YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను సెటప్ చేయండి

మీ కుటుంబంలో గరిష్ఠంగా మరో 5 మంది మెంబర్‌లతో YouTube పెయిడ్ మెంబర్‌షిప్, లేదా Primetime ఛానెల్స్‌ను (US, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, UKలో మాత్రమే) షేర్ చేయడానికి YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను పొందండి.

YouTube, YouTube TVలో ఫ్యామిలీ గ్రూప్‌లను క్రియేట్ చేయడం ఎలా

ఫ్యామిలీ ప్లాన్ ఏ విధంగా పని చేస్తుంది

ఒకే రెసిడెన్షియల్ అడ్రస్‌లో నివసించే, గరిష్ఠంగా 5 మంది ఫ్యామిలీ మెంబర్‌లతో మెంబర్‌షిప్ ప్రయోజనాలను షేర్ చేసే వీలును YouTube ఫ్యామిలీ ప్లాన్‌లు మీకు కల్పిస్తాయి.

  • ఫ్యామిలీ మేనేజర్:
    • ప్రధాన ఖాతాదారుగా వ్యవహరిస్తారు.
    • Google ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేస్తారు, అలాగే గ్రూప్‌లోకి ఫ్యామిలీ మెంబర్‌లను ఆహ్వానించగలరు.
  • ఫ్యామిలీ మెంబర్‌లు:
    • షేర్ చేసిన మెంబర్‌షిప్‌ను యాక్సెస్ చేయడానికి, తమ సొంత Google ఖాతాను ఉపయోగిస్తారు.
    • ఫ్యామిలీ మేనేజర్ కొనుగోలు చేసిన Primetime ఛానెళ్ల కంటెంట్‌ను చూడగలరు. మెంబర్‌లు విడిగా తమ సొంత Primetime ఛానెల్‌ను కూడా కొనుగోలు చేసుకోవచ్చు, ఇది ఫ్యామిలీ మేనేజర్‌తో షేర్ చేయబడదు.
    • తమ సొంత వ్యక్తిగత లైబ్రరీని, సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉండవచ్చు, వ్యక్తిగత సిఫార్సులను కూడా అందుకుంటారు – మెంబర్ల వీక్షణ ప్రాధాన్యతలను, లేదా వీక్షణ హిస్టరీని మేము ఫ్యామిలీ మెంబర్ ఖాతాలతో షేర్ చేయము.
    • 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉండే ఫ్యామిలీ మెంబర్‌లకు వయోపరిమితులు వర్తిస్తాయి.
  • ఫ్యామిలీ గ్రూప్‌లలో వీటికి యాక్సెస్ షేర్ చేయబడుతుంది :
గమనిక: ప్రస్తుతం బెలారస్, ఐస్‌లాండ్, ఇజ్రాయిల్, స్లోవేనియా, దక్షిణ కొరియా, వెనిజువెలాలో ఫ్యామిలీ ప్లాన్‌లు అందుబాటులో లేవు.

YouTube Premiumలో ఫ్యామిలీ ప్లాన్‌లు

యాడ్స్-లేకుండా చూడటం, ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ ప్లేతో పాటు YouTube Premium ఫ్యామిలీ ప్లాన్ యొక్క అన్ని ప్రయోజనాలను పొందడానికి, ఫ్యామిలీ ప్లాన్ మెంబర్‌షిప్‌ను ఎంచుకోవడానికి ఇక్కడ‌కు వెళ్లండి.

YouTube Music Premiumలో ఫ్యామిలీ ప్లాన్‌లు

యాడ్స్-లేకుండా వినడం, ఆఫ్‌లైన్‌లో ప్లే చేయడం, స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నా కూడా ఆడియోను ప్లే చేయడంతో పాటు YouTube Music Premium యొక్క అన్ని ప్రయోజనాలను పొందడానికి, ఫ్యామిలీ ప్లాన్ మెంబర్‌షిప్‌ను ఎంచుకునేందుకు ఇక్కడ‌కు వెళ్లండి.

YouTube TVలో ఫ్యామిలీ ప్లాన్‌లు

మీరు YouTube TV మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేస్తే, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్ఠంగా 5 మంది వ్యక్తులతో మీ మెంబర్‌షిప్‌ను షేర్ చేయడానికి మీరు ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయవచ్చు. మీరు ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు, ఫ్యామిలీ మేనేజర్ అవుతారు.
ఒక ఫ్యామిలీ మేనేజర్‌గా, మీరు ఒక్కరు మాత్రమే YouTube TVలో కొనుగోలు చేయగలరు, అలాగే మెంబర్‌షిప్ నిర్ణయాలను తీసుకోగలరు. మీరు అదనపు సబ్‌స్క్రిప్షన్‌లను, ప్యాకేజీలను కొనుగోలు చేసినట్లయితే, ఫ్యామిలీ మెంబర్‌లు తమ ఖాతాల నుండి ఈ యాడ్-ఆన్‌లను చూడగలరు.
మీరు ఇంటి లొకేషన్‌ను కూడా సెట్ చేసి, మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి ఫ్యామిలీ మెంబర్‌లను ఆహ్వానించగలరు లేదా తీసివేయగలరు. 
ఫ్యామిలీ గ్రూప్‌ను సైన్ అప్ చేయడానికి, క్రియేట్ చేయడానికి:
  1. YouTube TVకి సైన్ ఇన్ చేయండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత సెట్టింగ్‌లు  ఆ తర్వాత ఫ్యామిలీ షేరింగ్ ను ఎంచుకోండి.
  3. సెటప్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. Google ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయండి.
  5. YouTube పేమెంట్ సర్వీస్ నియమాల‌ను, Google గోప్యతా పాలసీ‌ని అంగీకరించండి.
  6. రద్దు చేయండి లేదా తర్వాత అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  7. గ్రూప్‌లో చేరడానికి మీ ఫ్యామిలీ మెంబర్‌లకు ఒక ఈమెయిల్ ఆహ్వానం వస్తుంది, అలాగే లాగిన్ అవ్వడానికి వారి Google ఖాతాలను ఉపయోగించవచ్చు.

