YouTube కోసం AdSense

మేము YouTube Studio మొబైల్ యాప్‌లోని 'సంపాదించండి' ట్యాబ్‌లో పేమెంట్ వివరాలను అందించే కొత్త బీటా వెర్షన్‌ను పరిచయం చేస్తున్నాము. ఈ బీటా వెర్షన్ అర్హత గల క్రియేటర్‌లకు వారి ఆదాయాలు పేమెంట్‌లుగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవడానికి సహాయపడే సులభమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ బీటా వెర్షన్‌తో, మీరు కింద పేర్కొన్న వాటిని చూడవచ్చు:
  • మీ తర్వాతి పేమెంట్‌కు సంబంధించిన ప్రోగ్రెస్
  • తేదీ, పే చేసిన మొత్తం, పేమెంట్ బ్రేక్‌డౌన్‌తో సహా మీకు సంబంధించిన గత 12 నెలల పేమెంట్ హిస్టరీ
మా ఫోరమ్ పోస్ట్ లింక్‌లో మరింత తెలుసుకోండి.

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా, రష్యాలోని యూజర్లకు Google యాడ్‌లను, YouTube యాడ్‌లను అందించడాన్ని మేము తాత్కాలికంగా పాజ్ చేయనున్నాము. మరింత తెలుసుకోండి.

'YouTube కోసం AdSense' అనేది Google వారి ప్రోగ్రామ్, దీని ద్వారా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగమైన క్రియేటర్‌లకు పేమెంట్ అందుతుంది. YouTubeలో పేమెంట్‌ను పొందడం ప్రారంభించడానికి, YouTube Studio నుండి, ఒక 'YouTube కోసం AdSense' ఖాతాను సెటప్ చేయండి. YouTube క్రియేటర్‌గా 'YouTube కోసం AdSense'ను ఎలా ఉపయోగించాలనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఈ పేజీని ఉపయోగించండి.

YouTube Creators కోసం AdSense

 

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

 

'YouTube కోసం AdSense'ను ఉపయోగించడం ప్రారంభించండి

గుర్తుంచుకోండి, మీ YouTube నికర ఆదాయాన్ని మీ 'YouTube కోసం AdSense' ఖాతా ద్వారా మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది. 'YouTube కోసం AdSense'ను ఉపయోగించడం ప్రారంభించడానికి, ఈ కింది దశలను ఫాలో అవ్వండి.

ఒక ఖాతాను సెటప్ చేయండి

మీకు ఇప్పటికే 'YouTube కోసం AdSense' ఖాతా లేకపోతే, ముందుగా YouTube Studioలో ఆ ఖాతాను సెటప్ చేసుకోండి. 'YouTube కోసం AdSense'ను సెటప్ చేయడానికి సంబంధించి మేము వివరణాత్మకమైన సూచనలను క్రియేట్ చేయడంతో పాటుగా, ఆ సెటప్ సమయంలో ఎదురయ్యే కొన్ని సాధారణ సమస్యలకు కూడా పరిష్కారాలను అందించాము: 

AdSense నియమాలు, షరతుల ప్రకారం లేదా 'YouTube కోసం AdSense' సర్వీస్ నియమాలు ప్రకారం (ఏది వర్తిస్తే అది), ఒక 'పేమెంట్ గ్రహీత' పేరు మీద ఒక AdSense లేదా ఒక 'YouTube కోసం AdSense' ఖాతా మాత్రమే ఉండాలి. కాబట్టి, మీ YouTube ఛానెల్‌తో లింక్ చేసేటప్పుడు, మీకు డూప్లికేట్ ఖాతాలు ఏవీ లేవని నిర్ధారించుకోండి. మీరు కేవలం మీ ఛానెల్‌కు లింక్ చేసిన AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతాను మార్చాలనుకుంటుంటే, ఈ దశలను ఫాలో అవ్వండి.

