మీ ఛానెల్ నుండి MCN యాక్సెస్‌ను తీసివేయండి

మీరు అనుబంధిత క్రియేటర్ అయితే, అలాగే MCNతో మీ ఒప్పందం ఇలా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుందని మీరు భావిస్తే, మీ ఛానెల్ నుండి MCN యాక్సెస్‌ను తీసివేయడానికి మీరు ప్రాసెస్‌ను ప్రారంభించవచ్చు.

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఛానెల్ డ్యాష్‌బోర్డ్‌లో, మీకు నెట్‌వర్క్ రిలేషన్‌షిప్ కార్డ్ కనిపిస్తుంది.
  3. మీ ఛానెల్ నుండి MCN యాక్సెస్‌ను తీసివేయడానికి ఆ కార్డ్‌లో యాక్సెస్‌ను తీసివేయండిని క్లిక్ చేయండి. మీ రిక్వెస్ట్‌కు​ ప్రతిస్పందించడానికి MCNకు 30 రోజుల సమయం ఉందని సూచిస్తూ మీకు ఒక పాప్-అప్ స్క్రీన్ కనిపిస్తుంది, లేదా 30 రోజుల్లో లేదా అంతకంటే ముందే యాక్సెస్ ఆటోమెటిక్‌గా తీసివేయబడుతుంది.
  4. నిర్ధారించడానికి నెట్‌వర్క్ నుండి నిష్క్రమించండిని క్లిక్ చేయండి.
ముఖ్య గమనిక: మీరు MCN నుండి నిష్క్రమిస్తే, డబ్బు సంపాదించడాన్ని, పేమెంట్ పొందడాన్ని కొనసాగించేందుకు మీరు మానిటైజేషన్‌ను సెటప్ చేయాల్సి ఉంటుంది, అలాగే YouTube కోసం AdSenseకు మీ ఖాతాను లింక్ చేయాల్సి ఉంటుంది.

నా MCN యాక్సెస్ తీసివేయడానికి క్లిక్ చేసి, అయితే అప్పటికి నా ఒప్పందం గడువు ముగియకపోతే ఏమవుతుంది?

యాక్సెస్‌ను తీసివేయడానికి క్లిక్ చేసే ముందు, మీ MCNతో మీకు ఉన్న ఒప్పంద నియమాలను మీరు రివ్యూ చేయాలి. మీరు ఇప్పటికీ మీ MCNతో ఒప్పందంలో ఉంటే, యాక్సెస్‌ను తీసివేయడం ద్వారా చట్టపరమైన బాధ్యతల నుండి బయటకు వచ్చే అవకాశం మీకు ఇంకా అప్పటికి రాకపోవచ్చు, అలా చేయడం ద్వారా మీరు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవవచ్చు. ఆ చట్టపరమైన బాధ్యతల గురించి తెలియని అనుబంధ ఛానెల్స్ వాటి MCN లేదా వారి స్వంత న్యాయవాదితో చర్చించి తెలుసుకోవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16903934259068388106
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false