Creator Musicను ఉపయోగించి ఆదాయాన్ని షేర్ చేయండి

 
మానిటైజేషన్ కోసం అర్హత ఉందని, లేదా ఆదాయ షేరింగ్ కోసం అందుబాటులో ఉందని కనిపించే కొంత కంటెంట్‌ రష్యా, బెలారస్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్లాక్ చేయబడవచ్చు.
గమనిక: Creator Music బీటా వెర్షన్‌లో ఉంది. మేము దీన్ని క్రమక్రమంగా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లోని US క్రియేటర్‌లకు అందుబాటులోకి తీసుకురానున్నాము, ఆపై US వెలుపల ఉన్న YPP క్రియేటర్‌లకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాము.
ఈ ఆర్టికల్‌లో వివరించిన ఫీచర్‌లు వెబ్ బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉంటాయి.
 

ఆదాయాన్ని షేర్ చేయడానికి అర్హత ఉన్న ట్రాక్ ను మీ వీడియోలో మీరు ఉపయోగిస్తే, ఆ వీడియో ఆదాయాన్ని, ట్రాక్ హక్కుదారులతో మీరు షేర్ చేసుకోవచ్చని దీని అర్థం.

ఆదాయాన్ని షేర్ చేసుకోవడం ప్రారంభించండి

వీడియోలో మ్యూజిక్ ఆదాయ విభజనను యాక్టివేట్ చేయడానికి:

  1. ఆదాయాన్ని షేర్ చేసుకోగల ట్రాక్‌లను కనుగొనండి.
  2. ఆదాయ విభజన వినియోగ అవసరాలకు అనుగుణంగా ఉండే వీడియోను క్రియేట్ చేయండి.
  3. YouTubeలోకి వీడియోను అప్‌లోడ్ చేయండి.
  4. అప్‌లోడ్ ప్రాసెస్‌లో చెకప్ దశలో, మీ వీడియోలో కాపీరైట్ రక్షణ ఉన్న కంటెంట్ ఉందా, లేదా అని మేము చెక్ చేస్తాము. ఆదాయ విభజనకు అర్హత ఉన్న ట్రాక్ కనుగొనబడితే, మీ వీడియో ఆటోమేటిక్‌గా ఆదాయ విభజన కోసం ఎనేబుల్ చేయబడుతుంది (కంటెంట్‌లో ఆదాయాన్ని షేర్ చేసుకోకుండా చేసే కంటెంట్ ID క్లెయిమ్‌లు లేనంత వరకు).
మీ వీడియో YouTubeలో పబ్లిష్ చేయబడిన వెంటనే ఆదాయ విభజన ప్రారంభమవుతుంది.

ఆదాయ విభజనకు సంబంధించిన వినియోగ అవసరాలను అర్థం చేసుకోండి

Creator మ్యూజిక్ నుండి ఆదాయ విభజనకు అర్హత ఉన్న ట్రాక్‌లను ఉపయోగించే వీడియోలు, ఆదాయాన్ని షేర్ చేయడానికి అర్హత పొందాలంటే, తప్పనిసరిగా ఈ వినియోగ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి:

  • ట్రాక్, ఇంకా వీడియో వ్యవధి: సరైన నిడివి ఉండే వీడియోలో సరైన నిడివి ఉండే ట్రాక్ ఉపయోగించబడాలి:
    • ఒకవేళ ట్రాక్‌కు లైసెన్స్ పొందగలిగే వీలు ఉండి కూడా, మీకు లైసెన్స్‌ను కొనుగోలు చేయాలని లేకపోతే, మీరు 3 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉండే వీడియోలో 30 సెకన్ల కన్నా తక్కువ నిడివి ఉండే ట్రాక్‌ను ఉపయోగించడం ద్వారా ఆదాయాన్ని షేర్ చేయవచ్చు.
    • ఒకవేళ ట్రాక్‌కు లైసెన్స్ పొందగలిగే వీలు లేకపోయినా కూడా, ఆదాయ విభజనకు దానికి అర్హత ఉంటే, వీడియో వ్యవధితో సంబంధం లేకుండా మీకు ఎంత కావాలంటే అంత ట్రాక్‌ను ఉపయోగించి, ఆదాయాన్ని షేర్ చేయవచ్చు.
  • మానిటైజేషన్ సమస్యలు ఉండకూడదు: ఈ కింద పేర్కొనబడినటువంటి మానిటైజేషన్ సమస్యలు వీడియోకు ఉండకూడదు:
  • లైవ్ స్ట్రీమ్‌లు లేదా షార్ట్‌లు కాకూడదు: వీడియో అనేది లైవ్ స్ట్రీమ్ లేదా షార్ట్ అయ్యి ఉండకూడదు. Shorts ఆదాయ విభజన గురించి తెలుసుకోండి.
వినియోగ ఆవశ్యకతలను ఫాలో అవ్వకపోతే, మీ వీడియోకు కంటెంట్ ID క్లెయిమ్ లేదా కాపీరైట్ ఉల్లంఘన వల్ల తొలగింపు రిక్వెస్ట్ అందవచ్చు, దీని వలన మానిటైజేషన్ డిజేబుల్ అవ్వవచ్చు లేదా మీ వీడియో బ్లాక్ అవ్వవచ్చు.

