కామెంట్‌లను పోస్ట్ చేయండి & ఇంటరాక్ట్ అవ్వండి

YouTube కామెంట్‌లు: రిప్లయి చేయడం, ఫిల్టర్ చేయడం & మోడరేట్ చేయడం

వీడియో ఓనర్ కామెంట్‌లను ఆన్ చేస్తే, YouTube, YouTube Music యాప్‌లోని ఏదైనా వీడియో, పాట లేదా పాడ్‌కాస్ట్‌పై మీరు కామెంట్‌లను పోస్ట్ చేయవచ్చు, ఇతర వ్యక్తుల కామెంట్‌లను లైక్ చేయవచ్చు, డిస్‌లైక్ చేయవచ్చు, లేదా వాటికి రిప్లయి ఇవ్వడం కూడా చేయవచ్చు. మీ స్వంత కామెంట్‌లలో దేనినైనా మీరు ఎడిట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు. కామెంట్‌కు రిప్లయి‌లు ఒరిజినల్ కామెంట్ కింద థ్రెడ్ చేయబడతాయి తద్వారా మీరు సంభాషణను ఫాలో అవ్వవచ్చు.

మీ స్మార్ట్ టీవీలోని కామెంట్‌లతో ఇంటరాక్ట్ అవ్వండి

మీరు ఇప్పుడు మీ స్మార్ట్ టీవీ లేదా గేమ్ కన్సోల్‌లో కంటెంట్‌ను చూసే సమయంలో కామెంట్‌లను చూడవచ్చు, ఇంకా ఇంటరాక్ట్ అవ్వవచ్చు. వీడియోకు సంబంధించిన కామెంట్‌లను చూడటానికి, వీడియో వీక్షణా పేజీకి వెళ్లి, వీడియో టైటిల్‌ను ఎంచుకోండి. వీడియో కామెంట్‌ల ప్యానెల్‌ను ప్రదర్శిస్తూ, పరిచయం విభాగం కనిపిస్తుంది. వీడియోకు సంబంధించిన కామెంట్‌ల పూర్తి లిస్ట్‌ను చూడటానికి, కామెంట్‌ల టైల్‌ను ఎంచుకోండి, ఇక్కడ మీకు ఈ కింద ఉన్నవి కూడా కనిపిస్తాయి:

  • క్రియేటర్ పిన్ చేసిన కామెంట్‌లు
  • లైక్‌ల సంఖ్య
  • రిప్లయిల సంఖ్య

కామెంట్‌ను పూర్తిగా చదవడానికి, రిప్లయిలను చూడటానికి, దానిని లైక్ చేయడానికి లేదా డిస్‌లైక్ చేయడానికి కామెంట్‌ను ఎంచుకోండి.

కామెంట్‌కు రిప్లయి ఇవ్వడానికి లేదా కామెంట్‌ను పోస్ట్ చేయడానికి, మీ ఫోన్‌తో స్మార్ట్ టీవీని లేదా గేమ్ కన్సోల్‌ను సింక్ చేసి, ఆపై మీ ఫోన్‌ను ఉపయోగించి కామెంట్‌ను పోస్ట్ చేయండి.

కామెంట్‌ను జోడించడానికి లేదా రిప్లయి ఇవ్వడానికి:

  1. మీ ఫోన్‌లో YouTube యాప్‌ను తెరవండి.
  2. మీరు రెండు పరికరాలలో ఒకే Google ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  3. మీ YouTube యాప్‌లో ఒక పాప్-అప్ తెరవబడుతుంది, అందులో మీ టీవీలో YouTubeకు కనెక్ట్ చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
  4. 'కనెక్ట్ చేయండి'ని ట్యాప్ చేయండి.
  5. మీ టీవీలో మీరు చూస్తున్న వీడియోకు సంబంధించిన కామెంట్‌లు YouTube యాప్‌లో లోడ్ అవుతాయి, దీని వలన ఎటువంటి అంతరాయాలూ లేకుండా స్మూత్‌గా వాటిని పోస్ట్ చేసే వీలు, ఇంకా వాటితో ఇంటరాక్ట్ అయ్యే వీలు మీకు లభిస్తుంది.
గమనిక: మీరు సైన్ అవుట్ చేసి ఉన్నప్పుడు, మీరు కామెంట్‌లను చూడగలరు, కానీ వాటికి రిప్లయి ఇవ్వలేరు లేదా మీ స్వంత కామెంట్‌ను పోస్ట్ చేయలేరు.

