మీ YouTube ఖాతాను సురక్షితం చేసుకోండి

నవంబర్ 1, 2021, మానిటైజ్ చేసే క్రియేటర్‌లు YouTube Studioను లేదా YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను యాక్సెస్ చేయడానికి వారి YouTube ఛానెల్ కోసం ఉపయోగించే Google ఖాతాలో 2-దశల వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా ఆన్ చేయాలి. మరింత తెలుసుకోండి

మీ YouTube ఖాతాను సురక్షితంగా చేసుకుంటే, మీ ఖాతా లేదా ఛానెల్ హ్యాక్ అవ్వకుండా, హైజాక్ అవ్వకుండా, లేదా చోరీకి గురి కాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది.

గమనిక: మీ ఖాతా హ్యాక్ చేయబడిందని మీరు భావిస్తే, దాన్ని ఎలా సురక్షితం చేసుకోవాలో తెలుసుకోండి.

మీ YouTube ఖాతాను సురక్షితం చేసుకోండి

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసి, దాన్ని సురక్షితంగా ఉంచుకోండి

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి

శక్తివంతమైన పాస్‌వర్డ్ మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది, అలాగే ఇతరులు మీ ఖాతాను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది.

శక్తివంతమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి: 8 లేదా అంత కంటే ఎక్కువ అక్షరాలను ఉపయోగించండి. అది అక్షరాలు, నంబర్‌లు, లేదా చిహ్నాల కలయిక ఏదైనా అవ్వొచ్చు.

మీ పాస్‌వర్డ్ విభిన్నంగా (యూనిక్‌గా) ఉండేలా రూపొందించండి: మీ YouTube ఖాతా పాస్‌వర్డ్‌ను ఇతర సైట్‌లలో ఉపయోగించవద్దు. మరొక సైట్ హ్యాక్ అయినట్లయితే, మీ YouTube ఖాతాలోకి ఎంటర్ కావడానికి ఆ పాస్‌వర్డ్ ఉపయోగించబడుతుంది.

వ్యక్తిగత సమాచారం, సాధారణ పదాలను ఉపయోగించకండి: మీ పుట్టినరోజులు, “పాస్‌వర్డ్” వంటి సాధారణ పదాలు లేదా “1234” వంటి సాధారణ పాస్‌వర్డ్‌లను ఉపయోగించవద్దు.

మీ పాస్‌వర్డ్‌ను హ్యాకర్‌ల నుండి రక్షించండి

Chrome కోసం పాస్‌వర్డ్ హెచ్చరికను ఆన్ చేయడం ద్వారా మీరు Googleకు చెందని సైట్‌లో మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసినప్పుడు నోటిఫికేషన్ పొందండి. ఉదాహరణకు, మీరు Google లాగా అనిపించే సైట్‌లో మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే మీకు తెలియజేయబడుతుంది, ఆపై మీరు మీ YouTube ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చవచ్చు.

మీ పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేయండి

శక్తివంతమైన, విభిన్నమైన (యూనిక్) పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయడంలో పాస్‌వర్డ్ మేనేజర్ మీకు సహాయపడుతుంది. Chrome లేదా మరొక విశ్వసనీయ పాస్‌వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించడానికి ట్రై చేయండి.
చిట్కా: మీ Google ఖాతాలో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు ఏవైనా బహిర్గతం అయ్యే అవకాశం ఉందా, బలహీనంగా ఉన్నాయా, లేదా పలు ఖాతాలలో మళ్లీ ఉపయోగించబడ్డాయా వంటి అంశాలను తెలుసుకోవడానికి, పాస్‌వర్డ్ చెకప్‌ను ఉపయోగించండి.

మీ సైన్ ఇన్ సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయకండి

మీ పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ ఎవరికీ చెప్పకండి. ఈమెయిల్, మెసేజ్ లేదా ఫోన్ కాల్ ద్వారా YouTube మీ పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ అడగదు. గుర్తింపు సంఖ్య, ఆర్థిక డేటా లేదా పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతూ YouTube ఎప్పుడూ ఫారమ్‌ను పంపదు.

