కొనుగోళ్ల కోసం వెరిఫికేషన్ అవసరం

కొనుగోలు వెరిఫికేషన్‌ను, లేదా ప్రామాణీకరణను ఆన్ చేయడం వల్ల మీ పరికరంలో అనధికార కొనుగోళ్లను నివారించడంలో సహాయపడుతుంది.

మీరు వెరిఫికేషన్‌ను ఆన్ చేసినట్లయితే, మీ పరికరంలో Google Play ద్వారా మీరు కొనుగోలు చేసిన ప్రతిసారీ అది మీరేనని వెరిఫై చేయడానికి బయోమెట్రిక్ డేటాను లేదా మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఉపయోగించాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అవసరమైతే, మీరు మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చవచ్చు లేదా రీసెట్ చేయవచ్చు.

బయోమెట్రిక్స్ మీ పరికరంలో స్టోర్ చేయబడిన ఏవైనా వేలిముద్ర లేదా ఫేస్ మోడల్స్‌ను సూచిస్తుంది. మీ పరికరంలో స్టోర్ చేయబడిన ఏదైనా బయోమెట్రిక్ డేటాను వెరిఫికేషన్ కోసం ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి. మీ పరికరాన్ని మీరు షేర్ చేసి, బయోమెట్రిక్ డేటాను మీ వెరిఫికేషన్ పద్ధతిగా ఎంచుకుంటే, మీ పరికరంలో స్టోర్ చేయబడిన బయోమెట్రిక్ డేటా అంతా వెరిఫికేషన్ కోసం ఉపయోగించబడే విషయంలో మీరు సౌకర్యవంతంగా ఉన్నారని నిర్ధారించుకోండి.

ముఖ్యమైనది: కొనుగోలు వెరిఫికేషన్ సెట్టింగ్‌లు, కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

మీ Google Assistantతో కొనుగోళ్లను ఆమోదించడానికి, మీ పేమెంట్ సమాచారాన్ని సెట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
దక్షిణ కొరియాలో కొనుగోలు వెరిఫికేషన్

Google Playలో కొనుగోలు వెరిఫికేషన్ ద్వారా మీ పరికరంలో అనధికార కొనుగోళ్లను నివారించవచ్చు. మీ పరికరాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటున్నట్లయితే ఇలా చేయడం చాలా ముఖ్యం. దక్షిణ కొరియాలోని Google Play యూజర్‌లు వారి కొనుగోళ్లను Google Play ద్వారా ఎలా వెరిఫై చేయాలో అనే దాని మార్పులు దిగువున ఉన్నాయి:

  • మీ మొబైల్ పరికరంలో
    • మీరు మీ మొబైల్ పరికరంలో Google Play Storeకు వెళ్లినప్పుడు, మీ Google ఖాతా పాస్‌వర్డ్‌తో కాకుండా, మీ పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి ఉపయోగించే అదే వెరిఫికేషన్ విధానంతో (ఉదా. PIN, ఆకృతి, పాస్‌వర్డ్, లేదా బయోమెట్రిక్స్) మీరు కొనుగోళ్లను వెరిఫై చేయవచ్చు.
    • మీ Google Play కొనుగోలు ప్రామాణీకరణ సెట్టింగ్ ఒక్క పరికరానికి, ఒక్క Google ఖాతాకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ప్రామాణీకరణ ఫ్రీక్వెన్సీని Google Playలో ఎప్పుడైనా మార్చుకోవచ్చు.
    • అన్‌లాక్ చేయడానికి మీ పరికరం, బయోమెట్రిక్స్‌ని (మీ ముఖం లేదా వేలిముద్ర) సపోర్ట్ చేస్తూ ఉండి, మీరు ఆ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకొని ఉంటే, పరికరంలో స్టోర్ చేసిన ఏదైనా బయోమెట్రిక్స్‌తో Google Playలో మీ కొనుగోళ్లను వెరిఫై చేయవచ్చు. మీరు మీ పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి వేరే వాళ్ల బయోమెట్రిక్స్‌ని కూడా స్టోర్ చేసి ఉండి, కొనుగోలు వెరిఫికేషన్ కోసం వాటిని ఉపయోగించకూడదనుకుంటే ఇది చాలా ముఖ్యం. అలాంటి సందర్భంలో, కొనుగోలు వెరిఫికేషన్ కోసం మీరు ఉపయోగించకూడదని అనుకుంటున్న బయోమెట్రిక్స్‌ని తీసివేయండి లేదా పరికరం అన్‌లాక్ చేయడానికి వేరొక విధానాన్ని (అంటే PIN, ఆకృతి లేదా పాస్‌వర్డ్ లాంటివి) ఉపయోగించండి. అలాగే వాటిని ఎవరితోనూ షేర్ చేయవద్దు.
    • మరింత సమాచారం కోసం, Android పరికరంలో స్క్రీన్ లాక్ సెట్ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి Android సహాయ కేంద్రాన్ని సందర్శించండి.
  • వెబ్‌లో play.google.com సైట్‌లో
    • వెబ్ ద్వారా play.google.com సైట్‌లో కొనుగోళ్లు, యాప్ ఇన్‌స్టాల్స్ వెరిఫై చేయడానికి, మీరు 2-దశల వెరిఫికేషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది మీ ఖాతాను రక్షించడంలో సహాయపడుతుంది. మరింత సమాచారం కోసం, 2-దశల వెరిఫికేషన్ ఎలా ఆన్ చేయాలో తెలుసుకోవడానికి Google ఖాతా సహాయ కేంద్రాన్ని సందర్శించండి. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కారణంగా, play.google.com వెబ్‌సైట్‌లో లావాదేవీల సమయంలో 2-దశల వెరిఫికేషన్‌ను ఉపయోగించడాన్ని సెటప్ చేసుకున్న తర్వాత కొందరు యూజర్‌లు నిరీక్షణ వ్యవధిని పూర్తి చేయాల్సిన అవసరం రావచ్చని దయచేసి గమనించండి. మీరు కొనుగోలు వెరిఫికేషన్ సెట్టింగ్‌లను play.google.com/settings లింక్ ద్వారా ఎప్పుడైనా మార్చుకోవచ్చు.

వెరిఫికేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

పరికరాలు అంతటా వర్తించే మీ play.google.com సెట్టింగ్‌లు, అలాగే నిర్దిష్ట Google Assistant సెట్టింగ్‌లు మినహా, వెరిఫికేషన్ సెట్టింగ్‌లు మీరు వాటిని సెట్ చేసిన మీ పరికరంలోని యాక్టివ్ ఖాతాకు మాత్రమే వర్తిస్తాయి. మీ Google ఖాతాను మీరు ఒకటి కంటే ఎక్కువ పరికరాలలో ఉపయోగిస్తే, ప్రతి పరికరం కోసం కింది దశలను రిపీట్ చేయండి. మీ పరికరంలో మీరు పలు ఖాతాలను ఉపయోగిస్తే, మీ పరికరంలోని ప్రతి ఖాతా కోసం కింది దశలను రిపీట్ చేయండి.

చిట్కా: కొనుగోలు వెరిఫికేషన్‌ను ఆన్ చేయడం ద్వారా ఫ్యామిలీ విభాగం వెలుపల అందుబాటులో ఉన్న యాప్‌లు, గేమ్‌ల నుండి మీ పరికరంలో పొరపాటున కొనుగోళ్లు జరగకుండా నివారించడానికి మీరు సహాయపడవచ్చు. 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు గల వారి కోసం రూపొందించబడిన యాప్‌లు లేదా గేమ్‌లలో, యూజర్ యాప్‌లో ఏదైనా కొనుగోలు చేసే ముందు Google Play వారిని మళ్లీ వెరిఫై చేస్తుంది. చిన్నారి చేసే కొనుగోలు ఆర్థికంగా బాధ్యత వహించే వ్యక్తి ద్వారా ఆమోదించబడిందని నిర్ధారించడానికి ఇది సహాయపడుతుంది.

