MCNలకు, అనుబంధ ఛానెల్స్‌‌కు సంబంధించిన ట్యాక్స్ ఆవశ్యకతలు

ముఖ్య గమనిక: సంవత్సరం చివరికి వచ్చే సరికి, మానిటైజ్ చేసే క్రియేటర్‌లు, తమ ట్యాక్స్ సమాచారాన్ని YouTube కోసం AdSenseలో చెక్ చేసుకోవలసి ఉంటుంది. ట్యాక్స్ ఫారమ్‌ను సబ్మిట్ చేశారని నిర్ధారించుకోండి, అర్హత ఉంటే, డిసెంబర్ 10, 2023 లోపు ట్యాక్స్ ఒప్పంద ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోండి. సందర్భోచితంగా ఉన్న చోట Google 2023 ట్యాక్స్‌లను తిరిగి లెక్కించి, వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది.

మీరు ట్యాక్స్ సమాచారాన్ని షేర్ చేయకపోతే, గరిష్ఠ ట్యాక్స్ రేట్‌ను ఉపయోగించి Google ప్రపంచవ్యాప్తంగా ట్యాక్స్‌లను విత్‌హోల్డ్ చేయవలసి రావచ్చు. మీరు ట్యాక్స్ సమాచారాన్ని షేర్ చేస్తే, మీ ట్యాక్స్ రేట్ మీ U.S. ఆదాయంలో 30% వరకు ఉండవచ్చు.

మీ ట్యాక్స్ సమాచారాన్ని చెక్ చేసి, ట్యాక్స్ ఒప్పంద ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోండి:

YouTubeలో ట్యాక్స్ విత్‌హోల్డింగ్ గురించి మరింత తెలుసుకోండి లేదా Googleకు మీ U.S. ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేయడానికి సంబంధించిన FAQలను రివ్యూ చేయండి.

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లోని (YPP) క్రియేటర్‌ల నుండి పన్ను సమాచారాన్ని Google సేకరించాల్సి ఉంటుంది. ఏవైనా ట్యాక్స్ డిడక్షన్‌లు వర్తిస్తే, U.S.లోని వీక్షకుల నుండి వచ్చే YouTube ఆదాయంపై Google ట్యాక్స్‌లను విత్‌హోల్డ్ చేస్తుంది. ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా మల్టీ ఛానెల్ నెట్‌వర్క్‌లో (MCN) ఉన్న అనుబంధ క్రియేటర్‌ల కోసం ఉద్దేశించబడింది. YouTube నికర ఆదాయంపై ట్యాక్స్ విత్‌హోల్డింగ్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి, అలాగే మా సమగ్రమైన FAQ ఆర్టికల్‌కు వెళ్లండి: మీ U.S. పన్ను సమాచారాన్ని Googleకు సమర్పించడం.

ముఖ్య గమనిక: Google ఎన్నడూ కూడా మీ పాస్‌వర్డ్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారం తెలియజేయమని అడుగుతూ అవాంఛిత మెసేజ్‌లను పంపదు. ఏదైనా లింక్‌ను క్లిక్ చేసే ముందు, ఈమెయిల్ @youtube.com లేదా @google.com ఈమెయిల్ అడ్రస్ నుండే పంపబడిందా, లేదా అని ఎల్లప్పుడూ చెక్ చేసుకోండి.

అనుబంధ ఛానెల్స్‌కు సంబంధించిన సమాచారం

మీరు మల్టీ ఛానెల్ నెట్‌వర్క్‌లో (MCN) భాగంగా ఉన్నారా? అయితే, మీ ఛానెల్‌కు లింక్ చేసి ఉన్న AdSense ఖాతాలో మీరు U.S. పన్ను సమాచారాన్ని అందించాలి. విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లు ఏవైనా వర్తిస్తే, వాటిని నిర్ణయించడానికి ఈ సమాచారం ఉపయోగించబడుతుంది. విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లు సరిగ్గానే లెక్కించబడ్డాయని నిర్ధారించడానికి, మీ YouTube కోసం AdSense ఖాతా మీ చట్టపరమైన పేరుతో లేదా మీ బిజినెస్‌కు ఉన్న చట్టపరమైన పేరుతో ఉండాలి. అలాగే, ట్యాక్స్, ఇంకా చట్టపరమైన ప్రయోజనాల కోసం ఫైల్‌లోని అడ్రస్ సమాచారం మీ శాశ్వత నివాస అడ్రస్‌తో మ్యాచ్ అవ్వాలి.

