నేను ఎటువంటి కంటెంట్‌ను మానిటైజ్ చేయగలను?

మీ వీడియోలు లేదా షార్ట్‌లు, మానిటైజేషన్‌కు అర్హత పొందాలంటే ఆ కంటెంట్ తప్పనిసరిగా ఒరిజినల్ అయి ఉండాలి. రిపీట్ అవుతున్న కంటెంట్ కాకూడదు. ఈ రెండింటితో పాటు మా YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలు నిర్దేశిస్తున్న ఇతర ఆవశ్యకతలను కూడా పాటించాలి. మీ కంటెంట్‌లోని విజువల్ ఎలిమెంట్‌లను, ఆడియో ఎలిమెంట్‌లను వాణిజ్యపరంగా ఉపయోగించడానికి మీకు అవసరమైన అన్ని హక్కులు ఉన్నాయని కూడా నిర్ధారించుకోండి.

మీరు క్రియేట్ చేసిన కంటెంట్ కోసం గైడ్‌లైన్స్:

  • YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వండి
  • వీడియోలోని అన్ని ఎలిమెంట్‌లను మీరే క్రియేట్ చేయండి. ఉదాహరణలలో ఇవి ఉంటాయి:
    • రోజువారీ వ్లాగ్‌లు
    • హోమ్ వీడియోలు
    • మీ అంతట మీరే చేసిన వీడియోలు
    • ట్యుటోరియల్స్
    • ఒరిజినల్ మ్యూజిక్ వీడియోలు
    • ఒరిజినల్ షార్ట్ ఫిల్మ్స్
    • రీమిక్స్ కంటెంట్ ఉన్న షార్ట్‌లు లేదా లేని షార్ట్‌లు
  • మీరు క్రియేట్ చేసిన అన్ని విజువల్స్‌ను ఉపయోగించడానికి అవసరమైన అన్ని వాణిజ్యపరమైన హక్కులను మీరు కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.
  • అడ్వర్టయిజర్‌లు, అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్‌లో యాడ్స్‌ను ప్రదర్శించే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.

మీరు క్రియేట్ చేయని కంటెంట్ కోసం గైడ్‌లైన్స్:

మీరు మానిటైజేషన్‌ను కోల్పోకుండా వీడియోలలో Creator Musicలోని ట్రాక్‌లను చేర్చవచ్చు. కొన్ని పాటలకు ముందస్తు లైసెన్స్ ఉంటుంది. అలాంటి వాటిని, క్రియేటర్‌లు పూర్తి స్థాయి మానిటైజేషన్ కోసం ఉపయోగించవచ్చు. ఇతర పాటలకు సంబంధించి, వాటి హక్కుదారులతో ఆదాయాన్ని షేర్ చేసుకునే ఆప్షన్ ఉండవచ్చు.
న్యాయమైన వినియోగం - YouTubeలో కాపీరైట్
తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

ఇలా ఉంటే నా వీడియోను నేను మానిటైజ్ చేయవచ్చా...?

మీ కంటెంట్ రకం, మానిటైజ్ చేయదగినదా కాదా అన్నది తెలుసుకోవడానికి, అలాగే దాన్ని వాణిజ్యపరంగా వినియోగించడానికి మీకు హక్కులు ఉన్నాయని నిర్ధారించడానికి దిగువున క్లిక్ చేయండి.

నేను మొత్తం ఆడియో, విజువల్ కంటెంట్‌ను క్రియేట్ చేశాను


మీరు వీడియోకు సంబంధించిన హక్కులను కలిగి ఉన్నంత వరకు మీరు క్రియేట్ చేసిన కంటెంట్‌ను మానిటైజ్ చేయవచ్చు.

ఏదైనా మ్యూజిక్ లేబుల్‌తో మీరు ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే, ఆ ఒప్పందంలోని నియమాలను లేదా పరిమితులను బట్టి మీ వీడియోను మానిటైజ్ చేయవచ్చు. మీరు న్యాయవాదిని సంప్రదించాల్సి రావచ్చు.