మీ మొబైల్ పరికరంలో వెరిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి
  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత కొనుగోలు వెరిఫికేషన్ ఆ తర్వాత వెరిఫికేషన్ ఫ్రీక్వెన్సీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. సెట్టింగ్‌ను ఎంచుకోండి.
  5. మార్పును నిర్ధారించండి.
మీ Google Assistant వెరిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, "Ok Google, Assistant సెట్టింగ్‌లను తెరువు" అని చెప్పండి. 
  2. "పాపులర్ సెట్టింగ్‌లు" కింద ఉన్న, మీరు and then పేమెంట్‌లు అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి.
  3. మీ Assistant ద్వారా పేమెంట్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
  4. వేలిముద్ర లేదా ముఖంతో నిర్ధారించండి, వాయిస్ మ్యాచ్‌తో నిర్ధారించండి ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

వాయిస్ మ్యాచ్‌తో పేమెంట్‌లను చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీ Chromebookలో వెరిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి

మీ Chromebookలో Play Store యాప్‌ను మీరు ఉపయోగిస్తున్నట్లయితే:

  1. Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. మెనూ మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  3. వెరిఫికేషన్ ప్రాధాన్యతలు.
  4. సెట్టింగ్‌ను ఎంచుకోండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

చిట్కాలు:

  • ఇది మీ Chromebookలో Google Play Store యాప్‌ను మీరు ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే పని చేస్తుంది. Chromebooksలో Google Play Storeను ఉపయోగించడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
  • వెరిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చడానికి, మీకు మీ Google పాస్‌వర్డ్ అవసరం. మీకు పాస్‌వర్డ్ సరిగా గుర్తు లేకపోతే ఖాతా రికవరీకి వెళ్లండి.
బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను (ఎంచుకున్న పరికరాలలో) ఆన్ లేదా ఆఫ్ చేయండి 

బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ఆన్ చేసినప్పుడు, మీరు కొనుగోలు చేసిన ప్రతిసారీ ఇది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్ర లేదా ముఖాన్ని ఉపయోగించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.

ముఖ్య గమనిక: మీ పరికరంలో స్టోర్ చేసి ఉన్న అన్ని బయోమెట్రిక్‌లను మీ Google ఖాతా ద్వారా చేసిన కొనుగోళ్లను వెరిఫై చేయడానికి ఉపయోగించవచ్చు. మీరు మీ పరికరాన్ని ఇతరులతో షేర్ చేస్తే ఈ విషయాలను గుర్తుంచుకోండి.
  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత కొనుగోలు వెరిఫికేషన్‌ను ట్యాప్ చేయండి.
  4. బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
చిట్కా: Google Playలో బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ఆన్ చేయడానికి, మీకు మీ Google పాస్‌వర్డ్ అవసరం కావచ్చు. మీ పాస్‌వర్డ్ మీకు గుర్తు లేకపోతే, ఖాతా రికవరీకి వెళ్లండి.
Android TVలో వెరిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి
చిట్కా: వెరిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చడానికి, మీకు మీ Google పాస్‌వర్డ్ అవసరం. మీకు మీ పాస్‌వర్డ్ గుర్తు లేకపోతే, ఖాతా రికవరీకి వెళ్లండి.
play.google.comలో వెరిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి
ఈ సెట్టింగ్, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు వర్తిస్తుంది. వెబ్ ద్వారా చేసే అన్ని రిమోట్ యాప్ ఇన్‌స్టాల్స్‌కు వెరిఫికేషన్ అవసరం.
  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. సెట్టింగ్‌లు మీద క్లిక్ చేయండి.
  4. "వెరిఫికేషన్ ప్రాధాన్యతలు" కింద ఉన్న సెట్టింగ్‌ను ఎంచుకోండి.
  5. అప్‌డేట్ చేయండిపై క్లిక్ చేయండి.
చిట్కా: వెరిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చడానికి, మీకు మీ Google పాస్‌వర్డ్ అవసరం. మీ పాస్‌వర్డ్ మీకు గుర్తుండకపోతే, ఖాతా రికవరీ లింక్‌కు వెళ్లండి.
మీ కంప్యూటర్‌లోని Google Play Gamesలో వెరిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి
  1. మీ కంప్యూటర్‌లో Google Play Games ను తెరవండి.
  2. ఎగువున, మీ గేమర్ పేరును క్లిక్ చేయండి.
  3. సెట్టింగ్‌లు Settings అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. "కొనుగోలు వెరిఫికేషన్" పక్కన ఉన్న, రీసెట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

వెరిఫికేషన్ సెట్టింగ్‌లు అంటే అర్థం ఏమిటి

మీరు కొనుగోళ్లకు సంబంధించిన వెరిఫికేషన్‌ను తాత్కాలికంగా ఆఫ్ చేస్తే, దానివల్ల అనధికార కొనుగోళ్లు జరగవచ్చు. అవాంఛిత లేదా అనధికార కొనుగోళ్లతో సహా అన్ని ఛార్జీలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది.

