YouTubeలో మీ స్టోర్‌ను కనెక్ట్ చేయండి, మేనేజ్ చేయండి, డిస్‌కనెక్ట్ చేయండి

మీకు అర్హత ఉండి, సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్‌ను లేదా రిటైలర్‌ను ఉపయోగిస్తుంటే, మీరు డెస్క్‌టాప్ లేదా మొబైల్ ద్వారా మీ ఛానెల్ కోసం Shopping ఫీచర్‌లను ఆన్ చేయవచ్చు. మీ ఛానెల్ కోసం Shopping ఫీచర్‌లను ఆన్ చేయడానికి, మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్‌లను లేదా రిటైలర్‌లను YouTubeతో తప్పనిసరిగా కనెక్ట్ చేయాలి.

YouTube Shopping: మీ స్టోర్‌లోని ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి, విక్రయించండి

మీరు అర్హత కలిగి ఉండి, సపోర్ట్ కలిగిన ప్లాట్‌ఫామ్ లేదా రిటైలర్ ద్వారా మీ ప్రోడక్ట్‌లను విక్రయించకుంటే, మీ స్టోర్‌ను సెటప్ చేయడానికి వారి వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఆ తర్వాత YouTubeతో మీ స్టోర్‌ను కనెక్ట్ చేయండి. మీరు ఈ కింది రిటైలర్‌లు లేదా ప్లాట్‌ఫామ్‌లలో ఒక దానితో పని చేయాలనుకుంటే, మీ స్టోర్‌ను సెటప్ చేయడానికి వారి సైట్‌కు వెళ్లండి.

మీ ప్రోడక్ట్‌లను విక్రయించడానికి, సపోర్ట్ చేసే రిటైలర్‌ను లేదా ప్లాట్‌ఫామ్‌ను మీరు ఉపయోగిస్తున్నట్లయితే, మీరు మీ స్టోర్‌ను కనెక్ట్ చేయవచ్చు. మీ స్టోర్ కనెక్ట్ అయిన తర్వాత, మీరు మీ ఛానెల్ కోసం Shopping ఫీచర్‌లను ఆన్ చేయవచ్చు.

YouTubeలో మీ స్టోర్ నుండి ప్రోడక్ట్‌లను మేనేజ్ చేయడం ఎలాగో కూడా మీరు తెలుసుకోవచ్చు.

సపోర్ట్ ఉన్న Shopping ప్లాట్‌ఫామ్‌లు

  • Cafe24 (దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది)
  • FourthWall
  • Marpple Shop (దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది)
  • Shopify
  • Spreadshop
  • Spring (గతంలో Teespring)
  • Suzuri (జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది)

సపోర్ట్ కలిగిన Shopping రిటైలర్‌లు

మరింత మంది రిటైలర్‌లతో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరింత తెలుసుకోవడానికి వారి YouTube ప్రతినిధిని ఆసక్తి గల పార్టీలు సంప్రదించవచ్చు.

మీ స్టోర్‌లను YouTubeతో కనెక్ట్ చేయండి

YouTubeలో మీ స్వంత ప్రోడక్ట్‌లను విక్రయించడానికి మీరు మీ అధికారిక స్టోర్‌ను YouTubeతో కనెక్ట్ చేయవచ్చు. మీరు ఒకే వీడియో, షార్ట్ లేదా లైవ్ స్ట్రీమ్‌లో ఒకటి కంటే ఎక్కువ స్టోర్‌లను లింక్ చేయవచ్చు, అలాగే ప్రతి స్టోర్‌కు సంబంధించిన ప్రోడక్ట్‌లను డిస్‌ప్లే చేయవచ్చు.

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. Shopping ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మీ ఛానెల్ అర్హత కలిగి ఉంటే మాత్రమే ఈ ట్యాబ్ కనిపిస్తుంది.
  4. Shopping రిటైలర్‌తో లేదా ప్లాట్‌ఫామ్‌తో YouTubeను మీరు కనెక్ట్ చేసి ఉండకపోతే, ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. లేకపోతే, ప్రోడక్ట్ కార్డ్‌లో, కొత్త స్టోర్‌ను కనెక్ట్ చేయండి  ని క్లిక్ చేయండి.
  5. మీ అధికారిక అమ్మకపు వస్తువుల స్టోర్‌ను మీ YouTube ఛానెల్‌కు లింక్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

మీరు Shopping ట్యాబ్‌లోని "ప్రోడక్ట్‌లు" అనే విభాగంలో మీ స్టోర్‌ల పూర్తి లిస్ట్‌ను కనుగొనవచ్చు. మీకు ఎన్ని అవసరమైతే అన్ని స్టోర్‌లను లింక్ చేయండి.

మీరు ఎప్పుడైనా మరొక స్టోర్‌ను కనెక్ట్ చేయవచ్చు లేదా మీ స్టోర్‌ను డిస్‌కనెక్ట్ చేయవచ్చు. YouTubeలో మీ స్టోర్ నుండి ప్రోడక్ట్‌లను మేనేజ్ చేయడం ఎలాగో కూడా మీరు తెలుసుకోవచ్చు.

