మీ ఖాతాలో పేమెంట్ సమస్యలను పరిష్కరించండి

మీరు Google Playలో ఏదైనా కొనడానికి ట్రై చేసినప్పుడు, మీ పేమెంట్ తిరస్కరించబడితే లేదా అది ప్రాసెస్ చేయబడకపోతే కింది దశలను ట్రై చేయండి.

పేమెంట్, ఆర్డర్ సమస్యలను పరిష్కరించండి

మీరు దేనినైనా కొనుగోలు చేసిన తర్వాత, దానికి సమస్య వస్తే, లేదా దాని గురించేమయినా ప్రశ్నలు ఉత్పన్నమయితే, యాప్‌లో కొనుగోళ్లతో సమస్యలను చూడండి లేదా Google Play కొనుగోళ్ల కోసం రిటర్న్‌లు, రీఫండ్‌లను చూడండి.

మీ పేమెంట్ సమాచారాన్ని వెరిఫై చేయండి

మీ పేమెంట్స్ ప్రొఫైల్ డీయాక్టివేట్ కావచ్చు. మీ ప్రొఫైల్‌ను తిరిగి యాక్టివేట్ చేయడానికి, మీ పేమెంట్ సమాచారాన్ని సబ్మిట్ చేయండి.

  1. Google Payకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువన ఉన్న, Alerts Notification bell iconను ఎంచుకోండి.
  3. మీకు రెడ్ అలర్ట్ కనిపిస్తే, మీ పేమెంట్ సమాచారం ఎంటర్ చేసి, టీమ్ స్పందించే వరకు వేచి ఉండండి.

    Google Pay notifications
  4. రివ్యూ ఫలితాల కోసం మీ ఈమెయిల్‌ను చెక్ చేసుకోండి.

వేరొక పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి పేమెంట్ చేయడానికి ట్రై చేయండి

ఒక పేమెంట్ ఆప్షన్‌లో సమస్య ఉంటే మీరు వేరే దానితో పేమెంట్ చేయడానికి ట్రై చేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. మీరు కొనుగోలు చేయాలనుకునే ఐటెమ్‌కు తిరిగి వెళ్లండి & ధరపై ట్యాప్ చేయండి.
  3. ప్రస్తుత పేమెంట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. వేరొక పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి లేదా కొత్త దాన్ని జోడించండి.
  5. మీ కొనుగోలును పూర్తి చేయడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎర్రర్‌లను పరిష్కరించండి

 

 

మీకు ఈ కింది ఎర్రర్ మెసేజ్‌లలో ఏదైనా కనిపిస్తే, మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌లో సమస్య ఉండవచ్చు:

  • "పేమెంట్‌ను ప్రాసెస్ చేయడం సాధ్యం కాలేదు: కార్డ్‌లో బ్యాలెన్స్ తక్కువగా ఉంది"
  • "లావాదేవీని పూర్తి చేయడం సాధ్యం కాలేదు. దయచేసి మరొక పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించండి"
  • "మీ లావాదేవీని పూర్తి చేయడం సాధ్యం కాలేదు"
  • "లావాదేవీని పూర్తి చేయడం సాధ్యం కాలేదు: కార్డ్ గడువు ముగిసింది"
  • "ఈ కార్డ్ సమాచారాన్ని సరి చేయండి లేదా మరొక కార్డ్‌తో ట్రై చేయండి"

ఈ ఎర్రర్‌లను పరిష్కరించడానికి, కింది దశలను ట్రై చేయండి:

మీ కార్డ్ & అడ్రస్ సమాచారం అప్‌డేట్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి

పేమెంట్‌లు సరిగా పని చేయకపోవడానికి సాధారణ కారణాలు క్రెడిట్ కార్డ్‌ల గడువు ముగిసిపోవడం లేదా బిల్లింగ్ అడ్రస్‌లు పాతవి కావడం. ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి Google Paymentsను ఉపయోగించండి:

గడువు ముగిసిన కార్డ్‌లను తీసివేయండి లేదా అప్‌డేట్ చేయండి

పేమెంట్‌ల తిరస్కరణకు గడువు ముగిసిన కార్డ్‌లు కారణమవుతాయి. గడువు ముగిసిన కార్డ్‌లను అప్‌డేట్ చేయాలంటే:

