మధ్య స్థాయి, అలాగే అధునాతన ఫీచర్‌లకు యాక్సెస్‌ను అన్‌లాక్ చేయండి

గమనిక: ఈ ఆర్టికల్ ఛానెల్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను కవర్ చేయదు. వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ల గురించి మరింత సమాచారం కోసం, ఈ సహాయ కేంద్రం ఆర్టికల్‌ను చూడండి.

మీ ఛానెల్ నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడటానికి YouTube అనేక టూల్స్ అలాగే ఫీచర్‌లను అందిస్తుంది. చాలా మంది క్రియేటర్‌లు ఈ ఫీచర్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు, కానీ కొన్ని ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి అదనపు వెరిఫికేషన్ అవసరం. ఈ అదనపు యాక్సెస్ ప్రమాణాలు స్కామర్‌లు, స్పామ్‌ చేసే వ్యక్తులు, అలాగే ఇతర మోసపూరితమైన వ్యక్తి లేదా సంస్థలు హాని కలిగించడాన్ని కష్టతరం చేస్తాయి. ప్రాథనిక ఛానెల్ ఓనర్‌లు మాత్రమే వారి గుర్తింపును వెరిఫై చేసుకొని, అదనపు ఫీచర్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.

మధ్య స్థాయి ఫీచర్‌లను యాక్సెస్ చేయండి

యాక్సెస్‌ను పొందడానికి ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి

మీరు ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తే, మధ్య స్థాయి ఫీచర్‌లకు మీకు యాక్సెస్ లభిస్తుంది. ఇక్కడి నుంచి, అధునాతన ఫీచర్‌లను ఎలా యాక్సెస్ చేయాలో మీరు నేర్చుకోవచ్చు.

  1. కంప్యూటర్‌లో, YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. ఛానెల్‌ను క్లిక్ చేయండి.
  4. ఫీచర్ అర్హతఆ తర్వాత మధ్య స్థాయి ఫీచర్‌లు ఆ తర్వాత ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయండిని క్లిక్ చేయండి.

ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మేము ఆ ఫోన్ నంబర్‌కు టెక్స్ట్ లేదా వాయిస్ కాల్ ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతాము.

అధునాతన ఫీచర్‌లను యాక్సెస్ చేయండి

అధునాతన ఫీచర్‌లు అనేవి YouTubeకు చెందిన ఒక ఫీచర్‌ల సెట్, ఉదాహరణగా, ఈ సెట్‌లో కామెంట్‌లను పిన్ చేయగల సదుపాయంతో పాటు రోజూ మరిన్ని వీడియోలను అప్‌లోడ్ చేసుకోగల సదుపాయం వంటివి ఉంటాయి.

మీరు ముందుగా ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయడం ద్వారా అధునాతన ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు సరిపడా ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకోవచ్చు లేదా కింద చూపిన విధంగా IDని లేదా వీడియోను ఉపయోగించి వెరిఫికేషన్‌ను పూర్తి చేయవచ్చు.

అందరు క్రియేటర్‌లకు ID, వీడియో వెరిఫికేషన్ అందుబాటులో లేదు. ఏ సమయంలోనైనా, YouTube Studioలో మీ ప్రస్తుత ఫీచర్ అర్హత స్టేటస్ అనేది అధునాతన ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి మీరు తీసుకోవలసిన దశలను మీకు చూపుతుంది.

యాక్సెస్‌ను పొందడానికి, ఫోన్ వెరిఫికేషన్‌ను, ID/వీడియో వెరిఫికేషన్‌ను ఉపయోగించండి

ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి

  1. కంప్యూటర్‌లో, YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. ఛానెల్‌ను క్లిక్ చేయండి.
  4. ఫీచర్ అర్హతఆ తర్వాత మధ్య స్థాయి ఫీచర్‌లు ఆ తర్వాత ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయండిని క్లిక్ చేయండి.
  5. ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మేము ఆ ఫోన్ నంబర్‌కు టెక్స్ట్ లేదా వాయిస్ కాల్ ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతాము.

