ప్లాట్‌ఫామ్ వెలుపలి రివార్డ్‌లను పొందడానికి మీ ఖాతాను కనెక్ట్ చేయండి

మీరు, మీ Google ఖాతాను ఒక పార్టనర్ ఖాతాకు కనెక్ట్ చేసి, YouTubeలో అర్హత గల లైవ్ స్ట్రీమ్‌లను చూసినప్పుడు ప్లాట్‌ఫామ్ వెలుపలి రివార్డ్‌లు పొందవచ్చు.

గమనిక: ఈ ఫీచర్ YouTubeలోని యాక్సెస్ పర్యవేక్షణ మోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. మరింత తెలుసుకోండి.

మీ ఖాతాలను కనెక్ట్ లేదా డిస్‌కనెక్ట్ చేయండి

YouTube సెట్టింగ్‌ల నుండి

ఖాతాను కనెక్ట్ చేయండి

  1. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో కు వెళ్లి, సెట్టింగ్‌ల ను ఎంచుకోండి.
  3. కనెక్ట్ అయి ఉన్న యాప్‌ల విభాగానికి వెళ్లండి.
  4. మీరు కనెక్ట్ చేయాలనుకుంటున్న పార్ట్‌నర్‌కు పక్కన ఉన్న, కనెక్ట్ అయి ఉన్నవి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    1. మీకు ఇప్పటికే ఖాతా లేకపోతే, ఒక దాన్ని క్రియేట్ చేయడానికి పార్ట్‌నర్ వెబ్‌సైట్‌లో ఉన్న సూచనలను ఫాలో అవ్వండి. ఆ తర్వాత, 2వ దశ నుండి ప్రారంభించండి.
  5. మీ పార్ట్‌నర్ ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.

ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి

  1. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను క్లిక్ చేసి, సెట్టింగ్‌ల ను ఎంచుకోండి.
  3. కనెక్ట్ అయి ఉన్న యాప్‌ల విభాగానికి వెళ్లండి.
  4. మీరు డిస్‌కనెక్ట్ చేయాలనుకుంటున్న పార్ట్‌నర్‌కు పక్కన ఉన్న, డిస్‌కనెక్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

YouTube వీక్షణ పేజీ నుండి

ఖాతాను కనెక్ట్ చేయండి

  1.  YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. రివార్డ్‌లకు అర్హత ఉన్న ఏదైనా వీడియోకు లేదా లైవ్ స్ట్రీమ్‌కు వెళ్లండి.
  3. వీక్షణ పేజీలో, ప్లేయర్ కింద ఉన్న కనెక్ట్ చేయండి ని క్లిక్ చేయండి.
  4. మీ పార్ట్‌నర్ ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.

పేజీ మధ్యలో 'సైన్ ఇన్' పాప్-అప్‌లా కనిపిస్తుంది

ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి

  1.  YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. అర్హత ఉన్న ఏదైనా వీడియోకు లేదా లైవ్ స్ట్రీమ్‌కు వెళ్లండి.
  3. వీక్షణ పేజీలో, ప్లేయర్ కింద ఉన్న కనెక్ట్ అయి ఉన్న యాప్‌ల ను క్లిక్ చేయండి.
  4. డిస్‌కనెక్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ Google ఖాతా నుండి

మీరు మీ Google ఖాతా నుండి పార్ట్‌నర్ ఖాతాను డిస్‌కనెక్ట్ చేయవచ్చు.

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. myaccount.google.com/accountlinking‌కు వెళ్లండి.
  3. మీరు డిస్‌కనెక్ట్ చేయాలనుకుంటున్న ఖాతా పక్కన ఉన్న, అన్‌లింక్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: ​మీరు ఒకసారి మీ ఖాతాలను డిస్‌కనెక్ట్ చేశాక, ఆ యాప్‌లో అర్హత గల వీడియోలను చూసినా కూడా, మీకు రివార్డ్‌లు పొందే అర్హత ఉండదు. మీరు డిస్‌కనెక్ట్ చేసినా కూడా, మా పార్ట్‌నర్‌లు ఆ వీక్షణల రికార్డ్‌ను స్టోర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. మీ డేటాను మేనేజ్ చేయడానికి మీ పార్ట్‌నర్ ఖాతాను రెఫర్ చేయండి.

