Creator Music వినియోగ వివరాలను అర్థం చేసుకోండి

Creator Music ఫీచర్ ప్రస్తుతం U.S. క్రియేటర్‌లకు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో అందుబాటులో ఉంది. U.S. బయట ఉండే YPP క్రియేటర్‌లకు విస్తరించే ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.
గమనిక: ఈ ఆర్టికల్‌లో వివరించిన ఫీచర్‌లు వెబ్ బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

Creator మ్యూజిక్‌లో, ట్రాక్‌ను ఉపయోగించడానికి మీకు ఈ కింద ఉన్న ఆప్షన్‌లు కనిపించవచ్చు:

  • లైసెన్స్ పొందడం: మానిటైజ్ చేయబడే మీ వీడియోలో మ్యూజిక్‌ను ఉపయోగించడానికి ముందస్తు ఫీజు (లేదా కొన్ని ట్రాక్‌ల విషయంలో ఫీజు ఉండదు) పే చేయండి. మ్యూజిక్ లేనప్పుడు మానిటైజ్ చేయబడే మీ వీడియోలకు ఏ ఆదాయ షేరింగ్ అయితే వర్తిస్తుందో, ఆ ఆదాయ షేరింగ్‌నే పొందండి.

  • ఆదాయాన్ని షేర్ చేసుకోవడం: ఈ ఆప్షన్‌లో ముందస్తు ఫీజు పే చేయవలసిన అవసరం లేదు, వీడియో ద్వారా వచ్చే ఆదాయం ట్రాక్ హక్కుదారులతో షేర్ చేయబడుతుంది.

పాటను ఏ విధంగా ఉపయోగించాలో నిర్వచించే వినియోగ వివరాలు, ట్రాక్‌ను బట్టి మారుతుంటాయి. ఏ ట్రాక్‌కు అయినా వినియోగ వివరాలను ఆ ట్రాక్ హక్కుదారులు సెట్ చేస్తారు, అలాగే వారి విచక్షణానుసారం వాటిని వారు మార్చవచ్చు.

వీటిని గుర్తుంచుకోండి:
 

లైసెన్స్‌లకు సంబంధించిన వినియోగ వివరాలు

ఇతర వ్యక్తులకు హక్కులు ఉన్న కంటెంట్‌ను ఎవరైనా ఉపయోగించే చట్టపరమైన అనుమతిని లైసెన్స్ అందిస్తుంది. మీరు ఏ ట్రాక్‌కు అయినా లైసెన్స్‌ను పొందే ముందు, దాని వినియోగ వివరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా మీరు లైసెన్స్ పొందుతున్న ట్రాక్‌ను ఉపయోగించడానికి ఏ అనుమతులు మీకు ఉన్నాయో మీకు తెలుస్తుంది.

ధర

మ్యూజిక్‌కు హక్కులు ఉండే మ్యూజిక్ లేబుల్స్, ఇంకా పబ్లిషర్‌ల వంటి మ్యూజిక్ పార్ట్‌నర్‌ల నుండి నేరుగా మ్యూజిక్‌కు లైసెన్స్‌ను పొందే వీలును క్రియేటర్‌లకు Creator మ్యూజిక్ కల్పిస్తుంది. హక్కుదారులుగా మ్యూజిక్ పార్ట్‌నర్‌లు, Creator మ్యూజిక్‌లో లైసెన్సింగ్ కోసం అవి అందించే ట్రాక్‌ల లైసెన్స్ ధరతో సహా వినియోగ వివరాలను సెట్ చేస్తాయి.

కొన్ని లైసెన్స్‌లకు క్రియేటర్‌లందరికీ ఒకే ధర సెట్ చేయబడి ఉంటుంది, ఇంకొన్ని ట్రాక్‌లకు అయితే, ఛానెల్ సైజును బట్టి అనుకూలంగా మార్చబడిన ధర ఉండవచ్చు. కొన్ని లైసెన్స్‌లను ఎటువంటి ధరనూ పే చేయాల్సిన అవసరం లేకుండా పొందవచ్చు, ఉదాహరణకు, YouTube ఆడియో లైబ్రరీ లైసెన్స్‌లు, క్రియేటివ్ కామన్స్ లైసెన్స్‌లు, ఇంకా హక్కుదారులు అందించే ఇతర ఉచిత లైసెన్స్‌లు.

