మీ 'YouTube కోసం AdSense' ఖాతా డీయాక్టివేట్ చేయబడింది

మీ 'YouTube కోసం AdSense' ఖాతాను సెటప్ చేయడాన్ని మీరు పూర్తి చేయకపోతే, లేదా అది 6 నెలల పాటు ఎలాంటి యాడ్ యాక్టివిటీ లేదా నికర ఆదాయాన్ని పొందకపోతే, అది డీయాక్టివేట్ చేయబడి ఉండవచ్చు. మీ 'YouTube కోసం AdSense' ఖాతాను మీరు మళ్లీ ఉపయోగించాలంటే, దాన్ని మీ ఛానెల్‌కు లింక్ చేయడం ద్వారా మళ్లీ యాక్టివేట్ చేయాలి. మీకు ఇకపై మీ 'YouTube కోసం AdSense' ఖాతా అవసరం లేకపోతే, మీరు రద్దు చేయవచ్చు.
 
మీ 'YouTube కోసం AdSense' ఖాతా డీయాక్టివేట్ చేయబడినప్పటికీ, మీరు దానికి సైన్ ఇన్ చేయవచ్చు. మీ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయడానికి, మీ ఫోన్ నంబర్‌ను మళ్లీ వెరిఫై చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీ అడ్రస్ అప్‌డేట్ అయ్యి ఉందో లేదో చెక్ చేయాలని కూడా మేము సిఫార్సు చేస్తున్నాము. మీ ఛానెల్ YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు లేదా YouTube నుండి పేమెంట్ పొందడానికి అర్హతను కలిగి ఉంటే, మీరు 'YouTube కోసం AdSense' ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయవచ్చు లేదా కొత్త దాన్ని క్రియేట్ చేయవచ్చు.
ఇటీవల రష్యాలో Google అడ్వర్టయిజింగ్ సిస్టమ్‌ల సస్పెన్షన్ కారణంగా, రష్యన్ 'YouTube కోసం AdSense', AdSense ఖాతాలకు సంబంధించిన రీయాక్టివేషన్‌లు పాజ్ చేయబడ్డాయి. మరింత తెలుసుకోండి.

మీ 'YouTube కోసం AdSense' ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి దశలు

  1. మీ ఛానెల్‌కు మీ 'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేయండి.
  2. 'YouTube కోసం AdSense'కు సైన్ ఇన్ చేయండి.
  3. మీ ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయండి.

మీ 'YouTube కోసం AdSense' ఖాతా ఎందుకు డీయాక్టివేట్ చేయబడింది

అసంపూర్ణ ఖాతా సెటప్

మీ ఖాతాను సెటప్ చేసి, దాన్ని మీ YouTube ఛానెల్‌కు లింక్ చేసే దశలు పూర్తి కానప్పుడు 'YouTube కోసం AdSense' ఖాతాలు డీయాక్టివేట్ చేయబడతాయి. మీ 'YouTube కోసం AdSense' ఖాతాను మీరు నిర్దిష్ట కాలంలో సెటప్ చేయడాన్ని పూర్తి చేయకపోతే, మీకు తెలియజేయడాన్ని మేము ప్రారంభిస్తాము.

5 నెలల పాటు ఖాతా సెటప్ అసంపూర్ణంగా ఉన్న తర్వాత

మీరు ఈ సహాయ కేంద్రం ఆర్టికల్‌లో పేర్కొన్న దశలను పూర్తి చేయకపోతే, మీ ఖాతా డీయాక్టివేట్ చేయబడుతుందని మీకు తెలియజేయడానికి 'YouTube కోసం AdSense' నుండి ఈమెయిల్ వస్తుంది.

6 నెలల పాటు ఖాతా సెటప్ అసంపూర్ణంగా ఉన్న తర్వాత

మీ 'YouTube కోసం AdSense' ఖాతా డీయాక్టివేట్ చేయబడుతుంది.

ఇన్‌యాక్టివిటీ

ఇన్‌యాక్టవిటీ కారణంగా 'YouTube కోసం AdSense' ఖాతాలు డీయాక్టవేట్ చేయబడతాయి. మీ ఛానెల్‌కు లింక్ చేయబడిన ఖాతా నిర్దిష్ట కాలం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, మీకు తెలియజేయడాన్ని మేము ప్రారంభిస్తాము. మీ 'YouTube కోసం AdSense' ఖాతాలో యాడ్ యాక్టివిటీ లేదా నికర ఆదాయం ఉంటే, అది డీయాక్టివేట్ చేయబడదు.

5 నెలల పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న తర్వాత

  • మీ ఖాతాలో యాడ్ యాక్టివిటీ లేదా నికర ఆదాయం లేకపోతే, అది డీయాక్టివేట్ చేయబడుతుందని మీకు తెలియజేయడానికి 'YouTube కోసం AdSense' నుండి ఈమెయిల్ వస్తుంది.

6 నెలల పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న తర్వాత

  • మీ 'YouTube కోసం AdSense' ఖాతా డీయాక్టివేట్ చేయబడింది.

FAQలు

నా 'YouTube కోసం AdSense' ఖాతా డీయాక్టివేట్ చేయబడింది, కానీ అందులో ఇంకా డబ్బు ఉంది, ఆ డబ్బును నేను ఎలా పొందగలను?

మీ ఖాతా బ్యాలెన్స్ రద్దు థ్రెషోల్డ్ కంటే ఎక్కువగా ఉంటే, మీరు ఏవైనా ఉన్న పేమెంట్ హోల్డ్స్‌ను పరిష్కరిస్తే, మీరు మీ ఖాతాను మూసివేసిన తర్వాత మీ 'YouTube కోసం AdSense' బ్యాలెన్స్‌ను పొందవచ్చు.

నా ఖాతాను నేను తిరిగి యాక్టివేట్ చేసినప్పుడు, PIN ద్వారా నా అడ్రస్‌ను మళ్లీ వెరిఫై చేయాలా?

లేదు. మీరు మీ అడ్రస్‌ను గతంలో PIN ద్వారా వెరిఫై చేసి ఉంటే, దాన్ని మళ్లీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకు ముందు మీ అడ్రస్‌ను PIN ద్వారా వెరిఫై చేయకపోతే, మీ పేమెంట్‌లను పొందడానికి ముందు మీ అడ్రస్‌ను వెరిఫై చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.

నా AdSense ఖాతా డీయాక్టివేట్ చేయబడింది, ఇది నా YouTube ఛానెల్ స్టేటస్‌ను ప్రభావితం చేస్తుందా?

చేయదు. AdSense డీయాక్టివేషన్ వల్ల మీ YouTube ఛానెల్ స్టేటస్ ప్రభావితం కాదు. మీరు మీ ఛానెల్‌లో మానిటైజ్ చేయడం ప్రారంభించి, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు కావలసిన అర్హతలు అన్నింటిని కలిగి ఉంటే, మీరు పేమెంట్ పొందడానికి 'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేయగలరు.

నేను హెచ్చరిక ఈమెయిల్‌ను అందుకున్న తర్వాత నా ఛానెల్ మానిటైజ్ చేయడం ప్రారంభించింది, నా 'YouTube కోసం AdSense' ఇప్పటికీ డీయాక్టివేట్ చేయబడుతుందా?

డీయాక్టివేట్ చేయబడదు. మీరు మీ YouTube ఛానెల్‌లో మానిటైజ్ చేయడం ప్రారంభిస్తే మీ 'YouTube కోసం AdSense' ఖాతా డీయాక్టివేట్ చేయబడదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1320780967078829685
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false