మీ వ్యక్తిగత సమాచారాన్ని వెరిఫై చేయండి

సెటప్ చేసిన తర్వాత, మీ వ్యక్తిగత సమాచారాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీ YouTube పేమెంట్స్ ఖాతా విషయంలో, మీ నికర ఆదాయం అడ్రస్‌కు సంబంధించిన కనిష్ఠ వెరిఫికేషన్ పరిమితిని దాటినప్పుడు, మేము మీ భౌతిక అడ్రస్‌కు ఒక వ్యక్తిగత గుర్తింపు నంబర్ (PIN)ను పంపుతాము. మీరు పేమెంట్‌ను పొందడానికి ముందు, మీ అడ్రస్‌ను వెరిఫై చేయడానికి ఈ PINను మీ 'YouTube కోసం AdSense' ఖాతాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరింత సమాచారం ఇక్కడ ఉంది:

అలాగే, మీ లొకేషన్‌ను బట్టి, మీ పేరు, అడ్రస్, లేదా పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని ఉపయోగించి మీ గుర్తింపును మేము వెరిఫై చేయాల్సి రావచ్చు. మీరు దీన్ని చేయాల్సి వస్తే, మీ గుర్తింపును విజయవంతంగా వెరిఫై చేసేంత వరకు, మీ అడ్రస్‌ను వెరిఫై చేయమని సాధారణంగా మిమ్మల్ని అడగడం జరగదు. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ మరింత తెలుసుకోండి:

మీ పన్ను సమాచారాన్ని అందించండి

మీ వ్యక్తిగత సమాచారాన్ని అందించిన తర్వాత, కొనసాగించడానికి మీరు మీ పన్ను సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. U.S.లోని వీక్షకుల నుండి మీరు జెనరేట్ చేసే ఆదాయంపై U.S. పన్నులను Google మినహాయిస్తుంది, కాబట్టి మీ సరైన మినహాయింపు ధరను నిర్ణయించడానికి ఈ సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యం. మీ పన్ను సమాచారాన్ని ఎలా సమర్పించాలనే అంశంతో పాటు మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోండి:

పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి

మీ సమాచారం వెరిఫై అయినప్పుడు, మీరు ఆపై మీ YouTube పేమెంట్స్ ఖాతాకు సంబంధించిన పేమెంట్ ఆప్షన్ ఎంపిక పరిమితిని దాటాల్సి ఉంటుంది. ఇది మేము మీకు పేమెంట్ చేయగల కనీస మొత్తం, కాబట్టి మీ YouTube పేమెంట్స్ ఖాతాలో అంత మొత్తం జమ అయ్యాక, ఒక పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అన్ని ఆప్షన్‌లు అలాగే దశలను ఇక్కడ కనుగొనండి:

పేమెంట్‌ను పొందండి

ప్రతి నెలకు సంబంధించిన మీ తుది YouTube నికర ఆదాయం, తదుపరి నెలలో 7, 12 తేదీల మధ్య 'YouTube కోసం AdSense'లోని మీ YouTube పేమెంట్స్ ఖాతా బ్యాలెన్స్‌కు జోడించబడుతుంది. జోడించబడిన తర్వాత, మీరు లావాదేవీల పేజీలో పేమెంట్ వివరాలను (వర్తించే ట్యాక్స్ డిడక్షన్‌ల వంటివి) చూడవచ్చు:

  1. 'YouTube కోసం AdSenseలోకి' సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, పేమెంట్స్ కింద పేమెంట్ సమాచారం ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. పేజీలోని లావాదేవీల విభాగంలో లావాదేవీలను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ బ్యాలెన్స్ కనిష్ఠ పేమెంట్ పరిమితికి అనుగుణంగా ఉంటే, అలాగే మీ ఖాతాలో ఎటువంటి పేమెంట్ హోల్డ్‌లు లేకపోతే, మీరు ప్రతి నెల 21 లేదా 26వ తేదీ లోపు పేమెంట్‌ను పొందుతారు.

