మీ ఫోటోలలోని వ్యక్తులు, అంశాలు, స్థలాల ఆధారంగా సెర్చ్ చేయండి

మీరు మీ ఫోటోలలో దేని కోసమైనా సెర్చ్ చేయండి. ఉదాహరణకు, మీరు వీటి కోసం సెర్చ్ చేయవచ్చు:

  • గత వేసవిలో మీరు హాజరైన వివాహం
  • మీ బెస్ట్ ఫ్రెండ్
  • పెంపుడు జంతువు
  • మీకు ఇష్టమైన నగరం

ముఖ్య గమనిక: కొన్ని ఫీచర్‌లు అన్ని భౌగోళిక ప్రాంతాలలో, అన్ని డొమైన్‌లలో, లేదా అన్ని ఖాతా రకాలలో అందుబాటులో లేవు.

Before you get started

Download and install the Google Photos app.

మీ ఫోటోలను సెర్చ్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. దిగువున, సెర్చ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • టెక్స్ట్ ఆధారంగా సెర్చ్ చేయడానికి:
      • ఎగువున ఉన్న సెర్చ్ బాక్స్ మీద ట్యాప్ చేసి, మీరు ఏమి కనుగొనాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి, ఉదాహరణకు:
      • న్యూయార్క్ నగరం
      • మీరు వ్యక్తులను లేదా పెంపుడు జంతువులను లేబుల్ చేసి ఉంటే, పేరు లేదా మారుపేరు
    • సూచనలను ఉపయోగించి సెర్చ్ చేయడానికి:
      • మీరు ఈ కేటగిరీలను అన్వేషించవచ్చు:
        • వ్యక్తులు & పెంపుడు జంతువులు: మీ సన్నిహితుల అన్ని ఫోటోలు, వీడియోలు
        • స్థలాలు: మీ ఫోటోలను తీసిన నిజమైన స్థలాలను అన్వేషించడానికి మ్యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది
        • అంశాలు: మీ ఫోటోలలో మేము కనుగొన్న వస్తువులు, విషయాలు
      • మరింత ఉపయోగకరమైన ఇటువంటి సెర్చ్‌ల కోసం మీరు కిందకు కూడా స్క్రోల్ చేయవచ్చు:
        • స్క్రీన్‌షాట్‌లు, సెల్ఫీలు, వీడియోలు

ఎవరైనా వ్యక్తి లేదా పెంపుడు జంతువు ఫోటోలను కనుగొని, పేరును జోడించండి

మీ ఫోటోలను మరింత సులభంగా సెర్చ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, Google Photos ద్వారా గ్రూప్ చేయబడిన ఫోటోలలో కనపడే వ్యక్తులకు లేదా పెంపుడు జంతువులకు మీరు లేబుల్‌ను వర్తింపజేయవచ్చు.

ముఖ్య గమనిక: ఈ ఫీచర్ అన్ని భౌగోళిక ప్రాంతాలలో, అన్ని డొమైన్‌లలో, లేదా అన్ని ఖాతా రకాలలో అందుబాటులో లేదు.

1వ దశ: ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా పెంపుడు జంతువు ఫోటోలను కనుగొనండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. దిగువున, సెర్చ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ముఖాలు ఉన్న ఒక అడ్డు వరుస మీకు కనిపిస్తుంది. వాటిలో ఎవరి ఫోటోలను అయినా చూడటానికి, ముఖం మీద ట్యాప్ చేయండి.
    • మరిన్ని ముఖాలను చూడటానికి, 'అన్ని చూడండి'ని ట్యాప్ చేయండి.

ముఖాలు ఉన్న అడ్డు వరుస మీకు కనిపించకపోతే:

2వ దశ: లేబుల్‌ను వర్తింపజేయండి

  1. ఫేస్ గ్రూప్ ఎగువున ఉన్న, 'పేరును జోడించు'ను ట్యాప్ చేయండి.
  2. పేరు లేదా మారుపేరును ఎంటర్ చేయండి.

మీరు సెర్చ్ బాక్స్‌ను ఉపయోగించి ఆ లేబుల్‌తో సెర్చ్ చేయగలరు. మీరు ఆ ఫోటోలను షేర్ చేసినప్పటికీ, మీరు ఎంచుకునే ప్రైవేట్ ఫేస్ లేబుల్‌లను మీరు మాత్రమే చూడగలరు.

