మీ YouTube సెర్చ్ హిస్టరీని చూడండి లేదా తొలగించండి

మీ YouTube సెర్చ్ హిస్టరీని మీరు, నా యాక్టివిటీ పేజీలో చూడవచ్చు. అక్కడి నుండి మీరు ఈ కింద ఉన్న వాటిని చేయవచ్చు:

  • మీ సెర్చ్ హిస్టరీని చూడవచ్చు
  • ఏదైనా ఒక నిర్దిష్ట వీడియోను కనుగొనడానికి మీ సెర్చ్ హిస్టరీని సెర్చ్ చేయవచ్చు
  • మీ సెర్చ్ హిస్టరీ అంతటినీ క్లియర్ చేయవచ్చు
  • సెర్చ్ సూచనల నుండి ఒక్కో సెర్చ్‌ను తీసివేయవచ్చు
  • మీ సెర్చ్ హిస్టరీని పాజ్ చేయవచ్చు
గమనిక: మీరు గతంలో YouTubeలో చూసిన వాటిని చూడటానికి లేదా తొలగించడానికి, నా యాక్టివిటీని చూడండి.

పరిగణించవలసిన కొన్ని గమనికలు:

  • మీరు తొలగించే సెర్చ్ ఎంట్రీలు ఇకపై మీ సిఫార్సులను ప్రభావితం చేయవు.
  • మీ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేసిన తర్వాత, మీరు గతంలో చేసిన సెర్చ్‌లు ఇకపై సెర్చ్ బాక్స్‌లో సూచనలుగా కనిపించవు.
  • మీ సెర్చ్ హిస్టరీ పాజ్ అయ్యి ఉన్నప్పుడు, మీరు ఎంటర్ చేసే సెర్చ్‌లు మీ సెర్చ్ హిస్టరీలో సేవ్ అవ్వవు.

మీ పరికరం ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు మీ వీక్షణ హిస్టరీ నుండి మీరు ఏవైనా వీడియోలను తీసివేసినట్లయితే, ఆ మార్పులు సింక్ అవ్వడానికి కొన్ని గంటలు పట్టవచ్చు.

ఒక్కో సెర్చ్‌ను తొలగించండి

నా యాక్టివిటీ ఆ తర్వాతకి వెళ్లండి, మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ పక్కన ఉన్న తొలగించండి ని క్లిక్ చేయండి.

మీ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండి

నా యాక్టివిటీ ఆ తర్వాతకి వెళ్లండి ఈ ప్రాసెస్‌ను ఫాలో అయ్యి, యాక్టివిటీని తొలగించండి… ఆ తర్వాతని క్లిక్ చేయండి మీరు తొలగించాలనుకుంటున్న యాక్టివిటీ సమయ వ్యవధిని ఎంచుకోండి ఆ తర్వాత పాప్-అప్‌నకు కుడి వైపున ఉన్న 'తొలగించండి'ని క్లిక్ చేయండి.

మీ సెర్చ్ హిస్టరీని పాజ్ చేయవచ్చు

యాక్టివిటీని సేవ్ చేయడం ను క్లిక్ చేయండి ఆపై ఆఫ్ చేయడానికి ఆన్/ఆఫ్ బటన్‌ను క్లిక్ చేయండి. సెర్చ్ హిస్టరీ, వీక్షణ హిస్టరీ తిరిగి ఎనేబుల్ అయ్యే వరకు ఈ ఆప్షన్ మీరు చూసే, సెర్చ్ చేసే వాటిని సేవ్ చేయకుండా ఉంచుతుంది.

మీ సెర్చ్ హిస్టరీని, అలాగే వీక్షణ హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించండి

నిర్దిష్ట సమయం తర్వాత, మీ YouTube సెర్చ్ హిస్టరీ, అలాగే వీక్షణ హిస్టరీ ఆటోమేటిక్‌గా తొలగించబడేలా మీరు ఎంచుకోవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎగువ ఎడమ వైపున ఉన్న ప్యానెల్‌లో, డేటా & గోప్యత అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌ల" కింద, YouTube హిస్టరీని క్లిక్ చేయండి.
  4. మీరు కావాలనుకుంటున్న 'ఆటోమేటిక్ తొలగింపు' టైమ్-ఫ్రేమ్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత 'తర్వాత' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత మీ 'ఆటోమేటిక్ తొలగింపు' యాక్టివిటీ ఎంపికను సేవ్ చేయడానికి పాప్-అప్‌నకు దిగువ కుడి వైపున ఉన్న అర్థమయ్యింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

TV, గేమ్ కన్సోల్, లేదా మీడియా స్ట్రీమింగ్ బాక్స్

మీ సెర్చ్ హిస్టరీని పాజ్ చేయండి

  1. ఎడమ వైపు ఉండే మెనూలో, సెట్టింగ్‌లు కు వెళ్లండి.
  2. సెర్చ్ హిస్టరీని పాజ్ చేయండి ని ఎంచుకోండి.
  3. సెర్చ్ హిస్టరీని పాజ్ చేయండి బటన్‌ను ఎంచుకోండి.

మీ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండి

  1. ఎడమ వైపు ఉండే మెనూలో, సెట్టింగ్‌లు కు వెళ్లండి.
  2. సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండిని ఎంచుకోండి.
  3. సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండి బటన్‌ను ఎంచుకోండి.

వీక్షణ హిస్టరీ, సిఫార్సు చేయబడిన కంటెంట్‌ను తీసివేయడం, అలాగే మీ సిఫార్సులను మెరుగుపరుచుకోవడం గురించి మరింత సమాచారం కోసం మా ఇతర ఆర్టికల్స్‌ను చూడండి.

అజ్ఞాత మోడ్‌లో సెర్చ్ చేయండి

మీరు అజ్ఞాత మోడ్‌లో బ్రౌజ్ చేసినట్లయితే, మీ సెర్చ్ హిస్టరీ సేవ్ అవ్వదు. అజ్ఞాత మోడ్ గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10529853960945919814
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false