క్రమం తప్పకుండా సెక్యూరిటీ చెకప్ చేయండి

మీ ఖాతా కోసం వ్యక్తిగతీకరించిన సెక్యూరిటీ సిఫార్సులను పొందడానికి సెక్యూరిటీ చెకప్ పేజీకి వెళ్లండి, అలాగే మీ ఖాతాను మరింత సురక్షితం చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

ఖాతా రికవరీ ఆప్షన్‌లను జోడించండి లేదా అప్‌డేట్ చేయండి

మీ రికవరీ ఫోన్ నంబర్‌ను, ఈమెయిల్ అడ్రస్‌ను వీటి కోసం ఉపయోగించవచ్చు:
  • మీ అనుమతి లేకుండా మీ ఖాతాను ఎవరైనా ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు వారిని బ్లాక్ చేయడానికి
  • మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ జరిగితే, మిమ్మల్ని అలర్ట్ చేయడంలో సహాయపడటానికి
  • మీ ఖాతా ఎప్పుడైనా లాక్ అయితే, దాన్ని రికవర్ చేయడంలో సహాయపడటానికి

2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి

హ్యాకర్‌లు మీ పాస్‌వర్డ్‌ను దొంగిలించినప్పటికీ, వారు మీ ఖాతాలోకి ప్రవేశించకుండా నివారించడంలో 2-దశల వెరిఫికేషన్ సహాయపడుతుంది. మీ ఆప్షన్‌లు ఇవిగోండి:
సెక్యూరిటీ కీలు శక్తిమంతమైన వెరిఫికేషన్ ఆప్షన్. ఎందుకంటే అవి టెక్స్ట్ మెసేజ్ కోడ్‌లను ఉపయోగించే ఫిషింగ్ పద్ధతులను నివారించడంలో సహాయపడతాయి.

మీ ఖాతా నుండి అనుమానాస్పద వ్యక్తులను తీసివేయండి

మీ ఖాతాను మేనేజ్ చేసే వ్యక్తులను మీరు గుర్తించలేకపోతే, మీ ఖాతా హ్యాక్ అయి ఉండవచ్చు, ఏదైనా సమాచారం పొందడానికి ఎవరో మీ ఖాతాకు సంబంధించిన యాజమాన్య హక్కును వెరిఫై చేస్తున్నారు. మీరు మీ ఖాతా రకాన్ని బట్టి వ్యక్తులను మార్చవచ్చు లేదా తొలగించవచ్చు.

మీకు అవసరం లేని సైట్‌లు, యాప్‌లను తీసివేయండి

మీ YouTube ఖాతాను రక్షించడానికి, తెలియని యాప్‌లను లేదా తెలియని మూలాల నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి. మీ కనెక్ట్ చేయబడిన ఖాతాల నుండి మీకు అవసరం లేని యాప్‌లను మేనేజ్ చేసి, తీసివేయండి.

మీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి, అలాగే మీ ఖాతాను బ్యాకప్ చేయండి

మీ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్, లేదా యాప్స్, అవుట్-డేట్ అయి ఉంటే, సాఫ్ట్‌వేర్ మీద హ్యాకర్‌లు దాడి చేసే ప్రమాదం ఉంది. మీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి, అలాగే మీ ఖాతాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయండి.

అనుమానాస్పద మెసేజ్‌లకు, కంటెంట్‌కు దూరంగా ఉండి మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోండి

మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి నమ్మదగిన వ్యక్తిగా నటిస్తూ హ్యాకర్ మిమ్మల్ని సంప్రదించడాన్ని ఫిషింగ్ అంటారు. వ్యక్తిగత సమాచారంలో ఈ కింద పేర్కొన్నవి ఉండవచ్చు:

  • ఆర్థికపరమైన డేటా
  • నేషనల్ ID/సోషల్ సెక్యూరిటీ నంబర్
  • క్రెడిట్ కార్డ్ నంబర్‌లు

సంస్థల మాదిరిగా, ఫ్యామిలీ మెంబర్‌లుగా, లేదా సహోద్యోగులు లాగా నటించడానికి హ్యాకర్‌లు ఈమెయిల్స్‌ను, టెక్స్ట్ మెసేజ్‌లను, వెబ్ పేజీలను ఉపయోగించవచ్చు.

మీ పాస్‌వర్డ్, ఈమెయిల్ అడ్రస్, లేదా ఇతర ఖాతా సమాచారం కావాలని YouTube మిమ్మల్ని ఎప్పుడూ అడగదు. ఒకవేళ ఎవరైనా YouTubeకు చెందిన వారిలా నటిస్తూ మిమ్మల్ని సంప్రదిస్తే మోసపోకండి.
 

