YouTubeలో మీ స్టోర్ నుండి ప్రోడక్ట్‌లను షోకేస్ చేయడం

అర్హత గల క్రియేటర్లు, తమ ప్రోడక్ట్‌లను, అధికారిక బ్రాండెడ్ అమ్మకపు వస్తువులను YouTubeలో షోకేస్ చేయడానికి YouTube Shopping అనుమతిస్తుంది. ఈ లొకేషన్‌లలో ఉండే వీక్షకులు, YouTubeలో ఈ కింద పేర్కొన్న ప్లాట్‌ఫామ్‌లలో మీ ప్రోడక్ట్‌లను బ్రౌజ్ చేయగలరు, కొనుగోలు చేయగలరు:

  • మీ ఛానెల్‌కు సంబంధించిన స్టోర్‌లో
  • వీడియో వివరణలోని ప్రోడక్ట్‌లలో
  • మీ వీడియో అలాగే లైవ్ స్ట్రీమ్‌లకు దిగువున లేదా పక్కన ఉన్న ప్రోడక్ట్ షెల్ఫ్‌లో
  • మీ వీడియోలు, షార్ట్‌లు, అలాగే లైవ్ స్ట్రీమ్‌లలోని Shopping బటన్‌లో
  • కలెక్షన్‌లు

YouTube Studioలోని ఈ ప్లాట్‌ఫామ్‌లన్నింటిలో లేదా YouTube Studio మొబైల్ యాప్‌తో మీ ప్రోడక్ట్‌లను డిస్‌ప్లే చేయడానికి ఆర్గనైజ్ చేయవచ్చు. ఛానెల్ స్థాయి, నిర్దిష్ట వీడియో అమరికలతో, మీ అవసరాలకు తగినట్లు మీ ప్రోడక్ట్‌ల క్రమాన్ని అనుకూలంగా మార్చవచ్చు.

మీ ఛానెల్ స్టోర్‌ను లింక్ చేయడం ద్వారా లేదా మీ వీక్షకులకు కావాల్సిన కలెక్షన్‌లను క్రియేట్ చేసి, షేర్ చేయడం ద్వారా కూడా మీరు మీ ప్రోడక్ట్‌లను షోకేస్ చేయవచ్చు.

YouTube Shopping: మీ స్టోర్‌లోని ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి, విక్రయించండి

మీ ఛానెల్ కోసం ప్రోడక్ట్‌లను ఎంచుకోండి

మీరు ఒక స్టోర్‌ను కనెక్ట్ చేసినప్పుడు, డిస్‌ప్లే చేయడానికి మీ వద్ద అర్హత గల ఐటెమ్ కనీసం ఒకటి ఉంటే, అర్హత గల ప్రోడక్ట్‌లు ఆటోమేటిక్‌గా ఇక్కడ షోకేస్ చేయబడతాయి: 

  • మీ వీడియో వివరణలలో
  • మీ ఛానెల్ హోమ్ పేజీలోని స్టోర్ ట్యాబ్‌లో

ధర, జనాదరణ, ఇంకా లభ్యత వంటి వివిధ అంశాల ఆధారంగా మీ ప్రోడక్ట్‌లకు సంబంధించిన డిస్‌ప్లే క్రమం ఎంగేజ్‌మెంట్ కోసం ఆప్టిమైజ్ చేయబడుతుంది అలాగే ఆటోమేటిక్‌గా సెట్ చేయబడుతుంది. మీ మొత్తం ఛానెల్, ఇంకా స్టోర్ కోసం నిర్దిష్ట క్రమంలో డిస్‌ప్లే చేయడానికి మీరు ప్రోడక్ట్‌లను ఎంచుకోవచ్చు.

ఛానెల్ స్థాయిలో సెట్ చేయబడే అమరికలు, లైవ్ స్ట్రీమ్‌లకు వర్తించవు.