ట్రాక్ హక్కుదారుల విచక్షణానుసారం లైసెన్స్‌ల ధరలు మారే అవకాశం ఉంది. లైసెన్స్ ధర మారినప్పుడు, గతంలో చేసిన లైసెన్స్ కొనుగోళ్లు, లేదా లైసెన్స్ వినియోగాలు ప్రభావితం కావు.

మీకు లైసెన్స్‌ను కొనుగోలు చేయాలని లేకపోతే, మీ వీడియో ఆదాయ విభజనకు సంబంధించిన వినియోగ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉంటే, మీరు ఆదాయాన్ని షేర్ చేయడానికి ఎంచుకోవచ్చని గుర్తుంచుకోండి.

పాటలో భాగం

ట్రాక్‌లో ఎంత భాగాన్ని వీడియోలో ఉపయోగించడానికి హక్కుదారులు అనుమతిస్తారో, ఆ భాగాన్ని పాటలో భాగం అని అంటారు.

మీరు లైసెన్స్ పొందాలనుకునే ఏ లైసెన్స్ పొందగల ట్రాక్ విషయంలో అయినా, వీడియో వ్యవధితో సంబంధం లేకుండా, మీరు పాటలో ఎంత భాగాన్ని అయినా ఉపయోగించుకోవచ్చు.

మీరు లైసెన్స్ కొనుగోలు చేయాలనుకోని లైసెన్స్ పొందగల ట్రాక్‌ల విషయంలో, 3 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉండే వీడియోలో మీరు 30 సెకన్ల కన్నా తక్కువ నిడివి ఉన్న పాటను ఉపయోగించినప్పుడు, ఆదాయాన్ని షేర్ చేయడానికి ఎంచుకోవచ్చు, కొనడానికి బదులుగా మీరు ఇలా చేయవచ్చు. ఆదాయ విభజన వినియోగ నియమాల గురించి మరింత తెలుసుకోండి.

సపోర్ట్ ఉన్న ప్రాంతాలు
ఏ దేశాలు/ప్రాంతాలు అయితే, ట్రాక్ హక్కుదారులచే ట్రాక్ వినియోగాన్ని అనుమతిస్తాయో, అలాగే లైసెన్స్ పరిధిలోకి వస్తాయో, అలాంటి దేశాలు/ప్రాంతాలను సపోర్ట్ ఉన్న ప్రాంతాలు అంటారు.
Creator Musicలోని నిర్దిష్ట ట్రాక్‌లు, నిర్దిష్ట దేశాలు/ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండవచ్చు. ఇటువంటి సందర్భంలో, మీరు ట్రాక్ వినియోగ వివరాల గురించి మీకు, సపోర్ట్ ఉన్న ప్రాంతాలకు పక్కన, పరిమితం చేయబడ్డాయి అనే ఆప్షన్ కనిపిస్తుంది.
సపోర్ట్ ఉన్న ప్రాంతాలు అన్నీ అని లిస్ట్ చేయబడి ఉన్నప్పటికీ, మీరు ఆదాయ షేరింగ్ వినియోగ నియమాల ప్రకారం ట్రాక్‌ను వినియోగించాలని నిర్ణయించుకుంటే (అలాగే దానికి లైసెన్స్ ఇవ్వకపోతే), అప్పుడు ట్రాక్ వినియోగం అనేది ఆదాయ షేరింగ్ అందుబాటులో ఉన్న దేశాలు/ప్రాంతాలకు పరిమితం చేయబడవచ్చని గుర్తుంచుకోండి. మీ వీడియో ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడ షేర్ అవుతుందో చూడటానికి, మీ వీడియోకు సంబంధించిన ఆదాయ విభజన స్టేటస్‌ను చెక్ చేయండి.
గడువు

