మీ YouTube ఖాతాను వెరిఫై చేయండి

మీ ఛానెల్‌ను వెరిఫై చేయడం కోసం, ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మేము ఆ ఫోన్ నంబర్‌కు టెక్స్ట్ లేదా వాయిస్ కాల్ ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతాము.

మీరు మీ ఖాతాను వెరిఫై చేసిన తర్వాత, మీరు వీటిని చేయవచ్చు:

అధునాతన ఫీచర్‌లను, యాక్సెస్ చేయడానికి, మీరు ముందుగా ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత మీరు సరిపడా ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకోవచ్చు లేదా IDని లేదా వీడియోను ఉపయోగించి వెరిఫికేషన్‌ను పూర్తి చేయవచ్చు.

మీరు సైన్ అప్ చేసినప్పుడు మీ ఖాతాను వెరిఫై చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని అడగవచ్చు. గమనిక: అన్ని క్యారియర్‌లు Google నుండి టెక్స్ట్ మెసేజ్ లు మరియు/లేదా వాయిస్ కాల్స్‌కు సపోర్ట్ ఇవ్వవు.

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

YouTube నా ఫోన్ నంబర్‌ను ఎందుకు అడుగుతుంది?

మేము స్పామ్, దుర్వినియోగాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాము. ఫోన్ నంబర్‌లను ఉపయోగించి గుర్తింపును వెరిఫై చేసి, మన కమ్యూనిటీని రక్షించడం, దుర్వినియోగంపై పోరాటం చేయడం ఒక మార్గం.

మీకు వెరిఫికేషన్ కోడ్‌ను పంపడానికి మేము ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తాము. ఫోన్ నంబర్ సంవత్సరానికి 2 కంటే ఎక్కువ ఛానెల్స్‌కు లింక్ చేయబడలేదని కూడా మేము నిర్ధారిస్తాము.

గమనిక: మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ విక్రయించము.

నాకు వెరిఫికేషన్ కోడ్ రాలేదు

మీకు వెంటనే కోడ్ వస్తుంది. ఒకవేళ మీకు అందకపోతే, మీరు కొత్త కోడ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. మీకు కోడ్ రాకపోతే, మీరు ఈ సాధారణ సమస్యలలో ఒకదానిని ఎదుర్కొంటూ ఉండవచ్చు:

  • కొన్ని క్యారియర్‌లు Google నుండి టెక్స్ట్ మెసేజ్‌లు లేదా వాయిస్ కాల్స్‌కు సపోర్ట్ ఇవ్వవు: చాలా వరకు మొబైల్ క్యారియర్‌లు Google నుండి టెక్స్ట్ మెసేజ్‌లను సపోర్ట్ చేస్తాయి. మీరు టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ కాల్ ఆప్షన్‌ను ట్రై చేయవచ్చు, లేదా వేరే క్యారియర్ నుండి ఫోన్ నంబర్‌ను ఉపయోగించవచ్చు. మీరు కొత్త కోడ్‌ను అందుకోకుంటే, మీ క్యారియర్ Google టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్‌లను సపోర్ట్ చేయకపోయే అవకాశం ఉంది.
  • ఒకే ఫోన్ నంబర్‌తో చాలా ఖాతాలు ఉన్నాయి: "ఈ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి ఇప్పటికే గరిష్ఠ సంఖ్యలో ఖాతాలను క్రియేట్ చేయడం జరిగింది" అని ఎర్రర్ మెసేజ్ మీకు కనిపిస్తే, మీరు వేరే నంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దుర్వినియోగాన్ని నివారించడంలో సహాయపడటానికి, ఒక ఫోన్ నంబర్‌ను సంవత్సరానికి 2 ఛానెల్స్‌కు మాత్రమే అనుబంధించే అవకాశం ఉంటుంది.
  • టెక్స్ట్ మెసేజ్ డెలివరీ ఆలస్యం కావచ్చు: జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లేదా మీ క్యారియర్ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోతే ఆలస్యం జరగవచ్చు. మీరు కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు వేచి చూసినప్పటికీ మా టెక్స్ట్ మెసేజ్‌ను అందుకోలేకపోతే, వాయిస్ కాల్ ఆప్షన్‌ను ట్రై చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5041802886033517252
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false