పార్టనర్ ఖాతాలు

Activision
Call of Dutyని Activision రూపొందించింది. మీ Activision ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లను పొందే అర్హత కోసం, ఎంపిక చేసిన 'Call of Duty' లైవ్ స్ట్రీమ్‌లను చూడండి.
Battle.net (Blizzard)
Battle.net, Overwatch, Hearthstoneలను Blizzard రూపొందించింది. మీ Battle.net ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లను పొందే అర్హత కోసం, ఎంపిక చేసిన 'Blizzard games' లైవ్ స్ట్రీమ్‌లను చూడండి.
Electronic Arts 
FIFA, Madden‌ను Electronic Arts (EA) రూపొందించింది. మీ EA ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లకు అర్హత పొందేందుకు ఎంపిక చేసిన 'EA games' లైవ్ స్ట్రీమ్‌లను చూడండి.
Epic Games
Fortnite‌ను Epic Games రూపొందించింది. మీ Fortnite ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లకు అర్హత సాధించడానికి ఎంపిక చేసిన Fortnite ప్రపంచ కప్ కంటెంట్‌ను చూడండి.
Garena
Free Fireను Garena రూపొందించింది.  మీ 'Garena Free Fire' ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లకు అర్హత పొందేందుకు ఎంపిక చేసిన 'Garena Free Fire'ను చూడండి.
MLBB
Mobile Legends: Bang Bang (MLBB)ను Moonton రూపొందించింది. మీ MLBB ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లను పొందే అర్హత కోసం, ఎంపిక చేసిన 'MLBB' లైవ్ స్ట్రీమ్‌లను చూడండి.
NFL
NFL నుండి ప్లాట్‌ఫామ్ వెలుపలి రివార్డ్‌లను పొందడానికి, మీ NFL ID ఖాతాను కనెక్ట్ చేయండి.
Krafton (PUBG)
PLAYERUNKNOWN’S BATTLEGROUNDS‌ను Krafton రూపొందించింది. మీ ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లను పొందడానికి అర్హత గల లైవ్ స్ట్రీమ్‌లను చూడండి.
PlayerUnknown's Battlegrounds Mobile (PUBG Mobile)
PlayerUnknown’s Battlegrounds (PUBG) Mobile‌ను Tencent రూపొందించింది. మీ ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లను పొందే అర్హత కోసం, ఎంపిక చేసిన 'PUBG Mobile' లైవ్ స్ట్రీమ్‌లను చూడండి.
Riot Games
League of Legends, Legends of Runeterra, Teamfight Tacticsలను Riot Games రూపొందించింది. మీ ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లను పొందడానికి అర్హత గల లైవ్ స్ట్రీమ్‌లను చూడండి.
Supercell

Clash Royale‌ను Supercell రూపొందించింది. మీ Supercell ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లను పొందే అర్హత కోసం, ఎంపిక చేసిన 'Clash Royale/Clash Royale League' లైవ్ స్ట్రీమ్‌లను చూడండి.

Ubisoft
Ubisoft 'Assassin's Creed, Tom Clancy's Rainbow Six'ను రూపొందించింది. మీ ఖాతాను లింక్ చేసిన తర్వాత, రివార్డ్‌లను పొందే అర్హత కోసం, ఎంపిక చేసిన 'Ubisoft games' లైవ్ స్ట్రీమ్‌లను చూడండి.

FAQలు

నేను నా ఖాతాలను కనెక్ట్ చేశాను, అలాగే నేను అర్హత గల లైవ్ స్ట్రీమ్‌ను చూస్తున్నాను. నేను ఎందుకు ఎలాంటి రివార్డ్‌లను గెలుచుకోవడం లేదు?

ఒక్కో స్ట్రీమ్‌కు ఉండే నియమాల ఆధారంగా, అంతిమంగా మా పార్టనర్‌లు, అర్హత ఉన్న ఏ వీక్షకులు గెలుస్తారు అన్నది నిర్ణయిస్తారు. పార్టనర్‌ ఆధారంగా నియమాలు మారవచ్చు.  
మీకు అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి, మీ వద్ద లింక్ చేసిన ఖాతాలు ఉన్నాయని, అలాగే మీరు కంప్యూటర్‌లో, లేదా YouTube మొబైల్ యాప్‌లో, లేదా మా మొబైల్ వెబ్‌సైట్‌లో చూస్తున్నారని నిర్ధారించుకోండి. మీరు పొందుపరిచిన (ఎంబెడ్‌ చేసిన) ప్లేయర్లలో, లేదా YouTube స్మార్ట్ టీవీ యాప్‌లో, లేదా కాస్టింగ్ ద్వారా చూస్తుంటే, రివార్డ్‌లు పొందడానికి అర్హులు కాదు.
To check if the video is eligible, you can look at the videos’ Player Settings, where eligible videos will include an option for you to review your linked account state.
మీరు Android లేదా iOS ఆధారిత పరికరాలను ఉపయోగిస్తూ ఉంటే, మీరు YouTubeకు చెందిన తాజా వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. 

నేను ఏదైనా గెలుచుకుంటే నాకు ఎలా తెలుస్తుంది?

