నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

Google నుండి ఇమేజ్ తీసివేయండి

మీరు Google సెర్చ్ ఫలితాల నుండి ఫోటోను తీసివేయాలనుకుంటే, సాధారణంగా ఆ ఇమేజ్‌ని కలిగి ఉన్న సైట్ ఓనర్‌ని సంప్రదించి, వారిని అడగాల్సి ఉంటుంది.

ముఖ్యం: Google సెర్చ్ ఫలితాలలో కనిపించే చాలా వరకు ఇమేజ్‌లు Googleకి చెందని వెబ్‌సైట్‌లలోవి, కాబట్టి మేము వెబ్‌లో నుండి ఈ ఇమేజ్‌లను తీసివేయలేము. అందువల్ల ఇమేజ్‌ని తీసివేయాలని అడగడం కోసం ముందుగా సైట్ ఓనర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.

Google సెర్చ్ ఫలితాల నుండి ఇమేజ్‌ని ఎలా తీసివేయాలి

మీరు నిర్ణీత ఇమేజ్‌లను వీలైనంత త్వరగా సెర్చ్ ఫలితాల నుండి తీసివేయాలని కోరుకుంటారని మేము అర్థం చేసుకోగలము. అయితే, సెర్చ్ ఫలితాల నుండి ఇమేజ్‌లను తీసివేసే ప్రాసెస్ కోసం కొంత సమయం పట్టవచ్చు.

ఇమేజ్ తీసివేయాల్సిందిగా కోరుతూ సైట్ ఓనర్‌ను కాంటాక్ట్ చేయండి

మీరు సైట్ ఓనర్‌ని సంప్రదించగల కొన్ని మార్గాలను ఇక్కడ అందించాము:

  • మమ్మల్ని సంప్రదించండి లింక్: “మమ్మల్ని సంప్రదించండి” లింక్‌ని లేదా సైట్ ఓనర్ ఇమెయిల్ అడ్రస్‌ని కనుగొనండి. ఈ సమాచారం తరచుగా సైట్ హోమ్ పేజీలో అందించబడుతుంది.
  • 'Whois' ఉపయోగించి సంప్రదింపు సమాచారాన్ని కనుగొనండి: మీరు Googleను ఉపయోగించి సైట్ ఓనర్ కోసం Whois (who is?) సెర్చ్ నిర్వహించవచ్చు. google.com లింక్‌కి వెళ్లి, whois www.example.com కోసం సెర్చ్ చేయండి. వెబ్‌మాస్టర్‌ను సంప్రదించాల్సిన ఇమెయిల్ అడ్రస్‌ని సాధారణంగా "రిజిస్ట్రంట్ ఇమెయిల్ అడ్రస్" లేదా "అడ్మినిస్ట్రేటర్ సంప్రదింపు సమాచారం" దిగువున కనుగొనవచ్చు.
  • సైట్‌ను హోస్ట్ చేస్తున్న కంపెనీని సంప్రదించండి: 'Whois' సెర్చ్ ఫలితంలో సాధారణంగా వెబ్‌సైట్‌ను ఎవరు హోస్ట్ చేస్తున్నారనే సమాచారం ఉంటుంది. మీరు సైట్ ఓనర్‌ని సంప్రదించలేని పక్షంలో, సైట్ హోస్టింగ్ కంపెనీని సంప్రదించడానికి ట్రై చేయండి.

గమనిక: మీరు సైట్ ఓనర్‌ని సంప్రదించకూడదనుకుంటే లేదా సైట్ నుండి తీసివేసిన ఇమేజ్ పొందలేకపోతుంటే, సెర్చ్ ఫలితాలలోని ఇమేజ్‌లను Google తీసివేయగల ఇతర సందర్భాలు చూడండి.

సైట్ నుండి ఇమేజ్‌ని తీసివేయడానికి చిట్కాలు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని తీసివేయండి

Facebook, Twitter లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని Google సెర్చ్ ఫలితాల నుండి తీసివేయడానికి, ముందుగా ప్లాట్‌ఫామ్ నుండి ఇమేజ్‌ని తీసివేయాలి.

  • ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసిన ఖాతాకు మీకు యాక్సెస్ ఉంటే, ప్లాట్‌ఫామ్ నుండి ఇమేజ్‌ని తీసివేయండి.
  • ఆ ఖాతా యాక్సెస్ మీకు లేకపోతే, సదరు ఇమేజ్‌ని తీసివేయడంలో సహాయం కోరడానికి సోషల్ మీడియా కంపెనీని సంప్రదించండి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సహాయ కేంద్రాన్ని చూడండి

చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌లు వాటి ఇమేజ్ తీసివేత పాలసీలు, ప్రాసెస్ గురించి వివరించే సహాయ రిసోర్స్‌లను కలిగి ఉంటాయి. 

  1. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సహాయ కేంద్రాన్ని చూడండి. ప్రసిద్ధ ప్లాట్‌ఫామ్‌ల కొన్ని సహాయ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి:
  2. మీ పరిస్థితి ఆధారంగా కీవర్డ్‌ల కోసం సెర్చ్ చేయండి. ఉదాహరణకు:
    • “ఫోటోను తీసివేయండి”
    • “ఫోటో గురించి రిపోర్ట్ చేయండి” లేదా “ఫోటోను తొలగించండి”
    • “మరొక వ్యక్తిలా నటించడం” లేదా “నకిలీ ఖాతాలు”
    • “ఇమేజ్ తీసివేత పాలసీలు”
మీ స్వంత సైట్ నుండి ఇమేజ్‌ని తీసివేయండి

ఒకవేళ ఇమేజ్ మీ సైట్‌లో ఉంటే, మీ సైట్‌లోని కంటెంట్ Google సెర్చ్ ఫలితాలలో కనబడకుండా బ్లాక్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీరు Google ప్రోడక్ట్‌కి అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని తీసివేయండి

మీరు Google ప్రోడక్ట్‌కి అప్‌లోడ్ చేసిన ఫోటోను మీ ఆల్బమ్ ఆర్కైవ్ లేదా Google Photos నుండి తీసివేయవచ్చు. మీ ఆల్బమ్ ఆర్కైవ్ నుండి ఫోటోను తొలగించినప్పుడు, అది కనిపించే Blogger, Hangouts, Google Photos లాంటి అన్ని Google ప్రోడక్ట్‌ల నుండి ఫోటోను తీసివేస్తుంది.

  1. మీ ఆల్బమ్ ఆర్కైవ్‌కి వెళ్లండి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న ఫోటోను తెరవండి.
  3. ఎగువున కుడివైపు, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఫోటోను తొలగించు తొలగించు ఎంచుకోండి.
  4. మీకు "ఫోటోను తొలగించు" ఆప్షన్ కనిపించకుంటే, మీ ఫోటోలను తొలగించడానికి Google Photosలో మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

Google Photosలో మీ ఫోటోలను ఎలా తొలగించాలో తెలుసుకోండి.

సెర్చ్ ఫలితాల నుండి అవుట్-డేట్ అయిన/తొలగించబడిన ఇమేజ్‌ను రిఫ్రెష్ చేయమని Googleను అడగండి

సైట్ ఓనర్ వారి సైట్ నుండి ఇమేజ్‌ని తీసివేసిన తర్వాత, మా సాధారణ అప్‌డేట్ ప్రాసెస్‌లో భాగంగా Google Search నుండి ఇమేజ్ తీసివేయబడుతుంది. మీరు Google Search నుండి కూడా ఇమేజ్‌ను తీసివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయవచ్చు.

