YouTube క్రియేటర్‌లకు మల్టీ ఛానెల్ నెట్‌వర్క్ (MCN) ఓవర్‌వ్యూ

మల్టీ ఛానెల్ నెట్‌వర్క్‌లు (“MCNలు” లేదా “నెట్‌వర్క్‌లు”) అన్నవి థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌లు. ఇవి పలు YouTube ఛానెల్స్‌తో అనుబంధంగా ఉండి, ప్రేక్షకుల సంఖ్యను పెంచడం, కంటెంట్ ప్రోగ్రామింగ్, క్రియేటర్ సహకారాలు, డిజిటల్ హక్కుల మేనేజ్‌మెంట్, మానిటైజేషన్, అలాగే/లేదా సేల్స్ వంటి సర్వీస్‌లను అందిస్తాయి. 

MCNలో భాగంగా ఉండే ఛానెల్స్ అన్నీ తమ ఛానెల్‌కు సంబంధించిన రివ్యూను కూడా పూర్తి చేసుకొని ఉండాలి, అలాగే YouTube మానిటైజేషన్ పాలసీలను ఫాలో అవ్వాలి.

అనుబంధ, స్వంతమైన & నిర్వహించబడుతున్న ఛానెల్‌లు

MCNలు వారి YouTube నెట్‌వర్క్‌లో రెండు రకాల ఛానెల్‌లు కలిగి ఉండవచ్చు:

  • అనుబంధ ఛానెల్‌లు వాటి MCN ద్వారా పెద్ద మొత్తంలో మేనేజ్ చేయబడతాయి, అలాగే అవి అనుబంధ కంటెంట్ ఓనర్ వద్ద ఉంటాయి.
  • స్వంతమైన & నిర్వహించబడుతున్న (స్వం&ని) ఛానెల్స్ పార్ట్‌నర్‌కు స్వంతమైనవి, అలాగే వారి ద్వారా నిర్వహించబడుతున్నవి. అంటే, ఛానెల్ YouTube కంటెంట్‌కు పార్ట్‌నర్ ప్రత్యేక హక్కులు పొందారని, అలాగే రోజువారీగా ఛానెల్ కార్యకలాపాలను (ఉదా. వీడియోలను అప్‌లోడ్ చేయడం) యాక్టివ్‌గా నిర్వహిస్తారని అర్థం. స్వం&ని ఛానెల్ అప్‌లోడ్ చేసిన కంటెంట్‌కు పార్ట్‌నర్ శాశ్వత, ప్రపంచవ్యాప్త ప్రత్యేకతను కలిగి ఉన్నంత వరకు, ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్ లభ్యతను మేనేజ్ చేయడానికి తగిన ఫీచర్‌లను ఉపయోగించడం పార్ట్‌నర్ బాధ్యత.

ఈ రెండు రకాల ఛానెల్స్ మధ్య తేడాను చూపడం ద్వారా YouTube మా పాలసీలను, ఛానెల్ ఫీచర్‌లను స్పష్టతతో, న్యాయబద్ధంగా వర్తింపజేయగలుగుతుంది.

MCNలు, అలాగే ఇతర థర్డ్-పార్టీ సర్వీసు ప్రొవైడర్‌ల విషయంలో YouTube లేదా Google బాధ్యత తీసుకోదు, కానీ మీరు YouTube సర్టిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్‌ల లిస్ట్‌ను క్రియేటర్ సర్వీసుల డైరెక్టరీలో చూడవచ్చు.

MCN పార్ట్‌నర్ కావడానికి ఆసక్తిగా ఉన్నారా? మా ఎంటర్‌ప్రైజ్ ఇన్‌టేక్ ఫారమ్‌ను పూర్తి చేయండి, మేము మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాము!

