సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయండి, అలాగే మేనేజ్ చేయండి

సూపర్ థ్యాంక్స్ (ఇంతకు ముందు వీక్షకుల ప్రశంసలు అని పిలిచేవారు) క్రియేటర్‌లు ఆదాయాన్ని సంపాదించడానికి, వారి కంటెంట్ పట్ల అదనపు కృతజ్ఞత చూపాలనుకునే వీక్షకులతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది.

నిడివి ఎక్కువ ఉన్న వీడియో లేదా షార్ట్‌లో సూపర్ థ్యాంక్స్ అనే సరదా యానిమేషన్‌ను వీక్షకులు కొనుగోలు చేయవచ్చు. వన్-టైమ్ యానిమేషన్, నిడివి ఎక్కువ ఉన్న వీడియోకు లేదా షార్ట్‌కు పైభాగంలో కొనుగోలుదారుకు మాత్రమే కనిపిస్తుంది. అదనపు బోనస్‌గా, కామెంట్‌ల విభాగంలో ఒక విభిన్నమైన, రంగురంగుల, అనుకూలంగా మార్చుకోదగిన పోస్ట్‌ను కూడా కొనుగోలుదారులు పొందుతారు. వీక్షకులు ఎంచుకోవడానికి వీలుగా సూపర్ థ్యాంక్స్ విభిన్న ధరలలో అందుబాటులో ఉంటుంది.

సూపర్ థ్యాంక్స్ అర్హత గురించి మరింత తెలుసుకోండి.

సూపర్ థ్యాంక్స్

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

మీ ఛానెల్‌లో సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయండి

Shorts కోసం సూపర్ థ్యాంక్స్ 🎉

సూపర్ థ్యాంక్స్ నుండి ఆదాయాన్ని పొందడానికి, మీరు (మీ MCN) మొదట తప్పనిసరిగా వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM)ను అంగీకరించాలి. CPM గురించిన మరింత సమాచారం కోసం, మా YouTube వాణిజ్యపరమైన ప్రోడక్ట్‌ల మానిటైజేషన్ పాలసీలను చూడండి.

సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయడానికి మీరు కంప్యూటర్‌ను ఉపయోగించాలనుకుంటే:

  1. కంప్యూటర్‌లో, YouTube Studioలోకి సైన్ ఇన్ అవ్వండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండిఅనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. Supers ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మీ ఛానెల్‌కు అర్హత ఉంటేనే ఈ ట్యాబ్ కనిపిస్తుంది.
  4. ప్రారంభించండిని క్లిక్ చేసి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  5. మీరు Supers విభాగాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి అయితే, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అయ్యి వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) ఒప్పందంపై సంతకం చేయండి.
  6. మీరు సూచనలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, స్విచ్‌కు పక్కన “సూపర్ థ్యాంక్స్” కనిపిస్తుంది, మీరు ఆ స్విచ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

సూపర్ థ్యాంక్స్  గతంలో, భవిష్యత్తులో అర్హత పొందిన Shortsతో పాటు నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు అన్నింటిలో కనిపిస్తుంది.

సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయడానికి మీ మొబైల్ పరికరాన్ని ఉపయోగించాలనుకుంటే:

  1. YouTube Studio మొబైల్ యాప్ ను తెరవండి.
  2. స్క్రీన్‌కు దిగువున, సంపాదించండి ను ట్యాప్ చేయండి.
  3. Supers కార్డ్‌ను ట్యాప్ చేయండి. Supers కార్డ్ కనిపించకపోతే, “Supers” విభాగంలో ప్రారంభించండిని ట్యాప్ చేసి, ఆ తర్వాత ఆన్ చేయండి.
  4. మీరు Supers విభాగాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి అయితే, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అయ్యి వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) ఒప్పందంపై సంతకం చేయండి.
  5. మీరు సూచనలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, కింద పేర్కొన్న అర్హత ఉన్న ఈ విభాగాలలో Supers ప్రోడక్ట్‌లన్నీ కనిపిస్తాయి:
    • లైవ్ స్ట్రీమ్‌లు, ప్రీమియర్‌లు (సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్)
    • నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు, Shorts (సూపర్ థ్యాంక్స్)
గమనికలు:
  • ఒకవేళ మీ హక్కులను థర్డ్ పార్టీ కనుక నిర్వహిస్తుంటే, సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయడానికి ముందు వారిని సంప్రదించండి.
  • మీరు నిర్దిష్ట Supersను ఆఫ్ చేయాలనుకుంటే, కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studio‌కు సైన్ ఇన్ చేయవచ్చు. Supers ట్యాబ్‌కు వెళ్లి సంబంధిత Supersను ఆఫ్ చేయండి.