మీరు లైసెన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీ లైసెన్స్ ఎంత కాలం యాక్టివ్‌గా ఉంటుందో అనే విషయాన్ని మీ లైసెన్స్ గడువు మీకు తెలియజేస్తుంది. Creator Music స్టోర్‌లోని ప్రతి ట్రాక్, హక్కుదారునిచే సెట్ చేసిన వేర్వేరు నియమాలను కలిగి ఉంటుంది, కాబట్టి మీ లైసెన్స్ వ్యవధి అనేది మీరు లైసెన్స్ ఇచ్చిన ట్రాక్‌ను బట్టి మారుతూ ఉంటుంది.

Creator Music మార్కెట్‌ప్లేస్ నుండి మీరు లైసెన్స్‌ను కొనుగోలు చేసిన వెంటనే లైసెన్స్ ప్రారంభమవుతుంది. దాని గడువు ముగిసిన తర్వాత, ఆ ట్రాక్‌ను కలిగి ఉన్న వీడియోలు కింద పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉండవచ్చు:

  • అప్‌డేట్ చేయబడిన మానిటైజేష‌న్ నియమాలు
  • వీడియో విజిబిలిటీకి చేసిన మార్పులు
  • కొత్త కాపీరైట్ క్లెయిమ్‌లు

మీ వీడియో ఆదాయానికి జరిగిన అంతరాయాన్ని నివారించడానికి, మీరు కొనుగోలు చేసిన ట్రాక్‌ల కోసం లైసెన్స్‌లను రీ-యాక్టివేట్ చేయవచ్చు.

వీడియో మానిటైజేషన్
మీరు Creator మ్యూజిక్ నుండి ఏదైనా ట్రాక్‌కు లైసెన్స్ పొంది, దాన్ని వీడియోలో ఉపయోగించినప్పుడు, మీ వీడియోలో ఉండే థర్డ్-పార్టీ కంటెంట్ అంతటినీ ఉపయోగించడానికి మీకు లైసెన్స్ ఉన్నంత కాలం (లేదా మీ వీడియోలో ఉండే లైసెన్స్ పొందని థర్డ్-పార్టీ కంటెంట్‌ను ఉపయోగించడానికి కావలసిన హక్కులన్నీ మీకు ఉన్నంత కాలం) మీ వీడియోను మీరు పూర్తిగా మానిటైజ్ చేసుకోవచ్చు.
లైసెన్స్ పొందిన ట్రాక్‌లను ఉపయోగించే వీడియోలకు YouTube వీక్షణా పేజీలో వచ్చే వీక్షణల ద్వారా ఆదాయం వస్తుంది కానీ షార్ట్‌ల నుండి కానీ లైవ్ స్ట్రీమ్‌ల నుండి కానీ రాదని గుర్తుంచుకోండి.
మీరు ఆదాయ షేరింగ్ వినియోగ నియమాల ప్రకారం ట్రాక్‌ను వినియోగించాలని నిర్ణయించుకుంటే (అలాగే దానికి లైసెన్స్ ఇవ్వకపోతే), అప్పుడు మానిటైజేషన్ అనేది ట్రాక్ హక్కుదారులతో షేర్ చేయబడుతుంది, ఇంకా ఆదాయ షేరింగ్ అందుబాటులో ఉన్న దేశాలు/ప్రాంతాలకు పరిమితం చేయబడవచ్చు. మీ వీడియో ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడ షేర్ అవుతుందో చూడటానికి, మీ వీడియోకు సంబంధించిన ఆదాయ విభజన స్టేటస్‌ను మీరు చెక్ చేసుకోవచ్చు.
కంటెంట్ రకం
Creator మ్యూజిక్ ద్వారా లైసెన్సింగ్ కోసం కానీ లేదా ఆదాయ విభజన కోసం కానీ అందుబాటులో ఉన్న ట్రాక్‌లను నిడివి ఎక్కువ ఉన్న వీడియోలలో మాత్రమే ఉపయోగించవచ్చు, షార్ట్‌లు లేదా లైవ్ స్ట్రీమ్‌లలో కాదు. Shortsలో ఆదాయాన్ని షేర్ చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి, Shortsతో యాడ్ ఆదాయం లింక్‌కు వెళ్లండి.
లైసెన్స్ వినియోగం గురించి ఇతర వివరాలు
  • కేవలం YouTube ఆడియో లైబ్రరీ లైసెన్స్‌లను మాత్రమే YouTubeకు అప్‌లోడ్ చేయబడిన పలు వీడియోలలో ఉపయోగించవచ్చు. ఇతర Creator మ్యూజిక్ పెయిడ్ లైసెన్స్‌లన్నింటినీ, YouTubeకు అప్‌లోడ్ చేయబడిన ఒకే వీడియోలో, అది కూడా ఒకసారే ఉపయోగించవచ్చు. 
  • Creator Music లైసెన్స్‌లను ఇతర ప్లాట్‌ఫామ్‌లకు లేదా ఇతర YouTube ఛానెల్స్‌కు బదిలీ చేయడం సాధ్యపడదు. Creator Music లైసెన్స్‌లను పబ్లిష్ అయిన వీడియోలో ఇప్పటికే ఉపయోగించకపోతే, వాటిని YouTube ఛానెల్‌లోని ఇతర వీడియోలకు బదిలీ చేయవచ్చు.
  • వీడియోలలో లైసెన్స్ పొందిన మ్యూజిక్‌ను ఎలా ఉపయోగించవచ్చు అనే విషయానికి సంబంధించి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. మరింత సమాచారం కోసం, Creator మ్యూజిక్ అర్హత, పరిమితుల లింక్‌కు వెళ్లండి.