Google Search నుండి తొలగించిన ఇమేజ్ తీసివేతను రిక్వెస్ట్ చేయండి

భాగం 1: ఇమేజ్ లింక్ అడ్రస్‌ని కాపీ చేయండి

  1. మీరు తీసివేయాలనుకుంటున్న ఇమేజ్‌ని images.google.comలో సెర్చ్ చేయండి.
  2. సెర్చ్ ఫలితాలలో, ఇమేజ్ థంబ్‌నెయిల్‌‌ని కుడి క్లిక్ చేసి, లింక్ అడ్రస్‌ని కాపీ చేయి ఎంచుకండి.
    • గమనిక: వివిధ బ్రౌజర్‌లు లింక్ లొకేషన్ కాపీ చేయడానికి వివిధ పేర్లను కలిగి ఉండవచ్చు.

భాగం 2: Google సెర్చ్ ఫలితాల నుండి తీసివేతను రిక్వెస్ట్ చేయండి

  1. దిగువున తీసివేతను రిక్వెస్ట్ చేయి క్లిక్ చేయండి.
    తీసివేతను రిక్వెస్ట్ చేయండి
  2. కొత్త రిక్వెస్ట్ ఆ తర్వాత ఇమేజ్ క్లిక్ చేయండి.
  3. ఇమేజ్ సెర్చ్ ఫలితాల నుండి “లింక్ అడ్రస్‌ని కాపీ చేయి” URLని ఎంటర్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. “సెర్చ్ ఫలితాలు URL” బాక్స్‌లో, లింక్ అడ్రస్‌ని పేస్ట్ చేయండి.
  5. సమర్పించు క్లిక్ చేయండి.

మీరు కాలం చెల్లిన కంటెంట్‌ను తీసివేయండి పేజీలో మీ రిక్వెస్ట్ స్టేటస్‌ని చూడవచ్చు.

సెర్చ్ ఫలితాల నుండి నిర్దిష్ట ఇమేజ్‌లు తీసివేయాల్సిందిగా Googleని అడగండి

మీకు సంబంధించిన కొన్ని రకాల ఇమేజ్‌లు లేదా మీ సమాచారాన్ని సెర్చ్ ఫలితాలలో కనుగొనడం బాధ కలిగిస్తుందని మేము గుర్తించాము.

పరిమిత సందర్భాలలో, Google Search నుండి ఇమేజ్‌కి గల లింక్‌లను Google తీసివేయవచ్చు. అయితే, దీని వలన లింక్ అయిన సైట్ నుండి ఇమేజ్ తీసివేయబడదు.

అటువంటి ఇమేజ్‌లు, వీడియోలను Google సెర్చ్ ఫలితాల నుండి తీసివేసే రిక్వెస్ట్ ప్రాసెస్‌లో మీకు సహాయపడటానికి, మీ పరిస్థితికి సంబంధించిన కింది దశలు ఫాలో అవ్వండి.

సున్నితమైన ఆర్థిక సంబంధిత, వైద్యపరమైన లేదా జాతీయ ID సమాచారం గల ఇమేజ్‌ను తీసివేయండి

'గుర్తింపు చౌర్యం', లేదా మోసం లాంటి ప్రమాదం వ్యక్తికి ఏర్పడుతుందని మేము భావిస్తే, ఆ విధంగా వర్గీకరించిన సమాచారాన్ని మేము తీసివేయవచ్చు.

అవసరాలు

మా కోసం తొలగింపు కంటెంట్‌ను పరిశీలనలోకి తీసుకోవడానికి, ఇది ఖచ్చితంగా ఈ కింది రకాల సమాచారానికి సంబంధించినది:

  • U.S. సోషల్ సెక్యూరిటీ నంబర్, అర్జెంటీనా సింగిల్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్, బ్రెజిల్ Cadastro de pessoas Físicas, కొరియా నివాసి నమోదు నంబర్, చైనా నివాసి గుర్తింపు కార్డ్ మొదలైన గోప్యమైన ప్రభుత్వ గుర్తింపు (ID) నంబర్‌లు.
  • బ్యాంక్ ఖాతా నంబర్‌లు
  • క్రెడిట్ కార్డ్ నంబర్‌లు
  • చేతితో వ్రాసిన సంతకాలు ఉన్న ఇమేజ్‌లు
  • ID డాక్యుమెంట్‌ల ఇమేజ్‌లు
  • వైద్యపరమైన రికార్డ్‌లు వంటి అత్యంత వ్యక్తిగత, పరిమితం చేయబడిన, ఇంకా అధికారిక రికార్డ్‌లు
  • వ్యక్తిగత కాంటాక్ట్ సమాచారం (భౌతిక అడ్రస్‌లు, ఫోన్ నంబర్‌లు, ఈమెయిల్ అడ్రస్‌లు)
  • గోప్యమైన లాగిన్ ఆధారాలు

Google Search నుండి ఇమేజ్ తీసివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయండి

ఒకవేళ ఇమేజ్ పైన అవసరాలకు అనుగుణంగా ఉంటే, మీరు లేదా అధికారిక ప్రతినిధి Google సెర్చ్ ఫలితాల నుండి ఇమేజ్ తీసివేతను రిక్వెస్ట్ చేయవచ్చు. రిక్వెస్ట్ చేయడానికి, కింది బటన్‌ని క్లిక్ చేయండి.

ఫారమ్‌ను పూరించండి

బలవంతం చేస్తున్నట్లు కనిపించే అశ్లీల చిత్రాలు లేదా వ్యక్తిగత సన్నిహిత చిత్రాలు లేదా "ప్రతీకార లైంగిక కార్యకలాపం" తీసివేయండి

సమ్మతి లేకుండా షేర్ అయ్యే సన్నిహితమైన లేదా అశ్లీలమైన ఇమేజ్‌లు, వీడియోలు (కొన్ని సార్లు “ప్రతీకార లైంగిక కార్యకలాపం” అని సూచించబడుతుంది) మేము తీసివేయవచ్చు.

ముఖ్యం: పిల్లలతో లైంగిక అసభ్యతను ప్రతిబింబించే ఇమేజ్‌లను రిపోర్ట్ చేయడానికి, పిల్లల లైంగిక అశ్లీల సంబంధిత అంశాలు రిపోర్ట్ చేసే దశలు ఫాలో అవ్వండి.

అవసరాలు

కంటెంట్‌ను తీసివేయడం గురించి మేము పరిశీలించడానికి, అది తప్పనిసరిగా కింద పేర్కొన్న ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి:

  1. ఆ ఇమేజ్ మిమ్మల్ని (లేదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని) లైంగిక కార్యకలాపంలో నగ్నంగా పాల్గొన్నట్లు లేదా అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు చూపుతోంది.
  2. ఆ ఇమేజ్ లేదా చర్యకు మీ (లేదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి) సమ్మతి లేకపోయినా దానిని పబ్లిక్‌గా అందుబాటులో ఉంచారు లేదా ఇమేజ్‌ను మీ సమ్మతి లేకుండా పబ్లిక్‌గా అందుబాటులో ఉంచారు.
  3. ప్రస్తుతం, ఈ కంటెంట్ కోసం మీకు ఆన్‌లైన్‌లో గానీ లేదా మరెక్కడైనా గానీ పేమెంట్ చేయడం లేదు.

Google Search నుండి ఇమేజ్ తీసివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయండి

ఒకవేళ ఇమేజ్ పైన అవసరాలకు అనుగుణంగా ఉంటే, మీరు లేదా అధికారిక ప్రతినిధి Google సెర్చ్ ఫలితాల నుండి ఇమేజ్ తీసివేతను రిక్వెస్ట్ చేయవచ్చు. రిక్వెస్ట్ చేయడానికి, కింది బటన్‌ని క్లిక్ చేయండి.

