మీ YouTube ఛానెల్ మెంబర్‌షిప్‌ల స్థాయిలను, పెర్క్‌లను క్రియేట్ చేయడం లేదా మేనేజ్ చేయడం

మీ ఛానెల్‌లో మీరు మెంబర్‌షిప్‌లను ఆన్ చేస్తే, మీ ఛానెల్ మెంబర్‌ల కోసం మీరు విభిన్న, మెంబర్‌లు మాత్రమే పొందగల పెర్క్‌లను కలిగి ఉండవచ్చు. ఈ పెర్క్‌లలో అనుకూల ఎమోజీ, బ్యాడ్జ్‌లు, మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోలు ఉండవచ్చు.

మీ ఛానెల్ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్‌లో వేర్వేరు ధరల్లో స్థాయిలు ఉండవచ్చు, ఇది ప్రతి స్థాయిలో మెంబర్ పెర్క్‌లను అందించవచ్చు. కానీ, మీరు ఒకటి కంటే ఎక్కువ స్థాయిలను కలిగి ఉంటే, ప్రతి స్థాయి పెర్క్‌లు ఒక దానిపై మరొకటి చేర్చబడతాయి. అంటే అత్యధిక ధర గల స్థాయిలకు ఆటోమేటిక్‌గా తక్కువ ధర గల స్థాయిలలో అందించే పెర్క్‌లకు యాక్సెస్ ఉంటుంది. మీరు గరిష్ఠంగా 6 వేర్వేరు మెంబర్‌షిప్ స్థాయిలను క్రియేట్ చేయవచ్చు, ప్రతి స్థాయిలో తప్పనిసరిగా 1 నుండి 5 వరకు పెర్క్‌లు ఉండాలి. మీ మెంబర్‌లకు మీరు అందించే పెర్క్‌లన్నీ మా ఛానెల్ మెంబర్‌షిప్‌ల పాలసీలను ఫాలో అవ్వాలని గుర్తుంచుకోండి.

మీరు మెంబర్‌షిప్‌ల స్థాయిలను, పెర్క్‌లను క్రియేట్ చేసిన తర్వాత, వీటిని చేయవచ్చు:

ఛానెల్ మెంబర్‌షిప్‌లు

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

ఛానెల్ మెంబర్‌షిప్ స్థాయిలు

మీరు వేర్వేరు ధరల్లో గరిష్ఠంగా 6 మెంబర్‌షిప్ స్థాయిలను క్రియేట్ చేయవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ స్థాయిలను కలిగి ఉంటే, అత్యధిక ధర గల స్థాయిలు, తక్కువ ధర గల స్థాయిలలో అందించే పెర్క్‌లన్నింటినీ కలిగి ఉంటాయని గుర్తుంచుకోండి. మెంబర్‌షిప్ స్థాయిలకు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనే దాని ఆధారంగా, ఇతర దేశాలు/ప్రాంతాలలోని మెంబర్‌లు ఏంత పే చేస్తున్నారో చూడండి.

మెంబర్‌షిప్ స్థాయిని జోడించడం

మీరు వేర్వేరు ధరలతో గరిష్ఠంగా 6 స్థాయిలను జోడించవచ్చు. ప్రతి ఒక్క స్థాయిలో తప్పనిసరిగా 1 నుండి 5 పెర్క్‌లు ఉండాలి.

మెంబర్‌షిప్ స్థాయిలను జోడించడం

  1. కంప్యూటర్‌లో, YouTube Studioకు వెళ్లండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. “1వ దశ: స్థాయిలు, పెర్క్‌లను జోడించండి” అనే బాక్స్‌లో, ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. పూర్తయిన తర్వాత, పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ స్థాయిలు, పెర్క్‌లు అందుబాటులోకి రావడానికి ముందు, మా ఛానెల్ మెంబర్‌షిప్‌‌ల పాలసీలకు అవి అనుగుణంగా ఉన్నాయో, లేదో మేము రివ్యూ చేస్తాము. ఈ ప్రాసెస్‌కు ఒక రోజు సమయం పట్టవచ్చు.

మెంబర్‌షిప్ స్థాయిని తీసివేయడం

మీరు ఒక స్థాయిని తీసివేస్తే, ఆ స్థాయిలో ఉన్న మెంబర్‌లందరూ తొలగించబడతారు. తీసివేసిన స్థాయిలోని మెంబర్‌లందరూ పెర్క్‌లకు ఉన్న యాక్సెస్‌ను వెంటనే కోల్పోతారు, అలాగే వారికి గత నెల పేమెంట్ రీఫండ్ చేయబడుతుంది.