  1. మీ Google ఖాతాతో, https://payments.google.com సైట్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. కొనుగోలు కోసం మీరు ఉపయోగించడానికి ట్రై చేస్తున్న పేమెంట్ ఆప్షన్‌ను కనుగొనండి.
  3. లిస్ట్ చేసిన పేమెంట్ ఆప్షన్‌ల గడువు ముగింపు తేదీలను చెక్ చేయండి.
  4. గడువు ముగిసిన ఏ పేమెంట్ ఆప్షన్‌లను అయినా తీసివేయండి లేదా అప్‌డేట్ చేయండి.

మీ కార్డ్ అడ్రస్, మీ Google Paymentsలో ఉన్న అడ్రస్‌కు మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయండి

మీ క్రెడిట్ కార్డ్ వేరే అడ్రస్‌తో రిజిస్టర్ అయి ఉంటే, అది పేమెంట్ తిరస్కరణకు కారణం కావచ్చు. మీ ప్రస్తుత అడ్రస్‌తో మ్యాచ్ అయ్యే జిప్ కోడ్‌ను చెక్ చేయండి.

  1. మీ Google ఖాతాతో, https://payments.google.com సైట్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. కొనుగోలు కోసం మీరు ఉపయోగించడానికి ట్రై చేస్తున్న పేమెంట్ ఆప్షన్‌ను కనుగొనండి.
  3. ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. లిస్ట్ చేసిన అడ్రస్, మీ కార్డ్ బిల్లింగ్ అడ్రస్‌తో మ్యాచ్ అవుతుందా, లేదా అనేది చెక్ చేయండి.
  5. అవసరం అయితే, అడ్రస్‌ను అప్‌డేట్ చేయండి.

ఆపై, కొనుగోలు చేయడానికి మళ్లీ ట్రై చేయండి.

ఏదైనా అదనపు సమాచారాన్ని రిక్వెస్ట్ చేస్తే, సమర్పించండి

ఎర్రర్ మెసేజ్‌తో పాటుగా అదనపు సమాచారాన్ని Googleకు సమర్పించమని సూచనలు వచ్చి ఉంటే, దయచేసి దాన్ని సమర్పించండి. ఈ సమాచారం లేకుండా, మీ ఖాతాలో లావాదేవీని మేము ప్రాసెస్ చేయలేము.

కొనుగోలు చేయడానికి మీ వద్ద తగినన్ని నిధులు ఉన్నాయా, లేదా అని చెక్ చేయండి

తగినన్ని నిధులు లేకపోవడం వల్ల కొన్ని సార్లు లావాదేవీ తిరస్కరించబడుతుంది. కొనుగోలు పూర్తి చేయడానికి మీ ఖాతాలో తగినన్ని నిధులు ఉన్నాయా, లేదా అని చెక్ చేయండి.

మీ కార్డ్‌ను జారీ చేసిన సంస్థను లేదా మీ బ్యాంక్‌ను సంప్రదించండి

మీ కార్డ్‌కు ప్రత్యేకమైన పరిమితులు ఉండటం వల్ల లావాదేవీ తిరస్కరించబడి ఉండవచ్చు. లావాదేవీ గురించి, మీ కార్డ్‌ను జారీ చేసిన సంస్థను సంప్రదించి, దాన్ని తిరస్కరించడానికి గల కారణం వారికి తెలుసో లేదో అడగండి.

ఇతర పేమెంట్ ఆప్షన్‌లతో (డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, Google Play బ్యాలెన్స్, గిఫ్ట్ కార్డ్‌లు, మరిన్ని) ఉన్న ఎర్రర్‌లను పరిష్కరించండి

"మీ ఖాతాతో ఏదో సమస్య ఉన్నందున, మీ పేమెంట్ తిరస్కరించబడింది" అని మీకు కనిపించినట్లయితే

మీకు ఈ మెసేజ్ కనిపించినట్లయితే, అందుకు గల కారణాలు ఇలా ఉండవచ్చు:

  • మీ పేమెంట్ ప్రొఫైల్‌లో అనుమానాస్పద లావాదేవీ మాకు కనిపించింది.
  • మోసాల నుండి మీ ఖాతాను రక్షించుకోవడానికి మాకు మరికొంత సమాచారం అవసరం.
  • EU చట్టాన్ని (ఐరోపా సమాఖ్య దేశాల కస్టమర్‌లకు మాత్రమే) పాటించడానికి మాకు మరింత సమాచారం అవసరం.