మీరు గెలిచిన తర్వాత రివార్డ్‌లు మీ పార్టనర్ ఖాతాకు డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. ఈ రివార్డ్‌లు కనిపించడానికి ఒక రోజు సమయం పట్టవచ్చు. నేరుగా పార్టనర్ వెబ్‌సైట్ నుండి మరింత తెలుసుకోండి.

ఈ ఫీచర్ మొబైల్‌లో అందుబాటులో ఉందా?

కంప్యూటర్‌లు, మొబైల్ యాప్, మా మొబైల్ వెబ్‌సైట్ m.youtube.comలో, అలాగే పిక్చర్-ఇన్-పిక్చర్ వీక్షణ ద్వారా రివార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు పొందుపరిచిన ప్లేయర్‌లలో చూస్తే, మీరు రివార్డ్‌లకు అర్హులు కాదు.
నేను నా ఖాతాను కనెక్ట్ చేయలేకపోతున్నాను. నేను ఏమి చేయాలి?
మొదట, మీరు సైన్ ఇన్ చేశారో లేదో చెక్ చేయండి. మీ ఖాతాలను కనెక్ట్ చేయడానికి మీరు మీ బ్రౌజర్‌లో పాప్-అప్‌లను ఆన్ చేయాల్సి రావచ్చు. Safariలో కనెక్ట్ చేయడం సాధ్యపడకపోతే, వేరొక బ్రౌజర్‌లో ట్రై చేయండి. 
గమనిక: మీరు వ్యక్తిగత ఖాతాలను మాత్రమే కనెక్ట్ చేయగలరు, బ్రాండ్ ఖాతాలను కనెక్ట్ చేయలేరు. కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు వ్యక్తిగత ఖాతాలోకి లాగిన్ చేశారని నిర్ధారించుకోండి.
వీడియో పిల్లల కోసం రూపొందించబడింది అని సెట్ చేయబడితే, ఖాతాను లింక్ చేయడం అందుబాటులో ఉండదు.

నా ఖాతాలు కనెక్ట్ అయినట్లు నాకు మెసేజ్ వచ్చింది, కానీ అవి కనెక్ట్ అయినట్లు కనిపించడం లేదు. నేను ఇప్పటికీ రివార్డ్‌లను పొందడానికి అర్హత కలిగి ఉన్నానా?

మీ ఖాతాలు కనెక్ట్ చేయబడ్డాక, కనెక్ట్ చేయబడినట్లు కనిపించడానికి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది.
మీ ఖాతాలు కనెక్ట్ అయ్యాయని నిర్ధారించడానికి ఈ పేజీకి వెళ్లండి. ఈ పేజీలో, మీరు మీ ఖాతాకు కనెక్ట్ అయిన అన్ని సర్వీస్‌లను చూడవచ్చు. మీరు ఏ సర్వీస్ అయినా అన్‌లింక్ కూడా చేయవచ్చు.
ఈ పేజీ మీ ఖాతాలను కనెక్ట్ చేసినట్లు చూపించినంత వరకు, మీరు రివార్డ్‌లు పొందడానికి అర్హులు.
మీ ఖాతాలు కనెక్ట్ అయినట్లు కనిపించకపోతే, మీరు మీ ఖాతాలను అన్‌లింక్ చేసి, తిరిగి కనెక్ట్ చేసి కూడా ట్రై చేయవచ్చు.

నేను నా ఖాతాలను డిస్‌కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కాని అవి ఇప్పటికీ కనెక్ట్ అయినట్లు చూపిస్తున్నాయి. ఎందుకు?

మీ ఖాతాలు డిస్‌కనెక్ట్ చేయబడ్డాక, డిస్‌కనెక్ట్ చేయబడినట్లు కనిపించడానికి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది.
మీ ఖాతాలు డిస్‌కనెక్ట్ చేయబడ్డాయి అని నిర్ధారించడానికి ఈ పేజీకి వెళ్లండి. ఈ పేజీలో సర్వీస్ పేర్కొనబడకపోతే, మీ ఖాతాలు ఇప్పుడు కనెక్ట్ అయి లేవని అర్థం.

నేను నా ఖాతాను కనెక్ట్ చేసినప్పుడు Google, నా పార్ట్‌నర్ ఖాతా మధ్య ఏ రకమైన సమాచారం షేర్ చేయబడుతుంది?

మీరు మీ ఖాతాను YouTubeకు కనెక్ట్ చేసిన తర్వాత, YouTube మీ వీక్షణ సమాచారాన్ని, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్‌ను షేర్ చేస్తుంది, అలాగే ప్రాథమిక ఖాతా సమాచారాన్ని Google లేదా YouTubeతో షేర్ చేయవచ్చు. ఏ ఖాతాలు రివార్డ్‌లు పొందడానికి అర్హతను కలిగి ఉన్నాయి అనే విషయాన్ని ఈ సమాచారం మాకు తెలియజేస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
534237966820986784
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false