నా స్వంత కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి నేను ఆడియో లేదా విజువల్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తాను

మానిటైజ్ చేయదగిన కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి ఆడియో లేదా విజువల్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించవచ్చు. మానిటైజేషన్ అనేది లైసెన్స్ యొక్క పరిధి, పరిమితులు, వాణిజ్యపరమైన అనుమతుల మీద ఆధారపడి ఉంటుంది. మీరు శాంపిల్స్‌ను లేదా లూప్‌లను ఉపయోగించినట్లయితే, వాణిజ్యపరమైన వినియోగం కోసం సదరు లైసెన్స్‌ను ప్రత్యేకంగా అనుమతించారని నిర్ధారించుకోండి. Shortsలో రీమిక్స్ కంటెంట్ కోసం, ఈ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వండి.

నేను రాయల్టీ-రహిత లేదా క్రియేటివ్ కామన్స్ కంటెంట్‌ను ఉపయోగిస్తాను


మీరు రాయల్టీ-రహిత లేదా క్రియేటివ్ కామన్స్ కంటెంట్‌ను మానిటైజ్ చేయాలంటే దానికి సంబంధించిన లైసెన్స్ ఒప్పందం, కంటెంట్‌ను వాణిజ్యపరంగా వినియోగించడానికి మీకు హక్కులు మంజూరు చేసి ఉండాలి. కంటెంట్‌ను వాణిజ్యపరంగా ఉపయోగించినప్పుడు కొన్నిసార్లు సంబంధిత హక్కులు ఉన్న ఓనర్‌లు, సదరు కంటెంట్ క్రియేటర్‌కు క్రెడిట్ ఇవ్వాలని లేదా మీ వీడియోలో ''కొనుగోలు రుజువు'' డాక్యుమెంట్‌ను చూపించాలని మిమ్మల్ని కోరవచ్చు.

మీ హక్కులను అర్థం చేసుకోవడానికి లైసెన్స్‌లను ఎలా చదవాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

వేరొకరు క్రియేట్ చేసిన ఆడియో‌ను లేదా విజువల్స్‌ను వినియోగించడానికి నాకు అనుమతి ఉంది

మీరు అలాంటి కంటెంట్‌ను మానిటైజ్ చేయవచ్చు. అయితే దానిని అన్నివేళలా వాణిజ్యపరంగా వినియోగించేందుకు హక్కుదారు నుండి స్పష్టంగా రాతపూర్వక అనుమతిని తప్పనిసరిగా కలిగి ఉండాలి.
నేను వీడియో గేమ్‌ను ఆడుతున్నాను లేదా క్లిష్టమైన లెవెల్స్‌ను పూర్తి చేయడానికి ఇతర వ్యక్తులకు సహాయం చేస్తున్నాను

మీరు వీడియో గేమ్ కంటెంట్‌ను మానిటైజ్ చేయాలనుకుంటే, సదరు వీడియో గేమ్ పబ్లిషర్ నుండి లైసెన్స్ తీసుకుని వాణిజ్యపరమైన వినియోగ హక్కులను పొందాల్సి ఉంటుంది. కొంతమంది వీడియో గేమ్ పబ్లిషర్‌లు వాణిజ్యపరమైన వినియోగం కోసం వీడియో గేమ్ కంటెంట్ మొత్తాన్ని ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించవచ్చు. ఈ సమాచారాన్ని వారి లైసెన్స్ ఒప్పందాలలో చూసి నిర్ధారించుకోవచ్చు.

ఇతర లైసెన్స్ ఒప్పందాలలో పబ్లిషర్‌లు, అర్థవంతమైన కంటెంట్ ఏదీ లేకుండా సుదీర్ఘ సమయం పాటు గేమ్‌లో పురోగతిని మాత్రమే చూపుతూ వెళ్లే వీడియోలకు వాణిజ్యపరమైన వినియోగ హక్కులను మంజూరు చేయకపోవచ్చు. లైసెన్సింగ్ నియమాల విషయానికొస్తే, కామెంటరీ కింది వాటికి సంబంధించినది అయితే మినహా, వీడియో గేమ్ వినియోగం తప్పనిసరిగా వీలైనంతగా తక్కువగా ఉండాలి:

  • బోధనాపరమైన/విద్యాపరమైన విలువ
  • వీడియోలో చూపిన చర్యలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంది
వీడియో గేమ్ & సాఫ్ట్‌వేర్ కంటెంట్ గురించి మరింత తెలుసుకోండి, గేమింగ్ & మానిటైజేషన్ కోసం మా యాడ్ ఫ్రెండ్లీ గైడ్‌లైన్స్‌ను చూడండి.
నేను సాఫ్ట్‌వేర్ వినియోగాన్ని ప్రదర్శించే ట్యుటోరియల్ వీడియోను రూపొందిస్తున్నాను

మీరు రూపొందించే సాఫ్ట్‌వేర్ యూజర్ ఇంటర్‌ఫేస్ కంటెంట్‌ను మానిటైజ్ చేసుకోవచ్చు. అయితే అది కూడా, సదరు సాఫ్ట్‌వేర్ లైసెన్స్ మంజూరు చేసే వాణిజ్యపరమైన వినియోగ హక్కుల మీద ఆధారపడి ఉంటుంది.