సూపర్ థ్యాంక్స్‌ను ఆఫ్ చేయండి

  1. కంప్యూటర్‌లో, YouTube Studio‌లోకి సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండిఅనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. Supers ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "సూపర్ థ్యాంక్స్"కు పక్కన ఉన్న స్విచ్‌ను ఆఫ్ చేయండి.
  5. పాప్-అప్‌లో, "ఈ చర్యను ఎంచుకోవడం వలన ఎదురయ్యే పరిణామాలను నేను అర్థం చేసుకున్నాను" పక్కన ఉండే చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి.
  6. ఆఫ్ చేయండిని క్లిక్ చేయండి.

మీరు స్విచ్‌ను ఆఫ్ చేసినప్పుడు, సూపర్ థ్యాంక్స్ ఫీచర్ అనేది మీ అన్ని Shorts, నిడివి ఎక్కువ ఉన్న వీడియోల నుండి తీసివేయబడుతుంది. గతంలోని నికర ఆదాయాన్ని మీరు ఇప్పటికీ రివ్యూ చేయవచ్చు.

మీ నెట్‌వర్క్ కోసం సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయండి

నెట్‌వర్క్‌లో ఉన్న ఒక ఛానెల్ సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయడానికి ముందు, నెట్‌వర్క్ తప్పనిసరిగా ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి అనుమతించాలి:

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లకు వెళ్లండి.
  3. ఒప్పందాలను క్లిక్ చేసి, వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌ను అంగీకరించండి.

ఆ ఒప్పందాన్ని ఆమోదించాక, మీ నెట్‌వర్క్‌లో ఉండే అర్హత గల ఛానెల్స్, సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేసుకోవచ్చు.

సూపర్ థ్యాంక్స్ కామెంట్‌లు

సూపర్ థ్యాంక్స్‌ను వీక్షకులు కొనుగోలు చేసినప్పుడు, బోనస్‌గా మీ షార్ట్ లేదా నిడివి ఎక్కువ ఉన్న వీడియోలోని కామెంట్‌ల విభాగంలో వారు ఒక కలర్‌ఫుల్ కామెంట్‌ను పోస్ట్ చేయవచ్చు.

YouTube Studio, అలాగే YouTube Studio యాప్‌లో ఉండే కామెంట్‌ల విభాగంలో “సూపర్ థ్యాంక్స్ నుండి” ఫిల్టర్‌ను ఉపయోగించి, సూపర్ థ్యాంక్స్‌ను ఎవరు కొనుగోలు చేశారో మీరు చూడవచ్చు. మీరు మీ కంటెంట్‌కు సంబంధించిన కామెంట్‌లను రివ్యూ చేయవచ్చు, వాటికి రిప్లయి చేయవచ్చు, వాటిపై హృదయ చిహ్నంతో ప్రతిస్పందించవచ్చు, అలాగే కామెంట్‌లను తీసివేయవచ్చు. కొనుగోలు చేసిన వ్యక్తి, తమ సూపర్ థ్యాంక్స్ కామెంట్‌ను తొలగిస్తే, అది మీ కామెంట్‌లలో కనిపించదు.