Shopify

మీ అడ్మిన్ అనుమతులను చెక్ చేయండి

YouTubeతో మీ Shopify స్టోర్‌ను కనెక్ట్ చేయడానికి ముందు, YouTube, అలాగే Shopify కోసం మీరు ఒకే ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. రెండు ఖాతాల విషయంలోనూ ఆ ఈమెయిల్ అడ్రస్‌కు అడ్మిన్ యాక్సెస్ ఉండాలి.

మీ ఈమెయిల్ అడ్రస్‌కు YouTubeలో ఓనర్/మేనేజర్ యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయండి

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయడానికి లేదా YouTube Studio మొబైల్ యాప్ ‌ను తెరవడానికి కంప్యూటర్‌ను ఉపయోగించండి.
  2. మీ సెట్టింగ్‌లకు వెళ్లండి.
  3. అనుమతుల దిగువున, మీ ఛానెల్‌కు, ఏ ఈమెయిల్ అడ్రస్‌కు మేనేజర్ లేదా ఓనర్ యాక్సెస్ ఉందో మీరు చెక్ చేయవచ్చు లేదా మీ అనుమతులను ఎడిట్ చేయవచ్చు.

మీ ఈమెయిల్ అడ్రస్‌కు మీ, Shopify స్టోర్‌లో సిబ్బంది యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయండి

మీకు సరైన స్థాయి యాక్సెస్ లేకపోతే, మీ Shopify అనుమతులను అప్‌డేట్ చేయండి.

మీ Shopify స్టోర్‌ను YouTubeతో కనెక్ట్ చేయండి

మీ Shopify స్టోర్‌ను YouTubeతో కనెక్ట్ చేయడానికి, YouTube Studio లేదా YouTube Studio మొబైల్ యాప్ ‌లోని రిటైలర్‌ల లిస్ట్ నుండి Shopifyఆ తర్వాతShopifyకి వెళ్లండి ఆప్షన్‌ను ఎంచుకోండి:

  1. Shopifyలో, మీ స్టోర్‌కు Google & YouTube యాప్‌ను జోడించి, సెటప్‌ను పూర్తి చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. మరింత సమాచారం కోసం, ఈ సెటప్ గైడ్‌ను చూడండి.
    1. మీరు Google & YouTube యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీ Google ఖాతాను Google & YouTube యాప్‌నకు కనెక్ట్ చేయండి:
      1. మీ Shopify అడ్మిన్ పేజీకి వెళ్లండి.
      2. సెట్టింగ్‌లు ఆ తర్వాత యాప్‌లు ఇంకా సేల్స్ ఛానెల్స్ ఆప్షన్‌ను తెరవండి.
      3. ఛానెల్స్ లిస్ట్ నుండి, Googleను ఎంచుకోండి.
      4. ఎగువున ఉన్న, సెట్టింగ్‌లు ఆ తర్వాత Google ఖాతా ఆప్షన్‌ను ఎంచుకోండి. లిస్ట్ చేయబడిన ఈమెయిల్, మీ YouTube ఛానెల్‌కు అడ్మిన్ యాక్సెస్‌ను కలిగి ఉందని నిర్ధారించుకోండి.
  2. Google & YouTube యాప్ నుండి, ఓవర్‌వ్యూ ఆ తర్వాత YouTube Shopping ఆ తర్వాత ప్రారంభించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీరు Shopifyకి కనెక్ట్ చేయాలనుకుంటున్న YouTube ఛానెల్‌ను ఎంచుకోండి.
    1. మీ ఈమెయిల్ అడ్రస్‌ను పలు YouTube ఛానెల్స్‌ను మేనేజ్ చేయడానికి ఉపయోగించినట్లయితే, అవి ఈ లిస్ట్‌లో కనిపిస్తాయి. Shopifyతో కనెక్ట్ చేయడానికి మీరు సరైన ఛానెల్‌నే ఎంచుకుంటున్నారని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.
  4. ప్రోగ్రామ్ నియమాలను జాగ్రత్తగా చదివి, ఆ నియమాలను అంగీకరించండి.
  5. సెటప్‌ను పూర్తి చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ స్టోర్ కనెక్ట్ అయిన తర్వాత, మీ ప్రోడక్ట్‌లు మా పాలసీలు అలాగే Google Merchant Center పాలసీలకు అనుగుణంగా ఉన్నాయా, లేదా అని నిర్ధారించడానికి మేము రివ్యూ చేస్తాము. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి సాధారణంగా కొన్ని పని దినాల సమయం పడుతుంది.

