    • మీకు తగినంత ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు.
చిట్కా: మీరు పలు వెరిఫికేషన్ కోడ్‌ల కోసం రిక్వెస్ట్ చేస్తే, దానిలో కొత్త కోడ్‌లు మాత్రమే పని చేస్తాయి.

నా Google Authenticator కోడ్‌లు పని చేయడం లేదు

మీ Google Authenticator యాప్‌లో సమయం సరిగ్గా సింక్ చేయబడకపోవడమే దీనికి కారణం.

సరైన సమయాన్ని సెట్ చేయడానికి:

  1. మీ Android పరికరంలో, Google Authenticator యాప్ ప్రధాన మెనూకు వెళ్లండి.

  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత కోడ్‌లకు సరైన సమయం సెట్ చేయడం ఆ తర్వాత ఇప్పుడే సింక్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

తర్వాతి స్క్రీన్‌లో, సమయం సింక్ అయినట్లు యాప్ నిర్ధారిస్తుంది. మీరు సైన్ ఇన్ చేయగలగాలి. సింక్ మీ Google ప్రామాణీకరణదారు యాప్ అంతర్గత సమయాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది, మీ పరికరం తేదీ & సమయ సెట్టింగ్‌లను మార్చదు.

మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేశాక యాప్ పని చేయదు

మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేసినప్పుడు, మీరు మళ్ళీ కొన్ని యాప్‌లకు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.

చిట్కా: మీరు 2-దశల వెరిఫికేషన్‌ను జోడించిన తర్వాత యాప్‌లోకి సైన్ ఇన్ చేయలేకుంటే, మీరు యాప్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించాల్సి రావచ్చు.

వెరిఫికేషన్ కోడ్‌ను పొందడానికి మీరు Google Voiceను ఎందుకు ఉపయోగించకూడదు

వెరిఫికేషన్ కోడ్‌ల‌ను పొందడానికి మీరు Google Voiceను ఉపయోగిస్తే, మీ ఖాతాకు మీరు ప్రవేశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

ఉదాహరణకు, మీరు మీ Google Voice యాప్ నుండి సైన్ అవుట్ చేస్తే, తిరిగి ప్రవేశించడానికి మీకు వెరిఫికేషన్ కోడ్ అవసరం కావచ్చు. కానీ, ఇది మీ Google Voiceకు పంపబడినందున, మీరు కోడ్‌ను పొందలేరు.

ఆఫీసు, స్కూల్ లేదా ఇతర సంస్థ ఖాతాలు

2-దశల వెరిఫికేషన్ ద్వారా రక్షించబడిన మీ ఆఫీసు, స్కూల్ లేదా ఇతర గ్రూప్ ద్వారా ఖాతాను మీరు ఉపయోగిస్తూ ఉండి, సైన్ ఇన్ చేయలేకపోతే, మీరు ఇలా చేయవచ్చు:

సైన్ ఇన్ చేయడానికి మీరు రెండవ దశను ఉపయోగించలేరు

విశ్వసనీయమైనదిగా మీరు మార్క్ చేసిన పరికరాన్ని ఉపయోగించి, ఖాతా రికవరీకి వెళ్ళండి.

నేను టెక్స్ట్ మెసేజ్‌లతో నా బ్యాకప్ ఫోన్‌కు సైన్ ఇన్ చేయలేను

మీరు సైన్ ఇన్ చేసే విధానంలో ఏదైనా తేడా ఉన్నప్పుడు (ఉదా. వేరే లొకేషన్ నుండి సైన్ ఇన్ చేసినప్పుడు) ఇలా జరగవచ్చు. మీ బ్యాకప్ ఫోన్‌లోకి సైన్ ఇన్ అవ్వడానికి మీరు మీ ప్రధాన ఫోన్ లేదా మరొక విశ్వసనీయ పరికరానికి వెళ్లవలసి ఉంటుంది.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18372720047172443471
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false