Google Playలో కొనుగోలు ఆమోదాలు

మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో తల్లి/తండ్రి అయితే, మీ ఫ్యామిలీ మెంబర్‌లు Google Playలో కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి మీ అనుమతిని పొందవలసి ఉంటుంది. కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు, కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లను మార్చండి

ఒకవేళ మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో ఫ్యామిలీ మేనేజర్ అయితే, మీరు మీ ఫ్యామిలీలోని ఏ మెంబర్ కోసం అయినా కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో తల్లి/తండ్రి అయితే, Family Linkతో మేనేజ్ చేయబడే ఖాతాలు కలిగిన ఫ్యామిలీ మెంబర్‌ల కోసం, మీరు కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, g.co/yourfamily లింక్‌కు వెళ్లండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. Google Playలో కంట్రోల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. “కొనుగోలు & డౌన్‌లోడ్ ఆమోదాలు" కింద, ఆమోదం అవసరమైనవి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మీకు ఆమోదం అవసరమైన కొనుగోళ్ల రకాలను ఎంచుకోండి:
    • మొత్తం కంటెంట్
    • ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ ద్వారా చేసిన అన్ని కొనుగోళ్లు
    • యాప్‌లో కొనుగోళ్లు మాత్రమే
    • ఆమోదం అవసరం లేదు

రిక్వెస్ట్‌లను ఆమోదించండి లేదా తిరస్కరించండి

ఒకవేళ మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో తల్లి/తండ్రి అయితే, Google Play నుండి పొందే కంటెంట్ కోసం చేసే రిక్వెస్ట్‌లను మీరు ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోలు పూర్తయినప్పుడు, ఫ్యామిలీ మేనేజర్ ఈ మెయిల్ రసీదును పొందుతారు.

మీరు Google Kids Spaceలో డౌన్‌లోడ్ చేసే సిఫార్సు చేసిన యాప్‌ల కోసం ఆమోదాలను, ప్రత్యేకంగా Google Kids Space సెట్టింగ్‌లులో మేనేజ్ చేయవచ్చు.

పెయిడ్ కంటెంట్
  1. ఫ్యామిలీ మెంబర్ Google Play బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసినప్పుడు, వారికి మీ పాస్‌వర్డ్‌ను అడిగే స్క్రీన్ కనిపిస్తుంది.
  2. రిక్వెస్ట్‌ను రివ్యూ చేయండి.
  3. ఆమోదించడానికి, వారి పరికరంలో మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  4. ఆమోదించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఎటువంటి ఛార్జీ లేకుండా అందుబాటులో ఉన్న కంటెంట్

ఒకవేళ Family Linkతో మేనేజ్ చేయబడే Google ఖాతాను కలిగిన చిన్నారికి Play కంటెంట్ కోసం తల్లిదండ్రుల ఆమోదం అవసరమైతే, వారు ఆ కంటెంట్‌ను డౌన్‌లోడ్ లేదా యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు వారికి రెండు ఆప్షన్‌లు కలిగిన స్క్రీన్ కనిపిస్తుంది:

మెసేజ్‌లో అడగండి

  1. మీరు మీ కంప్యూటర్‌లో నోటిఫికేషన్‌ను పొందుతారు.
  2. రిక్వెస్ట్‌ను రివ్యూ చేయడం. మరిన్ని వివరాలను చూడటానికి, రిక్వెస్ట్‌ను లేదా యాప్ పేరును క్లిక్ చేయండి.
  3. ఆమోదించు లేదా నిరాకరించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇప్పుడు అడగండి

  1. మీరు రిక్వెస్ట్‌ను మీ చిన్నారి పరికరంలో రివ్యూ చేస్తారు.
  2. దానిని ఆమోదించడానికి, వారి పరికరంలో మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  3. ఆమోదించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
చిట్కా: మీరు Family Link యాప్ లేదా Play స్టోర్ యాప్ కోసం నోటిఫికేషన్‌లను ఆఫ్ చేస్తే, రిక్వెస్ట్ వచ్చినప్పుడు మీకు తెలియజేయబడదు.
ఎలాంటి ఛార్జీ లేకుండా కంటెంట్‌కు సంబంధించి పెండింగ్ రిక్వెస్ట్‌లను కనుగొనండి