అనుమానాస్పదంగా ఉండే రిక్వెస్ట్‌ల జోలికి వెళ్లకండి
  • మీ వ్యక్తిగతమైన లేదా ఆర్థికపరమైన సమాచారాన్ని అడిగే అనుమానాస్పద ఈమెయిల్స్‌కు, టెక్స్ట్ మెసేజ్‌లకు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లకు, వెబ్‌పేజీలకు, ఫోన్ కాల్స్‌కు రిప్లయి ఇవ్వకండి.
  • అవిశ్వసనీయమైన వెబ్‌సైట్‌లను, లేదా పంపే వారి (సెండర్స్) నుండి వచ్చిన ఈమెయిల్స్‌లో, మెసేజ్‌ల్లో, వెబ్‌పేజీల్లో, పాప్-అప్‌ల్లో ఉండే లింక్స్‌ను క్లిక్ చేయకండి.
  • YouTube ఇమెయిల్‌లు @youtube.com లేదా @google.com అడ్రస్‌ల నుండి మాత్రమే వస్తాయి.

ఈమెయిల్ అడ్రస్‌లలో స్వల్ప అక్షరదోషాలు ఉన్నాయేమో చెక్ చేయండి

అనుమానాస్పద ఫిషింగ్ ఈమెయిల్‌కు ఉదాహరణ

అనుమానాస్పదమైన వెబ్ పేజీలను నివారించండి

అనుమానాస్పదమైన కంటెంట్ గురించి, అలాగే అవాంఛిత సాఫ్ట్‌వేర్ గురించి మిమ్మల్ని హెచ్చరించేలా Google Chrome, అలాగే Search రూపొందించబడ్డాయి.
ఈ హెచ్చరికలను ఎలా మేనేజ్ చేయాలో Chromeలో, Searchలో తెలుసుకోండి.

స్పామ్ లేదా ఫిషింగ్‌ను రిపోర్ట్ చేయండి

ఫిషింగ్ నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి, myaccounts.google.com లింక్‌లో తప్ప మరే పేజీలోనూ మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవద్దు. మీరు స్పామ్‌గా లేదా ఫిషింగ్‌గా భావించే వీడియోలను YouTubeలో కనుగొంటే, దయచేసి YouTube టీమ్ ద్వారా వాటిని రివ్యూ చేయడానికి ఫ్లాగ్ చేయండి. స్పామ్, ఫిషింగ్‌ల గురించి మరింత సమాచారం కోసం దయచేసి నేషనల్ సైబర్ సెక్యూరిటీ అలయన్స్ లింక్‌ను సందర్శించండి.
చిట్కా: మా ఫిషింగ్ క్విజ్‌తో ఫిషింగ్ గురించి మరింత తెలుసుకోండి.

మీ ఛానెల్‌లో అనుమతులను సెట్ చేయండి, అలాగే చెక్ చేయండి

మీరు క్రియేటర్ అయితే, మీ Google ఖాతాకు యాక్సెస్ ఇవ్వకుండా మీ YouTube ఛానెల్‌ను మేనేజ్ చేయడానికి మరొకరిని ఆహ్వానించవచ్చు. ఛానెల్‌ను పరిమితంగా యాక్సెస్ చేయడానికి కింద పేర్కొన్న వారి మాదిరిగా మరొకరిని ఆహ్వానించండి:

  • మేనేజర్: ఇతరులను జోడించగలరు లేదా తీసివేయగలరు, అలాగే ఛానెల్ వివరాలను ఎడిట్ చేయగలరు.
  • ఎడిటర్: ఛానెల్ వివరాలన్నింటినీ ఎడిట్ చేయగలరు.
  • వ్యూయర్: ఛానెల్ వివరాలన్నింటినీ చూడగలరు (కానీ ఎడిట్ చేయలేరు).
  • వ్యూయర్ (పరిమిత యాక్సెస్): ఆదాయ సమాచారం మినహా ఛానెల్ వివరాలన్నింటినీ చూడగలరు (కానీ ఎడిట్ చేయలేరు).

మీ ఛానెల్ అనుమతులను సెట్ చేయడం, చెక్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

గమనిక: మీకు బ్రాండ్ ఖాతా ఉంటే, మీ Google ఖాతాను, మీ YouTube ఛానెల్‌ను మేనేజ్ చేయడం కోసం మీరు ఇతరులను ఆహ్వానించవచ్చు. మీకు బ్రాండ్ ఖాతా ఉందో లేదో చెక్ చేయండి, అలాగే బ్రాండ్ ఖాతా అనుమతులను ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15908174287691861648
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false