Google Playలో ఆమోదయోగ్యమైన పేమెంట్ ఆప్షన్‌లు

మీరు మీ Google ఖాతా నుండి పేమెంట్ ఆప్షన్‌లను ఉపయోగించి Google Playలో యాప్‌లను, డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఇది మీ మొదటి కొనుగోలు అయితే, మీ పేమెంట్ ఆప్షన్ మీ Google ఖాతాకు జోడించబడుతుంది.

పేమెంట్ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేసి, సమస్యలను పరిష్కరించండి

మీరు ఉపయోగించగల పేమెంట్ ఆప్షన్‌లను కనుగొనండి

అందుబాటులో ఉండే పేమెంట్ ఆప్షన్‌లు దేశాన్ని బట్టి మారతాయి. మీ దేశం లిస్ట్ చేయకపోతే, కిందికి స్క్రోల్ చేయండి.

మీరు కింద పేర్కొన్న క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను మీ ఖాతాకు జోడించవచ్చు:

  • American Express
  • Discover
  • JCB
  • Mastercard
  • Visa
  • Visa Electron

గమనిక: Google Play ద్వారా అంగీకరించబడే కార్డ్‌ల రకాలు మారవచ్చు. మీరు పనిచేస్తుందనుకున్న కార్డ్ పని చేయకపోతే, సహాయం కోసం, మీ బ్యాంకును లేదా కార్డ్ జారీ చేసిన సంస్థను సంప్రదించండి. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు మీ ఖాతాలో తాత్కాలిక ప్రామాణీకరణ ఛార్జీలు గమనించవచ్చు.

Google Pay బ్యాలెన్స్

యునైటెడ్ స్టేట్స్‌లో, మీరు చేసిన కొనుగోలు కోసం పే చేయడానికి, మీ Google Pay బ్యాలెన్స్‌ను ఉపయోగించవచ్చు. మీరు చేసిన కొనుగోలు మొత్తాన్ని కవర్ చేయడానికి, మీ Google Pay బ్యాలెన్స్‌లో తగినంత డబ్బు ఉందని నిర్ధారించుకోండి.

మొబైల్ ఫోన్ బిల్లింగ్

కొన్ని మొబైల్ పరికరాలు, సర్వీస్ ప్లాన్‌లతో, మీరు కొనుగోళ్లను మీ క్యారియర్ బిల్‌కు ఛార్జీ చేయవచ్చు.

USAలో మొబైల్ నెట్‌వర్క్ సర్వీస్‌ను అందించే క్యారియర్‌లు:

  • Sprint
  • T-Mobile
  • US Cellular

మీరు ఏదైనా కొన్నప్పుడు, దాని ఛార్జీని మీ క్యారియర్ ఖాతాలో 15 నిమిషాల తర్వాత చూస్తారు.

గమనిక: మీరు మొబైల్ ఫోన్ బిల్లింగ్ కోసం సైన్ అప్ చేసినప్పుడు, మీరు "DCB" లేదా "DCB_Association"తో మొదలయ్యే "SMS (టెక్స్ట్ మెసేజ్)ను మీ ఫోన్‌లో చూడవచ్చు. మీ Google Play ఖాతా కోసం, మొబైల్ ఫోన్ బిల్లింగ్‌లో ఎన్‌రోల్‌మెంట్‌ను పూర్తి చేయడానికి గాను, ఈ మెసేజ్ ఆటోమేటిక్‌గా జెనరేట్ చేయబడి పంపబడుతుంది.

మొబైల్ ఫోన్ బిల్లింగ్ పరిష్కార ప్రక్రియ

మీకు క్యారియర్ బిల్లింగ్ ఆప్షన్ కనబడకపోతే, వీటిని గుర్తుంచుకోండి:

  • Google Play స్టోర్ యాప్‌ను ఉపయోగించడం ద్వారా మాత్రమే మొబైల్ ఫోన్ బిల్లింగ్ అందుబాటులో ఉంటుంది. ఇది కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్‌లోని Google Play వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండదు.
  • మీ క్యారియర్‌తో ఉన్న మీ ఖాతా, తప్పకుండా మంచి స్థితిలో ఉండాలి.
  • మీరు రెండు SIM కార్డ్‌లు ఉన్న పరికరాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, సరైన SIM కార్డ్‌ను 1వ స్లాట్‌లో ఉంచి, 2వ స్లాట్ ఖాళీగా ఉండేలా చూసుకోండి.
  • నిర్వాహక పరికరాలలో మొబైల్ ఫోన్ బిల్లింగ్ అందుబాటులో ఉండదు.
  • సబ్‌స్క్రిప్షన్‌ల కోసం పేమెంట్ చేయడానికి కొన్ని మొబైల్ ఫోన్ క్యారియర్‌లను ఉపయోగించలేరు.