Play Store యాప్

  1. మీ కంప్యూటర్‌లో, మీ బ్రౌజర్‌లో play.google.com లింక్‌ను ఉపయోగించి Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. అప్రూవల్ రిక్వెస్ట్‌లను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

Family Link యాప్

  1. మీ కంప్యూటర్‌లో, familylink.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువ కుడి వైపున, నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
చిట్కా: మీరు మీ ఫోన్‌లో ఎటువంటి ఛార్జీ లేకుండా కంటెంట్, అలాగే మీ ఆమోద హిస్టరీ కోసం మాత్రమే పెండింగ్ రిక్వెస్ట్‌లను చూడవచ్చు.
కొనుగోలు రిక్వెస్ట్‌లను ఉపసంహరించుకోండి
Android పరికరంలో ఫ్యామిలీ మెంబర్‌లు, Google Play ఆర్డర్ హిస్టరీ ట్యాబ్ నుండి, పెండింగ్‌లో ఉన్న వారి పెయిడ్ కొనుగోలు రిక్వెస్ట్‌లను ఉపసంహరించుకోవచ్చు.
ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ లేకుండా చేసిన కొనుగోలు రిక్వెస్ట్‌లు

మీరు ఫ్యామిలీ మేనేజర్ అయి ఉండి, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను జోడించకుంటే, మీ ఫ్యామిలీ మెంబర్‌లు కొనుగోలు చేయడానికి మీ ఆమోదం కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ గురించి మరింత తెలుసుకోండి.

మీరు, Google Play గిఫ్ట్ కార్డ్‌లతో సహా, మీ Google Play ఖాతాకు జోడించే ఏదైనా పేమెంట్ ఆప్షన్‌తో కొనుగోలును పూర్తి చేయవచ్చు. మీరు కొనుగోలును పూర్తి చేసినప్పుడు, ఆ విషయాన్ని నిర్ధారిస్తూ మీ Google ఖాతాకు ఒక ఈమెయిల్ వస్తుంది. కొనుగోలు మీ Google Play ఆర్డర్ హిస్టరీలో చూపబడుతుంది.

మీ ఫ్యామిలీ మెంబర్‌లు కొనుగోలు రిక్వెస్ట్ చేస్తే, వారు కూడా కొనుగోలు నిర్ధారణ ఈమెయిల్‌ను అందుకుంటారు. మీ కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు, కొనుగోలు నిర్ధారణ ఈమెయిల్స్‌తో సహా, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు వర్తిస్తాయి.

చిట్కాలు:

  • పెయిడ్ యాప్‌లు లేదా యాప్‌లో కొనుగోళ్లను చేయడానికి ఫ్యామిలీ మెంబర్‌లు ఆమోదం కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. ఇందులో, Play Books, Google TV లేదా సబ్‌స్క్రిప్షన్ కొనుగోళ్లు ఉండవు.
  • మీరు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను జోడిస్తే, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ లేకుండా చేసిన కొనుగోలు రిక్వెస్ట్‌లు మీ ఫ్యామిలీ గ్రూప్‌నకు అందుబాటులో ఉండవు.
  • ఫ్యామిలీ మేనేజర్ అనుమతి లేకుండా ఫ్యామిలీ మెంబర్‌లు, ఫ్యామిలీ మేనేజర్‌కు చెందిన పేమెంట్ ఆప్షన్‌ను కనుగొనలేరు లేదా ఉపయోగించలేరు.
  • కొనుగోలు రిక్వెస్ట్‌లను పూర్తి చేయడానికి ఫ్యామిలీ మేనేజర్‌లు గతంలో రిడీమ్ చేసిన ప్రమోషనల్ ఆఫర్‌లను ఉపయోగించలేరు లేదా కొత్త ప్రమోషనల్ ఆఫర్‌లను రిడీమ్ చేయలేరు. Google Playలో రీఫండ్‌ల గురించి మరింత తెలుసుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13238996772776165336
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false