చిట్కా: మేము తీసివేయాలని మీరు కోరుకునే ఇమేజ్ స్క్రీన్‌షాట్‌లను అందించాల్సి ఉంటుంది. లైంగిక అశ్లీల భాగాలను మసకగా చేయడానికి స్క్రీన్‌షాట్‌లు ఎడిట్ చేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాము, అయితే మేము అప్పటికీ ఇమేజ్‌ని గుర్తించగలిగేలా చూసుకోండి.

ఫారమ్‌ను పూరించండి

మా రివ్యూలో మేము ఏమి చేర్చాము

కంటెంట్ తీసివేయబడుతుందో లేదో నిర్ణయించేటప్పుడు మేము ప్రజా ప్రయోజన, వార్తా స్థాయిని పరిగణనలోకి తీసుకుంటాము.

  • చాలా సందర్భాలలో, ఈ రకమైన ఇమేజ్‌లు, వాటితో కూడిన కంటెంట్‌కు ప్రజా ప్రయోజన విలువలు ఉండవు.
  • చాలా అరుదైన సందర్భాలలో, బలమైన ప్రజా ప్రయోజనం ఆధారంగా రిపోర్ట్ చేసిన కంటెంట్‌ను మేము తీసివేయలేము.
  • ఇతర సందర్భాలలో, మా ఫలితాలలో అందుబాటులో ఉండటానికి ప్రజా ప్రయోజనంలో ఉన్న ఇమేజ్‌తో పాటు అందించిన సమాచారం ఉండవచ్చు, కానీ కాంటెక్స్ట్ లేని ఇమేజ్‌ని తీసివేసే అవకాశం ఉంటుంది.
అసంకల్పిత నకిలీ అశ్లీలతను తీసివేయండి

మేము Google సెర్చ్ ఫలితాల నుండి మీకు సంబంధించిన అసంకల్పిత అశ్లీల చిత్రాలను తీసివేస్తాము, అయితే సదరు ఇమేజ్ లేదా వీడియో కింది అవసరాలకు అనుగుణంగా ఉండాలి.

అవసరాలు

మేము కంటెంట్‌ను తీసివేయడం పరిశీలించడానికి, అది తప్పనిసరిగా కింద పేర్కొన్న అన్ని అవసరాలకు అనుగుణంగా ఉండాలి:

  1. మీరు ఇమేజ్‌లలో గుర్తుపెట్టబడేలా కనిపించారు.
  2. నివేదించబడిన ఇమేజ్‌లు నకిలీవి, తప్పుడు విధానంలో మిమ్మల్ని నగ్నంగా లేదా అశ్లీలమైన భంగిమలో చూపుతున్నాయి.
  3. ఇమేజ్‌లు మీ సమ్మతి లేకుండా పంపిణీ చేయబడ్డాయి.

Google Search నుండి ఇమేజ్ తీసివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయండి

ఒకవేళ ఇమేజ్ పైన అవసరాలకు అనుగుణంగా ఉంటే, మీరు లేదా అధికారిక ప్రతినిధి Google సెర్చ్ ఫలితాల నుండి ఇమేజ్ తీసివేతను రిక్వెస్ట్ చేయవచ్చు. రిక్వెస్ట్ చేయడానికి, కింది బటన్‌ని క్లిక్ చేయండి.

చిట్కా: మేము తీసివేయాలని మీరు కోరుకునే ఇమేజ్ స్క్రీన్‌షాట్‌లను అందించాల్సి ఉంటుంది. లైంగిక అశ్లీల భాగాలను మసకగా చేయడానికి స్క్రీన్‌షాట్‌లు ఎడిట్ చేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాము, అయితే మేము అప్పటికీ ఇమేజ్‌ని గుర్తించగలిగేలా చూసుకోండి.