వీడియోపై కామెంట్‌లను పోస్ట్ చేయండి

పబ్లిక్ వీడియోలు

మీరు YouTube, YouTube Music నుండి పాటలు, వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు, అప్‌లోడ్ చేసిన మ్యూజిక్‌కు కామెంట్ చేయవచ్చు. YouTubeలో పబ్లిక్ వీడియోలపై చేసే కామెంట్‌లన్నీ పబ్లిక్‌గా ఉంటాయి, అలాగే మీరు పోస్ట్ చేసే కామెంట్‌కు ఎవరైనా రిప్లయి ఇవ్వవచ్చు. మీరు Google యాప్స్ ఖాతా యూజర్ అయితే, YouTubeలో మీరు పోస్ట్ చేసే ఏ కామెంట్ అయినా, మీ డొమైన్ వెలుపల ఉన్న యూజర్‌లకు పబ్లిక్‌గా కనిపిస్తుంది.

కామెంట్‌ను జోడించడానికి

  1. వీడియో కింద కామెంట్ విభాగాన్ని కనుగొనండి.
  2. ఒక కామెంట్‌ను జోడించండి... బాక్స్‌లో టైప్ చేయండి.
  3. మీ కామెంట్‌ను ఎంటర్ చేయండి.
  4. కామెంట్‌ను క్లిక్ చేయండి.

ప్రైవేట్ వీడియోలు

ప్రైవేట్ వీడియోలలో కామెంట్‌లు చేసే సదుపాయం అందుబాటులో లేదు. మీరు పబ్లిక్‌గా అందుబాటులో లేని వీడియోపై కామెంట్‌లను అనుమతించాలనుకుంటే, పైన పేర్కొన్నట్లు కాకుండా అన్‌లిస్టెడ్ వీడియోను పోస్ట్ చేయండి.

అన్‌లిస్టెడ్ వీడియోలు

మీరు అన్‌లిస్టెడ్ వీడియోలపై కామెంట్ చేయవచ్చు, అలాగే కామెంట్‌లకు రిప్లయి ఇవ్వవచ్చు. అన్‌లిస్టెడ్ వీడియోలపై చేసిన కామెంట్‌లను వీడియో లింక్‌ను కలిగి ఉన్న ఎవరైనా చూడవచ్చు. అన్‌లిస్టెడ్ వీడియోలు, అలాగే గోప్యతా సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

మీరు YouTube ఛానెల్‌ను కలిగి లేకపోతే, కామెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా మీరు ఆటోమేటిక్‌గా ఛానెల్‌ను క్రియేట్ చేస్తారు. మీ కామెంట్‌ను పోస్ట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో‌కు వెళ్లడం ద్వారా మీరు మీ ఛానెల్‌ను యాక్సెస్ చేయవచ్చు, అలాగే ఛానెల్‌ను మేనేజ్ చేయవచ్చు.
కామెంట్‌లకు రిప్లయి ఇవ్వండి

YouTube, YouTube Music నుండి పాటలు, వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు, అప్‌లోడ్ చేసిన మ్యూజిక్‌కు వచ్చిన కామెంట్‌లకు రిప్లయి ఇవ్వండి. 

  1. కామెంట్ కింద, రిప్లయి చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. మీ కామెంట్‌లో టైప్ చేయండి.
  3. రిప్లయి చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
కామెంట్‌లకు ఫార్మాటింగ్‌ను జోడించండి
మా YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకొని, తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందండి!

మీ కామెంట్‌కు స్టయిల్‌ను జోడించండి

సాధారణంగా లభించే కింద పేర్కొన్నటువంటి ప్రత్యేక ట్యాగ్‌లతో రిచ్ టెక్స్ట్‌ను ఉపయోగించి మీ కామెంట్‌ను ఫార్మాట్ చేయవచ్చు:

  • *bold text*bold
  • _italicized text_italics
  • -strikethrough text-strikethrough

మీ కామెంట్‌కు లింక్‌లను జోడించండి

మీ కామెంట్‌కు మీరు URLను జోడిస్తే, అది హైపర్‌లింక్‌లా కనిపిస్తుంది.

ఫేవరెట్ కామెంట్‌లకు హార్ట్‌లను జోడించండి

వీక్షణా పేజీలోని కామెంట్‌లతో పాటు, మీ కమ్యూనిటీ ట్యాబ్ కామెంట్‌లపై వీక్షకుల కామెంట్‌లకు ప్రశంసలు తెలియజేయడానికి మీరు హార్ట్ చిహ్నాన్ని ఉపయోగించవచ్చు.

  1. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్‌కు వెళ్లండి.
  3. బాగుంది, బాగా లేదు చిహ్నాల పక్కన ఉన్న హార్ట్  చిహ్నాన్ని కనుగొనండి.

