మీ YouTube సెర్చ్ హిస్టరీని చూడండి లేదా తొలగించండి

మీ YouTube సెర్చ్ హిస్టరీని మీరు, నా యాక్టివిటీ పేజీలో చూడవచ్చు. అక్కడి నుండి మీరు ఈ కింద ఉన్న వాటిని చేయవచ్చు:

  • మీ సెర్చ్ హిస్టరీని చూడవచ్చు
  • ఏదైనా ఒక నిర్దిష్ట వీడియోను కనుగొనడానికి మీ సెర్చ్ హిస్టరీని సెర్చ్ చేయవచ్చు
  • మీ సెర్చ్ హిస్టరీ అంతటినీ క్లియర్ చేయవచ్చు
  • సెర్చ్ సూచనల నుండి ఒక్కో సెర్చ్‌ను తీసివేయవచ్చు
  • మీ సెర్చ్ హిస్టరీని పాజ్ చేయవచ్చు
గమనిక: మీరు గతంలో YouTubeలో చూసిన వాటిని చూడటానికి లేదా తొలగించడానికి, నా యాక్టివిటీని చూడండి.

పరిగణించవలసిన కొన్ని గమనికలు:

  • మీరు తొలగించే సెర్చ్ ఎంట్రీలు ఇకపై మీ సిఫార్సులను ప్రభావితం చేయవు.
  • మీ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేసిన తర్వాత, మీరు గతంలో చేసిన సెర్చ్‌లు ఇకపై సెర్చ్ బాక్స్‌లో సూచనలుగా కనిపించవు.
  • మీ సెర్చ్ హిస్టరీ పాజ్ అయ్యి ఉన్నప్పుడు, మీరు ఎంటర్ చేసే సెర్చ్‌లు మీ సెర్చ్ హిస్టరీలో సేవ్ అవ్వవు.

మీ పరికరం ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు మీ వీక్షణ హిస్టరీ నుండి మీరు ఏవైనా వీడియోలను తీసివేసినట్లయితే, ఆ మార్పులు సింక్ అవ్వడానికి కొన్ని గంటలు పట్టవచ్చు.

సెర్చ్ హిస్టరీని పాజ్ చేయండి

  1. మీ ప్రొఫైల్ ఫోటో కు వెళ్లండి.
  2. సెట్టింగ్‌లు ఆ తర్వాత మొత్తం హిస్టరీని మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ YouTube హిస్టరీని సేవ్ చేయడం అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, ఆ తర్వాత "YouTubeలో మీ సెర్చ్‌లను జోడించండి" అనే ఎంపికను రద్దు చేయండి.

ఒక్కో సెర్చ్‌ను తొలగించండి

  1. సెర్చ్ ను ట్యాప్ చేయండి.
  2. హిస్టరీ చిహ్నం పక్కన ఉన్న, సూచించబడిన సెర్చ్ ఫలితాన్ని ట్యాప్ చేసి ఉంచండి.
  3. పాప్-అప్‌లో తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

TV, గేమ్ కన్సోల్, లేదా మీడియా స్ట్రీమింగ్ బాక్స్

మీ సెర్చ్ హిస్టరీని పాజ్ చేయండి

  1. ఎడమ వైపు ఉండే మెనూలో, సెట్టింగ్‌లు కు వెళ్లండి.
  2. సెర్చ్ హిస్టరీని పాజ్ చేయండి ని ఎంచుకోండి.
  3. సెర్చ్ హిస్టరీని పాజ్ చేయండి బటన్‌ను ఎంచుకోండి.

మీ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండి

  1. ఎడమ వైపు ఉండే మెనూలో, సెట్టింగ్‌లు కు వెళ్లండి.
  2. సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండిని ఎంచుకోండి.
  3. సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండి బటన్‌ను ఎంచుకోండి.

వీక్షణ హిస్టరీ, సిఫార్సు చేయబడిన కంటెంట్‌ను తీసివేయడం, అలాగే మీ సిఫార్సులను మెరుగుపరుచుకోవడం గురించి మరింత సమాచారం కోసం మా ఇతర ఆర్టికల్స్‌ను చూడండి.

అజ్ఞాత మోడ్‌లో సెర్చ్ చేయండి

మీరు అజ్ఞాత మోడ్‌లో బ్రౌజ్ చేసినట్లయితే, మీ సెర్చ్ హిస్టరీ సేవ్ అవ్వదు. అజ్ఞాత మోడ్ గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
990164165148121208
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false