Creator Musicకు అర్హత, దానికి ఉన్న పరిమితులు

Creator Music ఫీచర్ ప్రస్తుతం U.S. క్రియేటర్‌లకు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో అందుబాటులో ఉంది. U.S. బయట ఉండే YPP క్రియేటర్‌లకు విస్తరించే ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.

Creator Musicకు అర్హత

Creator మ్యూజిక్‌ను ఉపయోగించడానికి అర్హత పొందాలంటే, YouTube క్రియేటర్‌లు తప్పనిసరిగా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉండాలి లేదా వారికి అర్హత ఉందని Google తెలియజేసి ఉండాలి. క్రియేటర్‌లు తప్పనిసరిగా వర్తించే అన్ని YouTube పాలసీలకూ కట్టుబడి ఉండాలి, కింద పేర్కొన్న పాలసీలకు మాత్రమే పరిమితం కాదు:

Creator మ్యూజిక్ ప్రస్తుతం వీటికి అందుబాటులో లేదు:

  • ప్రధానంగా థియేటర్లలో, టెలివిజన్‌లో, మరియు/లేదా ఓవర్-ది-టాప్ స్ట్రీమింగ్ టెలివిజన్ సర్వీస్‌ల ద్వారా రిలీజ్ అయ్యే వాణిజ్యపరమైన కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసే కంపెనీలు లేదా YouTube క్రియేటర్‌లకు.
  • సదరు బ్రాండ్‌లు, వస్తువులు, మరియు/లేదా సర్వీస్‌లను ప్రమోట్ చేయడమే ఉద్దేశంగా గల YouTube ఛానెళ్లను కలిగిన వాణిజ్యపరమైన బ్రాండ్‌లకు.

Google తన సొంత విచక్షణ మేరకు Creator Musicకు సంబంధించిన అర్హత ప్రమాణాలను మార్చే హక్కును కలిగి ఉంది.

Creator మ్యూజిక్‌కు ఉన్న పరిమితులు

YouTube వీడియోలలో Creator Music ట్రాక్‌లను ఎలా ఉపయోగించవచ్చు అనే దానిని కింద లిస్ట్ చేసిన పరిమితులు వివరిస్తాయి. Creator Music ద్వారా లైసెన్స్ జారీ చేసే అన్ని ట్రాక్‌లకూ ఈ పరిమితులు వర్తిస్తాయి. ఒక్కొక్క ట్రాక్‌కు, దాని స్వంత వినియోగ వివరాలు ఉంటాయి, వీటిని ట్రాక్ హక్కుదారులు సెట్ చేస్తారు.

పరిమితం చేయబడిన కేటగిరీలు

Creator మ్యూజిక్ నుండి లైసెన్స్ పొందిన ట్రాక్‌లను కింద పేర్కొన్న పరిమిత కేటగిరీలలోని కంటెంట్ దేనినీ వీడియోలలో ఉపయోగించడం లేదని క్రియేటర్‌లు నిర్ధారించుకోవాలి:

వాణిజ్యపరమైన వినియోగం

ఒక బ్రాండ్ లేదా సర్వీస్‌ను ఎండార్స్ లేదా ప్రమోట్ చేయడం కోసం, ప్రధానంగా కంటెంట్‌ను రూపొందించమని ఆ బ్రాండ్ లేదా సర్వీస్ క్రియేటర్‌కు పేమెంట్ చేసిన వీడియోలో, Creator Music నుండి ట్రాక్‌లను ఉపయోగించకుండా క్రియేటర్‌లను నిషేధించడం జరుగుతుంది.