ఫారమ్‌ను పూరించండి

మోసపూరిత తీసివేత విధానాలు గల సైట్‌లో హోస్ట్ చేసిన వ్యక్తిగత ఇమేజ్‌ని తీసివేయండి

రిక్వెస్ట్ మేరకు, కొన్ని పరిస్థితులలో, ఏదైనా సైట్ లేదా ఇతర ఏజెన్సీ కంటెంట్‌ని తీసివేయడానికి నేరుగా వారికి పేమెంట్ చేయాలని కోరినప్పుడు మేము సదరు కంటెంట్ సంబంధిత లింక్‌లను Google సెర్చ్ ఫలితాల నుండి తీసివేసే అవకాశం ఉంటుంది.

అవసరాలు

మేము కంటెంట్‌ను తీసివేయడం పరిశీలించడానికి, అది తప్పనిసరిగా కింద పేర్కొన్న అన్ని అవసరాలకు అనుగుణంగా ఉండాలి:

  1. మీరు సమర్పించబడిన URLలో కంటెంట్‌కు కర్త.
  2. వెబ్‌సైట్ అనేది బిజినెస్ రివ్యూ సైట్ కాదు.
  3. వెబ్‌సైట్‌లో తీసివేత పద్ధతులు ఉన్నాయి, దీనిలోని కంటెంట్‌ను తీసివేయడానికి సైట్‌కు లేదా ఇతర సంస్థలకు చెల్లించాలి.

Google Search నుండి ఇమేజ్ తీసివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయండి

ఒకవేళ ఇమేజ్ పైన అవసరాలకు అనుగుణంగా ఉంటే, మీరు లేదా అధికారిక ప్రతినిధి Google సెర్చ్ ఫలితాల నుండి ఇమేజ్ తీసివేతను రిక్వెస్ట్ చేయవచ్చు. రిక్వెస్ట్ చేయడానికి, కింది బటన్‌ని క్లిక్ చేయండి.

చిట్కా: మేము తీసివేయాలని మీరు కోరుకునే ఇమేజ్ స్క్రీన్‌షాట్‌లను అందించాల్సి ఉంటుంది. లైంగిక అశ్లీల భాగాలను మసకగా చేయడానికి స్క్రీన్‌షాట్‌లు ఎడిట్ చేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాము, అయితే మేము అప్పటికీ ఇమేజ్‌ని గుర్తించగలిగేలా చూసుకోండి.

ఫారమ్‌ను పూరించండి

మైనర్‌కు సంబంధించిన ఇమేజ్‌ను తీసివేయండి (18 ఏళ్లలోపు ఎవరైనా)

ప్రజా ప్రయోజనం, వార్తా స్థాయి దృష్ట్యా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మినహాయించి, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారి ఇమేజ్‌లను 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి లేదా వారి పేరెంట్ లేదా గార్డియన్ రిక్వెస్ట్ మేరకు సెర్చ్ ఫలితాల నుండి Google తీసివేస్తుంది. దీని అర్థం ఈ ఇమేజ్‌లు Images ట్యాబ్‌లోని లేదా Google Searchలోని ఏ ఫీచర్‌లోనూ థంబ్‌నెయిల్‌లగా కనిపించవు. ఈ వార్తా కథనం Google సెర్చ్ ఫలితాల నుండి అటువంటి కంటెంట్‌కు సంబంధించిన తీసివేత రిక్వెస్ట్‌ల ప్రాసెస్ ద్వారా మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఉద్దేశించబడింది.

ముఖ్యమైన సమాచారం: మీరు మైనర్‌కు సంబంధించిన అసభ్యకరమైన ఇమేజ్‌ను తీసివేయమని రిక్వెస్ట్ చేసినట్లైతే, పిల్లలతో లైంగిక అసభ్యతను ప్రతిబింబించే కంటెంట్‌ను రిపోర్ట్ చేయండి.