ఉదాహరణ: YouTube కనిష్ఠ పేమెంట్ పరిమితి అనేది $100 అయి ఉండి, ఆ పరిమితి మొత్తాన్ని మీరు జూన్‌లో చేరుకున్నట్లయితే, అప్పుడు మేము ఎంత లేదనుకున్నా, మీకు జూలై 26 నాటికి పేమెంట్ చేస్తాము.

'YouTube కోసం AdSense', YouTube పేమెంట్స్ ఖాతా

YouTube ఒక ప్రత్యేకమైన YouTube కోసం AdSense ఖాతాను మెయిన్‌టెయిన్ చేస్తోంది, దీని సహాయంతో క్రియేటర్‌లు, 'YouTube కోసం AdSense'లో వారి తుది YouTube నికర ఆదాయాన్ని మరింత వేగంగా యాక్సెస్ చేయగలుగుతారు.

YouTube నికర ఆదాయానికి సంబంధించిన పేమెంట్‌లు దాని స్వంత పేమెంట్‌ల ఖాతాలో వేరుగా ఉంచబడతాయి. అంటే YouTube, AdSense పేమెంట్‌ల ఖాతాలకు వేర్వేరు కనిష్ఠ పేమెంట్ పరిమితి మొత్తాలు ఉంటాయి. మీరు కేవలం YouTube నుండి మాత్రమే కాకుండా ఇతర సర్వీస్‌లకు సంబంధించిన పేమెంట్‌ను పొందడానికి కూడా AdSenseను ఉపయోగిస్తారా, లేదా అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది పేమెంట్ సమయాన్ని ప్రభావితం చేయగలదు.

2022కు ముందు మీకు పేమెంట్ చేసిన YouTube నికర ఆదాయ వివరాలు ఏవైనా ఉంటే అవి, అలాగే ఇతర AdSense నికర ఆదాయం ఏదైనా ఉంటే అది మీ AdSense పేమెంట్‌ల ఖాతాకు అనుబంధించబడే ఉంటాయి. పే చేయవలసిన YouTube నికర ఆదాయం ఏదైనా ఉంటే, అది YouTube పేమెంట్‌ల ఖాతాకు తరలించబడుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను YouTube కాకుండా ఇతర సర్వీస్‌ల నుండి పేమెంట్‌ను పొందడానికి AdSense‌ను ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది?

మీరు YouTube ఆదాయంతో పాటుగా ఇతర రకాల ఆదాయాలు గల AdSense పబ్లిషర్ అయితే, పేమెంట్స్ పేజీ నుండి యాక్సెస్ చేయగలిగిన ప్రత్యేకమైన పేమెంట్స్ ఖాతాలో మీ YouTube నికర ఆదాయాన్ని మేనేజ్ చేయగలరు, చూడగలరు.

మీరు పేమెంట్ పొందాలంటే, YouTube ఖాతాతో పాటు AdSense పేమెంట్స్ ఖాతా కూడా, వాటి సంబంధిత కనిష్ఠ పేమెంట్ పరిమితులను చేరుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. దీనివల్ల మీ పేమెంట్‌లు మీకు అందే సమయం ప్రభావితం కావచ్చు.

నా తుది నికర ఆదాయాన్ని AdSenseలో నేను ఎలా చూడగలను?

మీరు ఈ దశలను ఫాలో అవ్వడం ద్వారా మీ YouTube ఆదాయాలను దాని స్వంత పేమెంట్‌ల ఖాతాలో కనుగొనవచ్చు:

  1. మీ AdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. పేమెంట్స్ ఆ తర్వాత పేమెంట్స్ సమాచారం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. పేమెంట్స్ ఖాతాల డ్రాప్‌డౌన్‌పై క్లిక్ చేయండి.
  4. YouTube పేమెంట్‌ల ఖాతాను ఎంచుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7475240724399073003
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false