MCNలతో కలిసి పని చేయడానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు

MCNలో చేరడం ఏ YouTube క్రియేటర్ విషయంలోనైనా ముఖ్య ఎంపిక. చేరడానికి ముందు, మీరు చేసిన పేమెంట్‌కు బదులుగా MCN ఎలాంటి సర్వీసులు అలాగే/లేదా ప్రయోజనాలను అందిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. మీ పేమెంట్‌లు ఏ సందర్బాల్లో విభజించి, డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి, అలాగే MCN మీకు పేమెంట్ చేయడంలో విఫలమయ్యే, లేదా మీకు స్వంతమైనదానికి సంబంధించి పేమెంట్ చేయని సందర్భాల్లో మీకు ఎలాంటి రక్షణలు ఉంటాయనేది మీరు అర్థం చేసుకున్నట్టు నిర్ధారించుకోవాలి. కొంతమంది క్రియేటర్‌లు MCNతో కలిసి పని చేసేందుకు ఎంచుకున్నప్పటికీ, YouTubeలో విజయవంతం అవ్వాలంటే మీరు MCNలో చేరాల్సిన అవసరం ఏమీ లేదు.

క్రియేటర్‌లందరి కోసం YouTube రిసోర్సులు

YouTube క్రియేటర్‌గా సహాయం పొందడం ఎలా, అలాగే మీరు MCNలో ఉన్నా, లేకపోయినా మీకు ఉండే YouTube సపోర్ట్ ఆప్షన్‌లను ఉపయోగించడం ఎలా అనే విషయం మీకు తెలుసని నిర్ధారించుకోండి.

మెరుగైన వీడియోలను క్రియేట్ చేయడంలో మీకు సహాయపడగల అన్ని ప్రోగ్రామ్‌లు, టూల్స్, అలాగే భవిష్యత్తులో జరగబోయే ఈవెంట్‌ల గురించి తెలుసుకోవడానికి క్రియేటర్ల కోసం YouTube చక్కని వేదికగా నిలుస్తుంది. క్రియేటర్ల కోసం YouTube ప్రయోజనాల ప్రోగ్రామ్ ద్వారా, మీ ఛానెల్‌ను వృద్ధి చేసుకోవడానికి కూడా మీరు సహాయం పొందవచ్చు.

MCNతో ఒప్పందంపై సంతకం చేయడం

MCN ఒప్పందాలు చట్టబద్ధంగా కట్టుబడి ఉంటాయి, కాబట్టి మీరు సమిష్టి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ స్వంత న్యాయవాదిని కూడా సంప్రదించవచ్చు.

మీరు MCNలో చేరడానికి ముందు, మీ ఒప్పందాన్ని చదివి, కనీసం ఈ కింది అంశాలను అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి:

  • నెట్‌వర్క్ విధించిన ఫీజు
  • మీ ఛానెల్‌కు అందించబడే నిర్దిష్ట సర్వీస్‌లు, సపోర్ట్ స్థాయి
  • నెట్‌వర్క్‌కు సంబంధించి మీ బాధ్యతలు
  • మీ ఒప్పంద వ్యవధి
  • మీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఎలా
ఆదాయం, పేమెంట్ పొందడం

మీరు MCNలో చేరినప్పుడు, మీ ఆదాయం అంతా మీ MCNకు చెందిన 'YouTube కోసం AdSense' ఖాతా ద్వారా వస్తుంది, మీ MCNకు మీ YouTube ఎనలిటిక్స్ ఆదాయ డేటాకు యాక్సెస్ ఉంటుంది.

MCNలో చేరడం ద్వారా YouTubeతో మీ ఆదాయ షేరింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు, ఇది సేవా నియమాల్లో వివరించబడింది. క్రియేటర్ వాటాను వారికి పేమెంట్ చేస్తున్నప్పుడు MCNలు సాధారణంగా ఆ ఆదాయంలో కొంత శాతాన్ని తీసుకుంటుంది.

