లైవ్ చాట్ కోసం YouTube సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్ మేనేజ్ చేయండి

సూపర్ చాట్, అలాగే సూపర్ స్టిక్కర్స్, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ద్వారా మీ ఛానెల్‌ను మానిటైజ్ చేసుకొనే అవకాశాన్ని మీకు ఇస్తాయి. ఈ ఫీచర్‌లు, ఇతర మెసేజ్‌ల మాదిరిగా కాకుండా భిన్నంగా, ప్రత్యేకంగా కనబడే లైవ్ చాట్ మెసేజ్‌లను కొనే వీలును మీ వీక్షకులకు కల్పిస్తాయి, అప్పుడప్పుడూ వీటిని లైవ్ చాట్ ఫీడ్‌కు ఎగువున పిన్ చేసే వీలు కూడా లభిస్తుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేయడం ఎలా అనే దాని గురించి, అలాగే అర్హత గురించి మరింత తెలుసుకోండి.
గమనిక: ఈ ఫీచర్ YouTubeలోని యాక్సెస్ పర్యవేక్షణ మోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. మరింత తెలుసుకోండి.

కొనుగోలు చేసిన సూపర్ చాట్‌లను, సూపర్ స్టిక్కర్స్‌ను చూడండి

సూపర్ చాట్‌లు, సూపర్ స్టిక్కర్స్ మీ లైవ్ చాట్ ఫీడ్‌లో రంగులతో ఉన్న చాట్ మెసేజ్‌లుగా, యానిమేటెడ్ ఇమేజ్‌లుగా కనిపిస్తాయి. వీక్షకులు సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్‌ను కొనుగోలు చేసినప్పుడు, వారి ప్రొఫైల్ ఫోటో లైవ్ చాట్ ఫీడ్‌లో పైన కనిపిస్తుంది. అది ఎంత సమయం పాటు కనిపిస్తుంది అనేది వారి కొనుగోలు మొత్తంపై ఆధారపడి ఉంటుంది. వీక్షకులు ఎంత ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తే, అంత ఎక్కువ సమయం పాటు చాట్ ఫీడ్‌లో పైన సూపర్ చాట్‌లు లేదా సూపర్ స్టిక్కర్స్ ఉంటాయి. 

లైవ్ స్ట్రీమ్ జరిగేటప్పుడు చేసిన కొనుగోళ్లను చూడండి

మీ లైవ్ చాట్ ఫీడ్‌లో సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్ యాక్టివిటీని చూడటానికి లైవ్ కంట్రోల్ పేజీ, YouTube మొబైల్ యాప్, లేదా YouTube వెబ్‌సైట్‌ను ఉపయోగించండి.

  1. సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్ కొనుగోళ్లను మాత్రమే చూడటానికి మీ లైవ్ చాట్ ఫీడ్‌ను ఫిల్టర్ చేయడానికి:
    1. కంప్యూటర్‌లో, Chat ఫిల్టర్ ఆ తర్వాత ఫ్యాన్ ఫండింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    2. YouTube మొబైల్ యాప్‌లో, సెట్టింగ్‌లు ఆ తర్వాతChat ఫిల్టర్ ఆ తర్వాత ఫ్యాన్ ఫండింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

2. మీ లైవ్ చాట్ ఫీడ్‌లో మెసేజ్‌లన్నింటినీ మళ్లీ చూడటానికి, Chat ఫిల్టర్ ఆ తర్వాత అన్ని మెసేజ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

గమనిక: మీ లైవ్ చాట్ ఫీడ్‌ను ఫిల్టర్ చేయడం వలన క్రియేటర్‌గా మీ వీక్షణపై మాత్రమే ప్రభావం చూపుతుంది. వీక్షకులు ఇప్పటికీ పాల్గొంటారు, సాధారణ లైవ్ చాట్‌లను ఫాలో అవుతారు.

అన్ని కొనుగోళ్లను చూడండి

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండిని ఎంచుకోండి.
  3. Supers ట్యాబ్‌ను ఎంచుకోండి.
  4. కొత్త కొనుగోళ్లు “మీ సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్ యాక్టివిటీ” కార్డ్‌లో డిస్‌ప్లే చేయబడతాయి. అందుబాటులో ఉన్న లావాదేవీ సమాచారం మొత్తాన్ని మీరు చూడాలనుకుంటే, అన్నింటిని చూడండిని క్లిక్ చేయండి.

సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వండి

మీ లైవ్ స్ట్రీమ్ సమయంలో సూపర్ చాట్‌లు, సూపర్ స్టిక్కర్‌లతో ఇంటరాక్ట్ అవ్వడం మీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గొప్ప మార్గం. మీరు వీటిని చేయవచ్చు:

  • లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు కేకలు వేయడంతో కొనుగోలుదారులను మౌఖికంగా గుర్తించండి లేదా అభినందనలు చెప్పండి.
  • అబినందనలు తెలియజేయడానికి సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్‌కు హృదయాకారం  ఇవ్వండి: మీ లైవ్ చాట్ ఫీడ్‌లో సూపర్ చాట్ లేదా స్టిక్కర్‌ను కనుగొనండి, దాని పక్కన ఉన్న హృదయాకారాన్ని ఎంచుకోండి. మీరు సూపర్ చాట్ లేదా స్టిక్కర్‌కు హృదయాకారాన్ని ఇచ్చినట్లు వీక్షకులందరూ చూడగలరు. కొనుగోలుదారు సెట్టింగ్‌ల ఆధారంగా, మీరు వారి కామెంట్‌ను ఇష్టపడినట్లు వారు నోటిఫికేషన్‌ను కూడా పొందవచ్చు.

YouTubeలో వీక్షకుల మైలురాయి కొనుగోలును గుర్తించడానికి మీ లైవ్ చాట్ ఫీడ్‌లో ఇతర ఆటోమేటెడ్ మెసేజ్‌లు కనిపించవచ్చు. ఉదాహరణకు, కొనుగోలుదారు మొదటి లేదా పదవ కొనుగోలు చేసిన వారి కోసం ఆటోమేటెడ్ మెసేజ్ కనిపించవచ్చు. 

కొనుగోళ్లు, మైలురాళ్లకు అభినందనలు చూపడం అనేది కమ్యూనిటీని నిర్మించడంలో, మీ అభిమానుల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది.

సూపర్ చాట్‌లు, సూపర్ స్టిక్కర్స్‌ను మోడరేట్ చేయండి

లైవ్ చాట్ ఆన్ చేసి ఉన్న, అర్హత గల లైవ్ స్ట్రీమ్‌లు, ప్రీమియర్‌లలో సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్ ఆటోమేటిక్‌గా అందుబాటులో ఉంటాయి. లైవ్ చాట్ ఆటోమేటిక్‌గా ఆన్ చేయబడుతుంది. లైవ్ చాట్‌ను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకోండి. 

మీరు లైవ్ చాట్ మెసేజ్‌లను మోడరేట్ చేసినట్లుగానే, సూపర్ చాట్‌లు, సూపర్ స్టిక్కర్స్‌ను కూడా మోడరేట్ చేయవచ్చు. YouTubeలో అన్నింటిలాగానే, మీరు సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్‌ను పంపుతున్నప్పుడు తప్పకుండా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి. మా పాలసీలను ఉల్లంఘించినందుకు సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్ మోడరేట్ చేయబడి, తీసివేయబడితే, ఆదాయంలో YouTubeకు అందే భాగాన్ని సేవా కార్యకలాపాలకు విరాళంగా ఇస్తుంది.

ఆదాయ రిపోర్టింగ్

మీరు Supersకు సంబంధించిన ఆదాయ రిపోర్ట్‌లను  YouTube ఎనలిటిక్స్ ఆ తర్వాత ఆదాయంలో చూడవచ్చు ఆ తర్వాత మీకు డబ్బు అందుతున్న మార్గాలు.

ఆదాయ షేరింగ్

Google నిర్ధారించే Supers ఆదాయంలో 70% అమౌంట్ క్రియేటర్‌లకు అందుతుంది. లోకల్ సేల్స్ ట్యాక్స్‌ను, ఇంకా iOSలో వర్తించే App Store ఫీజులను డిడక్ట్ చేసిన తర్వాత, ఈ 70% లెక్కించబడుతుంది. క్రెడిట్ కార్డ్ ఫీజులతో సహా లావాదేవీల ఖర్చులు ప్రస్తుతం YouTube ద్వారా కవర్ అవుతున్నాయి.

సూపర్ చాట్‌తో, "థ్యాంక్స్" చెప్పడం ద్వారా, అలాగే ఇతర చిన్న ఇంటరాక్షన్‌లు జరపడం ద్వారా మీ ప్రేక్షకుల సంఖ్యను మీరు వేగంగా పెంచుకోవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2297264922527678063
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false