షార్ట్‌తో సూపర్ థ్యాంక్స్ కామెంట్‌కు రిప్లయి ఇవ్వండి

కామెంట్ స్టిక్కర్ ఫీచర్ షార్ట్‌తో సూపర్ థ్యాంక్స్ కామెంట్‌కు రిప్లయి ఇవ్వడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా మీ అభిమానులతో ఉన్న గట్టి బంధాలను గుర్తించడంలో, ఏర్పరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ అభిమాని కామెంట్ షార్ట్‌లో సూపర్ థ్యాంక్స్ కామెంట్‌గా చూపబడుతుంది, అలాగే మీరు అభిమాని కామెంట్‌కు రిప్లయి ఇచ్చినట్లు వారికి తెలియజేస్తుంది. 

YouTube Studio, అలాగే YouTube Studio మొబైల్ యాప్ లో ఉండే కామెంట్‌ల విభాగంలో “సూపర్ థ్యాంక్స్ నుండి” ఫిల్టర్‌ను ఉపయోగించి, సూపర్ థ్యాంక్స్‌ను ఎవరు కొనుగోలు చేశారో మీరు చూడవచ్చు. మీరు షార్ట్‌తో రిప్లయి ఇవ్వాలనుకుంటున్న సూపర్ థాంక్స్‌ను కనుగొన్న తర్వాత: 

  1. YouTube మొబైల్ యాప్‌ను తెరవండి.
  2. సూపర్ థ్యాంక్స్ కామెంట్‌తో మీ వీడియో వీక్షణ పేజీకి లేదా షార్ట్‌కు వెళ్లండి. 
  3. కామెంట్‌ల ఫీడ్‌ను తెరిచి, మీరు రిప్లయి ఇవ్వాలనుకుంటున్న సూపర్ థ్యాంక్స్ కామెంట్‌ను కనుగొనండి.
  4. కామెంట్ కింద, రిప్లయి ను ట్యాప్ చేసి, ఆ తర్వాత షార్ట్ ను క్రియేట్ చేయండి.

Shorts క్రియేషన్ అనుభవం సమయంలో, మీ కామెంట్ స్థానాన్ని మార్చడానికి మీరు సూపర్ థ్యాంక్స్ కామెంట్‌ను లాగవచ్చు లేదా కామెంట్ స్టిక్కర్ సైజ్ మార్చడానికి సూపర్ థ్యాంక్స్ కామెంట్‌ను వేళ్లతో నియంత్రించవచ్చు. YouTube Shortsను క్రియేట్ చేయడం గురించి, అలాగే క్రియేటివ్ ఫీచర్‌లు కలిగిన మా సూట్‌తో మీ షార్ట్‌ను ఎలా మెరుగుపరచుకోవాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఆదాయ రిపోర్టింగ్

YouTube ఎనలిటిక్స్‌లో, ఆదాయం ఆ తర్వాత మీరు డబ్బు సంపాదించే మార్గాల కార్డ్ ఆ తర్వాత Supersను ఎంచుకోవడం ద్వారా సూపర్ థ్యాంక్స్ ఆదాయ విభజనను చూడవచ్చు.

ఆదాయ షేరింగ్

క్రియేటర్‌లు Google ద్వారా గుర్తించబడిన సూపర్ థ్యాంక్స్ ఆదాయంలో 70% పొందుతారు. ట్యాక్స్‌లు, ఫీజులను (iOSలో App Store ఫీజులతో సహా) డిడక్ట్ చేసిన తర్వాత, ఈ 70% లెక్కించబడుతుంది. క్రెడిట్ కార్డ్ ఫీజులతో సహా లావాదేవీల ఖర్చులు ప్రస్తుతం YouTube ద్వారా కవర్ అవుతున్నాయి.

మీరు YouTube కోసం AdSense ఖాతాతో యాడ్‌ల ఆదాయాన్ని ఎలా అయితే పొందుతారో, అలాగే సూపర్ థ్యాంక్స్ ఆదాయాన్ని కూడా పొందుతారు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10204234836880529040
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false