కొన్ని MCNలు మీ ఛానెల్ మొత్తం ఆదాయాన్ని పెంచడంలో తోడ్పాటు అందించే బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు లేదా ప్రత్యేక సేల్స్ టీమ్‌ల వంటి అదనపు ఆదాయ అవకాశాలను కూడా అందిస్తాయి. ఒక నెట్‌వర్క్ మీకు ఈ సర్వీస్‌లను అందిస్తే, వాటిని మీ ఒప్పందంలో పేర్కొన్నట్టుగా మీరు నిర్ధారించుకోవచ్చు.

యాడ్స్‌ను బ్లాక్ చేయడం, కంట్రోల్ చేయడం

యాడ్స్‌ను కంట్రోల్ చేయడం అనేది తక్కువగానే చేయాల్సిన విషయం అయినప్పటికీ, అనుబంధ క్రియేటర్‌లు తమ ఛానెల్‌తో లింక్ చేయబడిన 'YouTube కోసం AdSense' ఖాతాలో ఈ పని చేయవచ్చు. యాడ్స్‌ను అనుమతించడం లేదా బ్లాక్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

స్ట్రయిక్‌లు & తొలగింపులు

మీ ఛానెల్‌పై ఉన్న కాపీరైట్ క్లెయిమ్, స్ట్రయిక్ లేదా తొలగింపును అర్థం చేసుకోవడంలో లేదా ఈ సమస్యలను అర్థం చేసుకోవడంలో MCN మీకు సహాయపడవచ్చుగానీ, ఇవి జరగకుండా MCN వాటిని నివారించలేదు. తమది కాని కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం వంటి YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్ లేదా కాపీరైట్ పాలసీల ఉల్లంఘనకు పాల్పడే ఛానెల్స్ MCNలో భాగమైనా, కాకపోయినా వాటిపై స్ట్రయిక్‌లు లేదా ఇతర జరిమానాలను విధిస్తారు.

మీరు మీ ఛానెల్‌ను స్ట్రయిక్‌లు, అలాగే తొలగింపుల బారిన పడకుండా ఉంచడం ఎలాగో పాలసీ మరియు భద్రతా కేంద్రం, అలాగే YouTube కాపీరైట్ కేంద్రంలో తెలుసుకోవచ్చు.

మీ ఛానెల్ నుండి MCN యాక్సెస్‌ను తీసివేయండి

మీరు అనుబంధిత క్రియేటర్ అయితే, MCNతో మీ ఒప్పందం ఇలా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుందని మీరు భావిస్తే, మీ ఛానెల్ నుండి మీరు MCN యాక్సెస్‌ను తీసివేయడానికి రిక్వెస్ట్ చేయవచ్చు.

MCNలకు సంబంధించి బెస్ట్ ప్రాక్టీసులు

MCNలు అన్నీ తమ క్రియేటర్‌లకు ఈ కింది వాటితో పాటుగా YouTube బెస్ట్ ప్రాక్టీసులను అనుసరిస్తూ విలువతో కూడిన సర్వీస్‌ను అందించే బాధ్యతను కలిగి ఉంటాయి:

  • గైడ్‌లైన్స్ ఉల్లంఘించే, MCNలో ఛానెల్స్ చేరేలా తప్పుదారి పట్టించే భాషను నివారించడం.
  • అందించే సర్వీస్‌లు, సోపర్ట్ స్థాయిని స్పష్టంగా ఒప్పందంలో వివరించడం.
  • అందించే సర్వీస్‌లు, అలాగే ఒప్పంద బాధ్యతల పట్ల నిజాయితీ, పారదర్శకతతో వ్యవహరించడం.
  • ఛానెల్స్‌తో ఒప్పందాలు చేసుకోవడం, అలాగే రద్దు చేసుకోవడం.

MCN ఈ బెస్ట్ ప్రాక్టీసులకు కట్టుబడి ఉండకపోతే, అది ఖాతా ఫీచర్‌లను, మానిటైజేషన్‌ను కోల్పోవచ్చు. ఒక MCN YouTube పాలసీలను అనుసరించకపోతే, క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4302448806100783445
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false