చెల్లని ట్రాఫిక్ కారణంగా AdSense ఖాతా డిజేబుల్‌ చేయబడింది

మీ ఖాతా గురించి, మా అడ్వర్టయిజర్‌ల రక్షణ కోసం మేము తీసుకునే చర్యల గురించి మీకు ప్రశ్నలు ఉండవచ్చని మేము అర్థం చేసుకున్నాము. చెల్లని ట్రాఫిక్ కారణంగా డిజేబుల్ చేయబడిన ఖాతాల గురించి చాలా తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు పొందుపరిచాము.

నా ఖాతా ఎందుకు డిజేబుల్‌ చేయబడింది?

మా పబ్లిషర్‌లకు ఏవైనా వెబ్ పేజీలు, యూజర్‌లు లేదా పాలుపంచుకున్న థర్డ్-పార్టీ సర్వీస్‌లతో సహా తమ ఖాతా యాక్టివిటీకి సంబంధించిన ఏ సమాచారమూ అందించలేము. ఎందుకంటే మేము మా యాజమాన్య గుర్తింపు సిస్టమ్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

చెల్లని ట్రాఫిక్‌కు Google ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది, క్లిక్‌లు మరియు ఇంప్రెషన్‌లను అన్నింటినీ విశ్లేషించడం ద్వారా, ఎవరైనా అడ్వర్టయిజర్ ఖర్చులు లేదా పబ్లిషర్ ఆదాయాలను కృత్రిమంగా పెంచే ఏదైనా వినియోగ నమూనాకు అవి సరిపోలుతాయా లేదా అన్నది నిర్థారిస్తుంది. AdSense ఖాతా మా Google Ads అడ్వర్టయిజర్‌లకు ప్రమాదంగా మారినట్లు మేము గుర్తిస్తే, మా అడ్వర్టయిజర్‌ల ప్రయోజనాలను రక్షించడానికి మేము ఆ ఖాతాను డిజేబుల్ చేయవచ్చు.

చెల్లని ట్రాఫిక్ వలన AdSense ఖాతాలను డిజేబుల్ చేయడానికి గల సాధారణ కారణాల గురించి మరింత తెలుసుకోండి.

చివరిగా, మా నియమాలు, షరతులులో పేర్కొన్న విధంగా చెల్లని ట్రాఫిక్ యొక్క సందర్భాలను గుర్తించినప్పుడు Google స్వంత విచక్షణపై నిర్ణయిస్తుంది.

చెల్లని ట్రాఫిక్ కారణంగా నా ఖాతా డిజేబుల్ చేసిన తర్వాత దాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవచ్చా?

మీకు సమస్యలు ఉన్నట్లయితే, పరిష్కారం కోసం మీతో కలిసి పని చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఈ నిర్ణయం తప్పుగా తీసుకున్నారని మీరు భావిస్తే మరియు చెల్లని ట్రాఫిక్‌కు మీ చర్యలు లేదా అశ్రద్ధ లేదా మీరు బాధ్యత వహించే వ్యక్తులు కారణం కాదని మీరు సద్భావనను కలిగి ఉంటే, మీరు ఇక్కడ ఉంచిన లింక్ ద్వారా చెల్లని యాక్టివిటీ అప్పీల్ ఫారమ్లో అప్పీల్ చేసుకోవచ్చు.

మేము మీ అప్పీల్‌‌ను స్వీకరించిన తర్వాత, మీకు త్వరగా సమాచారం అందజేయడానికి శాయశక్తులా కృషి చేస్తాము, తగిన చర్య తీసుకుంటాము. మీ ఖాతా పునరుద్ధరించబడుతుందనే ఖచ్చితమైన హామీ లేదని గమనించండి.

మీ అప్పీల్‌పై మేము ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, తర్వాతి అప్పీల్‌లు పరిగణించబడకపోవచ్చు.

విజయవంతమైన చెల్లని ట్రాఫిక్ అప్పీల్‌ను రాయడానికి కొన్ని చిట్కాలు ఏవి?

మీకు అప్పీల్‌ను రాయడంలో ఉపయోగపడే కొన్ని చిట్కాలను ఇక్కడ పొందుపరిచాము, వాటిని ఒకసారి చూడండి:

  • చెల్లని ట్రాఫిక్ వలన AdSense ఖాతాలను డిజేబుల్ చేయడానికి‌ గల సాధార‌ణ కారణాలను రివ్యూ చేయండి. ఇక్కడ పేర్కొన్న ఏవైనా కారణాలు మీకుగాని మీ కంటెంట్‌కుగాని వర్తిస్తాయా? మీ స్నేహితులు ఏమైనా మీ యాడ్‌లపై అనేక సార్లు క్లిక్ చేసారా? చెల్లని ట్రాఫిక్ ఒక్కసారిగా పెరగడానికి దారితీసిన ట్రాఫిక్‌ని మీరు కొనుగోలు చేసారా? చెల్లని ట్రాఫిక్ మళ్లీ తలెత్తకుండా మీరు కంటెంట్ మరియు/లేదా ప్రవర్తనా మార్పులను చేయగలరా?
  • మీ డెస్క్‌టాప్ సైట్, మొబైల్ సైట్ మరియు/లేదా మొబైల్ యాప్‌లో యాడ్ అమలులను రివ్యూ చేయండి. మీ సాధారణ యూజర్ అనుభూతి గురించి ఆలోచించండి, మీరు అమలు చేస్తున్న యాడ్‌ల వల్ల యూజర్‌లు అనుకోకుండా యాడ్‌లను క్లిక్ చేసే అవకాశముందేమో చెక్ చేయండి.
  • అప్పీల్స్ ఫారమ్‌లో మీరు డిజేబుల్ చేసిన Google AdSense ఖాతాతో అనుబంధించిన ఈమెయిల్ అడ్రస్‌ను అందించండి. ఇది మీ ఖాతా లొకేషన్‌ను గుర్తించడంలో మాకు సహాయం చేస్తుంది అలాగే మీ అప్పీల్‌ను ప్రాసెస్ చేయడంలో ఆలస్యం జరగకుండా చూస్తుంది.
  • భవిష్యత్తు కోసం మీరు ఏ మార్పులు చేస్తారో మాకు చెప్పండి. ఇలాంటిది మళ్లీ జరగకూడదని నిర్ధారించడానికి మీరు ఏర్పాటు చేసిన సిస్టమ్‌లు లేదా తీసుకున్న చర్యలు ఏమిటి? ఉదాహరణకు, మీరు మీ యాడ్ అమలులను ఎలా సర్దుబాటు చేశారు, మీ ట్రాఫిక్ సోర్స్‌లు మొదలైన వాటిని ఎలా అంచనా వేశారు అన్న విషయాలను మాకు చెప్పండి.

నా ఖాతా డిజేబుల్ చేయబడింది, నా అప్పీల్ తిరస్కరించబడింది. నేను మళ్ళీ ప్రోగ్రామ్‌లోనికి తిరిగి చేరవచ్చా లేదా కొత్త ఖాతాను తెరవాలా?

మీ ఖాతాపై తీసుకున్న చర్యలకు సంబంధించి మీ ఆందోళనను మేము అర్థం చేసుకున్నాము. మా అడ్వర్టయిజర్‌లు, పబ్లిషర్‌లు అలాగే యూజర్‌ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని మా నిపుణుల బృందం జాగ్రత్తగా చేసిన విచారణ ఫలితంగానే మేము ఈ చర్యలు తీసుకున్నాము. మా నిర్ణయంతో మీరు నిరాశకు గురైనప్పటికీ, మేము మీ ఖాతాను పునరుద్ధరించలేము.

చెల్లని ట్రాఫిక్ కారణంగా నిలిపివేయబడిన పబ్లిషర్‌లు ఇకముందు AdSenseలో పాల్గొనడానికి అనుమతించబడరు. ఈ కారణంగా, ఈ పబ్లిషర్‌లు కొత్త ఖాతాలను తెరవలేకపోవచ్చు.

ఏ మూలాధారం నుండైనా చెల్లని ట్రాఫిక్‌ ఏర్పడిన లేదా ఇతర ఏ కారణం చేతనైనా ఖాతాను నిలిపివేసే హక్కు Google కలిగి ఉంది.

మరొక నిలిపివేయబడిన ఖాతాకు నా ఖాతా అనుసంధానమై ఉండడంతో నిలిపివేయబడింది. ఈ సంబంధం గురించి నాకు మరింత తెలియజేయగలరా?

చెల్లని ట్రాఫిక్ మాదిరిగానే, పబ్లిషర్‌ల ఖాతాల మధ్య ఉన్న సంబంధం గురించి ఎలాంటి సమాచారమైనా మేము మా పబ్లిషర్‌లకు అందించలేము. మా యాజమాన్య గుర్తింపు సిస్టమ్‌ను రక్షించుకోవడానికి మా పబ్లిషర్‌లు అందరితోను మేము ఈ జాగ్రత్తలను తీసుకోవడం జరుగుతోందని దయచేసి అర్థం చేసుకోండి.

AdSense ఖాతా మా Google Ads అడ్వర్టయిజర్‌లకు ప్రమాదంగా మారినట్లు మేము గుర్తిస్తే, మా అడ్వర్టయిజర్‌ల ప్రయోజనాలను రక్షించడానికి మేము ఆ ఖాతాను డిజేబుల్ చేయవచ్చు.

నా AdSense ఆదాయాలు ఇప్పటికీ నాకు పేమెంట్ చేయబడతాయా?

