మీరు కొనుగోలు చేసిన బ్లూ-రే లేదా DVD సినిమా డిజిటల్ కాపీని రిడీమ్ చేయండి

ఏదైనా సినిమాను మీరు బ్లూ-రే లేదా DVDలో కొనుగోలు చేసినప్పుడు, సదరు సినిమా డిజిటల్ కాపీని రిడీమ్ చేయడానికి మీకు అర్హత లభించవచ్చు. డిజిటల్ కాపీకి ఛార్జీ ఉండదు కాబట్టి మీరు పేమెంట్ ఆప్షన్‌ను జోడించాల్సిన అవసరం లేదు.

కొన్ని ప్రోడక్ట్‌లు, ఫీచర్‌లు అన్ని దేశాలలో అందుబాటులో లేవు. మీ దేశంలో అందుబాటులో ఉన్న వాటి గురించి మరింత తెలుసుకోండి.

దశ 1: Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి లేదా ఖాతాను రూపొందించండి

ముఖ్యమైనది: మీరు మీ సినిమా డిజిటల్ కాపీని జోడించాలనుకుంటున్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి. మీరు డిజిటల్ కాపీని రిడీమ్ చేసిన తర్వాత, దాన్ని మరొక ఖాతాకు బదిలీ చేయలేరు.
  1. Android ఫోన్‌లోని, Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.

దశ 2: మీ సినిమా కోసం Google Play కోడ్‌ను పొందడానికి ప్రమోషనల్ కోడ్‌ను ఉపయోగించండి

మీరు DVD లేదా బ్లూ-రేలో కొనుగోలు చేసిన అదే సినిమా డిజిటల్ కాపీని మాత్రమే మీరు పొందగలరు. అలాగే, మీ DVD లేదా బ్లూ-రే కాపీ క్వాలిటీకి ఆ డిజిటల్ కాపీ మ్యాచ్ అవుతుంది, కాబట్టి మీరు DVDని SD క్వాలిటీలో కొనుగోలు చేసినట్లయితే, మీ డిజిటల్ కాపీ కూడా SDలోనే ఉంటుంది.

ముఖ్యమైంది: మీ DVD లేదా బ్లూ-రేను కొనుగోలు చేసిన దేశం లోపల మాత్రమే మీ ప్రమోషనల్ కోడ్‌ను మీరు రిడీమ్ చేయగలరు. ఒకవేళ మీరు ప్రయాణం చేస్తూ ఉండి, డిజిటల్ కాపీతో ఉన్న DVD లేదా బ్లూ-రేను కొనుగోలు చేసినట్లయితే, మీరు ఆ దేశాన్ని వదిలి వెళ్లడానికి ముందే డిజిటల్ కాపీని రిడీమ్ చేసుకునేలా చూసుకోండి.

మీ డిజిటల్ కాపీని రిడీమ్ చేయడానికి సూచనల కోసం, DVD లేదా బ్లూ-రే సినిమాను చెక్ చేయండి. మీ వద్ద ప్రమోషనల్ కోడ్ ఉన్నట్లయితే, ఈ కింది దశలను అనుసరించండి: 

  1. మీరు మీ సినిమాను ఎక్కడి నుండి పొందారు అనే దాని ఆధారంగా, వాటిని రిడీమ్ చేసే సైట్‌ను తెరవండి. విభిన్న పార్టనర్‌ల కోసం రిడీమ్ చేసే సైట్‌లను చెక్ చేయండి.
  2. వెబ్‌సైట్‌లో, మీరు మీ DVD లేదా బ్లూ-రేతో పొందిన ప్రమోషనల్ కోడ్‌ను ఎంటర్ చేయండి.
  3. దిగువున మీరు 'ఫలితం: Google Play కోడ్ xxxxxx'ను చూస్తారు.
  4. Google Play స్టోర్‌లో రిడీమ్ చేయడానికి కోడ్‌ను కాపీ చేయండి.

దశ 3: Google Playలో మీ సినిమాను పొందండి

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. కోడ్‌ను నమోదు చేయండి.
  5. రిడీమ్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు ఒక ప్రమోషనల్ కోడ్‌ను ఒకసారి మాత్రమే రిడీమ్ చేయగలరు.

దశ 4: మీ సినిమాను చూడండి

మీ Google Play లైబ్రరీకి మీ సినిమా జోడించబడిన తర్వాత, మీరు వాటిని చూడటానికి పలు మార్గాలు ఉన్నాయి. మీ సినిమాలు, షోలను మీరు ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి.

మీ బ్లూ-రే లేదా DVD డిజిటల్ కాపీని మీరు రిడీమ్ చేయలేకపోయినప్పుడు వచ్చిన సమస్యలను పరిష్కరించండి

మీరు Google Play కోడ్ కోసం మీ ప్రమోషనల్ కోడ్‌ను రిడీమ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, సహకారం కోసం సంబంధిత పార్టనర్‌ను కాంటాక్ట్ చేయండి.

పార్టనర్ సపోర్ట్ సమాచారం
Disney

యునైటెడ్ స్టేట్స్ & కెనడా: https://redeemdigitalmovie.com/
జపాన్: http://www.digitalcopyplus.jp/help/

HBO

యునైటెడ్ స్టేట్స్: http://www.hbodigitalhd.com/

20th Century Fox https://www.foxmovies.com/
Paramount http://www.paramountdigitalcopy.com/support
Universal https://www.uphe.com/contact-support
Sony Pictures https://redeem.sonypictures.com/
Warner Bros. https://digitalredeem.warnerbros.com/
Lions Gate https://movieredeem.com/
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11336435290612479021
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false