ఈ సమస్యలను పరిష్కరించడానికి:

  1. పేమెంట్‌ల కేంద్రానికి వెళ్లండి.
  2. ఎర్రర్‌లు లేదా రిక్వెస్ట్‌లు ఏవైనా ఉంటే, పేమెంట్‌ల కేంద్రంలో వాటిపై చర్య తీసుకోండి.
  3. మీ పేరు, అడ్రస్, పేమెంట్ సమాచారం అప్‌డేట్ అయ్యి ఉన్నాయని నిర్ధారించుకోండి.
మీరు డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్ ద్వారా పేమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటే (మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ బిల్లు ద్వారా పేమెంట్ చేయండి)

డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్ ద్వారా పేమెంట్ చేస్తున్నప్పుడు మీకు సమస్య ఎదురైతే, ఈ కింది వాటిని ట్రై చేయండి:

  • మీరు మీ క్యారియర్ నెట్‌వర్క్‌కు నేరుగా లేదా Wi-Fi ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్నారని నిర్ధారించుకోండి.
  • మీరు డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్‌ను పేమెంట్ ఆప్షన్‌గా జోడించారని నిర్ధారించుకోండి.
  • మీరు లోకల్ కరెన్సీని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

ఇప్పటికీ మీకు సమస్యలు ఉంటే, సహాయం కోసం మీ మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

మీరు పేమెంట్ ఆప్షన్‌ను జోడించలేకపోతే లేదా వేరొక పేమెంట్ ఆప్షన్‌తో మీకు సమస్య ఉంటే

వేరొక పేమెంట్ ఆప్షన్‌తో మీకు సమస్య ఉంటే, దానిని పరిష్కరించుకోవడానికి Google Paymentsకు వెళ్లండి.

  1. మీ Google ఖాతాతో, https://payments.google.com సైట్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. సమాచారం కోసం ఏవైనా నోటిఫికేషన్‌లు లేదా రిక్వెస్ట్‌లను చూసి, ఏదైనా అడిగి ఉంటే దాన్ని అందజేయండి.
  3. మీ అడ్రస్ అప్‌డేట్ అయ్యి ఉందా, లేదా అనేది చెక్ చేయండి.
  4. లిస్ట్ చేసినవి, మీరు ఉపయోగించాలనుకుంటున్న పేమెంట్ ఆప్షన్‌లు అవునో, కాదో చెక్ చేయండి.

మీరు కొనుగోలు చేస్తున్నప్పుడు "మీ లావాదేవీని పూర్తి చేయడం సాధ్యం కాదు" అని మీకు ఎర్రర్ మెసేజ్ కనిపిస్తే

వివిధ రకాలైన విభిన్న పరిస్థితులు ఈ మెసేజ్‌ను ట్రిగ్గర్ చేయవచ్చు. సమస్యను పరిష్కరించడానికి, దయచేసి ఈ సూచనలను ట్రై చేయండి:

  • ఈ మెసేజ్‌తో పాటుగా అదనపు సమాచారాన్ని సమర్పించమని సూచనలు చేయబడి ఉంటే, ఆ సూచనలను ఫాలో చేయండి. ఇతర దశలు ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం లేదు.
  • మీ పేమెంట్ ఆప్షన్‌కు సంబంధించిన బిల్లింగ్ అడ్రస్, మీ GPay సెట్టింగ్‌లలోని అడ్రస్‌తో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఆ రెండూ మ్యాచ్ కాకపోతే, Google Payలో మీ అడ్రస్‌ను అప్‌డేట్ చేసి లావాదేవీని జరపడానికి మళ్లీ ట్రై చేయండి.
  • లావాదేవీని ముగించడం కోసం, Google Play గిఫ్ట్ కార్డ్‌ను ఉపయోగించి మళ్లీ ట్రై చేయండి.
  • మళ్లీ ట్రై చేసి, మీ పరికరం కోసం అత్యుత్తమ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించండి:
    • డెస్క్‌టాప్ లేదా కంప్యూటర్ కోసం, Google ప్రోడక్ట్ వెబ్‌సైట్ నుండి లావాదేవీని జరపండి.
    • మొబైల్ పరికరాల కోసం, ప్రోడక్ట్‌కు సంబంధించిన మొబైల్ యాప్ అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించండి.
  • ఎర్రర్ సంభవించినప్పుడు, మీరు గెస్ట్ చెక్ అవుట్‌ను ఉపయోగిస్తే:
కార్డ్ లేత బూడిదరంగులో చూపబడింది & "payments.google.comలో వెరిఫై చేయండి" అని చెప్తుంది