చిట్కాలు:

  • మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి, ప్రతి కొనుగోలుకు సంబంధించి కొనుగోలు వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి.
  • సెట్టింగ్‌ను ఎంచుకున్న పరికరంలో Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వెరిఫికేషన్ సెట్టింగ్‌లు వర్తిస్తాయి.
  • మీ సెట్టింగ్‌లను మీరు వేరుగా సెట్ చేసినప్పటికీ, 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు గల వారి కోసం రూపొందించబడిన యాప్ లేదా గేమ్ కోసం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే ప్రతి కొనుగోలుకు వెరిఫికేషన్ ఎల్లప్పుడూ అవసరం.
  • మీరు Google Playలో ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసినప్పుడు, మీ ఫ్యామిలీ మెంబర్‌లు, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోళ్లు చేయడానికి ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. ఫ్యామిలీ గ్రూప్‌ను సెటప్ చేయడం, మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
play.google.com ద్వారా కాకుండా ఇతర అన్ని పరికరాల కోసం

వెరిఫికేషన్ ఫ్రీక్వెన్సీ కోసం ఈ కింది ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి:

  • అన్ని కొనుగోళ్లను వెరిఫై చేయండి: యాప్‌లలోని వాటితో సహా, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే ప్రతి డిజిటల్ కంటెంట్ కొనుగోలుకు వెరిఫికేషన్ అవసరం.
  • ప్రతి 30 నిమిషాల కొనుగోళ్లను వెరిఫై చేయండి (మొబైల్ పరికరం మాత్రమే): మీరు కొనుగోలును వెరిఫై చేసిన ప్రతిసారీ, మీరు Google Play బిల్లింగ్ సిస్టమ్ (యాప్‌లలోని వాటితో సహా) ద్వారా అన్ని రకాల డిజిటల్ కంటెంట్‌లను తదుపరి 30 నిమిషాల వరకు మళ్లీ వెరిఫై చేయకుండానే కొనుగోలు చేయడం కొనసాగించవచ్చు.
  • కొనుగోళ్లను ఎప్పుడూ వెరిఫై చేయవద్దు: Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే ఏ కొనుగోళ్లకు వెరిఫికేషన్ అవసరం ఉండదు.
play.google.com కోసం

మీరు ఏ పరికరంలో అయినా play.google.com కు సైన్ ఇన్ చేసినప్పుడు ఈ సెట్టింగ్‌లు వర్తిస్తాయి, అలాగే Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి. ఈ సెట్టింగ్‌లు play.google.com వెలుపల మీ వెరిఫికేషన్ సెట్టింగ్‌లను ప్రభావితం చేయవు (ఉదాహరణకు, మీ మొబైల్ పరికరంలోని Google Play యాప్‌లో మీరు ఉన్నప్పుడు).

play.google.com ద్వారా చేసే అన్ని కొనుగోళ్లు, యాప్ ఇన్‌స్టాల్స్ (ఆటోమేటిక్ సెట్టింగ్): play.google.com లో మీ Google ఖాతా ద్వారా చేసే ప్రతి డిజిటల్ కంటెంట్ కొనుగోలుకు వెరిఫికేషన్ అవసరం.

play.google.com ద్వారా చేసే యాప్ ఇన్‌స్టాల్స్ మాత్రమే: మీరు play.google.com కు సైన్ ఇన్ చేసినప్పుడు, పెయిడ్ కంటెంట్, ఇంకా యాప్‌లో కొనుగోళ్ల వంటి డిజిటల్ కంటెంట్ కొనుగోళ్లకు వెరిఫికేషన్ అవసరం లేదు. play.google.com లో మీ Google ఖాతా ద్వారా చేసే రిమోట్ యాప్ ఇన్‌స్టలేషన్‌లకు వెరిఫికేషన్ అవసరం.

చిట్కాలు:

  • మీ పరికరాలను మీరు ఇతరులతో షేర్ చేస్తే, లేదా play.google.com ద్వారా పిల్లలకు అనుకూలమైన కంటెంట్ కొనుగోళ్లను నివారించాలనుకుంటే, కొనుగోళ్ల కోసం వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి.
  • Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వెరిఫికేషన్ సెట్టింగ్‌లు వర్తిస్తాయి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12178432318798173876
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false