మీరు లైసెన్సింగ్ ఫీజును చెల్లించారని నిరూపించడానికి మీకు పబ్లిషర్‌తో ఉన్న ఒప్పందం లేదా రుజువు కొన్ని సందర్భాల్లో అవసరం పడవచ్చు. సాఫ్ట్‌వేర్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ల వినియోగం తప్పనిసరిగా సాధ్యమైనంత తక్కువగా ఉండాలి. అయితే కామెంటరీ, కింది వాటికి సంబంధించినది అయినప్పుడు మినహాయింపు ఉంటుంది:

  • బోధనాపరమైన/విద్యాపరమైన విలువ
  • కంటెంట్, వీడియోలో చూపిన చర్యలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంది

వీడియో గేమ్, సాఫ్ట్‌వేర్ కంటెంట్ల గురించి మరింత తెలుసుకోండి.

నేను పబ్లిక్ డొమైన్‌లో ఉన్న కంటెంట్‌ను ఉపయోగిస్తాను
 

కంటెంట్, పబ్లిక్ డొమైన్‌లో ఉంది అని పరిగణించబడాలి అంటే సదరు వర్క్‌పై కాపీరైట్ గడువు ముగిసి ఉండాలి, లేదా దానిపై కాపీరైట్‌ హక్కును కోల్పోయి ఉండాలి, లేదా ఇక మీదట ఆ హక్కు వర్తించకుండా ఉండాలి. మీ వీడియోలోని కంటెంట్, పబ్లిక్ డొమైన్‌లో ఉందని మీరు రుజువు చేస్తే, దానిని మానిటైజ్ చేసుకోవచ్చు.

గమనిక: ఇది లైసెన్స్ పరిధి, పరిమితులు, వాణిజ్యపరమైన అనుమతులపై ఆధారపడి ఉంటుంది.

పబ్లిక్ డొమైన్ కిందకు ఏది వస్తుంది అనేది పలు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
పబ్లిక్ డొమైన్ గురించి మరింత తెలుసుకోండి.
దీనిలో కవర్ సాంగ్‌కు సంబంధించి నా ఒరిజినల్ రికార్డింగ్ ఉంది

కొన్ని కవర్ సాంగ్‌లకు మానిటైజేషన్ అర్హత ఉండవచ్చు. అర్హత పొందడానికి, మ్యూజిక్ పబ్లిషర్ తప్పనిసరిగా కంటెంట్ ID సిస్టమ్ ద్వారా పాటను క్లెయిమ్ చేయాలి, అలాగే దానిని మానిటైజ్ చేయడానికి ఎంచుకోవాలి.

ఒకవేళ పాటను క్లెయిమ్ చేయకపోతే, మీ వీడియోను మీరు మానిటైజ్ చేయలేరు. పాటపై హక్కులు ఉన్న ఓనర్ నుండి స్పష్టమైన రాతపూర్వక అనుమతిని ముందుగానే పొంది ఉండాలి.

ఇన్‌స్ట్రుమెంటల్, కారియోకి రికార్డింగ్, లేదా ఆర్టిస్ట్ ద్వారా 'లైవ్ సంగీత కచేరీ ప్రదర్శన' వంటి ఏదైనా వాణిజ్యపరమైన సౌండ్ రికార్డింగ్‌ను ఉపయోగిస్తే దానికి మానిటైజేషన్ అర్హత ఉండదు.

అర్హత ఉన్న కవర్ వీడియోలను మానిటైజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

నేను పబ్లిక్ సంగీత కచేరీలు, ఈవెంట్‌లు, షోలు మొదలైన వాటికి సంబంధించి నా వ్యక్తిగత రికార్డింగ్‌ను ఉపయోగిస్తాను

కంటెంట్‌ను మీరే రికార్డ్ చేసినప్పటికీ, సాధారణంగా ఈ కంటెంట్‌కు సంబంధించి వాణిజ్య వినియోగానికి అవసరమైన హక్కులను ఒరిజినల్ క్రియేటర్ లేదా రచయిత కలిగి ఉంటారు.