కార్డ్ దొంగిలించబడిందని రిపోర్ట్ చేయబడింది. కార్డ్‌ను మీరు ఉపయోగించగలిగే ముందు తప్పనిసరిగా మీరు దీన్ని వెరిఫై చేయాలి:

  1. payments.google.comకు వెళ్లి మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
    1. మీరు పలు ఖాతాలను కలిగి ఉంటే, లేత బూడిదరంగులో చూపబడిన కార్డ్ ఖాతాకు సైన్ ఇన్ అవ్వండి.
  2. పేమెంట్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. “వెరిఫికేషన్ అవసరం,” అని తెలిపే కార్డ్ పక్కన వెరిఫై చేయి ఆ తర్వాత కార్డ్‌ను ఛార్జ్ చేయిని క్లిక్ చేయండి.
  4. 2 రోజుల్లోపు, మీరు మీ కార్డ్ స్టేట్‌మెంట్‌పై 8 అంకెల కోడ్‌తో కూడిన తాత్కాలిక ఛార్జ్‌ను చూస్తారు.
  5. వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి, payments.google.comకు వెళ్లి 8 అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి. 

మీరు పేమెంట్ ఆప్షన్‌ను మళ్ళీ వెరిఫై చేయడానికి ట్రై చేయాలనుకొంటే:

  1. మీరు ఏ కార్డ్‌ను వెరిఫై చేయాలనుకున్నారో నిర్ధారించండి.
  2. ఎంతకాలం ముందు మీరు మీ కార్డ్‌ను వెరిఫై చేయడానికి ట్రై చేశారో చెక్ చేయండి.
    • 2 రోజుల కన్నా తక్కువ అయితే: 2 రోజుల దాకా వేచి ఉండండి.
    • 2 రోజుల కన్నా మించితే: మీ కార్డ్ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోండి. మీరు “GOOGLE TEST” అని పిలవబడే 8 అంకెలతో కూడిన తాత్కాలిక ఛార్జ్‌ను మీరు కనుగొనాలి.
కార్డ్ లేత బూడిదరంగులో చూపబడినది & “కార్డ్‌కు అర్హత లేదు” అని చెప్తుంది

ఈ కొనుగోలు కోసం మీరు ఈ కార్డ్‌ను ఉపయోగించలేరు. వేరొక కార్డ్‌ను ఉపయోగించి మళ్లీ కొనుగోలు చేయడానికి ట్రై చేయండి.

మీరు ఉపయోగించాలనుకున్న కార్డ్ లిస్ట్ కాకపోతే, కొత్త కార్డ్‌ను జోడించడానికి, స్క్రీన్‌పై సూచనలు ఫాలో చేయండి.

మీరు రెండు SIM కార్డ్ పరికరాలను ఉపయోగిస్తున్నట్లయితే
స్లాట్ 1లో సరైన SIM కార్డ్ ఉందా అని చెక్ చేసి, స్లాట్ 2లో ఏదైనా SIM కార్డ్ ఉంటే, దాన్ని తీసివేయండి.
ఇతర పేమెంట్ ఆప్షన్‌లు
ఇతర పేమెంట్ ఆప్షన్‌ల కోసం, Google Playలో అనుమతించబడిన పేమెంట్ ఆప్షన్‌లు లింక్‌ను చూడండి.
Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11562622452522150297
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false