మీ ఛానెల్ ఆదాయం మీ MCN పార్ట్‌నర్‌కు పేమెంట్ చేయడం కొనసాగించబడుతుంది. ఏవైనా విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లు వర్తిస్తే, వాటిని మీ ఛానెల్ ఆదాయానికి సంబంధించి మీ MCNకు చేసే పేమెంట్ నుండి విత్‌హోల్డ్ చేయడం జరుగుతుంది.

విత్‌హోల్డింగ్ అమౌంట్‌లు YouTube ఎనలిటిక్స్‌లో కనిపించవు, కాబట్టి ఇవి ఇక్కడ ఉన్న లాజిక్‌ను ఉపయోగించడం ద్వారా మాన్యువల్‌గా లెక్కించబడతాయి. మీ MCNకు ప్రతి నెలా ఒక రిపోర్ట్ అందజేయబడుతుంది, దీనిలో U.S. చట్టం ప్రకారం విత్‌హోల్డ్ చేయబడిన మొత్తం ట్యాక్స్‌ల అమౌంట్ గురించిన సమాచారం ఉంటుంది.

మీరు విత్‌హోల్డింగ్ ప్రారంభమైన తర్వాత చెల్లుబాటు అయ్యే మీ U.S. పన్ను సమాచారాన్ని సమర్పించి, తక్కువ ట్యాక్స్ రేటును పొందడానికి అర్హత ఉన్నవారైతే, మినహాయింపు ధర మీ తర్వాతి పేమెంట్ కాల వ్యవధిలో సర్దుబాటు చేయబడుతుంది.

అనుబంధ ఛానెల్స్‌కు సంబంధించిన ట్యాక్స్ రీఫండ్‌లు

2023 ప్రారంభం నుండి MCNలలోని అనుబంధ ఛానెల్స్, రీఫండ్‌లకు అర్హత పొందవచ్చు. అనుబంధ ఛానెల్స్ తక్కువ రేట్‌కు లోబడి ముందస్తుగా పేమెంట్ చేశాయి అనే దానిని రుజువు చేసే చెల్లుబాటయ్యే డాక్యుమెంటేషన్‌ను తప్పనిసరిగా మాకు అందించాలి. అదే క్యాలెండర్ సంవత్సరంలో విత్‌హోల్డ్ చేయబడిన ట్యాక్స్‌లు మాత్రమే రీఫండ్‌లకు అర్హతను కలిగి ఉంటాయి. ఈ మార్పు 2022 సంవత్సరానికి లేదా మునుపటి సంవత్సరాలకు వర్తించదు. ఒకసారి అర్హత పొందితే, ట్యాక్స్ వివిత్‌హోల్డ్ చేయబడిన ఒరిజినల్ కంటెంట్ ఓనర్‌కు రీఫండ్ ఇవ్వబడుతుంది.

MCNలకు సంబంధించిన సమాచారం

స్వంతమైన & నిర్వహించబడుతున్న కంటెంట్ ఓనర్‌లకు సంబంధించిన MCNకు చెందిన YouTube నికర ఆదాయం కూడా U.S. విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లకు లోబడి ఉండవచ్చు. మీకు 'స్వంతమైన మరియు నిర్వహించబడుతున్న' కంటెంట్ ఓనర్‌లకు సంబంధించిన విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లను లెక్కించడానికి గాను, మీ YouTube కోసం AdSense ఖాతాలో సమర్పించిన పన్ను సమాచారాన్ని Google ఉపయోగిస్తుంది. ఇందులో అనుబంధ ఛానెళ్లు కానటువంటి, ఖాతాకు లింక్ చేయబడిన ఏవైనా ఇతర వ్యక్తిగత ఛానెల్స్ లేదా కంటెంట్ ఓనర్‌ల సమాచారం ఉంటుంది.

విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లు ఏవైనా వర్తిస్తే, ఇది మీకు 'YouTube కోసం AdSense'లోని మీ పేమెంట్‌ల రిపోర్ట్‌లో కనిపిస్తుంది. అనుబంధ ట్యాక్స్ విత్‌హోల్డింగ్‌లకు సంబంధించి, మీకు ఒక అదనపు రిపోర్ట్ అందజేయబడుతుంది. 

Google, అనుబంధ ఛానెల్స్ తమ ఛానెల్‌కు లింక్ చేయబడిన AdSense ఖాతాలో వారు అందించే పన్ను సమాచారం ఆధారంగా (ఉదా. 1042-S, 1099-MISC) అనుబంధ ఛానెల్స్‌కు నేరుగా ట్యాక్స్ రిపోర్టింగ్ ఫారమ్‌లను పంపిస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12690503666694658398
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false