ఫేస్ గ్రూప్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి

మీరు మీ ఫోటోలలో కనిపించే ముఖాల ఆధారంగా ఫోటోలను గ్రూప్ చేయడం ఆపివేయవచ్చు.

మీరు ఫేస్ గ్రూప్‌ల ఫీచర్ ఆఫ్ చేస్తే, మీరు వీటిని తొలగిస్తారు:

  • మీ ఖాతాలోని ఫేస్ గ్రూప్‌లు
  • ఆ ఫేస్ గ్రూప్‌లను క్రియేట్ చేయడానికి ఉపయోగించిన ఫేస్ మోడల్‌లు
  • మీరు క్రియేట్ చేసిన ఫేస్ లేబుల్స్

Google Photos ఫేస్ గ్రూప్‌ల ఫీచర్ నిల్వ కొనసాగింపు పాలసీ గురించి తెలుసుకోండి.

దీన్ని ఆఫ్ లేదా ఆన్ చేయడానికి:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. పైన కుడి వైపున, మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా పేరులోని మొదటి అక్షరాలను ట్యాప్ చేయండి.
  4. Photos సెట్టింగ్‌లు ఆ తర్వాత గోప్యత ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  5. ఫేస్ గ్రూప్‌ల ను ఆఫ్ లేదా ఆన్ చేయడానికి.
    • పెంపుడు జంతువుల ఫోటోలకు మాత్రమే ఫేస్ గ్రూప్‌ల ఫీచర్‌ను ఆఫ్ చేయడానికి, వ్యక్తులతో పాటు పెంపుడు జంతువుల ఫోటోలను చూపండి ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

అధునాతన చిట్కాలు

ఫేస్ గ్రూప్‌లను మిళితం చేయండి

ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ గ్రూప్‌లలో ఉంటే, మీరు ఆ గ్రూప్‌లను విలీనం చేయవచ్చు.

  1. ఫేస్ గ్రూప్‌లలో ఒకదానిని పేరు లేదా మారుపేరుతో లేబుల్ చేయండి.
  2. సూచనల నుండి ఎంచుకుని అదే పేరు లేదా మారుపేరుతో ఇతర ఫేస్ గ్రూప్‌ను లేబుల్ చేయండి.
  3. మీరు రెండవ పేరు లేదా మారుపేరును నిర్ధారించినప్పుడు, మీరు ఫేస్ గ్రూప్‌లను విలీనం చేయాలనుకుంటున్నారా అని 'Google Photos' అడుగుతుంది.

రెండు ఫేస్ గ్రూప్‌లను విలీనం చేయమని మీకు సూచన కూడా అందవచ్చు. వారు ఒకే వ్యక్తి అయితే, 'అవును' ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

లేబుల్‌ను మార్చండి లేదా తీసివేయండి

మీరు మీ ఫేస్ గ్రూప్ లేబుళ్లను ఎడిట్ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు.

  • లేబుల్‌ను మార్చడానికి: వ్యక్తుల ఫోల్డర్ ఆ తర్వాత మరిన్ని ఆ తర్వాత పేరు లేబుల్‌ను ఎడిట్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  • లేబుల్‌ను తీసివేయడానికి: వ్యక్తులు ఫోల్డర్ ఆ తర్వాత మరిన్ని ఆ తర్వాత పేరు లేబుల్‌ను తీసివేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
సెర్చ్ పేజీ నుండి ఫేస్ గ్రూప్‌ను తీసివేయండి

మీ సెర్చ్ పేజీలో నిర్దిష్ట ఫేస్ గ్రూప్‌ను మీరు చూడకూడదని అనుకుంటే, మీరు దానిని తీసివేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. దిగువున, సెర్చ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ముఖాలు ఉన్న అడ్డు వరుసకు పక్కన, అన్నీ చూడండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. పైన కుడి వైపున ఉన్న, మరిన్ని ఆ తర్వాత వ్యక్తులను దాచండి & చూపండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  6. మీరు దాచాలనుకుంటున్న ముఖాలను ట్యాప్ చేయండి. ఏదైనా ముఖాన్ని చూపడానికి, బాక్స్‌ను మళ్లీ ట్యాప్ చేయండి.
  7. ఎగువ కుడి వైపున, 'పూర్తయింది'ని ట్యాప్ చేయండి.
గ్రూప్ నుండి ఏదైనా ఐటెమ్‌ను తీసివేయండి