ఫోన్ వెరిఫికేషన్ దశను పూర్తి చేశాక, తర్వాతి దశలో IDని లేదా వీడియోను ఉపయోగించి వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి.

గమనిక: మీ ID/వీడియో వెరిఫికేషన్ సాధారణంగా మీరు తగినంత ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకున్న తర్వాత కొన్ని నెలలలో గానీ, లేదా మీరు అధునాతన ఫీచర్‌లను ఉపయోగించకపోతే 2 సంవత్సరాల తర్వాత గానీ తొలగించబడుతుంది.

ID వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి. 
  2. సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. ఛానెల్‌ను క్లిక్ చేయండి. 
  4. ఫీచర్ అర్హత  ఆ తర్వాత  అధునాతన ఫీచర్‌లు  ఆ తర్వాత ఫీచర్‌లను యాక్సెస్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీ IDని ఉపయోగించండిని ఎంచుకుని, ఆపై ఈమెయిల్‌ను పొందండిని క్లిక్ చేయండి. Google మీకు ఈమెయిల్ పంపుతుంది. బదులుగా మీరు QR కోడ్‌ను కూడా స్కాన్ చేయవచ్చు. 
  6. మీ ఫోన్‌లో, ఈమెయిల్‌ను తెరిచి, వెరిఫికేషన్‌ను ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  7. Google మీ IDని ఎలా ఉపయోగిస్తుంది, అలాగే మీ ID ఎలా స్టోర్ చేయబడుతుంది అనే వివరణను చదవండి. వెరిఫికేషన్‌ను కొనసాగించడానికి, నేను అంగీకరిస్తున్నాను అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  8. మీ IDకి సంబంధించిన ఫోటోను తీయడానికి ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి. గమనిక: మీ IDలోని పుట్టిన తేదీ మీ Google ఖాతా‌లో పేర్కొన్న పుట్టిన తేదీతో మ్యాచ్ అయిందని నిర్ధారించుకోండి. 
  9. సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. సమర్పించిన తర్వాత, మేము మీ IDని రివ్యూ చేస్తాము. దీనికి సాధారణంగా 24 గంటలు పడుతుంది.

మీ ID వెరిఫికేషన్ డేటా ఎలా ఉపయోగించబడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

లేదా

వీడియో వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  3. ఛానెల్‌ను క్లిక్ చేయండి.
  4. ఫీచర్ అర్హత ఆ తర్వాత అధునాతన ఫీచర్‌లు ఆ తర్వాత ఫీచర్‌లను యాక్సెస్ చేయండిని క్లిక్ చేయండి.
  5. వీడియో వెరిఫికేషన్‌ను ఉపయోగించండిని ఎంచుకొని, ఆపై తర్వాత, ఈమెయిల్‌ను పొందండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • Google మీకు ఒక ఈమెయిల్ పంపుతుంది. ఇలా చేయడానికి బదులుగా, మీరు QR కోడ్‌ను స్కాన్ కూడా చేయవచ్చు.
  6. మీ ఫోన్‌లో, ఈమెయిల్‌ను తెరిచి, వెరిఫికేషన్‌ను ప్రారంభించండిని ట్యాప్ చేయండి.
  7. డాట్‌ను ఫాలో కావడం, లేదా మీ తలను తిప్పడం వంటి చర్యలను చేయడానికి ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
  8. మీ వెరిఫికేషన్ వీడియోను అప్‌లోడ్ చేయడం పూర్తయినప్పుడు, మేము మీ వీడియోను రివ్యూ చేస్తాము.
    • రివ్యూకు సాధారణంగా 24 గంటలు పడుతుంది. ఆమోదం పొందినప్పుడు మీకు ఒక ఈమెయిల్ వస్తుంది.

