మీ Google Play పేమెంట్ ఆప్షన్‌ను జోడించడం, తీసివేయడం లేదా ఎడిట్ చేయడం ఎలా చేయాలి

మీరు Google Play కొనుగోళ్ల కోసం ఉపయోగించే పేమెంట్ ఆప్షన్‌లను జోడించడం, ఎడిట్ చేయడం లేదా తీసివేయడం ఎలాగో ఇక్కడ చూడండి.

పేమెంట్ ఆప్షన్ సమస్యలను పరిష్కరించండి

క్రెడిట్ కార్డ్‌లు, డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్, PayPal ఇంకా Google Play క్రెడిట్ వంటి అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్‌ల గురించిన మరింత సమాచారం కోసం, ఆమోదించబడిన పేమెంట్ ఆప్షన్‌లకు వెళ్లండి. మీకు సమస్యలు ఉన్నట్లయితే, మీ ఖాతాలో పేమెంట్ సమస్యలను పరిష్కరించుకోండి.

మీ Google Play ఖాతాకు పేమెంట్ ఆప్షన్‌ను ఎలా జోడించాలి

  1. మీ Android ఫోన్‌లో, Google Play లోని మీ పేమెంట్ ఆప్షన్‌లు అనే లింక్‌కు వెళ్లండి.
  2. పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు జోడించాలనుకుంటున్న పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయండి.
గమనిక: మీరు భారతదేశంలో Google Payను పేమెంట్ ఆప్షన్‌గా ఉపయోగిస్తుంటే, మీరు మీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ఐడెంటిఫయర్ IDని అప్‌డేట్ చేయాలి.

Google Play సబ్‌స్క్రిప్షన్‌లకు బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి

మీ సబ్‌స్క్రిప్షన్‌ల విషయంలో ఆలస్యాన్ని నివారించడానికి, మీరు ఒక్కో సబ్‌స్క్రిప్షన్‌కు విడివిడిగా ఒక బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌ను మీ Google Play ఖాతాలో జోడించవచ్చు. ఒకవేళ మీ ప్రధాన పేమెంట్ ఆప్షన్ పని చేయకపోతే, మీ బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌కు ఛార్జీ విధించబడుతుంది. మీరు మీ బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌లను ఎప్పుడైనా తీసివేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Playలోని సబ్‌స్క్రిప్షన్‌లకు వెళ్లండి.
  2. సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోండి.
  3. బ్యాకప్ పేమెంట్ ఆప్షన్ ఆ తర్వాత సెటప్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

మీ Google Play ఖాతా నుండి పేమెంట్ ఆప్షన్‌ను ఎలా తొలగించాలి

మీరు మీ Google Play ఖాతా నుండి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఇతర పేమెంట్ ఆప్షన్‌ను తీసివేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో Google Playలోని పేమెంట్ ఆప్షన్‌లకు వెళ్లండి.
  2. మరిన్ని Settings ఆ తర్వాత పేమెంట్ సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి.
  3. ఒకవేళ అడిగితే, Google Payకు సైన్ ఇన్ చేయండి.
  4. మీరు తీసివేయాలనుకుంటున్న పేమెంట్ ఆప్షన్ కింద, తీసివేయండి ఆ తర్వాత తీసివేయండిని ట్యాప్ చేయండి.

మీ పేమెంట్ ఆప్షన్‌ను ఎలా ఎడిట్ చేయాలి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నం మీద ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌లు ఆ తర్వాత మరిన్ని పేమెంట్ సెట్టింగ్‌లు Settings ఆప్షన్‌లపై ట్యాప్ చేయండి.
  4. ఒకవేళ అడిగితే, Google Payకు సైన్ ఇన్ చేయండి.
  5. మీరు తీసివేయాలనుకుంటున్న పేమెంట్ ఆప్షన్ కింద ఉన్న, ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. మీ మార్పులు చేయండి.  
  7. అప్‌డేట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ పేమెంట్ ఆప్షన్‌ను ఎడిట్ చేయండి

కొనుగోలు చేసేటప్పుడు, మీ పేమెంట్ ఆప్షన్‌ను ఎలా మార్చాలి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Store Google Playను తెరవండి.
  2. పెయిడ్ ఐటెమ్‌కు చెందిన వివరాల పేజీకి వెళ్లండి.
  3. ధర, యాప్ రివ్యూ అనుమతుల ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. యాప్ పేరు కింద ఉన్న, కింది వైపు బాణం గుర్తు కిందికి బాణంఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌లు‌ను ట్యాప్ చేయండి.
  5. ఇప్పటికే ఉన్న మీ పేమెంట్ ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోండి లేదా కొత్త దాన్ని జోడించండి.
  6. మీ కొనుగోలును పూర్తి చేయండి.

గమనిక: ఒకవేళ కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు పేమెంట్ ఆప్షన్‌ను జోడిస్తే, అది మీ ఖాతాలో సేవ్ చేయబడుతుంది.

Android TVలో మీ పేమెంట్ ఆప్షన్‌ను మార్చండి
  1. మీ Android TV పరికరంలో, Google Play Store Google Playను తెరవండి.
  2. పెయిడ్ ఐటెమ్‌కు చెందిన వివరాల పేజీకి వెళ్లండి.
  3. ధర ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. ఇప్పటికే ఉన్న మీ పేమెంట్ ఆప్షన్‌ల నుండి ఒకదాన్ని ఎంచుకోండి.
  5. మీ కొనుగోలును పూర్తి చేయండి.

గమనిక: ఒకవేళ కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు పేమెంట్ ఆప్షన్‌ను జోడిస్తే, అది మీ ఖాతాలో సేవ్ చేయబడుతుంది.

సంబంధిత కథనాలు

Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10635455250281639310
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false