మీరు అర్హత ఉన్న క్రియేటర్ అయితే, మీ లైవ్ స్ట్రీమ్‌లో ఫీచర్ అయ్యే ప్రోడక్ట్‌లను మీరు ట్యాగ్ చేయవచ్చు. మీరు ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌ల లిస్ట్‌ను రివ్యూ చేయడానికి, వీక్షకులు Shopping ను ఎంచుకోవచ్చు. వీక్షకులు YouTubeలో ప్రోడక్ట్‌లను ఎలా కొనుగోలు చేయగలరు అనే దాని గురించి మరింత తెలుసుకోండి. అర్హత ఉన్న క్రియేటర్‌లు, తమ సొంత ప్రోడక్ట్‌లను, లేదా ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు. YouTubeలో షాపింగ్‌ను ఎలా ప్రారంభించాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.
ప్రమాణాలు, గైడ్‌లైన్స్
మీ సొంత ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి కావాల్సిన ఛానెల్ ప్రమాణాలు
మీ సొంత ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడాన్ని ప్రారంభించడానికి ముందు, మీ ఛానెల్‌కు YouTube Shoppingకు అర్హత ఉండాలి. అప్పుడు మీరు స్టోర్‌ను YouTubeకు కనెక్ట్ చేయవచ్చు, అలాగే మీ ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు.
ట్యాగ్ చేయబడిన ప్రోడక్ట్‌లు ఈ దేశాలు/ప్రాంతాల్లోని వీక్షకులకు మాత్రమే కనిపిస్తాయి, అలాగే వీక్షకుల దేశం/ప్రాంతానికి షిప్పింగ్ చేయడానికి ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉంటే మాత్రమే కనిపిస్తాయి.
ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి కావల్సిన ఛానెల్ ప్రమాణాలు
మీ లైవ్ స్ట్రీమ్‌లలో ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి, మీ ఛానెల్ తప్పనిసరిగా YouTube Shopping ఆవశ్యకతలకు అర్హతను కలిగి ఉండాలి.
ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లు ఈ దేశాలు/ప్రాంతాలలోని వీక్షకులకు మాత్రమే కనిపిస్తాయి. మేము వీక్షకులకు పూర్తి ప్రోడక్ట్ సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తాము. తద్వారా ప్రోడక్ట్‌ను ఏ దేశాలు/ప్రాంతాలకు డెలివరీ చేయవచ్చో వీక్షకులకు తెలుస్తుంది. నిర్దిష్ట దేశంలో వీడియో "షిప్పింగ్ ఏరియాస్ లిమిటెడ్" నిరాకరణతో పాటు ఉంటే, వ్యాపారి ఈ దేశాన్ని టార్గెట్‌గా చేసుకోలేదని అర్థం.
వీడియో గైడ్‌లైన్స్
లైవ్ స్ట్రీమ్‌లోని కంటెంట్‌కు సంబంధించిన అన్ని హక్కులను క్రియేటర్‌లు కలిగి ఉండాలి, అలాగే కంట్రోల్ చేయాలి లేదా అన్ని హక్కులను క్లియర్ చేయాలి. ఇందులో భాగంగా, పబ్లిక్‌గా ప్లే చేయగల హక్కుల వంటి ఏవైనా అవసరమైన మ్యూజిక్ హక్కులు ఉంటాయి. లైవ్ స్ట్రీమ్‌లలోని కంటెంట్ అంతా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను, అలాగే మా సర్వీస్ నియమాలను పాటించాలి.