వినియోగ ఆవశ్యకతలు అనేవి, హక్కుదారుల విచక్షణానుసారం మారవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, మీరు ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న ట్రాక్‌ను ఉపయోగించే వీడియోను అప్‌లోడ్ చేశాక, హక్కుదారు ఆ ట్రాక్‌కు మానిటైజేషన్‌ను తర్వాత ఎప్పుడైనా డిజేబుల్ చేయవచ్చు, అలా చేసినప్పుడు మీ వీడియోకు మానిటైజేషన్ డిజేబుల్ అవుతుంది. వినియోగ నియమాలకు మార్పులు, నిర్దిష్ట ప్రాంతాలకు గానీ, లేదా ప్రాంతాలన్నింటికీ గానీ వర్తించవచ్చు. 

ఆదాయ షేరింగ్‌ను ఎలా లెక్కిస్తారో అర్థం చేసుకోండి

Creator Musicతో, ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన ట్రాక్‌లను నిడివి ఎక్కువ ఉన్న వీడియో ఉపయోగిస్తే, ఈ కింద ఉన్న ఉదాహరణల్లో చూపిన విధంగా మ్యూజిక్ హక్కులు పొందేందుకు అయ్యే ఖర్చుల కోసం స్టాండర్డ్ 55% ఆదాయ షేరింగ్ సర్దుబాటు చేయబడుతుంది. ఇది ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:

  • ఉపయోగించిన ట్రాక్‌ల సంఖ్య: ఒక క్రియేటర్ తమ వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన ఎన్ని ట్రాక్‌లను ఉపయోగిస్తారు (ఈ కింద ఉదాహరణలను చూడండి).
  • అదనపు మ్యూజిక్ హక్కుల కోసం అయ్యే ఖర్చులు: ప్లే చేయగల హక్కుల వంటి అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చుల కోసం డిడక్షన్. ఈ డిడక్షన్ 5% దాకా ఉండవచ్చు, ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న Creator Music ట్రాక్‌లన్నింటికి సంబంధించిన ఈ అదనపు మ్యూజిక్ హక్కుల మొత్తం ఖర్చును ఇది ప్రతిబింబిస్తుంది.
ఆదాయ షేరింగ్ లెక్కింపుల ఉదాహరణలు

ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు

ఉదాహరణ: క్రియేటర్ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన 1 ట్రాక్‌ను ఉపయోగించి, స్టాండర్డ్ 55% ఆదాయ షేరింగ్‌లో సగం వాటా (27.5%)ను పొందుతారు. ఉదాహరణకు, అదనపు మ్యూజిక్ హక్కుల ధరలకు సంబంధించి డిడక్షన్ 2.5% ఉంటుంది.

ఈ వీడియో కోసం క్రియేటర్ మొత్తం ఆదాయంలో 25% పొందుతారు (27.5% - 2.5%).

 
ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు
ఉదాహరణ ఆదాయ షేరింగ్: 55% ÷ 2 27.5%
ఉదాహరణ అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులు - 2.5%
ఉదాహరణ మొత్తం ఆదాయం 25%

ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, అలాగే లైసెన్స్ పొందిన 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు

ఉదాహరణ: క్రియేటర్ తమ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, లైసెన్స్ ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించి, స్టాండర్డ్ 55% ఆదాయ షేర్‌లో 1/3 వంతు (18.33%)ను పొందుతారు. ఉదాహరణకు, అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులకు సంబంధించి డిడక్షన్ 2% ఉంటుంది.

ఈ వీడియో కోసం క్రియేటర్ మొత్తం ఆదాయంలో 16.33% పొందుతారు (18.33% - 2%).

 
ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, అలాగే లైసెన్స్ పొందిన 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు
ఉదాహరణ ఆదాయ షేరింగ్: 55% ÷ 3 18.33%
ఉదాహరణ అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులు - 2.5%
ఉదాహరణ మొత్తం ఆదాయం 15.83%

ఆదాయ విభజన స్టేటస్‌ను చెక్ చేయండి

వీడియోను పబ్లిష్ చేసిన తర్వాత, దాని ఆదాయ విభజన స్టేటస్‌కు సంబంధించిన సమాచారాన్ని మీరు YouTube Studioలో పొందవచ్చు:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్ ను ఎంచుకోండి.
  3. వీడియోల ట్యాబ్‌లో, మీరు ఆదాయ విభజన ట్రాక్‌ను జోడించిన వీడియోను కనుగొనండి.
  4. వీడియో ఆదాయాన్ని షేర్ చేస్తోందని నిర్ధారించుకోవడానికి, మానిటైజేషన్ నిలువు వరుసలో షేరింగ్ కోసం చూడండి.
  5. వివరాల కోసం, వీడియో థంబ్‌నెయిల్‌ను క్లిక్ చేయండి.
  6. ఎడమ వైపు మెనూలో, కాపీరైట్ ను ఎంచుకోండి
  7. వీడియోపై ప్రభావం నిలువు వరుసలో , ఆదాయాన్ని షేర్ చేయడంపై మౌస్ కర్సర్‌ను ఉంచండి.

హక్కుదారుల విచక్షణ మేరకు వినియోగ వివరాలు మారవచ్చని గుర్తుంచుకోండి.

 

మరింత సమాచారం

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13944925658741226655
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false