హ్యాక్ అయిన YouTube ఛానెల్‌ను రికవర్ చేయండి

ఒక క్రియేటర్‌గా, మీరు మీ కంటెంట్ కోసం, ఛానెళ్లలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. మీ ఛానెల్ హ్యాక్ చేయబడినప్పుడు అది ఒత్తిడితో కూడుకున్న, కష్టమైన పరిస్థితి అని మాకు తెలుసు. అదృష్టవశాత్తూ, మీ ఛానెల్‌ను రికవర్ చేయడానికి మీరు తీసుకోగలిగే దశలు ఉన్నాయి.

చర్య తీసుకునే ముందు, మీ ఛానెల్ హ్యాక్ చేయబడి ఉండవచ్చనే సంకేతాల కోసం ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం ముఖ్యం.

ప్రతి YouTube ఛానెల్ కనీసం ఒక Google ఖాతాతో అనుబంధించబడి ఉంటుంది. YouTube ఛానెల్‌ను హ్యాక్ చేసినప్పుడు, ఛానెల్‌తో అనుబంధించబడిన Google ఖాతాలలో కనీసం ఒకటి అయినా చోరీకి గురి అయ్యిందని అర్థం.

మీరు కింది వాటిలో దేనినైనా గమనించినట్లయితే, మీ Google ఖాతా హ్యాక్ చేయబడి ఉండవచ్చు, హైజాక్ చేయబడి ఉండవచ్చు లేదా సురక్షితం కాకపోవచ్చు:

  • మీరు చేయని మార్పులు కనిపించడం: మీ ప్రొఫైల్ ఫోటో, వివరణలు, ఈమెయిల్ సెట్టింగ్‌లు, YouTube కోసం AdSense అనుబంధం లేదా పంపిన మెసేజ్‌లు భిన్నంగా ఉండడం.
  • మీకు చెందని వీడియోలు అప్‌లోడ్ చేయబడి ఉండడం: ఎవరో మీ Google ఖాతా వలె వీడియోలను పోస్ట్ చేయడం. మీరు ఈ వీడియోలలో అసభ్యకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు జరిమానాలు లేదా స్ట్రయిక్ విధించినట్లు ఈమెయిల్ నోటిఫికేషన్‌లను పొందవచ్చు.

వివిధ కారణాల వల్ల Google ఖాతాలు హ్యాక్ చేయబడవచ్చు, హైజాక్ చేయబడవచ్చు లేదా చోరీకి గురికావచ్చు. ఈ కారణాలలో హానికరమైన కంటెంట్ (మాల్‌వేర్), మీకు తెలిసిన (ఫిషింగ్) సర్వీస్ రకం లాగా నమ్మింపజేసే మోసపూరిత ఈమెయిళ్లు ఉన్నాయి. మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి, మీ ఈమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయవద్దు. మీరు విశ్వసించని సోర్స్ నుండి ఫైళ్లను లేదా సాఫ్ట్‌వేర్‌లను ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయకండి.

హ్యాక్ అయిన YouTube ఛానెల్‌ను రికవర్ చేయడానికి, ముందుగా YouTube ఛానెల్‌తో అనుబంధించబడిన హ్యాక్ అయిన Google ఖాతాను రికవర్ చేయడం అవసరం.

మీ YouTube ఛానెల్‌ను రికవర్ చేయడానికి 3 దశలు ఉన్నాయి:

1. YouTube ఛానెల్‌తో అనుబంధించబడిన హ్యాక్ అయిన Google ఖాతాను రికవర్ చేసి, దాన్ని సురక్షితం చేయండి
2. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ లేదా కాపీరైట్ స్ట్రయిక్‌ల వంటి పాలసీ ఉల్లంఘనలను నివారించడానికి YouTube ఛానెల్‌లో అవాంఛిత మార్పులను వెంటనే పూర్వస్థితికి మార్చండి
3. అనుబంధిత ఛానెల్ యూజర్‌లందరి విషయంలో సెక్యూరిటీ సంబంధిత బెస్ట్ ప్రాక్టీసులను ఉపయోగించడం ద్వారా మీ Google ఖాతాను వేరే వ్యక్తులు అనధికారికంగా యాక్సెస్ చేసే రిస్క్‌ను తగ్గించుకోండి