వీడియో కింద పేర్కొన్న విధంగా ఉంటే, ప్రోడక్ట్ ట్యాగ్‌లు వీక్షకులకు చూపబడవు:
- క్లెయిమ్ చేయబడిన కంటెంట్‌ను కలిగి ఉంటే లేదా అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్ లేదా మ్యూజిక్ పార్ట్నర్తో అనుబంధించబడిన ఛానెల్స్‌తో అనుబంధించబడి ఉంటే
- కంటెంట్ పిల్లల కోసం రూపొందించినది అయితే
- పరిమితం చేయబడినదిగా లేదా మానిటైజేషన్‌కు అర్హత లేనిదిగా పరిగణించబడితే
- పెయిడ్ కంటెంట్ అయితే
- యాడ్ల కోసం బ్లాక్ చేయబడితే
ఇతర బ్రాండ్‌లకు చెందిన ప్రోడక్ట్‌ల విషయంలో ట్యాగ్ చేయడానికి సంబంధించిన గైడ్‌లైన్స్
ఎంపిక చేసిన రిటైలర్‌లలో కనీసం ఒకరి వద్ద ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉంటే మాత్రమే మీరు వాటిని ట్యాగ్ చేయగలరు. మీరు ప్రోడక్ట్‌ను ట్యాగ్ చేయాలనుకుంటున్న నిర్దిష్ట రిటైలర్‌ను కూడా ఎంచుకోవాలి. భవిష్యత్తులో మరింత మంది రిటైలర్‌లతో పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరింత తెలుసుకోవడానికి వారి YouTube ప్రతినిధిని ఆసక్తిగల పార్టీలు సంప్రదించవచ్చు.
మీరు ట్యాగ్ చేయలేని నిర్దిష్ట ప్రోడక్ట్‌లు ఇక్కడ ఉన్నాయి, లిస్ట్ ఇక్కడ పేర్కొన్న వాటికి మాత్రమే పరిమితం కాదు: పిల్లల ఆహారం, శుభ్రతా సామగ్రి, వ్యూహాత్మక గేర్.
ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి, పిన్ చేయండి, వాటి ఆర్డర్‌ను మార్చండి, అలాగే వాటిని తీసివేయండి
లైవ్ స్ట్రీమ్‌కు ముందే ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి
- YouTube Studioకు వెళ్లండి.
- క్రియేట్ చేయండి
లైవ్ స్ట్రీమ్ ప్రారంభించండి
ని క్లిక్ చేయండి.
- ఎడమ వైపు మెనూలో స్ట్రీమ్ చేయండి
లేదా మేనేజ్ చేయండి
అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- లైవ్ స్ట్రీమ్ ప్రివ్యూ దిగువ, Shopping ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
- ట్యాగ్ చేసిన మీ ప్రోడక్ట్‌లను ఎడిట్ చేయడానికి, "ట్యాగ్ ప్రోడక్ట్"ను తెరవడానికి ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- టాగ్‌లను జోడించండి లేదా తీసివేయండి
- ఒక ప్రోడక్ట్‌ను ట్యాగ్ చేయడానికి: సెర్చ్ బార్‌లో ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేయండి. తర్వాత, మీరు ట్యాగ్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ పక్కన ఉన్న, ట్యాగ్ చేయండి
ని క్లిక్ చేయండి.
- ఒక ప్రోడక్ట్‌ను తీసివేయడానికి: ప్రోడక్ట్ పక్కన ఉన్న, ట్యాగ్‌ను తీసివేయండి
చిహ్నాన్ని క్లిక్ చేయండి.
- ఒక ప్రోడక్ట్‌ను ట్యాగ్ చేయడానికి: సెర్చ్ బార్‌లో ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేయండి. తర్వాత, మీరు ట్యాగ్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ పక్కన ఉన్న, ట్యాగ్ చేయండి
- సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ మార్పులు ఒక్కో వీడియో స్థాయి సెట్టింగ్‌లలో కూడా ప్రతిబింబిస్తాయి.
- ప్రోడక్ట్ పికర్లో చూపిన ఆర్డర్, వీక్షకులకు చూపే ఆర్డర్ ఒకటే అయి ఉండాలి.
- మీరు లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు, అయితే అప్‌డేట్ చేసిన ఎంపిక ఇప్పటికే ఉన్న వీక్షకులకు కనిపించకపోవచ్చు.
- YouTube Studioలో లైవ్ స్ట్రీమ్ ముగిసిన తర్వాత కూడా మీరు ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు. కొత్తగా ట్యాగ్ చేయబడిన ప్రోడక్ట్‌లు రీప్లేల సమయంలో చూపబడతాయి.
లైవ్ స్ట్రీమ్ కోసం ఐటెమ్‌ను పిన్ లేదా అన్‌పిన్ చేయండి:
- YouTube Studioకు వెళ్లండి.