కింది వాటిని నిర్ధారించుకోవడానికి, మీ క్యారియర్‌తో చెక్ చేయండి:

  • మీరు మీ క్యారియర్ నెలవారీ ఖర్చు పరిమితిని మించలేదు.
  • మీ పరికరం అలాగే సర్వీస్ ప్లాన్, ప్రీమియం కంటెంట్ కొనుగోళ్లను అనుమతిస్తాయి.
  • మీ పరికరం మొబైల్ ఫోన్ బిల్లింగ్‌ను ఉపయోగించగలదు.

రద్దు చేసిన కొనుగోళ్లు

మీ క్యారియర్‌తో విజయవంతంగా ప్రామాణీకరించబడని కొనుగోళ్లు తక్షణమే రద్దు చేయబడతాయి. విజయవంతం కాని మొబైల్ ఫోన్ బిల్లింగ్ కొనుగోళ్ల సహాయం కోసం, మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

Google Play బ్యాలెన్స్, Google Play గిఫ్ట్ కార్డ్‌లు

మీరు మీ Google Play బ్యాలెన్స్‌ను దీనికి ఉపయోగించవచ్చు:

  • Google Playలో యాప్‌లు, డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేయండి.
  • Google Playలో సబ్‌స్క్రిప్షన్‌ల కోసం పేమెంట్ చేయండి. 

Google Play బ్యాలెన్స్‌ను పొందడానికి మార్గాలు

Google Play బ్యాలెన్స్ ఉపయోగాలు & పరిమితులు గురించి మరింత తెలుసుకోండి.

PayPal

మీరు Google Playలో యాప్‌లను, డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి PayPalను ఉపయోగించవచ్చు.

ముఖ్య గమనిక: మీరు PayPal సెక్యూరిటీ కీని ఆన్ చేసి ఉంటే, మీరు కంప్యూటర్ లేదా మొబైల్ వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించి మీ Google Play ఖాతాకు PayPalను జోడించాలి. మీరు దీన్ని Play Store యాప్‌ను ఉపయోగించి లింక్ చేయలేరు. PayPalను జోడించడానికి, Google Playలో మీ పేమెంట్ ఆప్షన్‌ల కింద ఉన్న, "పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి"ని ఎంచుకోండి. మీరు PayPalను జోడించిన తర్వాత, Play Store యాప్ ఇంకా Play వెబ్ స్టోర్ నుండి ఏవైనా కొనుగోలు చేయడానికి, మీరు దానిని ఉపయోగించవచ్చు.

సపోర్ట్ చేయబడని పేమెంట్ రకాలు

ఈ కింది వాటితో Google Play ఉపయోగించబడదు:

  • బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌లు
  • బ్యాంక్ బదిలీలు
  • Western Union
  • Money Gram
  • వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు (VCC)
  • హెల్త్ సేవింగ్స్ ఖాతా (HSA)
  • ట్రాన్సిట్ కార్డ్‌లు
  • ఏదైనా తాకట్టు రకపు పేమెంట్

ఇతర దేశాలు

మీ దేశం లిస్ట్‌లో లేకపోతే, అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్‌లు కింద లిస్ట్ చేయబడి ఉన్నాయి:

క్రెడిట్ కార్డ్‌లు లేదా డెబిట్ కార్డ్‌లు

మీరు కింద పేర్కొన్న క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను మీ ఖాతాకు జోడించవచ్చు:

  • American Express
  • Discover
  • Mastercard
  • Visa
  • Visa Electron

గమనిక: Google Play ద్వారా అంగీకరించబడే కార్డ్‌ల రకాలు మారవచ్చు. మీరు పనిచేస్తుందనుకున్న కార్డ్ పనిచేయకపోతే, సహాయం కోసం మీ బ్యాంకును లేదా కార్డ్ జారీ చేసిన సంస్థను సంప్రదించండి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు మీ ఖాతాలో తాత్కాలిక ప్రామాణీకరణ ఛార్జీలను గమనించవచ్చు.

సపోర్ట్ లేని పేమెంట్ రకాలు

ఈ కింది వాటితో Google Play ఉపయోగించబడదు:

  • బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌లు
  • బ్యాంక్ బదిలీలు
  • Western Union
  • Money Gram
  • వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు (VCC)
  • హెల్త్ సేవింగ్స్ ఖాతా (HSA)
  • ట్రాన్సిట్ కార్డ్‌లు
  • ఏదైనా తాకట్టు రకపు పేమెంట్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12119502598068106796
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false