YouTube Primetime ఛానెళ్లలో ఫ్యామిలీ ప్లాన్‌లు

మీరు ఫ్యామిలీ ప్లాన్‌ను సెటప్ చేసినట్లయితే, ఆహ్వానం పొందిన ఫ్యామిలీ మెంబర్‌లందరితో ఆటోమేటిక్‌గా Primetime ఛానెల్స్‌కు యాక్సెస్ షేర్ చేయబడుతుంది.

ఫ్యామిలీ గ్రూప్‌నకు కావాల్సిన అర్హతలు

ముఖ్య గమనిక: మీరు Google Workspace ఖాతాను ఉపయోగించి ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రారంభించలేరు లేదా అందులో చేరలేరు. ఫ్యామిలీ ప్లాన్‌కు సైన్ అప్ చేయడానికి, మీ సాధారణ Google ఖాతాను క్రియేట్ చేయండి లేదా దానికి సైన్ ఇన్ చేయండి.

ఫ్యామిలీ మేనేజర్ కావడానికి కావాల్సిన అర్హతలు

ఒక ఫ్యామిలీ మేనేజర్‌గా, కేవలం మీరు మాత్రమే, ఫ్యామిలీ గ్రూప్ కోసం, YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను కొనుగోలు చేయగలరు, లేదా మెంబర్‌షిప్ నిర్ణయాలను తీసుకోగలరు. మీరు కుటుంబ లొకేషన్‌ను సెట్ చేసి, ఫ్యామిలీ మెంబర్‌లను ఆహ్వానించగలరు లేదా వారిని తీసివేయగలరు.

మీ YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను మీ ఫ్యామిలీ గ్రూప్‌తో షేర్ చేయడానికి మీకు తప్పనిసరిగా ఉండాల్సిన అర్హతలు:

  • మీరు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి (లేదా మీ భౌగోళిక ప్రాంతంలో నిర్దేశించినంత వయస్సు ఉండాలి).
  • Google ఖాతాను కలిగి ఉండాలి. మీరు Google Workspace ఖాతాను కలిగి ఉంటే, మీరు సాధారణ Google ఖాతాను క్రియేట్ చేయాల్సి ఉంటుంది లేదా దానికి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.
  • YouTube Premium, YouTube Music Premium, లేదా Primetime ఛానెళ్లు అందుబాటులో ఉండే దేశంలో నివసిస్తూ ఉండాలి.
    • గమనిక:
      • ఫ్యామిలీ ప్లాన్‌లు కొరియాలో అందుబాటులో లేవు.
      • యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాత్రమే Primetime ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి.
  • వారు వేరొక ఫ్యామిలీ గ్రూప్‌లో మెంబర్ అయ్యి ఉండకూడదు.
  • గత 12 నెలల్లో ఒక ఫ్యామిలీ గ్రూప్ నుండి మరొక దానికి మారి ఉండకూడదు.

ఫ్యామిలీ మెంబర్‌కు ఉండాల్సిన అర్హతలు

ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి ఫ్యామిలీ మేనేజర్, గరిష్ఠంగా 5 మంది దాకా మెంబర్లను ఆహ్వానించవచ్చు. YouTube ఫ్యామిలీ ప్లాన్ ద్వారా ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి మీకు ఉండాల్సినవి:

  • Google ఖాతాను కలిగి ఉండాలి. మీరు Google Workspace ఖాతాను కలిగి ఉంటే, మీరు సాధారణ Google ఖాతాను క్రియేట్ చేయాల్సి ఉంటుంది లేదా దానికి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.
  • ఫ్యామిలీ మేనేజర్ నివసిస్తున్న అదే రెసిడెన్షియల్ అడ్రస్‌లో నివసిస్తూ ఉండాలి.
  • YouTube Premium, YouTube Music Premium, లేదా Primetime ఛానెళ్లు అందుబాటులో ఉన్న దేశం లేదా ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి.
  • వారు వేరొక ఫ్యామిలీ గ్రూప్‌లో మెంబర్ అయ్యి ఉండకూడదు.
  • గత 12 నెలల్లో ఒక ఫ్యామిలీ గ్రూప్ నుండి మరొక దానికి మారి ఉండకూడదు.
చిట్కా: మీ YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను ఎలా సెటప్ చేయాలో, మేనేజ్ చేయాలో తెలుసుకోండి. మీ ఫ్యామిలీ ప్లాన్‌కు సంబంధించి మీకు సహాయం అవసరమైతే, మీరు ఏ సమయంలో అయినా సపోర్ట్‌ను సంప్రదించవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7799708295396773323
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false