మీరు ఏదైనా ఫోటోను తప్పు గ్రూప్‌లో చూస్తే, మీరు దాన్ని తీసివేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. దిగువున, సెర్చ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు ఏ ఫేస్ గ్రూప్ నుండి అయితే దేన్నైనా తీసివేయాలనుకుంటున్నారో, ఆ ఫేస్ గ్రూప్‌ను ఎంచుకోండి.
  5. మరిన్ని ఆ తర్వాత ఫలితాలను తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. మీరు గ్రూప్ నుండి తీసివేయాలనుకుంటున్న ఫోటోలను లేదా వీడియోలను ఎంచుకోండి.
  7. ఎగువు కుడి వైపున, 'తీసివేయి'ని ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు గ్రూప్ నుండి ఏదైనా ఐటెమ్‌ను తీసివేస్తే, మీ 'Google Photos' లైబ్రరీ నుండి వీడియో లేదా ఫోటో తొలగించబడదు.

ఫీచర్ ఫోటోను మార్చండి
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. దిగువున, సెర్చ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫేస్ గ్రూప్‌ను ట్యాప్ చేయండి.
  4. పైన కుడి వైపున ఉన్న, మరిన్ని ఆ తర్వాత ఫీచర్ ఫోటోను మార్చండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  5. ఫీచర్ ఫోటోగా చేయడానికి ఫోటోను ఎంచుకోండి.
ఫేస్ మోడల్స్ గురించి తెలుసుకోండి

ఫేస్ గ్రూప్‌లు అనేది 3 దశలలో జరుగుతుంది:

  1. ఏదైనా ఫోటోలో ముఖం ఉందో లేదో మేము గుర్తిస్తాము.
  2. ఫేస్ గ్రూప్‌ల ఫీచర్ ఆన్‌లో ఉంటే, అల్గారిథమ్‌లను ఉపయోగించి ముఖాల ఇమేజ్‌లను సంఖ్యాపరంగా సూచించే ఫేస్ మోడల్స్ క్రియేట్ చేయబడతాయి, ముఖాలకు చెందిన వేర్వేరు ఇమేజ్‌ల సారూప్యత సూచించబడుతుంది, అలాగే వేర్వేరు ఇమేజ్‌లు ఒకే ముఖాన్ని చూపిస్తున్నాయో లేదో అంచనా వేయబడుతుంది.
  3. చాలా సారూప్యంగా అనిపించే ముఖాలు, అవి కూడా దాదాపు ఒకే వ్యక్తికి చెందినవి అయిన ఫోటోలు ఒకటిగా ఫేస్ గ్రూప్ చేయబడతాయి. ఏదైనా ఫోటో తప్పు గ్రూప్‌లో ఉందని మీరు భావిస్తే, మీరు దాన్ని గ్రూప్ నుండి ఎప్పుడైనా తీసివేయవచ్చు.

మీరు ఏ ఫేస్ గ్రూప్‌నకు అయినా పేరు లేదా మారుపేరు లేబుల్‌ను జోడించవచ్చు.

ఫేస్ గ్రూప్‌ల ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు, Google Photos ఇతర లక్షణాల ఆధారంగా ఫోటోలను ఒక నిర్దిష్ట గ్రూప్‌లో చేర్చవచ్చు. సమీప సమయాల్లో తీసిన ఫోటోలు, అలాగే ముఖం కనిపించకపోతే, ఒక వ్యక్తి అన్ని ఫోటోలలో ఒకే రకమైన దుస్తులు ధరించినట్లు కనుగొనడం వంటివి ఇందులో భాగంగా ఉంటుంది.

ఫేస్ గ్రూప్‌లు, ఫేస్ లేబుల్స్ & షేరింగ్

  • ఆటోమేటిక్‌గా, మీ ఖాతాలోని ఫేస్ గ్రూప్‌లు, లేబుల్స్ మీకు మాత్రమే కనిపిస్తాయి.
  • మీరు ఫోటోలను షేర్ చేసినప్పుడు, ఫేస్ గ్రూప్‌లు షేర్ చేయబడవు.
  • ఫేస్ లేబుళ్ళు ప్రతి ఖాతాకు ప్రైవేట్‌గా ఉంచబడతాయి, అవి అన్ని ఖాతాలతో షేర్ చేయబడవు.
  • మీరు ఫేస్ గ్రూప్‌ను "నేను"గా లేబుల్ చేయడానికి ఎంచుకోవచ్చు. ఇది మీ కాంటాక్ట్‌ల Google Photos యాప్‌లు ఫోటోలలో మీ ముఖాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది, మీతో మీ ఫోటోలను షేర్ చేయడానికి సూచనలను పొందుతుంది. మీ ఫేస్ గ్రూప్‌ను లేబుల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఫేస్ గ్రూప్‌ల ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు, మేము మీ ఫోటోలలో కనిపించే ముఖాల మోడల్స్‌ను చేయాలని మీరు అనుకుంటున్నట్లుగా మాకు తెలియజేస్తారు. ఈ మోడల్స్‌ను కొన్ని అధికారిక ప్రదేశాలలో బయోమెట్రిక్ డేటాగా పరిగణించబడతాయి.