వీక్షకులు దిగువ ఎడమ వైపున చిన్న ఎరుపు రంగు హార్ట్ చిహ్నంతో మీ అవతార్‌ను చూస్తారు, అలాగే ఛానెల్ ఓనర్ "మీ కామెంట్‌ను ఇష్టపడుతున్నారు" అని తెలియజేసే నోటిఫికేషన్‌ను (వారి కంప్యూటర్, అలాగే మొబైల్‌లో వీక్షకుల సమ్మతి సెట్టింగ్‌ల ఆధారంగా) పొందుతారు.

చిట్కా: మీ మొబైల్ పరికరంలో క్రియేటర్ Studio యాప్‌తో కూడా మీరు కామెంట్‌లను మేనేజ్ చేయవచ్చు. YouTube క్రియేటర్ Studio యాప్ సహాయ కేంద్రంతో ప్రారంభించండి.
కామెంట్‌లను ఎగువున పిన్ చేయండి

కామెంట్‌లను పిన్ చేయడానికి, మీరు మీ ఛానెల్‌లోని అధునాతన ఫీచర్‌లకు యాక్సెస్‌ను తప్పక అనుమతించాలి. అధునాతన ఫీచర్‌లు మీ ఛానెల్‌లో కనిపించడానికి వాటిని ఆన్ చేసిన తర్వాత 24 గంటల వరకు పట్టవచ్చు.

కామెంట్‌ల విభాగంలో ఎగువున కామెంట్‌ను పిన్ చేయడం ద్వారా మీ ఫ్యాన్స్ కోసం కామెంట్‌ను హైలైట్ చేయండి. మొబైల్‌లో, పిన్ చేసిన కామెంట్‌ను చూడటానికి వీక్షకులు తప్పనిసరిగా కామెంట్ విభాగాన్ని విస్తరించాలి. మీరు మీ స్వంత కామెంట్‌ను లేదా ఫ్యాన్ కామెంట్‌ను పిన్ చేయడానికి ఎంచుకోవచ్చు.

  1. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. వీడియోకు కిందన ఉన్న కామెంట్‌ల నుండి, మీరు పిన్ చేయాలనుకుంటున్న కామెంట్‌ను ఎంచుకోండి.
  3. మరిన్ని ఆ తర్వాత పిన్ చేయండి ని క్లిక్ చేయండి. మీరు ఇప్పటికే ఒక కామెంట్‌ను పిన్ చేసి ఉంటే, దానిని ఇది రీప్లేస్ చేస్తుంది.
    గమనిక: మీరు ఎప్పుడైనా కామెంట్‌ను అన్‌పిన్ చేయవచ్చు, అప్పుడు అది దాని అసలు స్థానానికి తరలించబడుతుంది.
  4. నిర్ధారించడానికి PINను క్లిక్ చేయండి.

కంప్యూటర్‌లో, పిన్ చేసిన కామెంట్ వీక్షణ పేజీ ఎగువున "వీరి ద్వారా పిన్ చేయబడింది" చిహ్నంతో, మీ ఛానెల్ పేరుతో వీక్షకులకు కనిపిస్తుంది. మొబైల్‌లో, కామెంట్ విభాగాన్ని విస్తరించడానికి వారు దాన్ని ట్యాప్ చేయాల్సి ఉంటుంది.

చిట్కా: మీ మొబైల్ పరికరంలో క్రియేటర్ Studio యాప్‌తో కూడా మీరు కామెంట్‌లను మేనేజ్ చేయవచ్చు. YouTube క్రియేటర్ Studio యాప్ సహాయ కేంద్రంతో ప్రారంభించండి.
కామెంట్‌లను లైక్ లేదా డిస్‌లైక్ చేయండి

కామెంట్‌కు వెళ్లి, ఆపై లైక్ లేదా డిస్‌లైక్  చిహ్నాన్ని ఉపయోగించండి.

చిట్కా: మీకు అనుచితంగా అనిపించే కామెంట్ కనిపిస్తే, దానిని మీరు స్పామ్ లేదా దుర్వినియోగం అని రిపోర్ట్ చేయవచ్చు. మీరు క్రియేటర్ అయితే, మీ వీడియోల్లో కామెంట్‌లను మేనేజ్ చేయడానికి కామెంట్‌ల నియంత్రణ టూల్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.

మీ కామెంట్‌ను ఎడిట్ చేయండి లేదా తీసివేయండి
  1. మీ కామెంట్‌కు పైన కుడి వైపున పాయింట్ చేయండి.
  2. మరిన్ని ని క్లిక్ చేయండి.
  3. ఎడిట్ చేయండి ని లేదా తొలగించండి ని ఎంచుకోండి.

కామెంట్ ప్రివ్యూ‌ల FAQ

ఈ కామెంట్ ప్రివ్యూ విభాగంలో ఏ కామెంట్‌లు కనిపిస్తాయి?