ఆదాయ షేరింగ్‌కు సంబంధించిన వినియోగ వివరాలు

ఆదాయాన్ని షేర్ చేయడానికి అర్హత ఉన్న ట్రాక్ ను మీ వీడియోలో మీరు ఉపయోగిస్తే, ఆ వీడియో ద్వారా వచ్చే ఆదాయాన్ని ట్రాక్ హక్కుదారులతో మీరు షేర్ చేయవచ్చని అర్థం. మీరు ఆదాయ షేరింగ్‌ను ప్రారంభించే ముందు, ట్రాక్‌కు సంబంధించిన వినియోగ వివరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఆ ట్రాక్‌ను ఉపయోగించడానికి మీకు ఏ అనుమతులు ఉన్నాయో తెలుస్తుంది.

ఆదాయ విభజనకు సంబంధించిన వినియోగ ఆవశ్యకతలు

Creator మ్యూజిక్ నుండి ఆదాయ విభజనకు అర్హత ఉన్న ట్రాక్‌లను ఉపయోగించే వీడియోలు, ఆదాయాన్ని షేర్ చేయడానికి అర్హత పొందాలంటే, తప్పనిసరిగా ఈ వినియోగ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి:

  • ట్రాక్, ఇంకా వీడియో వ్యవధి: సరైన నిడివి ఉండే వీడియోలో సరైన నిడివి ఉండే ట్రాక్ ఉపయోగించబడాలి:
    • ఒకవేళ ట్రాక్‌కు లైసెన్స్ పొందగలిగే వీలు ఉండి కూడా, మీకు లైసెన్స్‌ను కొనుగోలు చేయాలని లేకపోతే, మీరు 3 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉండే వీడియోలో 30 సెకన్ల కన్నా తక్కువ నిడివి ఉండే ట్రాక్‌ను ఉపయోగించడం ద్వారా ఆదాయాన్ని షేర్ చేయవచ్చు.
    • ఒకవేళ ట్రాక్‌కు లైసెన్స్ పొందగలిగే వీలు లేకపోయినా కూడా, ఆదాయ విభజనకు దానికి అర్హత ఉంటే, వీడియో వ్యవధితో సంబంధం లేకుండా మీకు ఎంత కావాలంటే అంత ట్రాక్‌ను ఉపయోగించి, ఆదాయాన్ని షేర్ చేయవచ్చు.
  • మానిటైజేషన్ సమస్యలు ఉండకూడదు: ఈ కింద పేర్కొనబడినటువంటి మానిటైజేషన్ సమస్యలు వీడియోకు ఉండకూడదు:
  • లైవ్ స్ట్రీమ్‌లు లేదా షార్ట్‌లు కాకూడదు: వీడియో అనేది లైవ్ స్ట్రీమ్ లేదా షార్ట్ అయ్యి ఉండకూడదు. Shorts ఆదాయ విభజన గురించి తెలుసుకోండి.
వినియోగ ఆవశ్యకతలను ఫాలో అవ్వకపోతే, మీ వీడియోకు కంటెంట్ ID క్లెయిమ్ లేదా కాపీరైట్ ఉల్లంఘన వల్ల తొలగింపు రిక్వెస్ట్ అందవచ్చు, దీని వలన మానిటైజేషన్ డిజేబుల్ అవ్వవచ్చు లేదా మీ వీడియో బ్లాక్ అవ్వవచ్చు.