మీ ఫేస్ మోడల్స్‌ను తొలగించడానికి, ఫేస్ గ్రూప్‌ల ఫీచర్‌ను ఆఫ్ చేయండి. మీ ఫేస్ మోడల్స్, ఫేస్ గ్రూప్ గ్రూప్‌లు, అలాగే ఫేస్ లేబుల్స్‌ను మీరు తొలగించే వరకు లేదా మీ Google Photos ఖాతా రెండు సంవత్సరాలకు పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉండే వరకు మేము వాటిని స్టోర్ చేసి ఉపయోగిస్తాము. Google Photos ఫేస్ గ్రూప్‌ల ఫీచర్ నిల్వ కొనసాగింపు పాలసీ గురించి తెలుసుకోండి.

మీ ఫోటోలకు వ్యక్తులు & పెంపుడు జంతువుల లేబుల్‌లను జోడించండి, మార్చండి, లేదా తీసివేయండి.
'Google ఫోటోలు' ఏదైనా ఫోటోను మిస్ చేస్తే లేదా తప్పుగా గ్రూప్ చేస్తే, మీరు ఫేస్ గ్రూప్‌నకు ఫోటోను జోడించవచ్చు, మార్చవచ్చు, లేదా తీసివేయవచ్చు.
ఈ ఫీచర్ అన్ని దేశాలలో అందుబాటులో లేదు.

ఫోటో ఏ ఫేస్ గ్రూప్‌నకు చెందినది అనేది మార్చండి

'Google ఫోటోలు' వ్యక్తిని లేదా పెంపుడు జంతువును తప్పుగా లేబుల్ చేసినప్పుడు, మీరు ఫేస్ లేబుల్‌ను జోడించవచ్చు, తీసివేయవచ్చు, లేదా మార్చవచ్చు.
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, 'Google ఫోటోలు' యాప్ 'ను తెరవండి.
  2. ఫోటోను ఎంచుకుని ఆ తర్వాత మరిన్ని 더보기 ట్యాప్ చేయండి.
  3. “వ్యక్తులు” వద్దకు స్క్రోల్ చేసి, ఎడిట్ చేయి Editని ట్యాప్ చేయండి.
  4. లేబుల్‌ను తీసివేయండి, జోడించండి, లేదా మార్చండి:
    • లేబుల్‌ను తీసివేయడానికి: ఫేస్ లేబుల్ మీద, తీసివేయి Removeని ట్యాప్ చేయండి.
    • లేబుల్‌ను జోడించడానికి: “జోడించడానికి అందుబాటులో ఉన్నాయి” కింద, ఫేస్ లేబుల్ మీద, జోడించు Addను ట్యాప్ చేయండి. తర్వాత, ఫోటోలో, జోడించడానికి లేబుల్‌ను ట్యాప్ చేయండి, లేదా కొత్త లేబుల్‌ను క్రియేట్ చేయడానికి, జోడించు Addను ఎంచుకోండి.
    • లేబుల్‌ను మార్చడానికి:
      1. ఫేస్ లేబుల్ మీద, తీసివేయి Removeని ట్యాప్ చేయండి.
      2. “జోడించడానికి అందుబాటులో ఉన్నాయి” కింద, ఫేస్ లేబుల్ మీద, జోడించు Addను ట్యాప్ చేయండి.
      3. జోడించడానికి ఫేస్ లేబుల్‌ను ఎంచుకోండి.
  5. 'పూర్తయింది'ని ట్యాప్ చేయండి.

సంబంధిత పేజీ

మీ ఫోటోలను కనుగొనడం సాధ్యపడలేదా? ఫోటోలను కనుగొనడంలో సహాయం పొందండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3021956878168252918
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false