ఒక కామెంట్ అనేక కారణాల వల్ల కామెంట్ ప్రివ్యూ విభాగంలో కనిపించవచ్చు. ఉదాహరణకు, కామెంట్ అనేది:

  • ఇటీవల పోస్ట్ చేయబడింది
  • వీడియో క్రియేటర్ ద్వారా పిన్ చేయబడింది లేదా "హార్ట్ చిహ్నం" ఇవ్వబడింది

నేను కామెంట్‌లు అన్నిటినీ ఎలా చూడాలి?

కామెంట్‌లు అన్నిటినీ చూడటానికి, కామెంట్ ప్రివ్యూ విభాగంలో ఎక్కడైనా ట్యాప్ చేయండి.

'తర్వాతి వీడియో లిస్ట్‌ను చూడండి'కి తిరిగి వెళ్లడానికి, పైన కుడి వైపు మూలన ఉన్న 'X'ను ట్యాప్ చేయండి.

పిన్ చేసిన నా కామెంట్‌లు కామెంట్ ప్రివ్యూ విభాగంలో కనిపిస్తాయా?

కామెంట్ ప్రివ్యూ విభాగాలలో పరిమిత స్పేస్ ఉన్నందున, కామెంట్‌ను పిన్ చేయడం ద్వారా ఆ కామెంట్ ప్రివ్యూ విభాగంలో కనిపిస్తుందన్న హామీ లేదు. అయితే, ఎవరైనా అన్ని కామెంట్‌లను చూడటానికి ట్యాప్ చేసినప్పుడు పిన్ చేసిన కామెంట్‌లు మొదటి కామెంట్‌గా కనిపిస్తూనే ఉంటాయి.

నా ప్రస్తుత కామెంట్‌ల నియంత్రణ సెట్టింగ్‌లు కామెంట్ ప్రివ్యూ విభాగానికి వర్తిస్తాయా?

అవును. బ్లాక్ చేసిన పదాలు అలాగే దాచిన యూజర్‌లతో సహా, కామెంట్ ప్రివ్యూ విభాగానికి కామెంట్‌ల నియంత్రణ సెట్టింగ్‌లు అన్నీ వర్తిస్తాయి. కింది వాటిని ఎలా చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి: మీ కామెంట్‌లను మేనేజ్ చేయడం అలాగే నియంత్రించడం.

కామెంట్‌కు సంబంధించిన రిమైండర్‌లు, హెచ్చరికలు, గడువు ముగింపులు

కామెంట్‌కు సంబంధించిన రిమైండర్‌లు

మీరు కామెంట్‌ను పోస్ట్ చేయడానికి ముందు, YouTubeలో గౌరవప్రదమైన ఇంటరాక్షన్‌లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మీకు ఒక రిమైండర్‌ను పంపవచ్చు. మీ కామెంట్ ఇతరులకు అభ్యంతరకరంగా అనిపించవచ్చని మా సిస్టమ్ కనుగొన్నప్పుడు ఈ రిమైండర్ చూపించబడుతుంది. పోస్ట్ చేయడానికి ముందు, మీ కామెంట్‌ను మరొకసారి పరిశీలించండి, లేదా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేయండి.

గమనిక: ఈ రిమైండర్ ప్రస్తుతం ఇంగ్లీష్, స్పానిష్ కామెంట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

కామెంట్ తీసివేయమని చేసే హెచ్చరికలు

మీరు కామెంట్‌ను పోస్ట్ చేసిన తర్వాత, కామెంట్ తీసివేయబడింది అని చెప్పే నోటిఫికేషన్ మీకు రావచ్చు. మీ కామెంట్‌లు YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘిస్తున్నాయని YouTube సిస్టమ్ కనుగొన్నప్పుడు, కామెంట్ తీసివేయబడవచ్చు. తీసివేతతో ఏకీభవించకపోతే, మీరు ఇక్కడ ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించవచ్చు.

కామెంట్‌కు సంబంధించిన గడువు ముగింపులు

మీరు కామెంట్‌ను పోస్ట్ చేసిన తర్వాత, మీ ఖాతా ద్వారా కామెంట్ చేయడం పాజ్ చేయబడింది అని చెప్పే నోటిఫికేషన్ మీకు రావచ్చు. మీరు చేసిన కామెంట్‌లు మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌లో ఒక దానిని లేదా అంత కంటే ఎక్కువ వాటిని పదే పదే ఉల్లంఘించినట్లు YouTube సిస్టమ్‌లు కనుగొన్నప్పుడు, కామెంట్ చేయడం పాజ్ చేయబడవచ్చు. కామెంట్ చేయడానికి మీకు ఉన్న సామర్థ్యం 24 గంటల వరకు పాజ్ చేయబడవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4322007883051145510
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false