ఒక స్థాయిని తీసివేయండి

  1. కంప్యూటర్‌లో, YouTube Studioకు వెళ్లండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. “1వ దశ: స్థాయిలు, పెర్క్‌లను జోడించండి” అనే బాక్స్‌లో, ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీరు తీసివేయాలనుకుంటున్న స్థాయిని క్లిక్ చేయండి ఆ తర్వాత తొలగించండి ని క్లిక్ చేయండి.
  6. స్క్రీన్‌పై కనిపించే మిగతా సూచనలను ఫాలో అవ్వండి. పూర్తయిన తర్వాత, పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఛానెల్ మెంబర్‌షిప్ పెర్క్‌లు

మీ మెంబర్‌లకు మీరు అందించగల కనీసం ఒక పెర్క్‌ను (గరిష్ఠంగా ఐదు పెర్క్‌ల దాకా) క్రియేట్ చేసి, పబ్లిష్ చేయండి. మీరు తప్పనిసరిగా ఈ పెర్క్‌లను మీ మెంబర్‌లకు అందించాలి, కాబట్టి మీ మెంబర్‌లు సంతృప్తి చెందే స్థాయిలో మీరు పెర్క్‌లను డెలివర్ చేయగలరా, లేదో అనే దేనిని పరిగణించండి.

మీ పెర్క్‌లు మా పాలసీలు, నియమాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మీ క్రియేటర్ పెర్క్‌లకు సంబంధించి YouTube, ఎటువంటి బాధ్యత వహించదు.

మీ ఛానెల్ మెంబర్‌ల కోసం మీరు ఈ రకాల, మెంబర్‌లు మాత్రమే పొందగల పెర్క్‌లను చేర్చవచ్చు:

అనుకూల లేదా ఆటోమేటిక్ సెట్టింగ్ ఛానెల్ బ్యాడ్జ్‌లు
మెంబర్‌లు మాత్రమే పొందగల ప్రత్యేక బ్యాడ్జ్‌ల ద్వారా మెంబర్‌లు, లైవ్ చాట్‌లో, కామెంట్‌లలో, కమ్యూనిటీ ట్యాబ్‌లో ప్రత్యేకంగా కనిపించవచ్చు. 8 వేర్వేరు రకాల బ్యాడ్జ్‌లు ఉంటాయి, వీటిలో ప్రతి బ్యాడ్జ్ వ్యక్తి మీ ఛానెల్‌కు ఎంత కాలం నుండి యాక్టివ్ పెయిడ్ మెంబర్‌గా ఉన్నారో హైలైట్ చేస్తుంది. కాబట్టి, ఒక యాక్టివ్ మెంబర్ మీ ఛానెల్‌లో ఒక సంవత్సరం క్రితం చేరినప్పటికీ, 12 నెలల్లో 9 నెలల కోసం మాత్రమే పేమెంట్ చేసినట్లయితే, వారు 9 నెలల వరకే మెంబర్‌గా ఉన్నారని వారి బ్యాడ్జ్ సూచిస్తుంది.
ఒక్కో బ్యాడ్జ్‌కు ఒక్కో సమయ వ్యవధి అనుబంధించి ఉంటుంది:
  • కొత్తది
  • 1 నెల
  • 2 నెలలు
  • 6 నెలలు
  • 1 సంవత్సరం
  • 2 సంవత్సరాలు
  • 3 సంవత్సరాలు
  • 4 సంవత్సరాలు
  • 5 సంవత్సరాలు

మీరు ఆటోమేటిక్ సెట్టింగ్ YouTube బ్యాడ్జ్‌లను ఉపయోగించవచ్చు లేదా మీ ఛానెల్‌కు అనుకూల బ్యాడ్జ్‌లను అప్‌లోడ్ చేయవచ్చు. మీరు కొన్ని వ్యవధులకు అనుకూల బ్యాడ్జ్‌లను, కొన్నింటికి ఆటోమేటిక్ సెట్టింగ్ బ్యాడ్జ్‌లను, కలిపి కూడా ఉపయోగించవచ్చు.

గమనిక: లాయల్టీని బట్టి మెంబర్‌లందరూ ఒకే బ్యాడ్జ్‌ను అందుకుంటారు.

అనుకూల ఛానెల్ బ్యాడ్జ్‌లను అప్‌లోడ్ చేయడం

మీరు ఆటోమేటిక్ సెట్టింగ్ YouTube బ్యాడ్జ్‌లను ఉపయోగించవచ్చు లేదా మీ ఛానెల్‌కు అనుకూల బ్యాడ్జ్‌లను అప్‌లోడ్ చేయవచ్చు. మీరు కొన్ని వ్యవధులకు అనుకూల బ్యాడ్జ్‌లను, కొన్నింటికి ఆటోమేటిక్ సెట్టింగ్ బ్యాడ్జ్‌లను, కలిపి కూడా ఉపయోగించవచ్చు.

మీరు అనుకూల బ్యాడ్జ్‌లను అప్‌లోడ్ చేసినప్పుడు ప్రతి స్లాట్‌ను వేర్వేరు బ్యాడ్జ్‌లతో నింపాలి, కానీ మీరు అలా చేయకపోతే, ఖాళీగా ఉన్న స్లాట్‌లు, వీటితో నింపబడతాయి:

  • మీరు అత్యధిక సార్లు అప్‌లోడ్ చేసిన అనుకూల బ్యాడ్జ్, లేదా
  • ఆ వ్యవధికి అనుబంధించి ఉన్న ఆటోమేటిక్ సెట్టింగ్ YouTube బ్యాడ్జ్

మీ ఛానెల్ బ్యాడ్జ్‌లను అప్‌లోడ్ చేసి, అనుకూలంగా మార్చడానికి:

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. సంపాదించండి ఆ తర్వాత మెంబర్‌షిప్‌లు ఆ తర్వాత లాయల్టీ బ్యాడ్జ్‌లకు వెళ్లండి.