- క్రియేట్ చేయండి
లైవ్ స్ట్రీమ్ ప్రారంభించండి
ని క్లిక్ చేయండి.
- లైవ్ స్ట్రీమ్ ప్రివ్యూ దిగువున, Shopping ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
- ఐటెమ్‌లను పిన్ లేదా అన్‌పిన్ చేయండి:
- ఒక ఐటెమ్‌ను పిన్ చేయడానికి: మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్న ఐటెమ్ పక్కన ఉన్న, ప్రోడక్ట్‌ను పిన్ చేయండి చిహ్నాన్ని
క్లిక్ చేయండి.
- ఒక ఐటెమ్‌ను అన్‌పిన్ చేయడానికి: ప్రోడక్ట్‌ను అన్‌పిన్ చేయండిని క్లిక్ చేయండి.
- ఒక ఐటెమ్‌ను పిన్ చేయడానికి: మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్న ఐటెమ్ పక్కన ఉన్న, ప్రోడక్ట్‌ను పిన్ చేయండి చిహ్నాన్ని
లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రోడక్ట్‌లను పిన్ చేయండి:
మీ లైవ్ స్ట్రీమ్‌లో ప్రోడక్ట్‌లను హైలైట్ చేయడానికి మీరు పలు ఫీచర్ చేసిన ప్రోడక్ట్‌లను పిన్ చేయవచ్చు. ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లను ఆటోమేటిక్‌గా ఒక దాని తర్వాత ఒకటి పిన్ చేసి, ప్రతి 60 సెకన్లకు ఒకసారి రొటేట్ చేయడం కోసం లైవ్ కంట్రోల్ పేజీ (LCR) షాపింగ్ ట్యాబ్‌లో టోగుల్ స్విచ్‌ను ఆన్ చేయండి.
ప్రోడక్ట్‌లను తీసివేయండి, అలాగే వాటి ఆర్డర్‌ను మార్చండి
మీరు లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రోడక్ట్‌లను తీసివేయవచ్చు, అలాగే వాటి ఆర్డర్‌ను మార్చవచ్చు, అప్‌డేట్ చేయబడిన ఎంపిక ఇప్పటికే ఉన్న కొంత మంది వీక్షకులకు కనిపించకపోవచ్చు. ఉత్తమ వీక్షకుల అనుభవం కోసం, లైవ్ స్ట్రీమ్ ప్రారంభం కావడానికి కనీసం 30 నిమిషాల ముందు ప్రోడక్ట్‌లను తీసివేయడాన్ని, అలాగే వాటి ఆర్డర్‌ను మార్చడాన్ని పూర్తి చేయండి. లైవ్ స్ట్రీమ్ ముగిసిన తర్వాత కూడా మీరు ప్రోడక్ట్‌లను తీసివేయవచ్చు లేదా ఆర్డర్‌ను మార్చవచ్చు. కొత్తగా ట్యాగ్ చేయబడిన ప్రోడక్ట్‌లు రీప్లేల సమయంలో చూపబడతాయి.
ప్రోడక్ట్‌ల ఆర్డర్‌ను మార్చడానికి లేదా ప్రోడక్ట్‌లను తీసివేయడానికి:
- YouTube Studioకు వెళ్లండి.
- క్రియేట్ చేయండి
లైవ్ స్ట్రీమ్ ప్రారంభించండి
ని క్లిక్ చేయండి.
- ట్యాగ్ చేసిన మీ ప్రోడక్ట్‌లను ఎడిట్ చేయడానికి, "ట్యాగ్ ప్రోడక్ట్"ను తెరవడానికి ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీరు ఇప్పటికే ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌ను కనుగొనండి.
- ఐటెమ్‌ల ఆర్డర్‌ను మార్చడానికి: కావలసిన స్థానానికి ప్రోడక్ట్‌ను లాగండి.
- ఐటెమ్‌లను తీసివేయడానికి: ప్రోడక్ట్ పక్కన ఉన్న తొలగించండి
ని క్లిక్ చేయండి.
- మీరు చేసిన మార్పులను సేవ్ చేయడానికి సేవ్ చేయండిని ఎంచుకోండి.