వాణిజ్యపరమైన వినియోగ పరిమితులకు ఉదాహరణలు

అనుమతించబడేది: ఆహారానికి సంబంధించిన కంటెంట్‌ను క్రియేట్ చేసే క్రియేటర్ A, వీడియో ఇంట్రోలో భాగంగా థర్డ్-పార్టీ బ్రాండ్ స్పాన్సర్ చేసే ప్రోడక్ట్‌ను పేర్కొంటూ, 10 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేయడం. వీడియోలోని ఎక్కువ భాగం క్రియేటర్ కొత్త వంటకాన్ని వివరించడంపై ఫోకస్ చేసి ఉంటుంది.
అనుమతించబడనిది: సౌందర్యానికి సంబంధించిన కంటెంట్‌ను క్రియేట్ చేసే క్రియేటర్ Bకి ఒక బ్రాండ్ పేమెంట్ చేసి, వారి కొత్త ప్రోడక్ట్‌ను ప్రమోట్ చేసి, రివ్యూ చేసే వీడియోను క్రియేట్ చేయమనడం. క్రియేటర్ B ఆ కంపెనీ కొత్త ప్రోడక్ట్‌ను ప్రమోట్ చేసే ఉద్దేశంతో పబ్లిష్ చేసిన 10 నిమిషాల వీడియో.

అదనంగా, ఆదాయ షేరింగ్ ట్రాక్‌లు ఉపయోగించే వీడియోలకు YouTube Shopping ఫీచర్‌లకు అర్హత ఉండదు. Creator Musicను ఉపయోగించి ఆదాయాన్ని షేర్ చేసుకోవడం లేదా అర్హత గల కవర్ వీడియోలపై పొందిన ఆదాయాన్ని షేర్ చేసుకోవడం గురించి మరింత తెలుసుకోండి.

వినియోగ పరిమితులు

Creator Music నుండి ట్రాక్‌లకు లైసెన్స్ జారీ చేసే క్రియేటర్‌లు ఈ కింది వినియోగ పరిమితులను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి:

  • Creator Music ట్రాక్‌లను ఎంతమాత్రం మార్చకూడదు (ఉదా., రీమిక్సింగ్ లేదు).
  • కొత్త సాహిత్యాన్ని క్రియేట్ చేయకూడదు లేదా సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించకూడదు.
  • Creator Music ట్రాక్, ఆర్టిస్ట్‌ను లేదా పాటల రచయితను పేర్కొనడానికి మినహా ఆర్టిస్ట్ లేదా పాటల రచయిత పేరును లేదా వారి వివరాలను పోలిన వాటిని ఉపయోగించకూడదు.
  • Creator Music ట్రాక్‌ల నుండి ఆర్ట్ ట్రాక్ (మొత్తం పాట ప్లే అవుతున్నప్పుడు స్టాటిక్ ఇమేజ్), విజువలైజర్ (పాట మొత్తం ప్లే అవుతున్నప్పుడు సాధారణంగా ఎక్కువగా రిపీట్ అయ్యే విజువల్), లిరిక్ వీడియో లేదా కరోకే వీడియోను క్రియేట్ చేయకూడదు.
  • క్రియేటర్ వీడియో(ల) నుండి విడిగా Creator Music ట్రాక్‌లను అందుబాటులో ఉంచడం, డిస్ట్రిబ్యూట్ చేయడం లేదా ప్రదర్శించడం (ఉదా., మ్యూజిక్ ఫైల్స్ విడిగా లభించేలా చేసే డిస్ట్రిబ్యూషన్‌కు అనుమతి ఉండదు) చేయకూడదు
  • Creator Music ట్రాక్‌లను అవమానకరమైన రీతిలో ఉపయోగించడం లేదా కళాకారుడిని, రికార్డ్ లేబుల్ లేదా పాటల రచయితపై ప్రతికూల దృష్టిని కలుగజేయడం చేయకూడదు.

వినియోగ పరిమితులకు ఉదాహరణలు

అనుమతించబడుతుంది: క్రియేటర్ A ఒక ట్రాక్‌కు లైసెన్స్‌ను కొనుగోలు చేసి, ఒరిజినల్ పాటను ఎడిట్ చేయకుండా వారి వీడియో ఇంట్రోలో భాగంగా ఉపయోగించడం.

అనుమతించబడదు: క్రియేటర్ B ఒక పాటకు లైసెన్స్‌ను కొనుగోలు చేసి, థర్డ్-పార్టీ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆ పాటను రీమిక్స్ చేసి, ఆ కొత్త వెర్షన్‌ను జోడించడం.

ఈ పరిమితులను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు కావచ్చు, అనుబంధిత వీడియోలు కూడా తీసివేయబడవచ్చు. Creator Music పరిమితులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, Creator Music సర్వీస్ నియమాల విభాగానికి వెళ్లండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14940617354810328540
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false