ఛానెల్ బ్యాడ్జ్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు

ఫైల్ ఫార్మాట్: JPEG, లేదా PNG ఫైల్స్.

ఫైల్ సైజ్: 1 MB కంటే తక్కువ ఉండాలి.

ఇమేజ్ డైమెన్షన్‌లు: కనీసం 32px x 32px ఉండాలి.

బ్యాడ్జ్‌లు కామెంట్‌లలో, కమ్యూనిటీ ట్యాబ్‌లో 14px x 14pxతో రెండర్ అవుతాయి. లైవ్ చాట్‌లో, బ్యాడ్జ్‌లు 16px x 16pxతో రెండర్ అవుతాయి.

మెంబర్‌లు మాత్రమే యాక్సెస్ చేయగల కమ్యూనిటీ పోస్ట్‌లు
కంటెంట్‌ను మీ ఛానెల్ మెంబర్‌లకు మాత్రమే షేర్ చేయడానికి మీరు కమ్యూనిటీ ట్యాబ్‌ను ఉపయోగించవచ్చు. మీ ఛానెల్‌లో స్థాయిలు ఉంటే, కమ్యూనిటీ పోస్ట్‌లను స్థాయిని బట్టి కూడా మెంబర్‌లకు షేర్ చేయవచ్చు.
మెంబర్‌లు మాత్రమే చూడగల కమ్యూనిటీ పోస్ట్‌లను క్రియేట్ చేయడానికి:
  1. మీ ప్రొఫైల్ ఫోటో ను క్లిక్ చేయండి.
  2. మీ ఛానెల్‌ను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. కమ్యూనిటీ ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. “విజిబిలిటీ” మెనూలో, పోస్ట్‌ను పబ్లిక్‌గా ఉంచాలో, మెంబర్‌లకు మాత్రమే కనిపించేలా ఉంచాలో లేదా నిర్దిష్ట స్థాయిలలో మెంబర్‌లకు కనిపించేలా ఉంచాలో ఎంచుకోండి. పబ్లిక్ అనేది ఆటోమేటిక్ సెట్టింగ్.
  5. మీ పోస్ట్ వివరాలను ఎంటర్ చేయండి.
  6. పోస్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మెంబర్‌లకు మాత్రమే అనుకూల ఎమోజీ
మీ వీడియోలు, లైవ్ చాట్‌లలోని కామెంట్‌లలో ప్రత్యేక ఎమోజీని ఉపయోగించే వీలును మీ ఛానెల్ మెంబర్‌లకు అనుకూల ఎమోజీ కల్పిస్తుంది.
ఆటోమేటిక్‌గా, అనుకూల ఎమోజీ ఏదీ లేదు, కాబట్టి మీరు స్వంత ఎమోజీని అప్‌లోడ్ చేయాలి. అనుకూల ఎమోజీని అప్‌లోడ్ చేయడానికి, మెంబర్‌షిప్‌ల పేజీకి వెళ్లి, “మీ బ్యాడ్జ్‌లు, ఎమోజి” కార్డ్‌లో ఎడిట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఎమోజీలను డిజైన్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
గమనిక: స్థాయి ఏదైనా సరే, మెంబర్‌లందరూ మీరు అప్‌లోడ్ చేసిన ఎమోజీకి యాక్సెస్ పొందుతారు.

ఫ్యామిలీ పేరు

మీ మొదటి ఎమోజీని అప్‌లోడ్ చేసినప్పుడు, మీ అన్ని ఎమోజీల కోసం, 'ఫ్యామిలీ పేరు' అని పిలువబడే ప్రిఫిక్స్ పేరును మీరు క్రియేట్ చేస్తారు. మీ ఛానెల్ మెంబర్‌లు ఈ పేరును ఉపయోగించి మీ ఎమోజీని ఆటో-కంప్లీట్ చేస్తారు. మీరు దీన్ని ఉపయోగించి కూడా మీ ఛానెల్ ఎమోజీలను ఆటో-కంప్లీట్ చేయవచ్చు :_ .

ఫ్యామిలీ పేర్లు YouTube అంతటా నిర్దిష్టంగా ఉండకూడదు, అలాగే తప్పనిసరిగా 3–10 అక్షరాలు ఉండాలి. ఫ్యామిలీ పేరును, మీ బ్రాండ్ మాదిరే ఇట్టే గుర్తుపట్టే విధంగా ఉండేలా ఎంచుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీసు అని మేము సిఫార్సు చేస్తున్నాం.

అనుకూల ఎమోజిని వీడియో కామెంట్‌లలో లేదా ఏవైనా లైవ్ చాట్‌లలో పంపవచ్చు.

