మీ లైవ్ స్ట్రీమ్‌లలో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి

మీరు అర్హులైన క్రియేటర్ అయితే, మీరు మీ లైవ్ స్ట్రీమ్‌లో ఫీచర్ అయ్యే ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు. మీరు ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌ల లిస్ట్‌ను రివ్యూ చేయడానికి, వీక్షకులు Shopping shopping bag iconను ఎంచుకోవచ్చు. వీక్షకులు YouTubeలో ప్రోడక్ట్‌లను ఎలా కొనుగోలు చేయగలరు అనే దాని గురించి మరింత తెలుసుకోండి. అర్హత ఉన్న క్రియేటర్‌లు, తమ సొంత ప్రోడక్ట్‌లను, లేదా ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు.

ప్రమాణాలు, గైడ్‌లైన్స్

మీ సొంత ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి కావాల్సిన ఛానెల్ ప్రమాణాలు

మీ సొంత ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడాన్ని ప్రారంభించడానికి ముందు, మీ ఛానెల్‌కు YouTube Shoppingకు అర్హత ఉండాలి. అప్పుడు మీరు స్టోర్‌ను YouTubeకు కనెక్ట్ చేయవచ్చు, అలాగే మీ ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు. 

ట్యాగ్ చేయబడిన ప్రోడక్ట్‌లు ఈ దేశాలు/ప్రాంతాల్లోని వీక్షకులకు మాత్రమే కనిపిస్తాయి, అలాగే వీక్షకుల దేశం/ప్రాంతానికి షిప్పింగ్ చేయడానికి ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉంటే మాత్రమే కనిపిస్తాయి.

ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి కావల్సిన ఛానెల్ ప్రమాణాలు

మీ లైవ్ స్ట్రీమ్‌లలో ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి, మీ ఛానెల్ తప్పనిసరిగా YouTube Shopping ఆవశ్యకతలకు అర్హతను కలిగి ఉండాలి.

ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లు ఈ దేశాలు/ప్రాంతాలలోని వీక్షకులకు మాత్రమే కనిపిస్తాయి. మేము వీక్షకులకు పూర్తి ప్రోడక్ట్ సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తాము. తద్వారా ప్రోడక్ట్‌ను ఏ దేశాలు/ప్రాంతాలకు డెలివరీ చేయవచ్చో వీక్షకులకు తెలుస్తుంది. నిర్దిష్ట దేశంలో వీడియో "షిప్పింగ్ ఏరియాస్ లిమిటెడ్" నిరాకరణతో పాటు ఉంటే, వ్యాపారి ఈ దేశాన్ని టార్గెట్‌గా చేసుకోలేదని అర్థం. 

వీడియో గైడ్‌లైన్స్

లైవ్ స్ట్రీమ్‌లోని కంటెంట్‌కు సంబంధించిన అన్ని హక్కులను క్రియేటర్‌లు కలిగి ఉండాలి, అలాగే కంట్రోల్ చేయాలి లేదా అన్ని హక్కులను క్లియర్ చేయాలి. ఇందులో భాగంగా, పబ్లిక్‌గా ప్లే చేయగల హక్కుల వంటి ఏవైనా అవసరమైన మ్యూజిక్ హక్కులు ఉంటాయి. లైవ్ స్ట్రీమ్‌లలోని కంటెంట్ అంతా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను, అలాగే మా సర్వీస్ నియమాలను పాటించాలి.

వీడియో కింద పేర్కొన్న విధంగా ఉంటే, ప్రోడక్ట్ ట్యాగ్‌లు వీక్షకులకు చూపబడవు:

మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే కంటెంట్‌ను మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలని ఎంచుకుంటే, మేము మీ లైవ్ స్ట్రీమ్ మీద వయోపరిమితిని విధించవచ్చు లేదా దాన్ని తీసివేయవచ్చు. YouTubeకు తన విచక్షణ మేరకు, లైవ్ స్ట్రీమ్ చేయకుండా క్రియేటర్ మీద పరిమితి విధించే హక్కు కూడా ఉంది.