వినియోగ ఆవశ్యకతలు అనేవి, హక్కుదారుల విచక్షణానుసారం మారవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, మీరు ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న ట్రాక్‌ను ఉపయోగించే వీడియోను అప్‌లోడ్ చేశాక, హక్కుదారు ఆ ట్రాక్‌కు మానిటైజేషన్‌ను తర్వాత ఎప్పుడైనా డిజేబుల్ చేయవచ్చు, అలా చేసినప్పుడు మీ వీడియోకు మానిటైజేషన్ డిజేబుల్ అవుతుంది. వినియోగ నియమాలకు మార్పులు, నిర్దిష్ట ప్రాంతాలకు గానీ, లేదా ప్రాంతాలన్నింటికీ గానీ వర్తించవచ్చు. 

పాటలో భాగం

ట్రాక్‌లో ఎంత భాగాన్ని వీడియోలో ఉపయోగించడానికి హక్కుదారులు అనుమతిస్తారో, ఆ భాగాన్ని పాటలో భాగం అని అంటారు.

ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న ట్రాక్‌ల విషయంలో, మీరు ఎంత నిడివి గల వీడియోలో అయినా, మీకు కావలసినంత పాటను ఉపయోగించుకోవచ్చు.

మీరు లైసెన్స్ కొనుగోలు చేయాలనుకోని లైసెన్స్ పొందగల ట్రాక్‌ల విషయంలో, 3 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉండే వీడియోలో మీరు 30 సెకన్ల కన్నా తక్కువ నిడివి ఉన్న పాటను ఉపయోగించినప్పుడు, ఆదాయాన్ని షేర్ చేయడానికి ఎంచుకోవచ్చు, కొనడానికి బదులుగా మీరు ఇలా చేయవచ్చు. ఆదాయ విభజన గురించి మరింత తెలుసుకోండి.

సపోర్ట్ ఉన్న ప్రాంతాలు
ఏ దేశాలు/ప్రాంతాలలో అయితే, ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు దాని ద్వారా ఆదాయం సంపాదించడానికి వీలు అవుతుందో, అలాంటి దేశాలు/ప్రాంతాలను సపోర్ట్ ఉన్న ప్రాంతాలు అంటారు. ఏ దేశాలు/ప్రాంతాలలో అయితే, ట్రాక్‌కు సంబంధించిన హక్కుదారులకు ఆ ట్రాక్‌పై హక్కులు ఉండటంతో పాటు, దాన్ని ఆదాయ విభజన కోసం అందుబాటులో ఉంచుతారో, ఆ దేశాలు/ప్రాంతాలలో ట్రాక్‌కు ఆదాయం సంపాదించడానికి అర్హత లభిస్తుంది.
Creator Musicలోని నిర్దిష్ట ట్రాక్‌లు, నిర్దిష్ట దేశాలు/ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండవచ్చు. ఇటువంటి సందర్భంలో, మీరు ట్రాక్ వినియోగ వివరాల గురించి మీకు, సపోర్ట్ ఉన్న ప్రాంతాలకు పక్కన, పరిమితం చేయబడ్డాయి అనే ఆప్షన్ కనిపిస్తుంది.
మీ వీడియో ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడ షేర్ అవుతుందో చూడటానికి, మీ వీడియోకు సంబంధించిన ఆదాయ విభజన స్టేటస్‌ను చెక్ చేయండి.
వీడియో మానిటైజేషన్

