యాడ్ పాలసీ ఓవర్‌వ్యూ

ఈ ఆర్టికల్‌లో, అడ్వర్టయిజర్‌లు అందరూ అనుసరించాల్సిన పాలసీలు మరియు మేము యాడ్‌లను ఎలా రివ్యూ చేయాలో మీరు నేర్చుకుంటారు.

మా పాలసీలు

YouTubeలో యాడ్‌లను ఉంచడానికి, మీరు తప్పనిసరిగా వీటిని పాటించాలి:

పాలసీ మార్గదర్శకాలు

మా పాలసీ మార్గదర్శకాల గురించి మరింత వివరణాత్మక సమాచారం మీకు కింద కనిపిస్తుంది:

నిషేధిత కంటెంట్

Google Networkలో మీరు అడ్వర్టయిజ్ చేయలేని కంటెంట్

నిషేధిత పద్ధతులు

మాతో అడ్వర్టయిజింగ్ చేసే సమయంలో మీరు చేయలేనివి

నియంత్రిత కంటెంట్

మీరు అడ్వర్టయిజ్ చేయగల కంటెంట్, అయితే పరిమితులతో

సంపాదకీయం, సాంకేతికం

మీ యాడ్స్, వెబ్‌సైట్‌లు యాప్‌లకు క్వాలిటీ స్టాండర్డ్స్

ఇతర ముఖ్యమైన పాలసీలు

యాడ్‌లు YouTubeలో కనిపించినప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మా ప్లాట్‌ఫామ్‌లో నడుస్తున్న ఏదైనా ప్రకటనకు వర్తించే ఇతర పాలసీలు దిగువున ఉన్న లింక్స్‌లో ఉన్నాయి:

పాలసీలు ఎక్కడ వర్తిస్తాయి

మా పాలసీలు మీ కంటెంట్‌లో అన్ని భాగాలకు వర్తిస్తాయి:

  • యాడ్‌లో టెక్స్ట్
  • యాడ్‌లో క్రియేటివ్ అంశాలు
  • మీ సైట్ లేదా మీ ఛానెల్ లేదా వీడియోలో ఉన్న కంటెంట్

మీ యాడ్ ఒకసారి రూపొందించబడిన తర్వాత, అది ఆటోమేటిక్‌గా రివ్యూ చేయబడుతుంది. మా యాడ్ రివ్యూ ప్రాసెస్ గురించి కింద మరింత తెలుసుకోండి.

మీ యాడ్‌లను మేము ఎలా రివ్యూ చేస్తాము

మీరు ఒక యాడ్‌ను లేదా ఎక్స్‌టెన్షన్‌ను రూపొందించడం లేదా ఎడిట్ చేయడం జరిగిన తర్వాత, రివ్యూ ప్రాసెస్ ఆటోమేటిక్‌గా ప్రారంభం అవుతుంది.

యాడ్ రివ్యూ వివరాలు

మేము దేనిని రివ్యూ చేస్తాము

  • హెడ్‌లైన్
  • వివరణ
  • కీవర్డ్‌లు
  • గమ్యస్థానం
  • ఇమేజ్‌లు
  • వీడియో.

రివ్యూవర్‌లు పరిశీలించే విషయాలు

వీడియో అనేది ఒక ప్రత్యేకమైన ఫార్మాట్ కాబట్టి, మీ యాడ్‌ను అంచనా వేసేటప్పుడు మాకు నిర్దిష్టమైన పరిశీలనలు ఉంటాయి, అవి:

  • వీడియోకు సంబంధించిన ఫోకల్ పాయింట్
  • కెమెరా కోణం, కొద్ది సమయం పాటు చూపే సీన్‌లు
  • మా యూజర్‌లకు కనిపించే ఇమేజ్‌ల స్పష్టత

మీరు ఏమి చేయవచ్చు

సందర్భం కీలకమైన అంశం, దానిని జోడించడం అనేది సరైన నిర్ణయం తీసుకోవడానికి మాకు సహాయపడుతుంది. మా సిస్టమ్‌లు తీసుకొనే నిర్ణయాలన్నీ సరైనవి కాకపోవచ్చు. మా సిస్టమ్‌లు మీ యాడ్‌లను "ఆమోదించనివి"గా మార్క్ చేస్తే, మీరు ఇక్కడ సూచనలను అనుసరించడం ద్వారా ఈ స్టేటస్‌ను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవచ్చు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి, మా మానవ రివ్యూవర్‌లు, మీ కంటెంట్‌ను, అలాగే సందర్భాన్ని అంచనా వేస్తారు.