మీ వీడియో వెరిఫికేషన్ డేటా ఎలా ఉపయోగించబడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

యాక్సెస్‌ను పొందడానికి ఛానెల్ హిస్టరీని ఉపయోగించండి

మీ ఛానెల్ హిస్టరీని ఉపయోగించి అధునాతన ఫీచర్‌కు యాక్సెస్ పొందడానికి, మీరు ఫోన్ వెరిఫికేషన్‌ను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి

  1. కంప్యూటర్‌లో, YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. ఛానెల్‌ను క్లిక్ చేయండి.
  4. ఫీచర్ అర్హత ఆ తర్వాత మధ్య స్థాయి ఫీచర్‌లు ఆ తర్వాత ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయండిని క్లిక్ చేయండి.
  5. ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మేము ఆ ఫోన్ నంబర్‌కు టెక్స్ట్ లేదా వాయిస్ కాల్ ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతాము.

మీ కంటెంట్, అలాగే యాక్టివిటీ YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను నిలకడగా ఫాలో అవుతున్నాయో లేదో గుర్తించడానికి, మీ ఛానెల్ హిస్టరీ డేటా ఉపయోగించబడుతుంది.

మీ ఛానెల్ హిస్టరీలో, ఈ కింద అందించబడిన డేటా ఉంటుంది:

  • మీ ఛానెల్ యాక్టివిటీ (వీడియో అప్‌లోడ్‌లు, లైవ్ స్ట్రీమ్‌లు, ఇంకా ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ వంటివి.)
  • మీ Google ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత డేటా.
    • ఖాతా ఎప్పుడు క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది.
    • ఎంత తరచుగా దాన్ని ఉపయోగించడం జరుగుతోంది.
    • Google సర్వీస్‌లకు మీరు కనెక్ట్ అయ్యే పద్ధతి.

అత్యధిక శాతం యాక్టివ్ ఛానెల్స్ వద్ద, ఇప్పటికే అధునాతన ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి సరిపడా ఛానెల్ హిస్టరీ ఉంది, వీటి విషయంలో తదుపరిగా ఎటువంటి చర్యా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, మేము కొన్నిసార్లు పొరపాట్లు చేయవచ్చని అర్థం చేసుకుంటున్నాము, అందుకే మరింత త్వరగా యాక్సెస్ అందించడం కోసం ఇతర వెరిఫికేషన్ ఆప్షన్‌లను కూడా ఆఫర్ చేస్తున్నాము.

మీ ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకుని, అలాగే కొనసాగించండి

అధునాతన ఫీచర్‌లు అనేవి YouTubeకు చెందిన ఒక ఫీచర్‌ల సెట్, ఉదాహరణగా, ఈ సెట్‌లో కామెంట్‌లను పిన్ చేయగల సదుపాయంతో పాటు రోజూ మరిన్ని వీడియోలను అప్‌లోడ్ చేసుకోగల సదుపాయం వంటివి ఉంటాయి. YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను నిలకడగా ఫాలో అవ్వడం ద్వారా, సరిపడా ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకోవడం ద్వారా క్రియేటర్‌లు అధునాతన ఫీచర్‌లకు యాక్సెస్‌ను అన్‌లాక్ చేయవచ్చు. మా పాలసీలను పాటించకపోతే అర్హతను పొందడంలో ఆలస్యమవుతుంది. అలాగే, అధునాతన ఫీచర్‌లకు ఇప్పటికే యాక్సెస్ ఉన్న ఛానెల్స్, దీని ఫలితంగా అర్హతను కోల్పోయే ప్రమాదం ఉంది.

ఏ చర్యల వల్ల ఫీచర్‌లకు యాక్సెస్ ఛానెల్‌కు ఆలస్యంగా లభించవచ్చో, లేదా ఫీచర్‌ల యాక్సెస్ విషయంలో ఛానెల్‌పై మరిన్ని పరిమితులు విధించబడవచ్చో, అలాంటి చర్యలకు కొన్ని ఉదాహరణలను దిగువున అందించాము. ఇది పూర్తి లిస్ట్ కాదని గుర్తుంచుకోండి:

  • కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ను అందుకోవడం
  • ఒకటి లేదా అంత కన్నా ఎక్కువ ఛానెల్స్‌లో, ఒకే కంటెంట్‌ను పదే పదే పోస్ట్ చేయడం లేదా మీది కాని లేదా EDSAకు చెందని కంటెంట్‌ను పదే పదే అప్‌లోడ్ చేయడం
  • దుర్వినియోగ, ద్వేషపూరిత, ప్రమాదకరమైన, లైంగికపరమైన, హింసాత్మకమైన మరియు/లేదా పీడించడానికి సంబంధించిన వీడియోలు లేదా కామెంట్‌లను మళ్లీ మళ్లీ పోస్ట్ చేయడం
  • స్పామ్ చేయడం, స్కామ్ చేయడం, తప్పుదారి పట్టించే మెటాడేటాను ఉపయోగించడం, ఖచ్చితత్వం లేని రిపోర్టింగ్, అలాగే మోసపూరిత పద్ధతులు
  • సైబర్‌బెదిరింపు
  • ఇతరుల లాగా నటించడం
  • పిల్లల భద్రతకు సంబంధించిన మా పాలసీని ఉల్లంఘించడం
  • పాలసీని ఉల్లంఘించే మరొక ఛానెల్‌కు సంబంధించిన ఛానెల్స్‌ను నిర్వహించడం (ఉదాహరణకు, పలు ఛానెల్స్‌కు ఓనర్ అయ్యి ఉండి తరచుగా స్పామ్ లేదా స్కామ్ చేసే వ్యక్తి)
  • కాపీరైట్ స్ట్రయిక్‌లను అందుకోవడం

ఫీచర్‌లకు మళ్లీ యాక్సెస్‌ను పొందండి

ఏవైనా అధునాతన ఫీచర్‌లకు మీ యాక్సెస్ పరిమితం చేయబడితే, మీకు ఈమెయిల్ వస్తుంది. ఛానెల్స్, తమ ఛానెల్ హిస్టరీని మెరుగుపరుచుకోవడం ద్వారా లేదా వెరిఫికేషన్‌ను అందించడం ద్వారా యాక్సెస్‌ను తిరిగి పొందవచ్చు. రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటూ, YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను నిలకడగా ఫాలో అయ్యే ఛానెల్స్, సాధారణంగా 2 నెలలలో సరిపడా ఛానెల్ హిస్టరీని తిరిగి బిల్డ్ చేసుకోగలవు.

గమనిక: IDని, ఇంకా వీడియోను ఉపయోగించి వెరిఫికేషన్‌ను పూర్తి చేసే సదుపాయం క్రియేటర్‌లు అందరికీ అందుబాటులో ఉండదు. ఏ సమయంలోనైనా, YouTube Studioలో మీ ప్రస్తుత ఫీచర్ అర్హత స్టేటస్ అనేది అధునాతన ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి మీరు తీసుకోవలసిన దశలను మీకు చూపుతుంది.

సమస్యలను పరిష్కరించండి

  • "ఈ ఖాతా కోసం అధునాతన YouTube ఫీచర్‌లు అందుబాటులో లేవు" అని మీకు మెసేజ్ వచ్చినట్లయితే:
    మీరు ప్రధాన ఓనర్ కాని ఖాతాకు మీరు సైన్ ఇన్ చేశారని దీని అర్థం. మీరు తల్లి/తండ్రి ద్వారా పర్యవేక్షించబడుతున్న ఖాతాకు సైన్ ఇన్ చేసినా లేదా మీరు బ్రాండ్ ఖాతాకు సైన్ ఇన్ చేసినా ఇది జరగవచ్చు.
  • "మీ బ్రౌజర్‌ను చెక్ చేయండి" అని మీకు మెసేజ్ వచ్చినట్లయితే:
    మీ బ్రౌజర్ అనుకూలమైనది కాదు. మీ పరికరాన్ని తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌కు, బ్రౌజర్ వెర్షన్‌కు అప్‌డేట్ చేశారని నిర్ధారించుకోండి. 
  • "ఈ ఫోన్ కెమెరాతో ID వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదు" అని మీకు మెసేజ్ వచ్చినట్లయితే:
    మీ కెమెరా అనుకూలమైనది కాదు. మీ IDని సబ్మిట్ చేయడానికి ఫుల్ HD వెనుక కెమెరా ఉన్న ఫోన్‌తో సైన్ ఇన్ చేయండి.
  • "మరొక యాప్ మీ కెమెరాను ఉపయోగిస్తూ ఉండవచ్చు. తెరిచి ఉన్న యాప్‌లను మూసివేసి, మళ్లీ ట్రై చేయండి" అని మీకు మెసేజ్ వచ్చినట్లయితే:
    మరొక యాప్ మీ కెమెరాను ఉపయోగిస్తోందని దీని అర్థం. తెరిచి ఉన్న యాప్‌లను మూసివేసి, మళ్లీ ట్రై చేయండి.

