ఇన్‌స్టాల్ చేసిన Android యాప్ సరిగ్గా పని చేయకపోతే దాని సమస్యను పరిష్కరించండి

మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లో కింది సమస్యలు ఏవైనా ఉంటే, ఇక్కడ పేర్కొన్న దశలను ట్రై చేయండి:

  • క్రాషింగ్. 
  • తెరవదు. 
  • ప్రతిస్పందించదు. 
  • సరిగ్గా పనిచేయడం లేదు. సరిగ్గా పనిచేయని యాప్ ఇన్‌స్టంట్ యాప్ అయితే గనుక, బదులుగా ఈ పరిష్కార ప్రక్రియ దశలు ట్రై చేయండి.

ప్రతి దశ తర్వాత, అది మీ ఫోన్ సమస్యను పరిష్కరించిందో లేదో చూడటానికి దాన్ని రీస్టార్ట్ చేయండి.

గమనిక: ఈ దశలలో కొన్ని, Android 8.1లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

1వ దశ: రీస్టార్ట్ చేసి అప్‌డేట్ చేయండి

మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి
ముఖ్యమైనది: ఫోన్‌ను బట్టి సెట్టింగ్‌లు మారవచ్చు. మరింత సమాచారం కోసం, మీ పరికర తయారీదారును సంప్రదించండి.
  1. చాలా ఫోన్‌లలో, మీ ఫోన్ పవర్ బటన్‌ను సుమారు 30 సెకన్ల పాటు లేదా మీ ఫోన్ రీస్టార్ట్ అయ్యేవరకు నొక్కి ఉంచండి. 
  2. రీస్టార్ట్ ఆ తర్వాత రీస్టార్ట్ అనే ఆప్షన్‌ను మీరు ట్యాప్ చేయాల్సి రావచ్చు.
Android అప్‌డేట్‌ల కోసం చెక్ చేయండి
  • మీ ఫోన్ సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  • దిగువ భాగం సమీపంలో, సిస్టమ్ ఆ తర్వాత అధునాతన ఆ తర్వాత సిస్టమ్ అప్‌డేట్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీ ఫోన్‌ను బట్టి మీరు ఫోన్ వివరాలు లేదా టాబ్లెట్ వివరాలు ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయవలసి ఉంటుంది.
  • మీరు మీ అప్‌డేట్ స్టేటస్‌ను కనుగొంటారు. స్క్రీన్‌పై దశలను వేటినైనా ఫాలో అవ్వండి.
యాప్‌ను అప్‌డేట్ చేయండి
  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లు & పరికరాలను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. "అప్‌డేట్‌ల లభ్యత" కింద, అన్ని యాప్‌లను లేదా నిర్దిష్ట యాప్‌ను అప్‌డేట్ చేయడాన్ని ఎంచుకోండి.

Androidలో Play Store, యాప్‌లను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

2వ దశ: యాప్‌కు సంబంధించిన పెద్దదైన సమస్య కోసం చెక్ చేయండి

యాప్‌ను ఫోర్స్ స్టాప్ చేయండి
సాధారణంగా మీరు మీ ఫోన్ సెట్టింగ్‌ల యాప్ ద్వారా యాప్‌ను ఫోర్స్ స్టాప్ చేయవచ్చు. యాప్ సెట్టింగ్‌లు ఫోన్‌ను బట్టి మారవచ్చు. మరింత సమాచారం కోసం, మీ పరికర తయారీదారును సంప్రదించండి.
చిట్కా: మీరు యాప్‌ను ఫోర్స్ స్టాప్ చేసిన తర్వాత కూడా సమస్యలు కొనసాగితే, మీరు దాని డెవలపర్‌ను సంప్రదించాలి. డెవలపర్‌ను ఎలా కాంటాక్ట్ చేయాలో తెలుసుకోండి.
యాప్ కాష్ & డేటాను క్లియర్ చేయండి
  • సాధారణంగా మీరు మీ ఫోన్ సెట్టింగ్‌ల యాప్ ద్వారా యాప్ కాష్, ఇంకా డేటాను క్లియర్ చేయవచ్చు.  యాప్ సెట్టింగ్‌లు ఫోన్‌ను బట్టి మారవచ్చు. మరింత సమాచారం కోసం, మీ పరికర తయారీదారును సంప్రదించండి.

  • మీరు కాష్ డేటాను క్లియర్ చేసినప్పుడు, తాత్కాలికంగా స్పేస్‌ను ఖాళీ చేయండి. ఇది ఒక స్వల్పకాలిక పరిష్కారం. కాలక్రమేణా, కాష్ చేసిన డేటా మళ్లీ బిల్డ్ అవుతుంది.

చిట్కా: మీరు యాప్ కాష్‌ను, డేటాను క్లియర్ చేసిన తర్వాత కూడా సమస్యలు కొనసాగితే, మీరు దాని డెవలపర్‌ను సంప్రదించాలి. డెవలపర్‌ను సంప్రదించడం ఎలాగో తెలుసుకోండి.

Google సర్వర్‌లతో పరికరాన్ని సింక్ చేయండి

ముఖ్యమైనది: ఫోన్‌ను బట్టి సెట్టింగ్‌లు మారవచ్చు. మరింత సమాచారం కోసం, మీ పరికర తయారీదారును కాంటాక్ట్ చేయండి.
  1. మీ ఫోన్ సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సిస్టమ్ ఆ తర్వాత  తేదీ & సమయం ట్యాప్ చేయండి.
  3. ఆటోమేటిక్ టైమ్ జోన్, ఆటోమేటిక్ తేదీ & సమయం ఆఫ్ చేయండి.
  4. తేదీ, ఇంకా సమయం తప్పుగా చూపించేటట్లు మార్చండి.
  5. ఆటోమేటిక్ టైమ్ జోన్, ఆటోమేటిక్ తేదీ & సమయం ఆన్ చేయండి.
యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి

జాగ్రత్త: ఈ యాప్‌లో సేవ్ చేయబడి ఉన్న డేటా ఏదైనా తొలగించబడుతుంది.

  1. మీ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. యాప్‌లు ఆ తర్వాత అన్ని యాప్‌లను చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. యాప్ మీద ట్యాప్ చేయండి.
  4. అన్‌ఇన్‌స్టాల్ చేయండి ఆ తర్వాత సరే అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు తిరిగి యాప్‌ను ఉపయోగించాలనుకుంటే దాన్ని మళ్లీ ఇన్‌స్టాల్ చేసి చూడవచ్చు. యాప్‌లను మళ్లీ ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

యాప్ డెవలపర్‌ను సంప్రదించండి
ముఖ్యమైనది: మీరు పరిష్కార ప్రక్రియ దశలను ట్రై చేసినప్పటికీ, ఇంకా సమస్య ఉంటే, మమ్మల్ని లేదా యాప్ డెవలపర్‌ను సంప్రదించండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17043543955015340700
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false