ఎమోజి పేరు

మెంబర్‌లు లైవ్ చాట్‌లో ఆటో-కంప్లీట్ చేయడానికి ఉపయోగించగలిగేలా ప్రతి ఎమోజి పేరు ఉంటుంది. ఎమోజీ పేరును మార్ఛడానికి, మీరు తప్పనిసరిగా ఎమోజీని తొలగించి, తిరిగి అప్‌లోడ్ చేయాలి. ఎమోజీ పేర్లు తప్పనిసరిగా 3–10 అక్షరాల నిడివి ఉండి అక్షరాలను, సంఖ్యలను కలిగి ఉండాలి, అలాగే వాటి ఎమోజీ ఫ్యామిలీలో నిర్దిష్టంగా ఉండాలి (YouTube అంతటా నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం లేదు).

మీరు అప్‌లోడ్ చేయగల అనుకూల ఎమోజీల సంఖ్య

మీరు మెంబర్‌లను పొందే కొద్దీ, కొత్త అనుకూల ఎమోజీ కోసం మరిన్ని స్లాట్‌లను అన్‌లాక్ చేయవచ్చు. కొత్త స్లాట్‌లు అన్‌లాక్ చేయబడినప్పుడు మీకు తెలియజేయబడదు.
మెంబర్‌లలో # ఎమోజీలో #వది
0 4
2 5
5 6
10 7
15 8
20 9
30 10
40 11
50 12
75 13
100 14
125 15
150 16
175 17
200 18
225 19
250 20
300 21
350 22
400 23
450 24
500 25
600 26
700 27
800 28
900 29
1000 30
1200 31
1400 32
1600 33
1800 34
2000 35
2200 36
2400 37
2600 38
2800 39
3000 40
3200 41
3400 42
3600 43
3800 44
4000 45
4200 46
4400 47
4600 48
4800 49
5000+ 54

అనుకూల ఎమోజీ స్పెసిఫికేషన్‌లు

ఫైల్ ఫార్మాట్: JPEG, PNG, GIF ఫైల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • గమనిక: GIFలు స్టాటిక్ ఇమేజ్‌గా డిస్‌ప్లే చేయబడతాయి, యానిమేషన్‌లా డిస్‌ప్లే చేయబడవు.
ఫైల్ సైజ్: 1 MB కంటే తక్కువ ఉండాలి.
ఇమేజ్ డైమెన్షన్‌లు: 48px x 48px (ప్రాధాన్యత గల సైజ్) నుండి 480px x 480px వరకు ఉండాలి.

ఒక్కో పరికరంలో ఒక్కోలా

మొబైల్ పరికరాలలో, కంప్యూటర్ మానిటర్‌లలో ఎమోజి వివిధ సైజ్‌ల్లో చూపబడుతుంది. రెండు ప్లాట్‌ఫామ్‌లలో మీ ఎమోజి సరిగ్గా ఉందని నిర్ధారించుకోవడం ఎలాగో ఇక్కడ ఉంది:
మొబైల్ పరికరాలలో: ఎమోజి 24x24 పాయింట్‌లతో కనిపిస్తుంది. పరికరం యొక్క పిక్సెల్ సాంద్రతకు సరిపోయేలా ఇమేజ్ స్కేల్ చేయబడింది.
చాలా మానిటర్‌లలో: ఎమోజి 24x24 పాయింట్‌లతో కనిపిస్తుంది. రెటీనా, HiDPI పరికరాలలో, ఇమేజ్‌లు 48x48 పాయింట్‌లతో లేదా అంతకంటే ఎక్కువ పాయింట్‌లతో కనిపిస్తాయి.
మెంబర్‌లు ముందుగా చూడగల వీడియోలు
"మెంబర్‌లకు మాత్రమే నుండి పబ్లిక్” ఫీచర్‌తో, ఇతరులకు యాక్సెస్ అందుబాటులోకి రావడానికి ముందు, నిర్దిష్ట సమయం పాటు మీ ఛానెల్ మెంబర్‌లు మాత్రమే చూసేలా మీరు కంటెంట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. మీ ఛానెల్ మెంబర్‌లకు మీ కంటెంట్‌కు ముందస్తు యాక్సెస్ ఇవ్వడం వలన మీ కంటెంట్ పబ్లిక్‌గా అందుబాటులోకి రావడానికి ముందే వారు దానిని చూడవచ్చు, దానితో ఎంగేజ్ కావచ్చు.
మీరు కంటెంట్‌ను "మెంబర్‌లకు మాత్రమే నుండి పబ్లిక్”‌గా అప్‌లోడ్ చేసినప్పుడు, మీ కంటెంట్ ముందుగా ఛానెల్ మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని మేము వారికి తెలియజేస్తాము. తర్వాత, వీడియో పబ్లిక్‌కు మారినప్పుడు, మీ సబ్‌స్క్రయిబర్‌లందరూ ఆ విషయం గురించి నోటిఫికేషన్‌ను పొందుతారు.
సగటున, క్రియేటర్‌లు మెంబర్‌లకు ముందుగా వీడియోలకు యాక్సెస్ ఇచ్చినప్పుడు, ఆ వీడియోల పనితీరు, వాటిని పబ్లిక్‌కు సెట్ చేసినప్పుడు ఉన్నట్లుగానే ఉంది, అలాగే అవి పబ్లిక్‌కు మారినప్పుడు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని మేము గమనించాము.
  • జనవరి నుండి ఫిబ్రవరి 2023 మధ్య కనీసం ఒక ముందస్తు యాక్సెస్ వీడియో, ఒక పబ్లిక్-మాత్రమే వీడియోను పబ్లిష్ చేసిన ఛానెల్స్‌లో.