Creator Musicతో, ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన ట్రాక్‌లను నిడివి ఎక్కువ ఉన్న వీడియో ఉపయోగిస్తే, ఈ కింద ఉన్న ఉదాహరణల్లో చూపిన విధంగా మ్యూజిక్ హక్కులు పొందేందుకు అయ్యే ఖర్చుల కోసం స్టాండర్డ్ 55% ఆదాయ షేరింగ్ సర్దుబాటు చేయబడుతుంది. ఇది ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:

  • ఉపయోగించిన ట్రాక్‌ల సంఖ్య: ఒక క్రియేటర్ తమ వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన ఎన్ని ట్రాక్‌లను ఉపయోగిస్తారు (ఈ కింద ఉదాహరణలను చూడండి).
  • అదనపు మ్యూజిక్ హక్కుల కోసం అయ్యే ఖర్చులు: ప్లే చేయగల హక్కుల వంటి అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చుల కోసం డిడక్షన్. ఈ డిడక్షన్ 5% దాకా ఉండవచ్చు, ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న Creator Music ట్రాక్‌లన్నింటికి సంబంధించిన ఈ అదనపు మ్యూజిక్ హక్కుల మొత్తం ఖర్చును ఇది ప్రతిబింబిస్తుంది.
ఆదాయ షేరింగ్ లెక్కింపుల ఉదాహరణలు

ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు

ఉదాహరణ: క్రియేటర్ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన 1 ట్రాక్‌ను ఉపయోగించి, స్టాండర్డ్ 55% ఆదాయ షేరింగ్‌లో సగం వాటా (27.5%)ను పొందుతారు. ఉదాహరణకు, అదనపు మ్యూజిక్ హక్కుల ధరలకు సంబంధించి డిడక్షన్ 2.5% ఉంటుంది.

ఈ వీడియో కోసం క్రియేటర్ మొత్తం ఆదాయంలో 25% పొందుతారు (27.5% - 2.5%).

 
ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు
ఉదాహరణ ఆదాయ షేరింగ్: 55% ÷ 2 27.5%
ఉదాహరణ అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులు - 2.5%
ఉదాహరణ మొత్తం ఆదాయం 25%

ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, అలాగే లైసెన్స్ పొందిన 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు

ఉదాహరణ: క్రియేటర్ తమ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, లైసెన్స్ ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించి, స్టాండర్డ్ 55% ఆదాయ షేర్‌లో 1/3 వంతు (18.33%)ను పొందుతారు. ఉదాహరణకు, అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులకు సంబంధించి డిడక్షన్ 2% ఉంటుంది.

ఈ వీడియో కోసం క్రియేటర్ మొత్తం ఆదాయంలో 16.33% పొందుతారు (18.33% - 2%).

 
ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, అలాగే లైసెన్స్ పొందిన 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు
ఉదాహరణ ఆదాయ షేరింగ్: 55% ÷ 3 18.33%
ఉదాహరణ అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులు - 2.5%
ఉదాహరణ మొత్తం ఆదాయం 15.83%
కంటెంట్ రకం
Creator మ్యూజిక్ ద్వారా లైసెన్సింగ్ కోసం కానీ లేదా ఆదాయ విభజన కోసం కానీ అందుబాటులో ఉన్న ట్రాక్‌లను నిడివి ఎక్కువ ఉన్న వీడియోలలో మాత్రమే ఉపయోగించవచ్చు, షార్ట్‌లు లేదా లైవ్ స్ట్రీమ్‌లలో కాదు. Shortsలో ఆదాయాన్ని షేర్ చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి, Shortsతో యాడ్ ఆదాయం లింక్‌కు వెళ్లండి.

 

మరింత సమాచారం

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3607341627031759869
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false