మీరు సమర్పించిన ఐటెమ్‌లు మా పాలసీలను ఫాలో అవ్వడం లేదనే విషయాన్ని మేము గమనిస్తే, ఒక్కొక్క ఐటెమ్‌ను మేము తిరస్కరిస్తాము. తిరస్కరించబడిన ఐటెమ్‌లను అప్పీల్ చేయడానికి, మీ అమ్మకపు వస్తువుల రిటైలర్‌ను లేదా మీ ఆన్‌లైన్ స్టోర్ అడ్మిన్‌ను సంప్రదించండి, తిరస్కరించబడిన ఐటెమ్‌లను రివ్యూ కోసం సమర్పించడానికి Google Merchant Centerను వారు ఉపయోగించగలరు.

మీ స్టోర్ షెల్ఫ్‌లో మీ ప్రోడక్ట్‌లను చూపండి

మీ స్టోర్ షెల్ఫ్ మీ ఛానెల్ స్టోర్‌ను కనుగొనడానికి, మీ ఛానెల్ హోమ్ పేజీ నుండి మీ ప్రోడక్ట్‌లను బ్రౌజ్ చేయడానికి మొబైల్‌లోని వీక్షకులను అనుమతిస్తుంది. మీ షెల్ఫ్‌లోని ఉత్పత్తులలో ప్రోడక్ట్ ఇమేజ్, పేరు, ధర, ఇంకా వీక్షకులు మీ స్టోర్‌కు వెళ్లడానికి క్లిక్ చేయగల 'అన్నీ చూడండి' బటన్ వంటి వివరాలు ఉంటాయి. మీరు డెస్క్‌టాప్‌లో మీ ఛానెల్ హోమ్ పేజీని అనుకూలంగా మార్చినప్పుడు మీరు షెల్ఫ్‌ను తరలించవచ్చు లేదా మీ హోమ్ పేజీ నుండి షెల్ఫ్‌ను తీసివేయవచ్చు.

ఆటోమేటిక్‌గా, మీ స్టోర్ షెల్ఫ్ మీ ఛానెల్ హోమ్ పేజీ ఎగువన కనిపిస్తుంది. దీన్ని తరలించడానికి:

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. మెనూ నుండి, అనుకూలంగా మార్చడం  ఆ తర్వాత మొదటి ట్యాబ్ ఆ తర్వాత స్టోర్ నుండి ప్రోడక్ట్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. లాగి, వదలండి చర్యను ఉపయోగించి షెల్ఫ్ స్థానాన్ని మార్చండి.

మీ స్టోర్ షెల్ఫ్ మీ ఛానెల్‌లో ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అవుతుంది. దీన్ని ఆఫ్ చేయడానికి:

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. మెనూ నుండి, అనుకూలంగా మార్చడం  ఆ తర్వాత మొదటి ట్యాబ్ ఆ తర్వాత స్టోర్ నుండి ప్రోడక్ట్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. టోగుల్ స్విచ్‌ను ఆఫ్ చేయండి.

YouTube నుండి మీ స్టోర్‌ను డిస్‌కనెక్ట్ చేయండి

మీ ఛానెల్ నుండి స్టోర్‌ను డిస్‌కనెక్ట్ చేయడానికి:

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. Shopping ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. కనెక్ట్ చేసిన స్టోర్‌కు పక్కన ఉన్న మరిన్ని ని క్లిక్ చేసి, స్టోర్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

స్టోర్ పాలసీలు

మీరు మీ స్టోర్‌లో ఫీచర్ చేసే ప్రోడక్ట్‌లు ఈ నియమాలతో సహా, YouTube సర్వీస్ నియమాలకు అనుగుణంగా ఉండాలి:

మీరు ఈ నియమాలు, పాలసీలను ఉల్లంఘిస్తే, ఈ కింది వాటిలో ఏవైనా లేదా ఒకదానికి ఈ పాలసీలకు అనుగుణంగా దారి తీయవచ్చు:

  • Shopping ఫీచర్‌ల తాత్కాలిక నిలిపివేత లేదా రద్దు
  • ఖాతా రద్దు

Shopping ఫీచర్‌లతో మీరు (లేదా ఛానెల్, లేదా వీడియో పేజీలో ఉన్న అమ్మకపు వస్తువులలో లేదా ఏదైనా కంటెంట్‌లో కనిపించిన ఎంటిటీ, వ్యక్తి లేదా ఆర్టిస్ట్) అందించే ఏ కంటెంట్ గానీ, అమ్మకపు వస్తువులు గానీ లేదా సర్వీస్‌లకు గానీ, Google హామీ ఇవ్వదు, కంటెంట్‌కు, అమ్మకపు వస్తువులకు, సర్వీస్‌లకు వర్తించే ఏవైనా ఒప్పందాల నియమాలు అనేవి Google ముందుగానే రాత పూర్వకంగా అలాంటి ఒప్పందాలకు ఆమోదం తెలియజేస్తే తప్ప వర్తించవు.

పైన పేర్కొన్న వాటిలో మీరు దేనికీ అంగీకరించకపోతే, మీ ఛానెల్ కోసం Shopping ఫీచర్‌లను ఆన్ చేయవద్దు. మీరు ఏ సమయంలోనైనా Shopping ఫీచర్‌లను ఆఫ్ కూడా చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12392534645875220800
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false