తరుచుగా అడిగే ప్రశ్నలు

YouTube నా ఫోన్ నంబర్ / వీడియో వెరిఫికేషన్ / చెల్లుబాటు అయ్యే ID కోసం ఎందుకు అడుగుతుంది?

ఉల్లంఘించే కంటెంట్‌కు, ప్రవర్తనకు గాను YouTube ప్రతి సంవత్సరం లక్షలాది ఛానెల్స్‌ను రద్దు చేస్తుంది. ఈ ఛానెల్స్‌లో చాలా వరకు, అవే గ్రూప్‌లు లేదా వ్యక్తుల చేత క్రియేట్ చేయబడి ఉంటాయి, వీక్షకులను, క్రియేటర్‌లను, అడ్వర్టయిజర్‌లను మోసగించడం, స్కామ్ చేయడం, లేదా దుర్వినియోగం చేసే ప్రయత్నంలో భాగంగా ఒకే రకమైన ఫీచర్‌లను ఉపయోగించి లేదా ఎక్కువగా ఉపయోగించి, వారు ఇలా చేస్తారు. దుర్వినియోగాన్ని అరికట్టడానికి మేము ఫాలో అయ్యే మార్గాలలో మీ గుర్తింపును వెరిఫై చేయడం అనేది ఒకటి, దీని ద్వారా మీరు గతంలో మా పాలసీని ఉల్లంఘించారా, లేదా అని మేము గుర్తించి, రిపీట్‌గా వచ్చే దరఖాస్తులను పరిమితం చేస్తాము. 

నా ID, వీడియో వెరిఫికేషన్ డేటా ఎలా ఉపయోగించబడుతుంది?

ఫోన్ నంబర్

మీరు ఫోన్ నంబర్‌ను సమర్పించినట్లయితే, మేము దీన్ని ఇందుకు ఉపయోగిస్తాము:

  • మీకు వెరిఫికేషన్ కోడ్‌ను పంపడానికి.

ID వెరిఫికేషన్

మీరు చెల్లుబాటయ్యే IDని (పాస్‌పోర్ట్ లేదా డ్రైవర్ లైసెన్స్ వంటివి) సమర్పించిన తర్వాత, మేము దాన్ని ఉపయోగించి, ఈ కింద ఉన్న వాటిని నిర్ధారిస్తాము:

  • మీ పుట్టిన తేదీని
  • మీ IDకి గడువు ముగియలేదని, అది చెల్లుబాటు అయ్యేదే అని
  • YouTube పాలసీలను ఉల్లంఘించినందుకు మీరు మునుపెన్నడూ సస్పెండ్ కాలేదని

మోసాల నుండి, దుర్వినియోగం నుండి రక్షించడానికి ఇది మాకు సహాయపడుతుంది. అలాగే మా వెరిఫికేషన్ సిస్టమ్‌లను మెరుగుపరచడానికి ఉపయోగపడవచ్చు.