ఇతర బ్రాండ్‌లకు చెందిన ప్రోడక్ట్‌ల విషయంలో ట్యాగ్ చేయడానికి సంబంధించిన గైడ్‌లైన్స్

మీ లైవ్ స్ట్రీమ్‌లో ప్రోడక్ట్‌లు ప్రముఖంగా ఫీచర్ చేయబడి, సురక్షితంగా ఉపయోగించబడి, ఇంకా మీ లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించిన విషయానికి చెందినవి అయితే వాటిని ట్యాగ్ చేయండి. అత్యంత సందర్భోచితమైన అనుభవాన్ని అందించడానికి, మీ కంటెంట్‌లో ఫీచర్ అయిన ప్రోడక్ట్‌లను మీ వీక్షకులు కనుగొనగలరని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాము.
పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు కలిగిన కంటెంట్‌కు ప్రోడక్ట్‌లను జోడించే ముందు, మీకు ఏమైనా ఒప్పందం ప్రకారం చట్టపరమైన బాధ్యతలుంటే వాటిని రివ్యూ చేశారని నిర్ధారించుకోండి. YouTube పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు, ఎండార్స్‌మెంట్‌లను బహిర్గతం చేయడంతో సహా మీ కంటెంట్‌కు తగిన బహిర్గత ప్రకటనలను జోడించండి

ఎంపిక చేసిన రిటైలర్‌లలో కనీసం ఒకరి వద్ద ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉంటే మాత్రమే మీరు వాటిని ట్యాగ్ చేయగలరు. మీరు ప్రోడక్ట్‌ను ట్యాగ్ చేయాలనుకుంటున్న నిర్దిష్ట రిటైలర్‌ను కూడా ఎంచుకోవాలి. భవిష్యత్తులో మరింత మంది రిటైలర్‌లతో పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరింత తెలుసుకోవడానికి వారి YouTube ప్రతినిధిని ఆసక్తిగల పార్టీలు సంప్రదించవచ్చు.

మీరు ట్యాగ్ చేయలేని నిర్దిష్ట ప్రోడక్ట్‌లు ఇక్కడ ఉన్నాయి, లిస్ట్ ఇక్కడ పేర్కొన్న వాటికి మాత్రమే పరిమితం కాదు: పిల్లల ఆహారం, శుభ్రతా సామగ్రి, వ్యూహాత్మక గేర్.

ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి, పిన్ చేయండి, వాటి ఆర్డర్‌ను మార్చండి, అలాగే వాటిని తీసివేయండి

గమనిక: మీరు Android టాబ్లెట్ లేదా iPadను ఉపయోగిస్తుంటే, బదులుగా కంప్యూటర్‌లకు సంబంధించిన ట్యాగింగ్ సూచనలను చూడండి.

లైవ్ స్ట్రీమ్‌కు ముందే ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి

  1. మీ మొబైల్ లైవ్ స్ట్రీమ్‌ను క్రియేట్ చేయండి, అలాగే షెడ్యూల్ చేయండి.
  2. “ముందుగా ప్లాన్ చేసుకోండి” విభాగంలో, ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి ని ట్యాప్ చేయండి.
  3. మీకు అందుబాటులో ఉన్న ఏవైనా ప్రోడక్ట్‌ల కోసం సెర్చ్ చేయండి.
  4. మీరు లైవ్ స్ట్రీమ్‌లో ట్యాగ్ చేయాలనుకునే ప్రోడక్ట్‌ల పక్కన ఉన్న జోడించండి ని ట్యాప్ చేయండి. మీ లైవ్ స్ట్రీమ్‌లో మీరు గరిష్ఠంగా 30 ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు.
    • నిర్దిష్ట రిటైలర్‌లకు చెందిన ప్రోడక్ట్‌లను సెర్చ్ చేయడానికి, ఫిల్టర్ చేయండి ని క్లిక్ చేసి, రిటైలర్ పేరును ఎంటర్ చేయండి.
  5. మీరు ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లను రివ్యూ చేసి, వాటి ఆర్డర్‌ను మార్చడానికి చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ఒక ప్రోడక్ట్‌ను తీసివేయడానికి, ప్రోడక్ట్ పక్కన ఉన్న ఎడిట్ చేయండి ని ట్యాప్ చేయండి.
  6. పూర్తయింది అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీ మార్పులు ఒక్కో వీడియో స్థాయి సెట్టింగ్‌లలో కూడా ప్రతిబింబిస్తాయి.
గమనికలు:

లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి

మీరు లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు, అయితే అప్‌డేట్ చేసిన ఎంపిక ఇప్పటికే ఉన్న వీక్షకులకు కనిపించకపోవచ్చు. ఉత్తమ వీక్షకుల అనుభవం కోసం, లైవ్ స్ట్రీమ్ ప్రారంభం కావడానికి కనీసం 30 నిమిషాల ముందు ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడాన్ని పూర్తి చేయండి.