మీ Google ఖాతాను రికవర్ చేయండి

మీరు ఇప్పటికీ మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయవచ్చు

మీ పాస్‌వర్డ్‌‌ను అప్‌డేట్ చేయడం, మీ Google ఖాతాను సెక్యూర్ చేయడం ముఖ్యం. తర్వాత, తదుపరి దశకు వెళ్లండి.

మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయలేకపోతున్నారు

మీ Google ఖాతాకు మళ్లీ సైన్ ఇన్ చేయడానికి సహాయం కోసం:

  1. మీ Google ఖాతా లేదా Gmailను రికవర్ చేయడానికి సూచించిన దశలను ఫాలో అవ్వండి.
  2. ప్రాంప్ట్ వచ్చినప్పుడు మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయండి. ఈ ఖాతాతో మీరు ఇది వరకే ఉపయోగించని ఒక శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి. శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీ ఛానెల్ మేనేజర్‌లు/ఓనర్‌లను వారి Google ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి అవే దశలను అనుసరించమని అడగండి.

మీ ఛానెల్‌ను హ్యాక్ కావడానికి ముందుగా ఉన్న స్థితికి మార్చండి

మీ ఛానెల్‌ను హ్యాక్ కావడానికి ముందుగా ఉన్న స్థితికి తీసుకురావడంలో సహాయం కోసం:

  1. ఛానెల్ పేరు లేదా హ్యాండిల్‌ను క్లీనప్ చేయండి
  2. ఛానెల్ బ్యానర్ లేదా లోగోను రీప్లేస్ చేయండి
  3. వీడియో గోప్యతా సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి
  4. తెలియని ఛానెల్ యూజర్‌లను లేదా బ్రాండ్ ఖాతా యూజర్‌లను తీసివేయండి
  5. కాపీరైట్ స్ట్రయిక్‌‌లను పరిష్కరించండి

అనధికార యాక్సెస్ ప్రమాదాన్ని తగ్గించండి

మీరు పై దశలను పూర్తి చేసిన తర్వాత, ఛానెల్‌తో అనుబంధించబడిన మీ Google ఖాతాను సురక్షితంగా ఉంచడం ముఖ్యం:

  1. మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను ఆన్ చేయండి
  2. మీ ఖాతాకు అదనపు సెక్యూరిటీ లేయర్‌ను జోడించడానికి 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి.
  3. రికవరీ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్‌ను సెటప్ లేదా అప్‌డేట్ చేయండి
  4. Google ఖాతా సురక్షిత చెకప్‌ను రివ్యూ చేయండి
  5. ఫిషింగ్ వంటి దాడుల నుండి రక్షణ కోసం పాస్-కీని సెటప్ చేయండి
  6. అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ను సమ్మతించండి

మీ Google ఖాతా హ్యాక్ అయిన తర్వాత మీ ఛానెల్ రద్దు చేయబడితే

మీరు మీ Google ఖాతాను రికవర్ చేసిన తర్వాత, మీ ఇన్‌బాక్స్‌లో ఛానెల్ రద్దును ఎలా అప్పీల్ చేయాలనే దాని గురించి మరిన్ని వివరాలతో కూడిన ఈమెయిల్‌ను మీరు కనుగొనవచ్చు. హ్యాక్ అయిన మీ Google ఖాతాను మీరు కనుగొన్న తర్వాత, మీరు ఈ ఫారమ్‌తో అప్పీల్ చేయవచ్చు. ఖాతా రికవరీ అసంపూర్తిగా ఉంటే మీ అప్పీల్ అంగీకరించబడకపోవచ్చు.

క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి

మీ ఛానెల్‌కు అర్హత ఉంటే (ఉదాహరణకు, మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంటే), మీరు మీ Google ఖాతాను రికవర్ చేసిన తర్వాత, సహాయం కోసం మీరు YouTube క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు.