చెల్లని ట్రాఫిక్ మరియు/లేదా ఉల్లంఘనల కారణంగా డిజేబుల్ అయిన పబ్లిషర్‌లు చెల్లనిదిగా గుర్తించబడని వారి ఆదాయం వంతులో తుది పేమెంట్‌ను అందుకునే అవకాశం ఉంటుంది. ఖాతాను డిజేబుల్ చేసిన తర్వాత, ఈ తుది పేమెంట్ లెక్కలన్నీ సరిచూడటానికి ఒక 30 రోజుల పాటు పేమెంట్ నిలిపివేయబడుతుంది (వర్తించే పక్షంలో). ఈ 30 రోజుల వ్యవధి తర్వాత, దయచేసి AdSenseకు సైన్ ఇన్ చేయడం ద్వారా మీరు పొందగల మిగతా బ్యాలెన్స్ (ఏదైనా ఉంటే) చూసుకుని, పేమెంట్ ఏర్పాటు చేసుకోండి. చెల్లని ట్రాఫిక్ మరియు/లేదా పబ్లిషర్ పాలసీ ఉల్లంఘనల కోసం మీ తుది బ్యాలెన్స్ నుండి మినహాయంచే డిడక్షన్‌లు వీలైన సముచిత సందర్భాలలో ప్రభావిత అడ్వర్టయిజర్‌లకు రీఫండ్‌గా అందజేస్తాము.

నేను నా PINని ఇప్పుడే స్వీకరించాను. నేను దానితో ఏమి చేయాలి?

చెల్లని యాక్టివిటీ కారణంగా డిజేబుల్ చేయబడిన పబ్లిషర్‌లు ఇకముందు ఎలాంటి పేమెంట్ అందుకోరు కాబట్టి, మీరు ఈ PINను విస్మరించవచ్చు.

నా సైట్‌లో యాడ్‌లను ప్రదర్శించేందుకు మరొక AdSense పబ్లిషర్‌ను అనుమతించాలనుకుంటున్నాను. ఇది తమ ఖాతాకు సమస్యను సృష్టిస్తుందా? నా సైట్ డిజేబుల్ కూడా చేయబడిందా?

AdSense ప్రోగ్రామ్ పాలసీలు, నియమాలు, షరతులను పాటించే ఏ సైట్‌లోనైనా AdSense పబ్లిషర్‌లు తమ యాడ్‌లను ప్రదర్శించవచ్చు. నిర్దిష్ట వెబ్‌సైట్ యొక్క మా విధానాల పాటింపు నుండి పబ్లిషర్ ఖాతా స్థితి ప్రత్యేకంగా ఉండవచ్చని దయచేసి గమనించండి. అయినప్పటికీ, ఇతర పబ్లిషర్ ఖాతా మా Google Ads అడ్వర్టయిజర్‌లకు ప్రమాదంగా పరిణమించిందని మేము గుర్తిస్తే, మా అడ్వర్టయిజర్‌ల ప్రయోజనాలను రక్షించడానికి మేము ఆ ఖాతాను డిజేబుల్‌ చేయవచ్చు.

నాకు సంబంధించిన వారు ఎవరైనా AdSense ఖాతాను క్రియేట్ చేస్తే, వారి ఖాతా కూడా డిజేబుల్ చేయబడుతుందా?

సంబంధిత పబ్లిషర్ ఖాతా మా Google Ads అడ్వర్టయిజర్‌లకు ప్రమాదంగా పరిణమించిందని మేము గుర్తిస్తే, మా అడ్వర్టయిజర్‌ల ప్రయోజనాలను రక్షించడానికి మేము ఆ ఖాతాను డిజేబుల్ చేయవచ్చు.

నేను అందుకున్న పేమెంట్‌ల కోసం ఇప్పటికీ నేను పన్ను ఫారమ్‌లను అందుకుంటానా?

మీరు గతంలో మా నుండి పేమెంట్ అందుకుని ఉంటే లేదా మీ ఖాతాలో పేమెంట్ చేయగల బ్యాలెన్స్ మిగిలి ఉంటే, మీరు ఇప్పుడు కూడా అవసరమైతే మా నుండి పన్ను ఫారమ్‌ను అందుకుంటారు. మీ AdSense ఆదాయాలపై పన్నులు పేమెంట్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

నా ఖాతా పునరుద్ధరించబడింది. అయినా నా సైట్‌లలో, యాప్‌లలో లేదా వీడియోలలో యాడ్‌లు ఎందుకు ప్రదర్శించబడడం లేదు?

మీ AdSense ఖాతా పునరుద్ధరించిన తర్వాత, ఈ అంశం మా అన్ని సర్వర్‌లలో అప్‌డేట్ చేయడానికి, యాడ్‌లు ప్రదర్శించబడడానికి 48 గంటల వరకు సమయం పట్టవచ్చు. అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నాము, మీ ఓపికకు ధన్యవాదాలు.

మీరు YouTube పబ్లిషర్ అయితే, మీరు మీ AdSense ఖాతాతో YouTube ఛానెల్‌ను మళ్లీ అనుబంధించాలి. సూచనల కోసం, ఈ లింక్‌ను రెఫర్ చేయండి: పేమెంట్స్ కోసం AdSense ఖాతాను సెటప్ చేయండి

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18003452973231838772
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false