  1. మీ లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు Shopping ప్యానెల్‌ను పైకి లాగడానికి, Shopping ను ట్యాప్ చేయండి.
  2. ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీకు అందుబాటులో ఉన్న ఏవైనా ప్రోడక్ట్‌ల కోసం సెర్చ్ చేయండి.
  4. మీరు లైవ్ స్ట్రీమ్‌లో ట్యాగ్ చేయాలనుకునే ప్రోడక్ట్‌ల పక్కన ఉన్న జోడించండి ని ట్యాప్ చేయండి. మీ లైవ్ స్ట్రీమ్‌లో మీరు గరిష్ఠంగా 30 ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు.
    • నిర్దిష్ట రిటైలర్‌లకు చెందిన ప్రోడక్ట్‌లను సెర్చ్ చేయడానికి, ఫిల్టర్ చేయండి ని క్లిక్ చేసి, రిటైలర్ పేరును ఎంటర్ చేయండి.
  5. మీరు ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లను రివ్యూ చేసి, వాటి ఆర్డర్‌ను మార్చడానికి చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
    • ఒక ప్రోడక్ట్‌ను తీసివేయడానికి, ప్రోడక్ట్ పక్కన ఉన్న ఎడిట్ చేయండి ని ట్యాప్ చేయండి.
  6. పూర్తయింది అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీ మార్పులు ఒక్కో వీడియో స్థాయి సెట్టింగ్‌లలో కూడా ప్రతిబింబిస్తాయి.
గమనికలు:

లైవ్ స్ట్రీమ్ జరుగుతున్న సమయంలో ప్రోడక్ట్‌ను పిన్ చేయండి

మీరు లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు, ఒక ఐటెమ్‌ను మీ లైవ్ స్ట్రీమ్‌లో ప్రముఖంగా కనిపించేలా చేయడానికి, దాన్ని మీరు పిన్ చేయవచ్చు.

  1. మీ లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు Shopping ప్యానెల్‌ను పైకి లాగడానికి, Shopping ను ట్యాప్ చేయండి.
  2. మీ లైవ్ స్ట్రీమ్‌లో మీరు పిన్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ పక్కన ఉన్న పిన్ ను ట్యాప్ చేయండి.

మీ లైవ్ స్ట్రీమ్ నుండి ఒక ప్రోడక్ట్‌ను అన్‌పిన్ చేయాలనుకుంటే, మీరు పిన్ చేసిన ప్రోడక్ట్ పక్కన, మరిన్ని  ఆ తర్వాత పిన్‌ను తీసివేయండి ని ట్యాప్ చేయండి.

ప్రోడక్ట్‌లను తీసివేయండి, అలాగే వాటి ఆర్డర్‌ను మార్చండి

మీరు లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రోడక్ట్‌లను తీసివేయవచ్చు, అలాగే వాటి ఆర్డర్‌ను మార్చవచ్చు, అప్‌డేట్ చేయబడిన ఎంపిక ఇప్పటికే ఉన్న కొంత మంది వీక్షకులకు కనిపించకపోవచ్చు. ఉత్తమ వీక్షకుల అనుభవం కోసం, లైవ్ స్ట్రీమ్ ప్రారంభం కావడానికి కనీసం 30 నిమిషాల ముందు ప్రోడక్ట్‌లను తీసివేయడాన్ని, అలాగే వాటి ఆర్డర్‌ను మార్చడాన్ని పూర్తి చేయండి. లైవ్ స్ట్రీమ్ ముగిసిన తర్వాత కూడా మీరు ప్రోడక్ట్‌లను తీసివేయవచ్చు లేదా ఆర్డర్‌ను మార్చవచ్చు. కొత్తగా ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లను రీప్లేల సమయంలో చూపడం జరుగుతుంది.

ప్రోడక్ట్‌ల ఆర్డర్‌ను మార్చడానికి లేదా ప్రోడక్ట్‌లను తీసివేయడానికి:

  1. మీ లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు Shopping ప్యానెల్‌ను పైకి లాగడానికి, Shopping ను ట్యాప్ చేయండి.
  2. ఎడిట్ చేయండి ని ట్యాప్ చేయండి.
  3. మీరు ఇప్పటికే ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌ను కనుగొనండి.
    1. ఐటెమ్‌ల ఆర్డర్‌ను మార్చడానికి: కావలసిన స్థానానికి ప్రోడక్ట్‌ను లాగండి.
    2. ఐటెమ్‌లను తీసివేయడానికి: ప్రోడక్ట్ పక్కన ఉన్న తొలగించండి ని ట్యాప్ చేయండి.
  4. మీ మార్పులను సేవ్ చేయడానికి పూర్తయింది అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4245628860319026304
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false