YouTube Studioలో మీ మొత్తం ఛానెల్, ఇంకా స్టోర్ కోసం డిస్‌ప్లే క్రమాన్ని అనుకూలంగా మార్చండి:

  1. సంపాదించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. Shopping ట్యాబ్‌ను క్లిక్ చేయండి. 
    • ఆటోమేటిక్‌గా సెట్ అయ్యి ఉండే ఎంపికను మీరు మొదటిసారి మారుస్తున్నట్లయితే, సొంత ఎంపికను క్రియేట్ చేసుకోండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మునుపటి ఎంపికను మీరు మారుస్తున్నట్లయితే, అనుకూలంగా మార్చండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. 30 ఐటెమ్‌ల వరకు లాగి, వదిలి, వాటిని క్రమపద్ధతిలో అమర్చండి.
  4. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు YouTube Studioకు చెందిన సంపాదించండి విభాగంలో మీ ఛానెల్ అలాగే స్టోర్ కోసం ఆటోమేటిక్‌గా సెట్ చేయబడే అమరికకు తిరిగి వెళ్లవచ్చు: Shopping ట్యాబ్ ఆ తర్వాత ఆటోమేటిక్ ఎంపికకు తిరిగి వెళ్లండి ఆ తర్వాత సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

నిర్దిష్ట కంటెంట్ కోసం ప్రోడక్ట్‌లను ఎంచుకోండి

మీ ప్రేక్షకుల కోసం మరింత అనుకూలంగా మార్చిన షాపింగ్ అనుభవాన్ని క్రియేట్ చేయడానికి ఒక్కో వీడియో లేదా షార్ట్‌కు గరిష్ఠంగా 30 ఐటెమ్‌లను ట్యాగ్ చేసి, వాటి క్రమాన్ని తిరిగి మార్చవచ్చు. మీరు లైవ్ స్ట్రీమ్ కోసం గరిష్ఠంగా 30 ఐటెమ్‌లను ట్యాగ్ చేయడానికి అలాగే వాటి క్రమాన్ని తిరిగి మార్చడానికి కూడా ఎంచుకోవచ్చు.

మీ ఛానెల్ స్టోర్‌కు లింక్ చేయడం

మీ స్టోర్ ట్యాబ్‌కు సంబంధించిన URLను కాపీ చేసి, దాన్ని కామెంట్‌లలో, వివరణలో, ఇంకా కమ్యూనిటీ పోస్ట్‌లలో పేస్ట్ చేయడం ద్వారా మీ స్టోర్ ట్యాబ్‌కు మీరు లింక్ చేయవచ్చు. మీరు వీడియో వివరణలలో అలాగే ఇతర మీడియా ఛానెల్స్‌లో మీ ఛానెల్ స్టోర్‌కు లింక్‌ను కూడా జోడించవచ్చు. వీక్షకులు ఆ లింక్‌ను క్లిక్ చేసినప్పుడు, వారి వీక్షణ అనుభవానికి ఏ మాత్రం అంతరాయం కలగకుండా, మీ స్టోర్‌లోని ఐటెమ్‌ల ప్రివ్యూ వారికి కనిపిస్తుంది. వీక్షకులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీ స్టోర్‌కు వెళ్లి, వారి కొనుగోలును పూర్తి చేయడానికి వారు మళ్లీ క్లిక్ చేయవచ్చు.

మీ ప్రోడక్ట్‌లతో ఉన్న సమస్యలను మేనేజ్ చేయడం

మీరు సపోర్ట్ ఉన్న రిటైలర్‌తో లేదా ప్లాట్‌ఫామ్‌తో మీ ఐటెమ్‌లను క్రియేట్ చేసినప్పుడు లేదా మార్చినప్పుడు, ఆ ఐటెమ్‌లు మా పాలసీలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి వాటిపై రివ్యూ జరుగుతుంది. ఈ రివ్యూ పూర్తి కావడానికి సాధారణంగా కొన్ని పని దినాల సమయం పడుతుంది.