అవసరాలు

తీసివేత కోసం మీ రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి, అది తప్పనిసరిగా, కింద పేర్కొన్న ఆవశ్యకతలకు తగినట్లుగా ఉండాలి:

  • సమర్పించిన URLలు ఇమేజ్ URLలు అయి ఉండాలి. వెబ్ URLలు (టెక్స్ట్, ఇమేజ్‌లు రెండూ ఉన్న పేజీలు) ఈ పాలసీ ప్రకారం తీసివేయడానికి అర్హత కలిగి ఉండవు.
  • ఇమేజ్‌లో ఉన్న వ్యక్తి, 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు లేదా 18 ఏళ్ల వయస్సు కన్నా ముందే మరణించిన వారు అయి ఉండాలి.
  • మీరు, ఇమేజ్‌లో ఉన్న వ్యక్తి గానీ, లేదా తల్లి/తండ్రి లేదా గార్డియన్ వంటి అధికారిక ప్రతినిధి గానీ అయి ఉండాలి.
  • ఇమేజ్, మీరు మేనేజ్ చేసే సోషల్ మీడియా ఖాతా లేదా వెబ్ పేజీలోనిది కాకూడదు.
చిట్కా: మరింత సమాచారం లేదా తొలగింపు ప్రాసెస్‌లో సహాయం కోసం, Google సెర్చ్ ఫలితాల నుండి మైనర్‌ల ఇమేజ్‌లను తీసివేయండికి వెళ్లండి.

Google Search నుండి ఇమేజ్ తీసివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయండి

ఒకవేళ ఇమేజ్ పైన అవసరాలకు అనుగుణంగా ఉంటే, మీరు లేదా అధికారిక ప్రతినిధి Google సెర్చ్ ఫలితాల నుండి ఇమేజ్ తీసివేతను రిక్వెస్ట్ చేయవచ్చు. రిక్వెస్ట్ చేయడానికి, కింది బటన్‌ని క్లిక్ చేయండి.

ముఖ్యమైనది: మీరు లేదా మీ అధికారిక ప్రతినిధి ఫారమ్‌లో సమర్పించిన URLలను మాత్రమే మేము రివ్యూ చేస్తాము.

ఫారమ్‌ను పూరించండి

చట్టపరమైన కారణాల కోసం ఇమేజ్‌ని తీసివేయండి

మేము వర్తించే చట్టాల ప్రకారం Google సర్వీస్‌ల నుండి కంటెంట్‌ని తీసివేస్తాము.

మేధోసంపత్తి సమస్య

కాపీరైట్ ఉల్లంఘన లేదా వంచన, వ్యాపారచిహ్నం అతిక్రమణ, నకిలీ వస్తువు లాంటి మేధోసంపత్తి ఉల్లంఘన కారణంగా, Google Search నుండి ఇమేజ్ తీసివేతను అభ్యర్థించడానికి, కింది బటన్‌ని క్లిక్ చేయండి.

ఫారమ్‌ను పూరించండి

ఇతర చట్టపరమైన కారణాలు

మేము ఇతర చట్టపరమైన కారణాలు, దీనితో అనుబంధమైన ప్రత్యేక రిక్వెస్ట్‌ల కోసం Google Search నుండి ఇమేజ్‌లను తీసివేయవచ్చు:

  • న్యాయస్థాన ఆదేశాలు, ఇది నిర్దిష్ట కంటెంట్ చట్టవిరుద్ధమైనది అని న్యాయస్థానం గుర్తించిన పక్షంలో అందిస్తుంది.
  • FOSTA-SESTA లేదా CA నిలిపివేత / హోమ్‌లోని CA సేఫ్ ప్రోగ్రామ్.
  • పిల్లలను లైంగికంగా వేధించే కంటెంట్, ఇది పిల్లలు పాల్గొనే లైంగిక అశ్లీల ప్రవర్తన దృశ్య రూపాన్ని సూచిస్తుంది.

పైన లిస్ట్ చేసిన చట్ట సంబంధిత కారణం కోసం Google Search నుండి ఇమేజ్ తీసివేతను రిక్వెస్ట్ చేయడానికి, కింది బటన్‌ని క్లిక్ చేయండి.

ఫారమ్‌ను పూరించండి

సంబంధిత రిసోర్స్‌లు 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17494712010184337216
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false