క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించడం ఎలాగో తెలుసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను నా ఖాతాను రికవర్ చేసుకున్నాను, కానీ దాని నుండి హ్యాకర్ యాక్సెస్ తీసివేయబడిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది?

హైజాకర్ యాక్సెస్ తీసివేయబడిందో లేదో నిర్ధారించడం మాకు ఎల్లప్పుడూ సాధ్యం కాదు. మీ YouTube ఛానెల్‌ను రివ్యూ చేయాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము, అలాగే మీ Google ఖాతా సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి, తద్వారా మీ ఖాతా భవిష్యత్తులో హ్యాక్ చేయబడదు.  

YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే వీడియోలను హ్యాకర్ అప్‌లోడ్ చేస్తే నేను ఏవైనా సమస్యలను ఎదుర్కొంటానా? నా ఛానెల్ రద్దు చేయబడుతుందా?

మీరు అప్‌లోడ్ చేయని వీడియోలన్నింటినీ తక్షణమే తొలగించండి, ఎందుకంటే YouTubeలోని మొత్తం కంటెంట్ తప్పనిసరిగా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండాలి. హ్యాక్ చేయబడిన తర్వాత మీ ఛానెల్ రద్దు చేయబడితే, మీ Google ఖాతాను మీరు రికవర్ చేసుకున్నాక ఇక్కడ అప్పీల్ చేసుకోవచ్చు. ఖాతా రికవరీ అసంపూర్తిగా ఉంటే మీ అప్పీల్ అంగీకరించబడకపోవచ్చు. మీకు మరిన్ని సందేహాలు ఉంటే, దయచేసి క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

నా ఛానెల్‌ను మేనేజ్ చేస్తున్న వ్యక్తులలో ఒకరి ఖాతా హ్యాక్ చేయబడింది. భవిష్యత్తులో నా ఖాతా హైజాక్ చేయబడకుండా చూసుకోవడానికి నేను ఏమి చేయాలి?

YouTubeలో ఛానెల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ మేనేజర్‌లు ఉండటం సర్వసాధారణం. మీ ఛానెల్‌లో భద్రతను, సెక్యూరిటీని మెరుగుపరచడానికి, ఈ దశలను ఫాలో అవ్వండి: 

  • మీరు, మీ టీమ్‌లోని వ్యక్తులు మీ ఖాతాలను సురక్షితంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారని నిర్ధారించుకోండి.
  • ఆమోదించబడిన ఖాతాలకు మాత్రమే మీ ఛానెల్‌ను మేనేజ్ చేయడానికి యాక్సెస్ ఉందని, ఇంకా మీరు ఎంచుకున్న స్థాయిలో ఆ ఖాతాలకు అనుమతులు ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఛానెల్ అనుమతుల టూల్‌ను, బ్రాండ్ ఖాతా టూల్స్‌ను ఉపయోగించండి. పాస్‌వర్డ్‌లను లేదా సైన్-ఇన్ సమాచారాన్ని ఇతరులతో షేర్ చేయవద్దు. ఛానెల్ అనుమతుల ఫీచర్‌తో ఆమోదించబడిన ఖాతాల ద్వారా మాత్రమే మీ ఛానెల్‌కు యాక్సెస్ ఉండాలి.
  • డేటా ఉల్లంఘనలను నివారించడంలో సహాయపడటానికి, మీరు ఇతర ఖాతాల కోసం ఉపయోగించే ఈమెయిల్‌ను కాకుండా మీ YouTube ఛానెల్ కోసం వేరే ఈమెయిల్‌ను ఉపయోగించండి. మీరు ఒకే ఈమెయిల్‌ను అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించినట్లయితే, ఇంకా ఎవరైనా దానికి యాక్సెస్ పొందినట్లయితే, వారు మీ YouTube, ఇతర ఖాతాలను ఏకకాలంలో దుర్వినియోగం చేయవచ్చు.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13574341473556769238
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false