2 సంవత్సరాల లోపు మీ Google ఖాతా నుండి మీ ID లేదా వీడియో వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది. ఇది సాధారణంగా, మీరు తగినంత ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకున్న తర్వాత కొన్ని నెలలలో గానీ, లేదా మీరు అధునాతన ఫీచర్‌లను ఉపయోగించకపోతే 1 సంవత్సరం తర్వాత గానీ తొలగించబడుతుంది. మీ వెరిఫికేషన్ డేటాను ఎలా తొలగించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

వీడియో వెరిఫికేషన్

వీడియో వెరిఫికేషన్ అనేది ఒక వ్యక్తి ముఖానికి సంబంధించిన చిన్న వీడియో. కింది వాటిని వెరిఫై చేయడంలో మాకు సహాయకరంగా ఉండేందుకు మేము ఈ వీడియోను ఉపయోగిస్తాము:

  • మీరు బాట్ కాదని, నిజమైన వ్యక్తి అని
  • Google సర్వీస్‌లను ఉపయోగించడానికి మీకు తగినంత వయస్సు ఉందని
  • YouTube పాలసీలను ఉల్లంఘించినందుకు మీరు సస్పెండ్ కాలేదని

మోసాలు ఇంకా దుర్వినియోగం నుండి రక్షించడంలో, అలాగే మా వెరిఫికేషన్ సిస్టమ్‌లను మెరుగుపరచడంలో కూడా ఇది మాకు సహాయపడుతుంది.

2 సంవత్సరాల లోపు మీ Google ఖాతా నుండి మీ ID లేదా వీడియో వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది. ఇది సాధారణంగా, మీరు తగినంత ఛానెల్ హిస్టరీని రూపొందించుకున్న తర్వాత కొన్ని నెలల్లో గానీ, లేదా మీరు అధునాతన ఫీచర్‌లను ఉపయోగించకపోతే 1 సంవత్సరం తర్వాత గానీ తొలగించబడుతుంది. మీ వెరిఫికేషన్ డేటాను ఎలా తొలగించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

డేటా నిల్వ కొనసాగింపు, తొలగింపు

మీ Google ఖాతాలో ఎప్పుడైనా మీరు మీ ID లేదా వీడియో వెరిఫికేషన్‌ను తొలగించవచ్చు. మీ YouTube ఛానెల్ హిస్టరీని తగినంతగా బిల్డ్ చేసుకోక ముందే పై రెండింటిలో దేనినైనా తొలగిస్తే, మీరు ఈ కింది దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు అధునాతన YouTube ఫీచర్‌లను ఉపయోగించలేరని గమనించండి:

  •  మీ YouTube ఛానెల్ హిస్టరీని తగినంతగా బిల్డ్ చేసుకోవడం

లేదా

  • ID లేదా వీడియో వెరిఫికేషన్‌ను మళ్లీ పూర్తి చేయడం

కొత్త ఖాతాలను క్రియేట్ చేయడం ద్వారా వ్యక్తులు లేదా గ్రూప్‌లు మా పరిమితులను తప్పించుకోకుండా చూసుకోవడానికి, మీరు గతంలో YouTube పాలసీలను ఉల్లంఘించారా, లేదా, అని మేము అంచనా వేసి, మళ్లీ మళ్లీ ఉల్లంఘించకుండా పరిమితం చేస్తాము. దుర్వినియోగం నుండి రక్షించడానికి Google కొంత కాలం పాటు మీ IDని లేదా మీ వీడియోను, ముఖ గుర్తింపు డేటాను సేవ్ చేయవచ్చు.

ఈ డేటా గరిష్ఠంగా YouTubeలో మీ చివరి ఇంటరాక్షన్ నుండి 3 సంవత్సరాల పాటు నిల్వ చేయబడుతుంది.

అధునాతన ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి ID లేదా వీడియో వెరిఫికేషన్‌ను అందించాలని మీకు లేకపోతే, అందించకండి. బదులుగా మీరు సరిపడే ఛానెల్ హిస్టరీని ఎల్లప్పుడూ బిల్డ్ చేయవచ్చు. మీరు అధునాతన ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయానికి, సరిపడే హిస్టరీని మీరు ఎలాగూ బిల్డ్ చేసి ఉండవచ్చు.