కొత్త అప్‌లోడ్‌ను "మెంబర్‌లకు మాత్రమే నుండి పబ్లిక్”‌గా సెట్ చేయడం

  1. వీడియోను అప్‌లోడ్ చేయండి.
  2. విజిబిలిటీ కోసం, మెంబర్‌లకు-మాత్రమే నుండి పబ్లిక్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీరు ఒకటి కంటే ఎక్కువ స్థాయిలను కలిగి ఉన్నట్లయితే, మీ వీడియో ఎవరికి కనిపించాలనుకుంటున్నారో ఆ స్థాయిలను ఎంచుకోండి.
  1. వీడియో పబ్లిక్‌కు మారాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకోండి.

మీ 'మెంబర్‌లకు-మాత్రమే' వీడియోను ప్రమోట్ చేయండి

'మెంబర్‌లకు-మాత్రమే' వీడియోలు మొదటి ట్యాబ్‌లో, సబ్‌స్క్రిప్షన్‌ల ఫీడ్‌లలో కనిపిస్తాయి. మెంబర్‌లు మీ ఛానెల్ పేజీ కంటెంట్‌లో, కమ్యూనిటీ ట్యాబ్‌లలో కూడా వీడియోలను కనుగొనగలరు. ఏదయినా వీడియో అందుబాటులో ఉందని మీ వీక్షకులందరికీ తెలియజేయడానికి, మీరు URLను పబ్లిక్‌గా వీటిలో షేర్ చేయవచ్చు:

  • కార్డ్‌లు
  • పబ్లిక్ కమ్యూనిటీ
  • ప్లేలిస్ట్‌లు

మీ మెంబర్‌లు వారి సరైన స్థాయి(ల)లో ఉంటే, సదరు మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోను తక్షణమే చూడవచ్చు. మెంబర్‌లు కాని వారికి ఇది 'మెంబర్‌లకు-మాత్రమే' అందుబాటులో ఉంది అని తెలియజేసే గమనిక కనిపిస్తుంది, అలాగే మెంబర్‌లుగా మారడానికి ఉన్న మార్గాలు చూపించబడతాయి.

మెంబర్‌లు మాత్రమే యాక్సెస్ చేయగల లైవ్ చాట్
పబ్లిక్ లైవ్ స్ట్రీమ్‌లు జరిగేటప్పుడు, మీరు, మెంబర్‌లు మాత్రమే యాక్సెస్ చేసేలా చాట్‌ను సెట్ చేయవచ్చు. అందరూ ఇప్పటికీ లైవ్ స్ట్రీమ్‌ను చూడవచ్చు, కానీ మెంబర్‌లు మాత్రమే చాట్‌లను పోస్ట్ చేయగలరు. మెంబర్‌లు మాత్రమే యాక్సెస్ చేయగల లైవ్ చాట్‌ను ఆన్ చేయడానికి:
  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. క్రియేట్ చేయండి ని క్లిక్ చేయండి.
  3. లైవ్‌ను ప్రారంభించండి ని ఎంచుకోండి.
  4. ఎడమ వైపున స్ట్రీమ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. స్ట్రీమ్‌ను క్రియేట్ చేయండి:
    1. మునుపటి స్ట్రీమ్‌ను కాపీ చేయడానికి: మునుపటి స్ట్రీమ్‌ను ఎంచుకొని, సెట్టింగ్‌లను మళ్లీ ఉపయోగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    2. కొత్త స్ట్రీమ్‌ను క్రియేట్ చేయడానికి: మీ కొత్త స్ట్రీమ్ సమాచారాన్ని ఎంటర్ చేసి, స్ట్రీమ్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  7. "లైవ్ చాట్" కింద, మెంబర్‌లు మాత్రమే యాక్సెస్ చేయగల చాట్‌ను ఎనేబుల్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  8. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మెంబర్‌లు మాత్రమే చూడగల లైవ్ స్ట్రీమ్‌లు

మీరు లైవ్ స్ట్రీమ్‌లను ప్రత్యేకంగా మీ ఛానెల్ మెంబర్‌లకు మాత్రమే చూసేలా షేర్ చేయవచ్చు.

కంప్యూటర్ నుండి:

  1. కంప్యూటర్‌లో, YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. క్రియేట్ చేయండి ని క్లిక్ చేయండి.
  3. లైవ్ స్ట్రీమ్ ప్రారంభించండి ని క్లిక్ చేయండి.
  4. లైవ్ స్ట్రీమ్‌ను క్రియేట్ చేయడానికి, సంబంధిత దశలను ఫాలో అవ్వండి.
  5. విజిబిలిటీ సెట్టింగ్‌లలో, ఏ ఛానెల్ మెంబర్‌లు లైవ్ స్ట్రీమ్‌ను చూడవచ్చు అనే దానిని మీరు ఎంచుకోవచ్చు:
    • లైవ్ స్ట్రీమ్‌ను చూడటానికి మెంబర్‌లందరినీ అనుమతించడానికి, “పెయిడ్ మెంబర్‌లందరూ” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • లైవ్ స్ట్రీమ్‌ను చూడటానికి నిర్దిష్ట స్థాయిలను మాత్రమే అనుమతించడానికి, చూడటానికి అనుమతించాల్సిన స్థాయి (అంతకంటే పై స్థాయిల)ను ఎంచుకోండి.
  6. లైవ్ స్ట్రీమ్‌కు లింక్ చేసే, మెంబర్‌లు మాత్రమే చూడగల కమ్యూనిటీ పోస్ట్‌ను క్రియేట్ చేయడానికి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. మీ మెంబర్‌లు, నోటిఫికేషన్‌లను ఆన్ చేసుకుని ఉంటే, మీరు మెంబర్‌లలు మాత్రమే చూడగల కొత్తగా లైవ్ స్ట్రీమ్‌ను క్రియేట్ చేసినప్పుడు, వారికి ఆ విషయం తెలియజేయబడుతుంది.

మొబైల్ పరికరం నుండి:

  1. మీ మొబైల్ పరికరంలో, YouTube యాప్‌ను తెరవండి.
  2. దిగువున ఉన్న, క్రియేట్ చేయండి ని ట్యాప్ చేయండి.
  3. లైవ్‌ను ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మరిన్ని ఆప్షన్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మరిన్నింటిని చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. విజిబిలిటీ సెట్టింగ్‌లలో, మెంబర్‌లకు మాత్రమే అనే ఆప్షన్‌ను ఎంచుకుని, మీ లైవ్ స్ట్రీమ్‌ను ఏ ఛానెల్ మెంబర్‌లు చూడవచ్చో ఎంచుకోండి:
    • లైవ్ స్ట్రీమ్‌ను చూడటానికి మెంబర్‌లందరినీ అనుమతించడానికి, “పెయిడ్ మెంబర్‌లందరూ” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • లైవ్ స్ట్రీమ్‌ను చూడటానికి నిర్దిష్ట స్థాయిలను మాత్రమే అనుమతించడానికి, చూడటానికి అనుమతించాల్సిన స్థాయి (అంతకంటే పై స్థాయిల)ను ఎంచుకోండి.
  7.  తర్వాత అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  8. లైవ్‌ను ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మెంబర్ మైల్‌స్టోన్ చాట్‌లు
మెంబర్ విశ్వసనీయతను గుర్తించి, వేడుక చేసుకోవడానికి, ఛానెల్ మెంబర్‌లు ప్రత్యేకంగా హైలైట్ చేసిన ఒక మెసేజ్‌ను నెలకు ఒకటి చొప్పున లైవ్ చాట్‌లో పంపవచ్చు. వరుసగా కనీసం రెండు నెలల నుండి మెంబర్‌గా కొనసాగుతున్న వారు మాత్రమే మైల్‌స్టోన్ చాట్‌లు పొందుతారు. మెంబర్‌లు లైవ్ స్ట్రీమ్‌లు లేదా ప్రీమియర్‌లు జరుగుతున్నప్పుడు మాత్రమే మైల్‌స్టోన్ చాట్‌లను పంపగలరు. మైల్‌స్టోన్ చాట్‌లను మెంబర్‌లు మాత్రమే పంపగలరు, కానీ వాటిని అందరూ చూడగలరు.
మీ ఛానెల్‌కు ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది. మీ మెంబర్‌లు మైల్‌స్టోన్ చాట్‌లను పొందకూడదని మీరు భావిస్తే, ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయవచ్చు. మెంబర్ మైల్‌స్టోన్ చాట్‌లను ఆఫ్ చేయడానికి:
  1. YouTube Studio ఆ తర్వాత సంపాదించండికి సైన్ ఇన్ చేయండి.
  2. మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకొని ఆ తర్వాతమెంబర్ మైల్‌స్టోన్ చాట్‌ను’ ‘ఆఫ్‌నకు’ సెట్ చేయండి.
గమనిక: అర్హత ఉన్న మెంబర్‌లందరూ మెంబర్ మైల్‌స్టోన్ చాట్‌లను ఉపయోగించగలరు కాబట్టి, ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత, మీరు లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు మొదట్లో కొన్ని సార్లు అధిక వినియోగాన్ని గమనించవచ్చు. ప్రతి మెంబర్ నెలకు ఒకసారి మెంబర్ మైల్‌స్టోన్ చాట్‌ను రిడీమ్ చేయగలరు కాబట్టి, కాలక్రమేణా వినియోగ రేటు అనుకూలంగా మారవచ్చు.
మెంబర్ గుర్తింపు షెల్ఫ్