YouTube Studioలో మీ ఐటెమ్‌లకు సంబంధించిన రివ్యూ స్టేటస్‌ను కనుగొనండి:

  1. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. Shopping ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  3. "స్టేటస్ కార్డ్"లో 'ఆర్గనైజ్ చేయండి'ని క్లిక్ చేయండి.
గమనిక: మీ ప్రోడక్ట్‌లు మా Google Merchant Center పాలసీలకు, అలాగే YouTube పాలసీలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి వాటిపై ఆటోమేటిక్‌గా రివ్యూ జరుగుతుంది. ఈ రెండు పాలసీలకూ అనుగుణంగా ఉంటే తప్ప, ప్రోడక్ట్‌లు YouTube Studioలో డిస్‌ప్లే చేయబడవు. ఏదైనా ఐటెమ్‌కు ఏవైనా మార్పులు చేసినట్లయితే (టైటిల్, వివరణ, లేదా ఇమేజ్‌తో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా), ఆ ఐటెమ్‌పై కొత్త అనుకూలత రివ్యూ ట్రిగ్గర్ అవుతుంది. ఈ రివ్యూ పూర్తి కావడానికి సాధారణంగా కొన్ని పని దినాల సమయం పడుతుంది.

"ఐటెమ్‌లను ఆర్గనైజ్ చేయండి" అనే ప్యానెల్‌లో నిర్దిష్ట ఐటెమ్‌లు కనిపించకపోవడం గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీ అమ్మకపు వస్తువుల రిటైలర్‌ను లేదా ప్లాట్‌ఫామ్‌ను సంప్రదించండి.

దిగువున పేర్కొన్న సందర్భాల్లో మీ కంటెంట్‌‌లోShopping ఫీచర్‌లు కనిపించవని గుర్తుంచుకోండి:

మీ ఛానెల్ లేదా నిర్దిష్ట కంటెంట్ నుండి Shopping ఫీచర్‌లను తీసివేయడం

మీరు ఎప్పుడైనా మీ ఛానెల్ నుండి Shopping ఫీచర్‌లను తాత్కాలికంగా తీసివేయవచ్చు లేదా మీ స్టోర్‌ను మొత్తంగా డిస్‌కనెక్ట్ చేయవచ్చు.

మీరు ఒక్కో వీడియో లేదా షార్ట్ నుండి Shopping ఫీచర్‌లను తీసివేయాలనుకుంటే, వీడియో లేదా షార్ట్ నుండి ప్రోడక్ట్‌లన్నింటికీ ఉన్న ట్యాగ్‌ను తీసివేయండి.

మీ ఛానెల్ నుండి Shopping ఫీచర్‌లను తాత్కాలికంగా తీసివేయడం

YouTube Studioలో మీ మొత్తం ఛానెల్ నుండి Shopping ఫీచర్‌లను తీసివేయడానికి కంప్యూటర్‌ను ఉపయోగించండి:

  1. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. Shopping ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  3. “Shopping” స్విచ్‌ను ఆఫ్ చేయడం ద్వారా ప్రోడక్ట్ షెల్ఫ్‌ను తాత్కాలికంగా తీసివేయండి.

మీ మొత్తం ఛానెల్ నుండి Shopping ఫీచర్‌లను తీసివేయడానికి Android లేదా iPhone కోసం YouTube Studio మొబైల్ యాప్ ‌ను ఉపయోగించండి:

  1. దిగువున ఉన్న మెనూలో, సంపాదించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. Shopping ట్యాబ్‌ను ట్యాప్ చేయండి.
  3. “ఛానెల్‌లోని ప్రోడక్ట్‌లు” విభాగం పక్కన ఉన్న మరిన్ని ని ట్యాప్ చేయండి.
  4. ఆఫ్ చేయండి ని ట్యాప్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11590929099863079040
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false