మా యాడ్ ఆమోదం ప్రాసెస్ గురించి మరింత తెలుసుకోండి.

మా పాలసీల పరిచయం

మా యూజర్‌లు, అడ్వర్టయిజర్‌‌లు అలాగే పార్ట్‌నర్‌లకు ప్రయోజనం కలిగించే న్యాయమైన, స్థిరమైన పాలసీలతో అడ్వర్టయిజింగ్ సర్వీస్‌ను అందించడానికి YouTube కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మా సైట్‌లో ఆమోదించబడిన యాడ్‌ల విషయంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తాము. మా టెక్నికల్, కమ్యూనిటీ, అడ్వర్టయిజింగ్ గైడ్‌లైన్స్ ఇంకా పాలసీలు ఏర్పరిచినవి కూడా వీటిలో ఉంటాయి.

యాడ్స్ పాలసీల వివరాలు
ముందస్తు నోటీసు లేకుండా ఎప్పుడైనా మా అడ్వర్టయిజింగ్ పాలసీలు మార్చుకునే హక్కు మాకు ఉంది. తాజా అప్‌డేట్‌లను చెక్ చేసుకోవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. పార్ట్‌నర్ విక్రయ ప్రోగ్రామ్‌లో పాల్గొనే పార్ట్‌నర్‌లు మా యాడ్ పాలసీలకు బిల్లింగ్ నియమాలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. కొన్నిసార్లు సాంకేతిక లేదా పాలసీ పరిమితుల కారణంగా యాడ్‌లు, YouTube ద్వారా విక్రయించబడిన లేదా ఇవ్వబడిన వాటికి పరిమితం కావచ్చు.
మీ యాడ్‌లోని టెక్స్ట్ లేదా క్రియేటివ్ అంశాల మీద ఆధారపడి, ఈ పాలసీలు వర్తించవచ్చు. మీ సైట్ కంటెంట్, మీ ఛానెల్ లేదా వీడియో కంటెంట్ ఆధారంగా కూడా పాలసీలు వర్తించవచ్చు. మా పాలసీలను ఎల్లప్పుడూ విచక్షణతో అమలు జరుపుతాము, అలాగే మేము ఏదైనా ప్రమోషన్‌లను తిరస్కరించడానికి లేదా ఆమోదించడానికి హక్కును కలిగి ఉంటాము. ఈ పాలసీలను ఉల్లంఘించినందుకు మేము ఏదైనా ప్రమోషన్ ప్రచారాన్ని సస్పెండ్ వేయవచ్చు లేదా డిజేబుల్ చేయవచ్చు. మేము అనుచితం లేదా సముచితం కానిదిగా ఉన్న ఏ యాడ్‌నైనా సైట్ నుంచి తీసివేయడానికి కూడా మేము హక్కును కలిగి ఉంటాము. మీ యాడ్‌లు ఈ గైడ్‌లైన్స్‌కి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం మీ బాధ్యత అని గమనించండి. పాలసీ ఉల్లంఘనల కారణంగా సంబంధిత యాడ్‌లు లేదా వీడియోలు డిజేబుల్ చేయబడిన, సస్పెండ్ చేయబడిన లేదా వయోపరిమితి విధించబడిన ప్రమోషన్‌ల కోసం రీఫండ్‌లు జారీ చేయబడవు.
YouTube అడ్వర్టయిజింగ్ ఇంకా కంటెంట్ పాలసీలు మా వినియోగ నియమాలను పరిపూర్ణం చేస్తాయి. ఈ పాలసీలు, హోమ్ పేజీ డిస్‌ప్లే యాడ్‌లు, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇంకా మొబైల్ యాడ్‌ల వంటి రెండు సార్లు క్లిక్ చేసే ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లకు కూడా వర్తిస్తాయి.
YouTube లేదా దీని అడ్వర్టయిజింగ్ ప్రోగ్రామ్‌లను మీరు ఉపయోగిస్తున్నారంటే, మీ వెబ్‌సైట్, వీడియోలు లేదా అడ్వర్టయిజ్‌మెంట్‌లు అన్ని వర్తించే చట్టాలు, నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయని మీరు ప్రాతినిధ్యం వహించి, హామీ ఇస్తున్నారని అర్థం. ఈ చట్టాలలో, నియంత్రణలలో ఏవైనా సంబంధిత స్వీయ నియంత్రణ లేదా ఇండస్ట్రీ గైడ్‌లైన్స్ ఉంటాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6684360096234919047
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false