ఏదైనా సంగీత కచేరీలో లేదా షోలో ఒక ప్రదర్శనను రికార్డ్ చేసి, దాన్ని మానిటైజ్ చేయాలి మీరు అనుకుంటే, సదరు ప్రదర్శనపై ఒరిజినల్ హక్కులు ఉన్న ఓనర్ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతిని పొందాలి.

నేను TV, DVD లేదా CD నుండి రికార్డింగ్ చేశాను

ఏదైనా కంటెంట్‌ను రికార్డ్ చేసింది మీరే అయినప్పటికీ, దానిని వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి అవసరమైన హక్కులు, సదరు కంటెంట్ క్రియేటర్‌కు లేదా రచయితకే చెంది ఉండే అవకాశం ఉంది.

మీరు రికార్డింగ్ చేసిన టీవీ షోను, DVDని లేదా CDని మానిటైజ్ చేసేందుకు గానూ, రికార్డ్ చేయబడిన ఆడియో లేదా విజువల్ అంశాలపై ఒరిజినల్ హక్కులు ఉన్న ఓనర్ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతిని పొంది ఉండాలి.

నేను కొనుగోలు చేసిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తాను

కంటెంట్‌ను మీరే స్వయంగా కొనుగోలు చేసినప్పటికీ, ఈ కంటెంట్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి అవసరమైన అనేక హక్కులను సాధారణంగా ఒరిజినల్ క్రియేటర్ లేదా రచయిత కలిగి ఉంటారు.

మీరు కొనుగోలు చేసిన థర్డ్ పార్టీ కంటెంట్‌పై సర్వ హక్కులు ఉన్న ఓనర్ మీకు వాణిజ్యపరమైన వినియోగ హక్కులను మంజూరు చేయకపోతే మీరు దాన్ని మానిటైజ్ చేయలేరు.

నేను ఆన్‌లైన్‌లో కనుగొన్న కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తాను

మీరు కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా కనుగొన్నప్పటికీ, సాధారణంగా కంటెంట్‌కు సంబంధించిన ఒరిజినల్ క్రియేటర్ దానిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి అవసరమైన చాలా హక్కులను కలిగి ఉంటారు.

అటువంటి కంటెంట్‌ను మీరు మానిటైజ్ చేయాలనుకుంటే, మీకు దానికి సంబంధించి అన్ని అవసరమైన వాణిజ్యపరమైన వినియోగ హక్కులు ఉన్నాయని నిర్ధారించుకోండి.

ఇందులో YouTube ఆడియో లైబ్రరీ మ్యూజిక్ ఉంది

మీరు YouTube ఆడియో లైబ్రరీలో ఉన్న మ్యూజిక్‌ను మానిటైజ్ చేయవచ్చు.

నేను న్యాయమైన వినియోగం ప్రకారం థర్డ్-పార్టీ కంటెంట్‌ను ఉపయోగించాను

వీడియోను మానిటైజ్ చేయడం సాధ్యమైనా, అది "న్యాయమైన వినియోగమే" అయినా కూడా, వాణిజ్యపరమైన వినియోగ రక్షణ యొక్క ప్రయోజనాన్ని పొందడం అనేది న్యాయమైనదిగా పరిగణించబడే అవకాశం తక్కువ. మరింత సమాచారం కోసం, YouTubeలో న్యాయమైన వినియోగం ఆర్టికల్‌ను చూడండి.

ఇప్పటికీ సహాయం కావాలా?

ఏ కంటెంట్‌ను మానిటైజ్ చేయవచ్చు లేదా ఏ కంటెంట్‌ను మానిటైజ్ చేయలేరు అన్న దానిపై మీకు ఇంకా అస్పష్టత ఉంటే, మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేయండి. YouTubeలో కాపీరైట్ ఎలా పని చేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఈ పేజీలోని అంశాలు పూర్తిగా విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడ్డాయి, ఇది చట్టపరమైన సలహా కాదు. చట్టపరమైన సలహాను పొందడానికి మీరు న్యాయవాదిని లేదా చట్టపరమైన ప్రతినిధిని సంప్రదించాలి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17531028724669337301
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false