ఛానెల్ పేరు, వివరణ, అనువాదాలు, లింక్‌ల వంటి మీ YouTube ఛానెల్‌కు సంబంధించిన సాధారణ సమాచారాన్ని మీరు మేనేజ్ చేయవచ్చు.
పేరు
మీ YouTube ఛానెల్ పేరును మార్చవచ్చు, అది మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతోందని నిర్ధారించుకోండి అంతే. మీ పేరును మార్చిన తర్వాత, కొత్త పేరు అప్డేట్ అయ్యి, YouTube అంతటా ప్రదర్శించబడటానికి కొన్ని రోజులు పట్టవచ్చు. మీరు మీ YouTube ఛానెల్ పేరును, ఫోటోను మారిస్తే, అది YouTubeలో మాత్రమే కనిపిస్తుంది. మీ Google ఖాతా పేరుకు, ఫోటోకు ఇక్కడ (మీ YouTube ఛానెల్ పేరుకు ఎటువంటి మార్పులూ చేయకుండా) మార్పులు చేయవచ్చు.
- YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపు మెనూ నుండి, ప్రాథమిక సమాచారాన్ని అనుకూలంగా మార్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ కొత్త ఛానెల్ పేరును ఎంటర్ చేయండి.
- పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
Choosing Your YouTube Channel Name
హ్యాండిల్
హ్యాండిల్ అనేది YouTubeలో మీ ప్రత్యేక ఉనికిని ఏర్పరుచుకుని, నిర్వహించడాన్ని సులభతరం చేసే ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫయర్.
గమనిక: 14 రోజుల వ్యవధిలో మీ హ్యాండిల్‌ను మీరు రెండుసార్లు మార్చుకోవచ్చు.
- YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలీకరణ సాధారణ సమాచారాన్ని ఎంచుకోండి.
- హ్యాండిల్ కింద, మీరు మీ హ్యాండిల్‌ను చూడవచ్చు లేదా మార్చవచ్చు.
- మీరు మీ హ్యాండిల్‌ను మార్చినట్లయితే, దాన్ని నిర్ధారించడానికి పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
వివరణ
- YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలీకరణ సాధారణ సమాచారాన్ని ఎంచుకోండి.
- మీ కొత్త ఛానెల్ వివరణను ఎంటర్ చేయండి.
- పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మీ సర్వనామాలను జోడించడం లేదా మార్చడం
- YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి ప్రాథమిక సమాచారం సర్వనామాలను జోడించండి ను ఎంచుకోండి.
- మీ సర్వనామాలను ఎంటర్ చేయడాన్ని ప్రారంభించండి, మీకు సంబంధితంగా ఉన్న ఒక సర్వనామాన్ని ఎంచుకోండి. మీరు గరిష్ఠంగా నాలుగు సర్వనామాలను జోడించవచ్చు.
- మీరు మీ ఎంపికలను తీసివేయడానికి, మీ సర్వనామాలలో ఒకదాని పక్కన ఉన్న ను క్లిక్ చేయడం ద్వారా దాన్ని ఎడిట్ చేయవచ్చు.
- మీ సర్వనామాలను ఎవరు చూడవచ్చో ఎంచుకోండి:
- అందరికీ కనిపించాలి, లేదా
- నా సబ్స్క్రయిబర్లకు మాత్రమే కనిపించాలి
- పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఛానెల్ పేరు & వివరణకు సంబంధించిన అనువాదం
- YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి ప్రాథమిక సమాచారం భాషను జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఒరిజినల్ భాషను ఎంచుకొని, ఆపై అనువాద భాషను ఎంచుకోండి.
- మీ ఛానెల్ పేరు, వివరణకు అనువాదాలను ఎంటర్ చేయండి.
- పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఛానెల్ URL
- YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపు మెనూ నుండి, ప్రాథమిక సమాచారాన్ని అనుకూలంగా మార్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- లింక్‌ల కింద, లింక్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, టైటిల్‌ను, మీ సైట్ URLను ఎంటర్ చేయండి.
- పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపు మెనూ నుండి, ప్రాథమిక సమాచారాన్ని అనుకూలంగా మార్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- కాంటాక్ట్ సమాచారం కింద, మీ ఈమెయిల్‌ను ఎంటర్ చేయండి.
- పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మీ ఛానెల్ యొక్క సాధారణ సమాచారాన్ని ఎలా మేనేజ్ చేయాలో చూడండి
మీ ఛానెల్ పేరును, వివరణను, అనువాదాలను, లింక్‌లను ఎలా మార్చాలి అనే దాని గురించి తెలుసుకోవడానికి YouTube Creators ఛానెల్లోని ఈ కింది వీడియోను చూడండి.
Customize Your Channel Branding & Layout: Add a Profile Picture, Banner, Trailer, Sections, & more!