ప్లేలిస్ట్‌లను క్రియేట్ చేయండి & మేనేజ్ చేయండి

ప్లేలిస్ట్ అనేది వీడియోల సేకరణ. ఎవరైనా ప్లేలిస్ట్‌లను రూపొందించవచ్చు, వాటిని షేర్ చేయవచ్చు, ఫ్రెండ్స్ మీ ప్లేలిస్ట్‌కు వీడియోలను జోడించవచ్చు.

మీ ప్లేలిస్ట్‌లు అన్నింటిని చూడటానికి మీరు ఖాతా ట్యాబ్‌కు వెళ్లవచ్చు. మీరు మీ ప్లేలిస్ట్‌లను YouTube Studioలో కూడా మేనేజ్ చేయవచ్చు.

ఏదైనా ఒక వీడియో లేదా ఛానెల్ తన ప్రేక్షకులను "పిల్లల కోసం రూపొందించబడింది" ఎంపికకు సెట్ చేసి ఉంటే, అలాగే మీరు హోమ్ పేజీలో ఉన్నట్లయితే, మీరు దాన్ని ప్లేలిస్ట్‌కు జోడించలేరు. మీరు ఇప్పటికీ సెర్చ్ ఫలితాల నుండి కంటెంట్‌ను ప్లేలిస్ట్‌లలోకి జోడించవచ్చు.

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

మీ ప్లేలిస్ట్‌లను కనుగొనడానికి, గైడ్ కు వెళ్లి, ఖాతా ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Create and manage a YouTube playlist on your desktop

వీడియో లేదా షార్ట్ నుండి ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయడం

వీడియో నుండి ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయడానికి:

  1. ఏ వీడియో అయితే ప్లేలిస్ట్‌లో ఉండాలని మీరు భావిస్తున్నారో, ఆ వీడియో వీక్షణా పేజీకి వెళ్లండి.
  2. మరిన్ని ఆ తర్వాత  సేవ్ చేయండి ఆ తర్వాత కొత్త ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయండి ఆ తర్వాత ప్లేలిస్ట్ కోసం పేరును ఎంటర్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. బాక్స్‌ను ఉపయోగించి మీ ప్లేలిస్ట్ గోప్యతా సెట్టింగ్‌ను ఎంచుకోండి. "ప్రైవేట్"కు చేస్తే, మీరు మాత్రమే ప్లేలిస్ట్‌ను చూడగలరు.
  4. క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

షార్ట్ నుండి ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయడానికి:

  1. ఏ షార్ట్ అయితే ప్లేలిస్ట్‌లో ఉండాలని మీరు భావిస్తున్నారో, ఆ షార్ట్ వీక్షణా పేజీకి వెళ్లండి.
  2. మరిన్ని ఆ తర్వాత  సేవ్ చేయండి ఆ తర్వాత కొత్త ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయండి ఆ తర్వాత ప్లేలిస్ట్ కోసం పేరును ఎంటర్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. బాక్స్‌ను ఉపయోగించి మీ ప్లేలిస్ట్ గోప్యతా సెట్టింగ్‌ను ఎంచుకోండి. "ప్రైవేట్"కు చేస్తే, మీరు మాత్రమే ప్లేలిస్ట్‌ను చూడగలరు.
  4. క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ప్లేలిస్ట్‌ను మేనేజ్ చేయండి

కంటెంట్‌ను ప్లేలిస్ట్‌లో సేవ్ చేయడం

  1. ఏ వీడియో లేదా షార్ట్ అయితే ప్లేలిస్ట్‌లో ఉండాలి అని మీరు భావిస్తున్నారో, ఆ వీడియో లేదా షార్ట్ వీక్షణా పేజీకి వెళ్లండి.
  2. మరిన్ని ఆ తర్వాత సేవ్ చేయండి ఆ తర్వాత తర్వాత చూడండి వంటి ప్లేలిస్ట్‌ను లేదా మీరు ఇప్పటికే క్రియేట్ చేసిన ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. వీడియో ఫలానా ప్లేలిస్ట్‌కు జోడించబడిందని నిర్ధారిస్తూ, మీ స్క్రీన్‌కు కింద ఒక మెసేజ్ పాప్-అప్ అవుతుంది.

ప్లేలిస్ట్‌ను ఎడిట్ చేయడం

  1.  గైడ్‌లో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న విభాగం ఆధారంగా ఎడిట్ చేయండి ని క్లిక్ చేయండి.

వీడియో రకం ఆధారంగా ప్లేలిస్ట్‌ను ఫిల్టర్ చేయడం

  1. గైడ్‌లో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి.
  2. మీ ప్లేలిస్ట్‌లో మీరు చూడాలనుకుంటున్న కంటెంట్ రకం కలిగిన చిప్‌ను ఎంచుకోండి:
    1. మొత్తం: ప్లేలిస్ట్‌లో సేవ్ చేసిన కంటెంట్ మొత్తాన్ని డిస్‌ప్లే చేస్తుంది.
    2. Shorts: ప్లేలిస్ట్‌లో సేవ్ చేసిన Shortsను డిస్‌ప్లే చేస్తుంది. ఈ ఫీచర్ కంప్యూటర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. 
    3. వీడియోలు: ప్లేలిస్ట్‌లో సేవ్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోలను డిస్‌ప్లే చేస్తుంది.

ప్లేలిస్ట్‌లోని కంటెంట్ క్రమాన్ని మార్చడం

  • వీడియోల క్రమాన్ని మార్చడానికి: ప్లేలిస్ట్‌ను తెరవండి ఆ తర్వాత ప్లేలిస్ట్‌లో వీడియోను పైకి లేదా కిందకు లాగండి.
  • వీడియోల క్రమాన్ని తాత్కాలికంగా మార్చడానికి: వీక్షణా పేజీకి సంబంధించిన ప్లేలిస్ట్ ప్యానెల్‌లో, ప్లేలిస్ట్‌లో వీడియోను పైకి లేదా కిందకు లాగండి.

గమనిక: ఈ ఫీచర్, YouTube Shortsను మాత్రమే ఉన్న ప్లేలిస్ట్‌ల కోసం అందుబాటులో లేదు. 

 

ప్లేలిస్ట్‌ను తొలగించండి

  1. మీ ప్లేలిస్ట్‌లలో ఒక దానికి వెళ్లండి.
  2. మరిన్ని ని క్లిక్ చేయండి.
  3. ప్లేలిస్ట్‌ను తొలగించండి ని ఎంచుకోండి.
  4. తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మీ ప్లేలిస్ట్‌ను తొలగించాలనుకుంటున్నారని నిర్ధారించండి.
గమనిక: వీక్షకుల వీక్షణ హిస్టరీలలో మీ పాత ప్లేలిస్ట్ తొలగించబడకుండా అలాగే ఉండవచ్చు.

మీరు ఏదైనా ప్లేలిస్ట్‌ను తొలగించిన తర్వాత, ఆ ప్లేలిస్ట్ URL, ఇంకా టైటిల్, YouTube ఎనలిటిక్స్‌లో కనిపించడం గానీ లేదా సెర్చ్ చేసినా కనిపించడం గానీ జరగదు. ప్లేలిస్ట్‌తో అనుబంధించబడి ఉన్న వాచ్ టైమ్ వంటి డేటా, ఇప్పటికీ సమగ్ర రిపోర్ట్‌లలో భాగంగానే ఉంటుంది, కానీ అది తొలగించబడిన ప్లేలిస్ట్‌కు ఆపాదించబడదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15025107330693461084
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false