మీ ఛానెల్ మెంబర్‌లను పబ్లిక్‌గా గుర్తించి, ధన్యవాదాలు తెలియజేయడానికి, మీ ఛానెల్ పేజీ పైన ఉన్న షెల్ఫ్‌లో వారి అవతార్‌లను ఫీచర్ చేయండి. ఈ షెల్ఫ్ ద్వారా మీ ఛానెల్ మెంబర్‌లకు మీరు పబ్లిక్‌గా ధన్యవాదాలు తెలియజేసి, వారిని మీరు ఎంత అభినందిస్తున్నారో ఇతరులకు చూపవచ్చు. ఫీచర్ అయ్యే మెంబర్‌లు ర్యాండమ్‌గా ఎంపిక చేయబడతారు, మరింత మంది మెంబర్‌లకు గుర్తింపునిచ్చి అవకాశం ఇవ్వడానికి వారిని తరచుగా మార్చడం జరుగుతుంది. మీ ఛానెల్ పేజీని చూసే మెంబర్‌లకు ఎల్లప్పుడూ షెల్ఫ్‌లో వారి స్వంత అవతార్ కనిపిస్తుంది. ఎవరైనా మెంబర్ ఒకవేళ వారి మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకుంటే, వారు ఇకపై షెల్ఫ్‌లో ఫీచర్ అవ్వరు.

మీ ఛానెల్‌లో 8 లేదా అంత కంటే ఎక్కువ మంది మెంబర్‌లు ఉన్నప్పుడు, ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. మెంబర్ గుర్తింపు షెల్ఫ్ కనిపించకూడదని మీరు అనుకుంటే, ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయవచ్చు. మెంబర్ గుర్తింపు షెల్ఫ్‌ను ఆఫ్ చేయడానికి:

మెంబర్ గుర్తింపు షెల్ఫ్‌ను ఆఫ్ చేయడానికి:

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2.  సంపాదించండి ఆ తర్వాత మెంబర్‌షిప్‌లకు వెళ్లండి.
  3. “మెంబర్ గుర్తింపు షెల్ఫ్‌ను” ఆఫ్‌నకు మార్చండి.
మెంబర్‌లు మాత్రమే చూడగల Shorts
మెంబర్‌లు మాత్రమే చూడగల Shorts అనేవి మీ మెంబర్‌లకు రెగ్యులర్, లైట్ వెయిట్ కంటెంట్‌ను అందించేందుకు ఒక గొప్ప మార్గం. తెర వెనుక సీన్లు, రాబోయే వీడియోల క్లిప్‌లు, సంక్షిప్త ప్రశ్నోత్తరాల వంటి వాటితో పాటు ఇంకా మరిన్నింటిని మీరు షేర్ చేయవచ్చు. ఈ షార్ట్‌లను మెంబర్‌లు మాత్రమే చూడగలరు కాబట్టి, మీ పబ్లిక్ కంటెంట్‌తో పోలిస్తే మరింత సాధారణమైన లేదా సహజమైన/ఆర్గానిక్ Shortsతో ప్రయోగాలు చేయవచ్చు.

కొత్త అప్‌లోడ్‌ను మెంబర్‌లు మాత్రమే చూడగలిగేలా సెట్ చేయండి

  1. షార్ట్-వీడియో ఫైల్‌ను ఎంచుకోండి:
  • 60 సెకన్ల వరకు.
  • చతురస్ర లేదా వర్టికల్ ఆకార నిష్పత్తితో.
  1. విజిబిలిటీ కోసం, మెంబర్‌లకు మాత్రమే అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. మిగతా అప్‌లోడ్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

ఇప్పటికే ఉన్న షార్ట్‌ను 'మెంబర్‌లకు-మాత్రమే' అని సెట్ చేయండి

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు వెళ్లండి లేదా YouTube Studio మొబైల్ యాప్ ను తెరవండి.
  2. కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు 'మెంబర్‌లకు మాత్రమే' అని సెట్ చేయాలనుకుంటున్న షార్ట్‌ను కనుగొనండి.
  4. ఎడిట్ ఆ తర్వాత విజిబిలిటీ ఆ తర్వాతని ఎంచుకోండి మెంబర్‌లకు మాత్రమే ఆ తర్వాత సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
గమనిక: మీరు షార్ట్‌ను ఒక ఫ్లోలో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తే, దాన్ని 'మెంబర్‌లకు మాత్రమే' అని సెట్ చేసే ఆప్షన్ మీకు కనిపించకపోవచ్చు. మీరు ఇప్పటికీ మీ షార్ట్‌ను అన్‌లిస్టెడ్‌గా అప్‌లోడ్ చేసి, తర్వాత విజిబిలిటీ సెట్టింగ్‌ను 'మెంబర్‌లకు మాత్రమే'కు మార్చవచ్చు.

మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోల లాగా మెంబర్‌లు మాత్రమే చూడగల Shorts తప్పనిసరిగా పూర్తి ఒరిజినల్ కంటెంట్‌ను కలిగి ఉండాలి, Shorts మ్యూజిక్ లైబ్రరీలోని మ్యూజిక్‌తో పాటు థర్డ్-పార్టీలకు చెందిన మ్యూజిక్‌ను కలిగి ఉండకూడదు.

Shorts, మొదటి ట్యాబ్‌లోని ఫీడ్‌లలో, అలాగే సిఫార్సు చేయబడిన వీడియోలలో మీ మెంబర్‌లు, మెంబర్‌లు మాత్రమే చూడగల Shortsను కనుగొనవచ్చు. మెంబర్‌లు మాత్రమే చూడగల Shorts మీ ఛానెల్ మెంబర్‌లకు నోటిఫికేషన్‌ను ట్రిగ్గర్ చేయవు.

మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోలు
మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోల ఫీచర్, వీడియోలను మీ ఛానెల్ మెంబర్‌లు మాత్రమే చూడగలిగేలా అప్‌లోడ్ చేసే వీలును మీకు కల్పిస్తుంది. ఇప్పటికే ఉన్న వీడియోలు, ప్రత్యేకించి మీ మెంబర్‌ల కోసం ఉండేలా, వాటి విజిబిలిటీ సెట్టింగ్‌లను కూడా మీరు మార్చవచ్చు. మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోను ఎవరైనా కనుగొనగలరు, కానీ సరైన స్థాయిలలో ఉన్న మెంబర్‌లు మాత్రమే దాన్ని చూడగలరు.
మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోలు పూర్తిగా ఒరిజినల్ కంటెంట్‌ను కలిగి ఉండాలి. మ్యూజిక్ పార్ట్‌నర్‌లు క్లెయిమ్ చేసిన వీడియోలతో సహా కాపీరైట్ క్లెయిమ్‌లు ఉన్న వీడియోలను చేర్చకండి.

కొత్త అప్‌లోడ్‌ను మెంబర్‌లు మాత్రమే చూడగలిగేలా సెట్ చేయండి

  1. వీడియోను అప్‌లోడ్ చేయండి.
  2. విజిబిలిటీ కోసం, 'మెంబర్‌లకు మాత్రమే' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ ఛానెల్‌లో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలు ఉంటే, మీ వీడియోను ఏ స్థాయి వారు చూడవచ్చు అనే దానిని ఎంచుకోండి.
  1. మిగతా అప్‌లోడ్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

ఇప్పటికే ఉన్న వీడియోను 'మెంబర్‌లకు-మాత్రమే' అని సెట్ చేయండి

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు వెళ్లండి లేదా YouTube Studio మొబైల్ యాప్ ను తెరవండి.
  2. కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు 'మెంబర్‌లకు-మాత్రమే' అని సెట్ చేయాలనుకుంటున్న వీడియోను కనుగొనండి.
  4. ఎడిట్ ఆ తర్వాత విజిబిలిటీ ఆ తర్వాతని ఎంచుకోండి మెంబర్‌లకు మాత్రమే ఆ తర్వాత సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ ఛానెల్‌లో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలు ఉంటే, మీ వీడియోను ఏ స్థాయి వారు చూడవచ్చు అనే దానిని ఎంచుకోండి.

మెంబర్‌లు మాత్రమే చూడగల మీ వీడియోలను ప్రమోట్ చేయడం

మెంబర్‌షిప్‌లు, కంటెంట్, కమ్యూనిటీ ట్యాబ్‌లలో మీ మెంబర్‌లకు, మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోలు కనిపిస్తాయి. ఈ వీడియోలు మెంబర్‌ల మొదటి ట్యాబ్‌లో, సబ్‌స్క్రిప్షన్‌ల ఫీడ్‌లలో కూడా కనిపించవచ్చు.

మెంబర్‌లు కాని వీక్షకులకు మీ కంటెంట్ సిఫార్సు చేయబడినప్పుడు, వారి మొదటి ట్యాబ్‌లోని ఫీడ్‌లో "మెంబర్‌లకు మాత్రమే" వీడియోలు కూడా కనిపించవచ్చు. మెంబర్‌లు కాని వారికి "మెంబర్లకు మాత్రమే" వీడియోలు కనిపిస్తే, సదరు మెంబర్‌లు, ఛానెల్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌లపై ఆసక్తి చూపవచ్చు, తద్వారా మెంబర్‌షిప్ తీసుకోవడానికి సైన్-అప్ చేసే అవకాశం ఉంటుంది. మెంబర్‌లు కాని వారు, వీడియో థంబ్‌నెయిల్‌ను, టైటిల్‌ను చూడగలరు తప్ప మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోలను చూడలేరు, అలా చూడాలంటే వారు సైన్-అప్ చేయాల్సి ఉంటుంది.

ఏదయినా వీడియో అందుబాటులో ఉందని మీ వీక్షకులకు తెలియజేయడానికి, మీరు URLను పబ్లిక్‌గా వీటిలో షేర్ చేయవచ్చు:

  • కార్డ్‌లు
  • పబ్లిక్ కమ్యూనిటీ
  • ప్లేలిస్ట్‌లు

సరైన స్థాయిలలో ఉన్న ఛానెల్ మెంబర్‌లు, మెంబర్‌లు మాత్రమే చూడగల వీడియోను తక్షణమే చూడవచ్చు. మెంబర్‌లు కాని వారు, వీడియో మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది అనే నోట్‌ను పొందుతారు, మెంబర్ కావడానికి గల మార్గాలు వారికి చూపబడతాయి.

మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో గల కంటెంట్: వీడియోలు, Shorts, లైవ్ స్ట్రీమ్‌లు, ఛానెల్ మెంబర్‌షిప్‌లకు సంబంధించిన పోస్ట్‌లు 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2530165949091494886
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false