మా సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా, మీ సమాచారాన్ని అందించడానికి మీరు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. ఇది ఒక పెద్ద బాధ్యత అని మేము అర్థం చేసుకుంటున్నాము, మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి, దాన్ని మీ కంట్రోల్‌లో ఉంచడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. మా ప్రోడక్ట్‌లు, ఫీచర్‌లన్నింటికీ Google గోప్యతా పాలసీ ఏ విధంగా అయితే వర్తిస్తుందో, ఇక్కడ కూడా అదే విధంగా వర్తిస్తుంది. 

గమనిక: మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ, ఎప్పుడూ విక్రయించము. 

నేను ఇప్పటికే వెరిఫై చేశాను, వెరిఫై చేయమని నన్ను మళ్లీ ఎందుకు అడుగుతున్నారు?

మేము డేటా ప్రాక్టీసులను బాధ్యతగా ఫాలో అవుతున్నామని నిర్ధారించుకోవడానికి, మీరు తగినంత ఛానెల్ హిస్టరీని పొందిన తర్వాత మీ ID లేదా వీడియో వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది లేదా 1 సంవత్సరం పాటు మీరు అధునాతన ఫీచర్‌లను ఉపయోగించకపోతే అది తొలగించబడవచ్చు. మీ Google ఖాతాలో మీ ID లేదా వీడియో వెరిఫికేషన్‌ను తొలగించడానికి మీరు ఎప్పుడైనా ఎంచుకోవచ్చు. 

మీ వెరిఫికేషన్ తొలగించబడితే, అధునాతన ఫీచర్‌లను ఉపయోగించడాన్ని కొనసాగించడానికి మీకు తగినంత ఛానెల్ హిస్టరీ ఉండాలి లేదా ID లేదా వీడియో వెరిఫికేషన్‌ను మళ్లీ సబ్మిట్ చేయాలి. 

నా వెరిఫికేషన్ డేటాను నేను ఎలా తొలగించగలను?

ముఖ్య గమనిక: మీరు మీ ఛానెల్ హిస్టరీని రూపొందించడానికి ముందే మీ ID లేదా వీడియో వెరిఫికేషన్‌ను తొలగించినట్లయితే, అధునాతన ఫీచర్‌లకు మీరు యాక్సెస్‌ను కోల్పోతారు.
  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారాన్ని క్లిక్ చేయండి.
  3. గుర్తింపు డాక్యుమెంట్ లేదా వీడియో వెరిఫికేషన్‌ను క్లిక్ చేయండి.
  4. తొలగించండి Deleteని క్లిక్ చేయండి.
స్మార్ట్‌ఫోన్ ఎందుకు అవసరం? నేను కేవలం వీడియో లేదా నా ID ఫోటోను అప్‌లోడ్ చేయలేనా?

స్మార్ట్‌ఫోన్ అవసరం, ఎందుకంటే స్కామర్లు, స్పామ్ చేసే వ్యక్తులు హాని కలిగించడాన్ని కష్టతరం చేయడానికి అవసరమైన అదనపు భద్రతను ఇది అందిస్తుంది.

నాకు ఫోన్‌లో వెరిఫికేషన్ కోడ్ రాలేదు. సమస్య ఏమిటి?

మీకు వెంటనే కోడ్ వస్తుంది. ఒకవేళ మీకు అందకపోతే, మీరు కొత్త కోడ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. మీరు ఈ సాధారణ సమస్యలలో ఒక దాన్ని ఎదుర్కోవడం లేదని నిర్ధారించుకోండి:

  • టెక్స్ట్ మెసేజ్ డెలివరీ ఆలస్యం కావచ్చు. జన సాంద్రత అధికంగా ఉన్న ఏరియాలలో గానీ లేదా మీకు బలమైన సిగ్నల్ లేకపోయినా గానీ ఆలస్యం జరగవచ్చు. మీరు కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు వేచి చూసినప్పటికీ మా టెక్స్ట్ మెసేజ్‌ను అందుకోలేకపోతే, వాయిస్ కాల్ ఆప్షన్‌ను ట్రై చేయండి.
  • మీరు ఇప్పటికే 1 ఫోన్ నంబర్‌తో 2 ఛానెల్స్‌ను వెరిఫై చేసినట్లయితే, మీరు వేరొక ఫోన్ నంబర్‌తో వెరిఫై చేయాలి. దుర్వినియోగాన్ని నివారించడంలో సహాయపడటానికి, ప్రతి ఫోన్ నంబర్‌తో అనుబంధించగల ఛానెల్స్ సంఖ్యను మేము పరిమితం చేస్తాము.
  • కొన్ని దేశాలు/ప్రాంతాలు అలాగే క్యారియర్‌లు Google నుండి టెక్స్ట్ మెసేజ్‌లను సపోర్ట్ చేయవు. చాలా మొబైల్ క్యారియర్‌లు Google నుండి టెక్స్ట్ మెసేజ్‌లను సపోర్ట్ చేస్తాయి. మీ క్యారియర్ Google నుండి వచ్చే టెక్స్ట్ మెసేజ్‌లను సపోర్ట్ చేయకపోతే, మీరు వాయిస్ కాల్ ఆప్షన్‌ను ట్రై చేయవచ్చు, లేదా వేరొక ఫోన్ నంబర్‌ను ఉపయోగించవచ్చు.
నా చెల్లుబాటు అయ్యే ID / వీడియో వెరిఫికేషన్ తిరస్కరించబడింది. నేను ఏమి చేయగలను?

మీ మొదటి ప్రయత్నం తిరస్కరించబడితే, మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. మీ ఈమెయిల్‌లోని చిట్కాలను రివ్యూ చేయమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.

రెండవ ప్రయత్నం విజయవంతం కాకపోతే, వెరిఫికేషన్ పద్ధతులలో ఏదో ఒక దానిని మళ్లీ ట్రై చేసే ముందు, మీరు తప్పనిసరిగా 30 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. మీ రెండవ వీడియో వెరిఫికేషన్ ఆమోదం పొంది ఉండాల్సిందని మీరు భావించినట్లయితే, మీరు దాన్ని అప్పీల్ చేయవచ్చు, అలాగే అది ఎందుకు అనే విషయాన్ని మాకు తెలియజేయండి.

బదులుగా మీరు వేచి ఉండి, ఛానెల్ హిస్టరీని కూడా బిల్డ్ చేయవచ్చు.

ID లేదా వీడియో వెరిఫికేషన్‌ను పూర్తి చేసే ఆప్షన్ నాకు ఎందుకు కనిపించడం లేదు?

అందరు క్రియేటర్‌లకు ID, వీడియో వెరిఫికేషన్ అందుబాటులో లేదు, ఈ సందర్భంలో అధునాతన ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి మీరు తప్పనిసరిగా సరిపడా ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకోవాలి. ఏ సమయంలోనైనా, YouTube Studioలో మీ ప్రస్తుత ఫీచర్ అర్హత స్టేటస్ అనేది అధునాతన ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి మీరు తీసుకోవలసిన దశలను మీకు చూపుతుంది.
పలు యూజర్‌లను కలిగి ఉన్న ఛానెల్స్ కోసం ఇది ఎలా పని చేస్తుంది?

మీకు బ్రాండ్ ఖాతా ఉన్నట్లయితే:

ఛానెల్ ప్రధాన ఓనర్‌కు మాత్రమే గుర్తింపు వెరిఫికేషన్ చేయడానికి అర్హత ఉంటుంది. వారి వెరిఫికేషన్ స్టేటస్ ఆధారంగా, ఛానెల్‌కు చెందిన యూజర్‌లందరికీ ప్రధాన ఓనర్ లాగానే అవే ఫీచర్‌లకు యాక్సెస్ ఉంటుంది.

మీకు బ్రాండ్ ఖాతా లేకపోతే:

ఛానెల్ ఓనర్‌కు మాత్రమే గుర్తింపు వెరిఫికేషన్ చేయడానికి అర్హత ఉంటుంది. వారి వెరిఫికేషన్ స్టేటస్ ఆధారంగా, ఛానెల్ యూజర్‌లందరికీ ఓనర్ లాగానే అవే ఫీచర్‌లకు యాక్సెస్ ఉంటుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11484599206746903546
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false