సబ్‌స్క్రిప్షన్‌లతో ఉన్న సమస్యలను పరిష్కరించండి

మీ సమస్యను బట్టి, కింద పేర్కొన్న పరిష్కారాలను ట్రై చేయండి.

మిస్ అయిన సబ్‌స్క్రిప్షన్‌లను కనుగొనండి

మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌లను కనుగొనలేకపోతే, మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ అయ్యారేమో చెక్ చేసుకోండి.

మీ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయడాన్ని నిర్ధారించుకోండి. ఒక ఖాతాను జోడించడం లేదా ఖాతాలను మార్చడం ఎలాగో తెలుసుకోండి.
  • మీరు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉపయోగించిన ఇమెయిల్ మీ Google ఖాతాది కాకుండా వేరేది కావచ్చు.
  • మీరు సబ్‌స్క్రిప్షన్‌ను ఎక్కడ జోడించారో తెలుసుకోవడానికి, మీ ఇతర ఇమెయిల్ ఖాతాలను చెక్ చేసి, సబ్‌స్క్రిప్షన్ రసీదును కనుక్కోండి.
  • మీ ఫ్యామిలీ మెంబర్‌లతో చెక్ చేయండి. మీరు సబ్‌స్క్రయిబ్ చేయడం కోసం మీ ఫ్యామిలీ మెంబర్ ఖాతాను ఉపయోగించి ఉండవచ్చు.

యాప్‌లోని సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌తో సమస్య

మీకు యాప్‌లోని కంటెంట్‌తో సమస్యలు ఉన్నట్లయితే, వాటి గురించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నా లేదా సహాయం పొందాలనుకున్నా, మీరు యాప్ డెవలపర్‌ను సంప్రదించవచ్చు.

వీటి కోసం యాప్ డెవలపర్‌ను సంప్రదించడం ఉత్తమం:

  • యాప్ లేదా గేమ్ ఇంకా దాని సబ్‌స్క్రిప్షన్‌తో ఉన్న సమస్యను పరిష్కరించడంలో సహాయాన్ని పొందడానికి.
  • యాప్ లేదా సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా ఉపయోగించాలో మరింత తెలుసుకోవడానికి.
  • యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ అందకపోతే, దాని గురించి అడగటానికి.
  • నిర్దిష్ట యాప్‌లకు సంబంధించి యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఇంకా సైన్ ఇన్ సమస్యలకు సహాయం పొందడానికి.
యాప్ డెవలపర్‌లను సంప్రదించడం ఎలాగో తెలుసుకోండి.

ఇప్పటికే యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి ఉంటే, ఛార్జిలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోండి

మీరు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మీరు ఇంకా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయాలి, లేకపోతే మీకు ఛార్జి విధించడం కొనసాగించబడుతుంది.

  1. మీ Android పరికరంలో, 'Google Playలో సబ్‌స్క్రిప్షన్స్' అనే లింక్‌కు వెళ్లండి.
  2. మీరు రద్దు చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోండి.
  3. సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. సూచనలను ఫాలో అవ్వండి.

రీఫండ్‌ను ఎలా రిక్వెస్ట్ చేయాలో తెలుసుకోండి.

సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లించడంలో ఉన్న సమస్యలను పరిష్కరించండి

మీరు పేమెంట్ ఆప్షన్‌ను కోల్పోతే లేదా దొంగిలించబడితే, లేదా మీ పేమెంట్ ఆప్షన్ తిరస్కరించబడింది అని మీకు ఇమెయిల్ వస్తే, మీరు వేరే పేమెంట్ ఆప్షన్‌ను ట్రై చేయండి. 

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, 'Google Play స్టోర్Google Play'ను తెరవండి.
  2. మీరు సరైన Google ఖాతాకు సైన్ ఇన్ చేశారేమో చెక్ చేసుకోండి.
  3. మెనూ మెనూ ఆ తర్వాత 'సబ్‌స్క్రిప్షన్‌లు'ను ట్యాప్ చేయండి.
  4. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న సబ్‌స్క్రిప్షన్‌ను కనుగొనండి.
  5. కింది వాటి నుండి ఎంచుకోండి:
    • యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం, 'మేనేజ్ చేయండి'ని ట్యాప్ చేయండి.
    • మీ పేమెంట్ ఆప్షన్‌ను పరిష్కరించడానికి, 'అప్‌డేట్ చేయి'ని ట్యాప్ చేయండి.
  6. మీ పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించండి.

ముఖ్య గమనిక: మీ పేమెంట్ ఆప్షన్ తిరస్కరించబడినా లేదా తగినన్ని నిధులు లేకపోయినా, మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడవచ్చు. ఇదే జరిగితే, మీ సబ్‌స్క్రిప్షన్‌ను మళ్లీ సెటప్ చేయండి.

Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1161609513336966300
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false